Poaching
-
కేజ్రీవాల్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు
ఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యేలకు ఎర వేసేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ చేసిన ఆరోపణలకు గాను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు శనివారం పోలీసులు నోటీసులిచ్చారు. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను మూడు రోజుల్లో అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా ఐదు గంటలు హైడ్రామా జరిగింది. కేజ్రీవాల్ నివాసంలో అధికారులు తాము నోటీసులు తీసుకుంటామని చెప్పగా పోలీసులు నిరాకరించారు. సీఎంకే ఇస్తామన్నారు. చివరికి కేజ్రీవాల్ బయటకు రాగా నోటీసులిచ్చారు. మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తామిచ్చిన ఐదు నోటీసులకు కేజ్రీవాల్ స్పందించలేదంటూ ఈడీ అధికారులు శనివారం అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దివ్యా మల్హోత్రాకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఈ నెల 7వ తేదీన విచారణ చేపడతామని మేజిస్ట్రేట్ చెప్పారు. -
Poaching Row: ఐటీ కంపెనీల్లో అక్రమ వలసలు.. పెదవి విప్పిన కాగ్నిజెంట్ సీఎండీ
న్యూఢిల్లీ: ఇతర సంస్థల నుంచి అక్రమంగా అత్యున్నత అధికారులను ఆకట్టుకోవడం(పోచింగ్)వల్ల కంపెనీ బిజినెస్‌పై ఎలాంటి ప్రభావం పడబోదని ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్, ఎండీ రాజేష్ నంబియార్ తాజాగా పేర్కొన్నారు. ఇటీవల దేశీ ఐటీ కంపెనీల మధ్య అత్యున్నత అధికారుల అక్రమ వలస(పోచింగ్)లపై తలెత్తిన ఆరోపణల నేపథ్యంలో నంబియార్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ అంశంపై ప్రత్యేకంగా మాట్లాడేందుకు నిరాకరించిన నంబియార్ ఉద్యోగులతో గల కాంట్రాక్టు అమలుకు కంపెనీలు పట్టుబట్టడాన్ని సమర్ధించారు. ఇందుకు ఆయా కంపెనీలకు అధికారముంటుందని వ్యాఖ్యానించారు. అయితే నాన్పోచింగ్పై పరిశ్రమవ్యాప్తంగా వర్తించే నిబంధనలకు ఆస్కారంలేదని స్పష్టం చేశారు. ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీ అధికారులను లేదా నిపుణులను తీసుకోవడాన్ని నివారించేందుకు నిబంధనలు వర్తింపచేయలేమని అభిప్రాయపడ్డారు. ఐటీ పరిశ్రమ ప్రధానంగా నైపుణ్య ఆధారితంకావడమే దీనికి కారణమని తెలియజేశారు. నిపుణులతోనే నిర్మితమైన సాఫ్ట్వేర్ సేవల పరిశ్రమలో ఉద్యోగ వలసలకు చెక్ పెట్టేందుకు సరైన నిర్వచనాన్ని ఇవ్వలేమని వివరించారు. అయితే ఉపాధి కల్పనకు సంబంధించి పరిశ్రమవ్యాప్తంగా వర్తించే మార్గదర్శకాలకు వీలున్నట్లు తెలియజేశారు. పోచింగ్ సమస్య తమ కంపెనీపై ప్రభావాన్ని చూపబోదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అంతేకాకుండా పరిశ్రమపైన సైతం ప్రభావాన్ని చూపబోదని అభిప్రాయపడ్డారు. గత కొన్ని వారాలుగా సాఫ్ట్వేర్ సేవల దిగ్గజాల మధ్య పోచింగ్ వివాదాలు తలెత్తిన విషయం విదితమే. దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇటీవల.. తమ అధికారులను కాగ్నిజెంట్ అనైతిక పద్ధతుల్లో విధుల్లోకి తీసుకుంటున్నట్లు విమర్శించడంతో పరిశ్రమలో అలజడి తలెత్తింది. గతంలో ఇన్ఫోసిస్‌లో పనిచేసి ప్రస్తుతం కాగ్నిజెంట్ సీఈవోగా వ్యవహరిస్తున్న రవి కుమార్ ఇతర సంస్థల నుంచి 20 మంది సీనియర్ లీడర్లను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో పలువురు ఇన్ఫోసిస్, విప్రోలో బాధ్యతలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. ఉద్యోగులతో కనీసం ప్రాథమిక స్థాయిలో నియామకాలలో సైతం ఎలాంటి సర్వీసు ఒప్పందాలు లేదా బాండ్లకు తెరతీయడంలేదని నంబియార్ వివరించారు. క్యాంపస్‌ల నుంచి ప్రధానంగా ఉద్యోగులకు ఎంపిక చేసుకుంటున్నట్లు తెలియజేశారు. ఇది స్వేచ్చా ప్రపంచమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
కేసీఆర్ విడుదల చేసిన 70 నిమిషాల వీడియో సంభాషణ ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు ఎర వేయడానికి సంబంధించి మొయినాబాద్ మండలంలోని అజీజ్‌నగర్ ఫామ్‌హౌస్‌లో బీజేపీ దూతలుగా చెబుతున్న వారి మధ్య జరిగిన వీడియో సంభాషణల రికార్డింగ్‌ను (మొత్తం నాలుగు క్లిప్‌లు) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం బహిర్గతం చేశారు. మూడు గంటలు ఉన్న వీడియో సంభాషణలను 70 నిమిషాలకు కుదించి విడుదల చేస్తున్నట్లు సీఎం తెలిపారు. బీజేపీలో ముగ్గురు వ్యక్తులే అన్ని నిర్ణయాలు తీసుకుంటారని, ప్రధాని నేరుగా ఉండరని, అయితే అన్ని విషయాలూ ఆయనకు వివరిస్తారంటూ జరిగిన సంభాషణలు ఇందులో ఉన్నాయి. ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రేగ కాంతారావుతో రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్ జరిపిన సంభాషణల్లోని కీలక అంశాలు ఇలా ఉన్నాయి. రోహిత్‌రెడ్డి: మీతో (రామచంద్ర భారతి) చెప్పినట్లు మేమంతా సిద్ధం. మీరు వీరితో కూడా ఓపెన్‌గా చర్చిస్తే వారికి నమ్మకం ఏర్పడుతుంది. రామచంద్ర: మీతో ఇదివరకే చర్చించాం.. రోహిత్: మీరు నాతో చర్చించడం వేరు. వారితో చర్చించడం వేరు. రామచంద్ర: ఇక్కడ డెలివరీ(డబ్బు)కి కమిట్ చేయించారు. తరువాత ఢిల్లీకి వెళ్దాం. నేను ఢిల్లీకి మెసెజ్ పంపించాను. అక్కడనుంచి సమాధానం కోసం చూస్తున్నా. రోహిత్: ఫిగర్ కూడా ఎంతో చెప్పండి. రామచంద్ర: ఒక్కొక్కరికి 50. గువ్వల బాలరాజు: అంటే.. రోహిత్: ఒక్కొక్కరికి రూ.50 కోట్లు (అందరు నవ్వులు). ఆయన ఢిల్లీకి సమాచారం పంపించారు. సింహయాజి: మీరు రూ.50 లక్షలు అనుకుంటున్నారా.? కాదు. రూ.50 కోట్లు బాలరాజు: మరో ఐదుగురు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ విషయం.. రోహిత్‌రెడ్డి: ఆ విషయం వారితో చర్చించా. సింహయాజి, నందు: ఇది తర్వాత చూద్దాం. మీకు ఎక్కడ డెలివరీ కావాలో అక్కడ ఇచ్చేస్తాం. నందు: మరో ఐదుగురు కూడా సిద్ధంగా ఉన్నారు. వారిని కూడా తీసుకుంటామా..! రామచంద్ర: ఎస్.. వాళ్లను కూడా..వీ వాంట్ ఎగ్జాట్ నంబర్స్. నందు: ఎస్. వాళ్లు వస్తారు. రోహిత్: మూడు అడిగా. బాలరాజు: నీవు ఏం అడిగావో మాకేమి తెలుసు. రోహిత్: బీ ఫామ్‌లు వారే ఇవ్వాలి. రామచంద్ర: బీ ఫామ్ కంటే ముందు.. మీరు క్లియర్‌గా ఉండాలి. మేము క్లియర్‌గా ఉంటాం. పార్టీలో చేరిన తరువాత బీ.ఫామ్ మా హామీ. చూడండి బీజేపీలో ముగ్గురు వ్యక్తులు ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ జాతీయ నాయకత్వం చూసుకుంటుంది. రాష్ట్ర నాయకత్వానికి ఏ సంబంధం ఉండదు. బీజేపీలో మొత్తం చూస్తారు. బీఎల్ సంతోష్, అమిత్‌షా, జేపీ నడ్డా. బాలరాజు: ప్రధానమంత్రి రామచంద్ర: పీఎం ఎందులోనూ నేరుగా ఇన్వాల్వ్ కారు. ఆయనకు వీరి నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్ అందుతుంటుంది అంతే. బాలరాజు: ఆరెస్సెస్ వేరు, బీజేపీ వేరు అనే చర్చ నడుస్తోంది... రామచంద్ర: అవును వేర్వేరు. ఆరెస్సెస్ ఓ సామాజిక సంస్థ. భాజపా ఒక రాజకీయ సంస్థ. అయితే ప్రతి భాజపా వ్యక్తికీ ఆరెస్సెస్ నేపథ్యం ఉంది. బాలరాజు: ఈయన కూడా అంతేనా? రామచంద్రభారతిని చూపిస్తూ... సింహయాజి: అవును...అంటూ ఆయన ఎదిగిన తీరును వివరించారు. (మరోసారి సంతోష్, అమిత్ షా, నడ్డాలు ఎలా హ్యాండిల్ చేస్తారో వివరించారు.) రామచంద్ర: మేం ఇక్కడికి వచ్చే ముందే విషయాలన్నీ చెప్పాం. అన్నింటికీ వారు ఒప్పుకున్నారు. ఎటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేదు. బీఎల్ సంతోష్ కాంగ్రెస్‌లోని సూర్జిత్వాలా లాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఆయనకు ఎవరికి బీఫామ్ ఇవ్వాలి వంటి విషయాల్లో పూర్తి అధికారం ఉంది. ఎమ్మెల్యేలు: మేం బీఫామ్ కోసమో దేనికో ఇక వేరే ఎవరినీ అప్రోచ్ కావాల్సిన అవసరం లేదు. రామచంద్ర: లేదు లేదు ఆ అవసరమే లేదు. మేం ఇక్కడ నుంచి వెళ్లేలోపుగానే మీకు వచ్చే ఎన్నికల్లో బీఫామ్ కన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే మరో 2 విషయాల్లో సంపూర్ణంగా స్పష్టత వస్తుంది. ఇదంతా క్రిస్టల్ క్లియర్ ఆపరేషన్. ఎమ్మెల్యేలు: మేం ఎవరైనా రాష్ట్ర నేతలతో టచ్‌లో ఉండాలి అంటారా? రామచంద్ర: లేదు లేదు... అక్కర్లేదు కేవలం మీరు రోహిత్‌తో టచ్‌లో ఉంటే చాలు. రోహిత్: మనం అంతా డైరెక్ట్ ఢిల్లీతోనే సార్. నిజానికి వీళ్లు స్వామిజీకి ఇన్చార్జిలు. స్వామిజీ నే కర్ణాటక, మహారాష్ట్ర చేశారు.. అంటుండగా.. రామచంద్ర: కర్ణాటక ఆపరేషన్ చేశాం మీకు తెలుసుగా? కాంగ్రెస్ నుంచి 16 మందిని తీసుకుని మేం ప్రభుత్వం ఏర్పాటు చేశాం, అయితే కర్ణాటకకు, తెలంగాణకు వ్యత్యాసం ఉంది. తెలంగాణ, ఆంధ్ర పూర్తిగా వేరే.. మిగతా వాటితో పోలిస్తే..మీ ఒక నియోజకవర్గ ఎన్నికతో మేం రాష్ట్ర స్థాయి ఎన్నికలే నిర్వహించగలం. (నవ్వుతూ) మీరిక్కడ ఒక ఎన్నిక కోసం రూ.50 కోట్లు ఖర్చు చేస్తే మేం ఆ మొత్తంతో 70, 80 నియోజకవర్గాలు ఫినిష్ చేస్తాం. రామచంద్ర: బీఆర్ఎస్ పేరుతో ఇప్పటికే 4 రాజకీయ పార్టీలు నమోదై ఉన్నాయి. ఎమ్మెల్యేలు: అయితే మీరు ఆపుతారా? సింహయాజి: అదంతా ఒక పొలిటికల్ సిస్టమ్ ప్రకారం నడుస్తుంది. ఎమ్మెల్యేలు: తెలంగాణ బాగా కాస్ట్లీ చేసేశారు... మునుగోడు కూడా కాస్ట్లీ చేసేస్తున్నారు. ఇంకేముంది ఆయనకు రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు. కాంట్రాక్ట్ సరే ఎంత ఖర్చుపెడుతున్నారు? సింహయాజి: ఎంతైనా పెట్టుకుంటాడు అది ఆయనే...కాదు కాదు పార్టీ కూడా ఇచ్చింది. 30 ఇచ్చింది ఆల్రెడీ... ఇంకో 20 వస్తుంది. రామచంద్ర: మరో 15 ఏళ్లు భాజాపా పాలనే ఉంటుంది. ఇది ఫిక్స్. కాంగ్రెస్‌కి లీడర్ లేడు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ కానీ నిర్మాణం లేదు. తెలంగాణ అవతల వారికి జాతీయ స్థాయి నేత ఎవరూ లేడు. మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ సహా మొత్తం 17 పార్టీలు కలిసి ఒక ప్రతిపక్ష పార్టీగా మారడం అసాధ్యం. ఎందుకంటే అందులో ప్రతి ఒక్కనేతా ప్రధాని అభ్యర్ధే. నితిష్, ఖర్గే, గెహ్లాట్, కేసీఆర్, కేజ్రీవాల్...అందరూ పీఎం అభ్యర్థులే...అందుకే వాళ్లు కలవరు. అందుకే 15 ఏళ్లు భాజాపాదే పాలన. ఎమ్మెల్యేలు: ఈవీఎం మిషన్లు ఉన్నాయి రామచంద్ర: మేం ఆ మిషన్లతో ఆపరేట్ చేయం కానీ (నవ్వుతూ) అందుకేనేమో బ్యాలెట్ రావాలంటున్నారు. బ్యాలెట్‌తో కూడా ఇష్యూ ఉంది. ఈవీఎంతో కూడా ఉంది. ఈవీఎంలో కొంత స్ట్రాటజీ ఉంది. ఎమ్మెల్యేలు: స్వామిజీ మీరు ఎప్పుడైనా రాజకీయాల్లో ఉన్నారా? రామచంద్ర: నేను ఆరెస్సెస్ వ్యక్తిని పూర్తిగా సింహయాజి: రామచంద్ర భారతి స్వామిజీ చాలా పవర్ ఫుల్, పెద్ద పెద్ద నేతలతో తిరుగుతారు. ఆయన మోదీగారు ఒకే ఫ్లైట్‌లో వెళ్లి వస్తుంటారు. ఎమ్మెల్యేలు: స్వామిజీ వయసు? సింహయాజి: రుషిమూలం, నదిమూలం అడగకూడదు అంటారు. ఇక్కడైన తర్వాత ఆంధ్రా ఎమ్మెల్యేలు: మరి బండి సంజయ్..! నందకుమార్: ఇక్కడ ఎవరిదీ నడవదు బండి సంజయ్, కిషన్‌రెడ్డి కాదు.. అంతా సంతోష్‌దే పవర్ సింహయాజి: బీఎల్ సంతోష్ క్యాండిడేట్లే ఉన్నారందరూ అర్థమైందా? ఎమ్మెల్యేలు: మరి అమిత్‌షా.. సింహయాజి: అమిత్‌షా, సంతోష్ అందరూ ఒకటేగా.. అంతేకాదు బీఎల్ సంతోష్ నో అంటే అమిత్‌షా ఏమీ చేయలేరు. అంత పవర్ఫుల్ సంతోష్. రాష్ట్రపతి కూడా ఈయన చెప్పింది వినాలి. ప్రతి కేబినెట్ మీటింగ్‌లో కూడా బీఎల్ సంతోష్ కూర్చుంటారు. నందుకుమార్: అన్నా అశోకా నైన్లో ఉంటాడు. మోడీ, అమిత్‌షా మాట్లాడాలనుకుంటే ఫోన్ నంబర్ ఇచ్చి పోతాడు. ఈయన మాత్రం పోడు. సింహయాజి: ఆయన పోడు.. క్వశ్చనే లేదు. ఆయనకు ఆర్ఎస్ఎస్ అంత పవర్ ఇచ్చింది. ఆర్ఎస్ఎస్ తరఫున ఆయన.. ఎమ్మెల్యేలు: స్వామీజీ అంతా ఇప్పుడు మనకు.. సింహయాజి: బీజేపీనంతా స్వామీజీలే ఆపరేట్ చేసేది. వీళ్లందరూ పోయి ఎందుకు స్వాముల్ని మొక్కుతుంటారు. చినజీయర్ స్వామికి.. ఆ స్వామికి..! నందు: ఈయన ఎంత సింపుల్‌గా ఉంటారంటే.. ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. అంతా మన సనాతన ధర్మం గురించే.. మోదీ, నడ్డా, అమిత్‌షా మాదిరి మొత్తం ఆరుగురే డీల్ చేసేది. ఈ ఆరుగురే అంతా.. రామచంద్ర: వీరంతా ఒప్పుకున్నా.. సంతోష్ నో అంటే నో అనే.. ఎమ్మెల్యేలు: పీఎం ఒప్పుకున్నా కూడానా? సింహయాజి: అవును పీఎం ఒప్పుకున్నా కూడా.. ఎమ్మెల్యేలు: అక్కడ ఎలా ఉంది స్వామి? ఆంధ్రా.. ఇదే ఆపరేషనా? సింహయాజి: ఇది అయిపోతే మొదలుపెడతాం రోహిత్‌రెడ్డి: క్యాష్ ఏడుందో చెప్తారు. చెప్తే మనం పోయి పిక్ చేసుకుని.. (ఇంతలో స్వామీజీ కల్పించుకుని ఆపారు) ఎమ్మెల్యేలు: మొత్తానికి ఢిల్లీ ఫెయిలైనట్టేనా? (ప్రభుత్వం కూల్చివేతపై) నందు: కాదు.. ఢిల్లీ కూడా స్టార్టయింది. సింహయాజి: 35 మంది రెడీ.. అసలు వాడ్ని ఎత్తేశాంగా ఇప్పుడు ఒకడిని. ఈడీని పెట్టి.. నందకుమార్: సిసోడియా గాడ్ని ఈడీ పెట్టి ఇరికించారు. సింహయాజి: సిసోడియాతోనే ఎమ్మెల్యేలు వస్తున్నారు ఇప్పుడు తెలుసా? ఎమ్మెల్యేలు: అవునా? సింహయాజి: అవును అందుకే ఈడీ. నందకుమార్: 36 మంది రెడీ. రాజస్థాన్‌లో 30 మందిని రెడీ చేశారు. ఈయన ఆపరేషన్లే.. సింహయాజి: వింటే గోడీ.. లేకపోతే ఈడీ. ఎమ్మెల్యేలు: గోడీ అంటే? సింహయాజి: గోడీ అంటే సఖ్యత.. లేకపోతే ఈడీ దాడులు. దాదాపు 38 మంది లిస్ట్‌లో ఉన్నారు. మన తెలంగాణలోనైనా వింటే గోడీ.. లేకపోతే ఈడీ ఎటాక్ అంటామన్నమాట. నందు: స్వామి దగ్గర లిస్టు ఉంది. స్వామికి ఆ లిస్ట్ ఇచ్చారు సంతోష్ వాళ్లు. ఇందులో అసలువారిని టచ్ చేయరు. పక్కనున్నోళ్లనే. రామేశ్వర్‌రావును వదిలేశారు. బీజేపీకి 100 (కోట్లు) ఇచ్చారు.. దండంపెట్టి.. సింహయాజి: ఆ 100 (కోట్లు) ఇస్తేనే ముగ్గురొచ్చారు. అమిత్‌షా, మిగతావారు.. రామేశ్వర్‌రావుపై కేసు ఉంది. దాన్ని తప్పించుకోవడానికే డబ్బులిచ్చి ఫేవర్‌గా ఉండటానికే వాళ్లను ఇన్వైట్ చేశారు. ఎమ్మెల్యేలు: ఇక్కడైతే మొత్తమ్మీద బండి సంజయ్దేమీ నడవదు సింహయాజి: బండికి గండే.. ఇప్పుడంతా ఎవరికి వారు హైకమాండ్‌కు టచ్‌లో ఉంటున్నారు. అదే చూస్తున్నారు. కొత్త రక్తం వస్తే దానికి అంటగట్టాలని చూస్తున్నారు. ఎమ్మెల్యేలు: మరి ఊ అంటే మోదీతో మాట్లాడుతాం అన్నట్టు మాట్లాడుతారు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు నందు: నిన్న మొన్న వచ్చినోడితో సహా ప్రతీ ఒక్కరి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరిని ఎక్కడ కట్ చేయాలో ఆయనకు తెలుసు. కిషన్‌రెడ్డి ఏంటి, కిషన్‌రెడ్డికి సీఎంతో సంబంధం ఏంటి అన్నీ మోదీకి తెలుసు. అయితే ఎవరినీ ఏమీ అనకుండా అలా నడిపిస్తారు. బండి సంజయ్‌కి అపాయింట్మెంటే లేదు. (అంతా నవ్వులు) డబ్బుకు సమస్య లేదు భారతి: సంతోష్, అమిత్ షా ఒకేచోట ఉన్నారు. తుషార్ వేరే చోట ఉన్నారు. ఫోన్ కలవడం లేదు. డబ్బులు ఇవ్వడంలో ఎలాంటి సమస్యా లేదు. ఈ రోజే మీ ముగ్గురి పేర్లు తెలిశాయి. మీ పేర్లు పంపొద్దని చెప్పా. ఇంటిలిజెన్స్‌కు సమాచారం వెళ్తే ఇబ్బందులు వస్తాయని చెప్పా. రోహిత్‌రెడ్డి: ఇప్పటినుంచి ఏ విధంగా ముందుకు వెళతారు అని మా ఎమ్మెల్యేలు అడుగుతున్నారు? భారతి: మీ తరహాలోనే వాళ్లకు కూడా కొన్ని షరతులు ఉన్నాయి. ఎవరికి ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి? అని అడుగుతారు. నేను మధ్యవర్తిని మాత్రమే. (ఈలోగా తుషార్ నుంచి ఫోన్.. మలయాళంలో) భారతి: తుషార్ గారు.. లైన్లో రోహిత్‌రెడ్డి ఉన్నారు. రోహిత్‌రెడ్డికి ఫోన్ ఇస్తున్నా. అతనితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పుడు నా ముందే ఉన్నారు. గతంలో చర్చించినట్లు డబ్బుల కోసం అడుగుతున్నారు. వాళ్లకు ఉన్న సమస్యలను చెప్తున్నారు. (భారతి ఫోన్ రోహిత్‌కు ఇచ్చాడు) రోహిత్‌రెడ్డి: తుషార్ గారూ.. ఎలా ఉన్నారు? మేం మునుగోడు ఎన్నికలో ఉన్నాం. తుషార్: రేపటి నుంచి ఎప్పుడైనా కలుద్దాం. బీఎల్ సంతోష్‌ను ఏ తేదీ రావాలో అడుగుతా. 3న ఎన్నిక ఉంది కదా. 4న కలుద్దాం. మీకు ఏ రోజు వీలవుతుంది. రోహిత్‌రెడ్డి: ఈ రోజు లేదా రేపు పూర్తిచేస్తే బాగుంటుంది. అందుకే మిగతా ఎమ్మెల్యేలను ఈ రోజు మునుగోడు నుంచి రప్పించా. తుషార్: రేపు లేదా ఎల్లుండి వీలైనంత త్వరగా సంతోష్ టైమ్ తీసుకుంటా. అంతకంటే ముందు మనం కలుద్దాం. రోహిత్‌రెడ్డి: తుషార్ గారూ.. మీరు ఈ రోజు రాత్రి లేదా రేపు హైదరాబాద్‌కు రాగలరా.. మేము ప్రమాదకర పరిస్థితుల్లో పడతాం. తుషార్: మనందరం బీఎల్ సంతోష్‌ను కలుద్దాం భారతి: వాళ్లు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. వారి వెనుక నిఘా వర్గాలు ఉన్నాయి. రోహిత్‌రెడ్డి: మీరు ఫిగర్ ఎంతో నేరుగా చెప్పండి భారతి: తుషార్ గారు.. మొత్తం నలుగురు ఉన్నారు. టు టు ఫైవ్.. రోహిత్‌రెడ్డి: ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు భారతి: సెవెన్.. ఫైవ్.. (మళయాలంలో సంభాషణ), ఈ రోజే డబ్బు కావాలని అడుగుతున్నారు. తుషార్: సంతోష్ ఫోన్ కలవడం లేదు. అమిత్‌షా మీటింగ్లోఉన్నారు. అందుబాటులోకి రావడం లేదు. రోహిత్‌రెడ్డి: ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ ముడితె జంప్ గువ్వల: ప్రచారానికి వెళ్లకపోతే మేము ఎక్కడ ఉన్నామో మా డ్రైవర్లను అడిగి ఆరా తీస్తున్నారు. భారతి: నా ఆరోగ్యం బాలేదు. అయినా వచ్చా.. ఈ రోజు పని పూర్తి చేయాలనే అనుకున్నాం. రోహిత్‌రెడ్డి: ఢిల్లీని కూడా స్వామీజీ అపరేట్ చేస్తున్నారట, వచ్చే వారం ఖతం అట. గువ్వల: ఎవరి ద్వారా అవుతోంది. భారతి: తొలిసారి మేము ఇలా వేరే చోటకు వచ్చి మాట్లాడుతున్నాం. కానీ చేరే వారు ఢిల్లీకి వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుని వెళ్తారు. ఇప్పటివరకు బీజేపీ ఇలానే చేస్తూ వస్తోంది. గువ్వల: ఆప్‌లో ఎవరిని చేర్చుకుంటున్నారు? భారతి: కేజ్రీవాల్ రైట్ హ్యాండ్ను చేర్చుకుంటున్నాం. 33 మెజారిటీ, 36 మంది రెడీగా ఉన్నారు. రాజస్తాన్‌లో 21 మంది ఉన్నారు. సింహయాజీ: రాజస్తాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా నా భక్తుడు. రోహిత్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి: గంట సేపైనా ఎదురు చూస్తాం. బీఎల్ సంతోష్‌తో మాట్లాడండి. భారతి: కర్ణాటకలో ఎమ్మెల్యేలను చెన్నై తీసుకెళ్లి ఇండిగోలో ముంబయికి చేర్చాం. అక్కడ వారికి కావాల్సింది ఇచ్చాం. సింహయాజి: పంచెలు, రుమాళ్లు చుట్టుకుని కర్ణాటక ఎమ్మెల్యేలు కూలీల్లా ట్రాక్టర్లో వచ్చారు. భారతి: మొదట రామనగరకు వెళ్లాం. అక్కడ ఫామ్‌హౌస్ నుంచి ట్రాక్టర్లో యెలహంకకు తీసుకెళ్లాం. అక్కడ నుంచి బస్సులో చెన్నైకు తీసుకెళ్లాం. సింహయాజి: ఢిల్లీలో ఇంటెలిజెన్స్ అంతా కేంద్రం పరిధిలో ఉంటుంది. భారతి: మొదటి పే మెంట్ ఇస్తాం. ఢిల్లీలో వాళ్లకు డబ్బులు వద్దు. పవర్ మారగానే పదవులు ఇస్తాం. సింగిల్ రూపీ కూడా ఇవ్వడం లేదు. బీజేపీ నుంచి సీఎం ఉంటారు. డిప్యూటీ సీఎం, ఇతర పదవులు ఆమ్ ఆద్మీ నుంచి వచ్చే వారికి ఇస్తాం. చర్చలు పూర్తయ్యాయి. బీజేపీ ఏం చెప్తుందో అది చేస్తుంది. కమిట్ అయితే చేస్తుంది. గువ్వల: మీలా ఎంతమంది పనిచేస్తున్నారు? భారతి: పార్టీ విషయాలు వేరు. మానవత్వం, నమ్మకం ఉండాలి. బీజేపీ నమ్మకంపైనే ఆధారపడుతుంది. ఏ రాష్ట్రం తీసుకున్నా సరే. గువ్వల: విశ్వాసం పేరిట అవిశ్వాసం పెట్టి ప్రభుత్వాలను కూల్చివేస్తారన్న మాట రోహిత్‌రెడ్డి: మంత్రి పదవి రానందునే గువ్వల బయటకు రావాలని అనుకుంటున్నాడు. భారతి: బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడిన ప్రతిచోటా చూడండి. కర్ణాటకలో 16 మంది వస్తే 12 మందికి మంత్రి పదవులు హామీ ఇచ్చాం. 13 మందికి ఇచ్చాం. మా సొంత ఎమ్మెల్యేలు 5, 6 సార్లు గెలిచినా కూడా పక్కన పెట్టాం. ఎందుకంటే మేం మాట ఇచ్చాం వారికి. అదే తరహాలో మీకు కూడా మంత్రి పదవులు ఇస్తాం. నిజానికి షిండేకు మేము డిప్యూటీ సీఎం ఆఫర్ చేశాం. కానీ చర్చల తర్వాత కావాల్సిన నంబర్ వచ్చిన తర్వాత సీఎం పోస్ట్ డిసైడ్ అయింది. అనుభవం లేకున్నా అన్నింటినీ మేనేజ్ చేశాడు షిండే. మీరు మంత్రి అయినా మీ అపాయింట్మెంట్ లేకుండా రాలేము. అదీ మా ప్రోటోకాల్.. కానీ జోక్యం చేసుకోం. గువ్వల: షిండే లాంటి వాళ్ల మీద నియంత్రణ లేకుండా సీఎంలు చేసి ఏం చేస్తారు? భారతి: సీఎం అయిన తర్వాత వాళ్లు బీజేపీ అడ్మినిస్ట్రేషన్లోకే వస్తారు. చదవండి: న్యాయవ్యవస్థే కాపాడాలి.. దేశంలో ప్రజాస్వామ్యం హత్య: సీఎం కేసీఆర్ -
ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం.. నందూ డైరీలో 50 మంది నేతల పేర్లు!
సాక్షి, హైదరాబాద్: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం రాష్ట్ర రాజకీ యాల్లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. టీఆర్ఎస్, బీజేపీల నడుమ రాజకీయ యుద్ధం లాగా సాగుతున్న ఈ ఎపిసోడ్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెబుతున్న నందకుమార్ డైరీలో సంచలన విషయా లున్నాయనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ప్రధాన రాజకీయనేతలుగా చెలామణి అవుతున్న నాయకుల పేర్లు, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 50 మంది నేతల పేర్లు డైరీలో ఉన్నాయని వస్తున్న వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇందులో 25 మంది ఇప్పటికే బీజేపీలో చేరేందుకు అంగీకరించారని సునీల్ బన్సల్ పేరిట ఉన్న సెల్‌ఫోన్‌కు రామచంద్రభారతి నుంచి మెసేజ్ వెళ్లిందన్న విషయం ఉత్కంఠకు దారితీస్తోంది. అసలు ఈ జాబితాలో ఉన్న నాయకులెవరూ? అందరూ ఎమ్మెల్యేలేనా? లేదా మాజీలా? ఎమ్మెల్యే స్థాయి నాయకులు నందకుమార్‌తో టచ్‌లోకి వచ్చారా లేదా వీరితో సంప్రదింపులు జరపాలని టార్గెట్‌గా పెట్టుకుని డైరీలో వీరి పేర్లను రాసుకున్నాడా? అసలెవరెవరు టచ్‌లో ఉన్నారు? నందకుమార్ నీడ పడిన నేతల డీల్స్ ఎంతవరకు వచ్చాయి? ఈ పేర్లుగల నాయకుల విషయంలో భవిష్యత్తులో ఏం జరుగబోతోంది? అన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. రూపాయి కావాలా.... నాయనా? నందకుమార్, రామచంద్రభారతి, సింహయాజీలు, పైలట్ రోహిత్‌రెడ్డిల నడుమ ఆడియో సంభాషణలు ఓ ఎత్తయితే, నందకుమార్ డైరీలో ఎవరి పేర్లున్నాయనే అంశం మరోఎత్తుగా మారింది. అన్ని రాజకీయ పార్టీల నేతలతో సంబంధాలు పెట్టుకున్న నందకుమార్ (ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా ఇప్పటికే మీడియాలో వచ్చాయి) ఏ పార్టీలోని ఏ నాయకుడితో డీల్ మాట్లాడుకున్నాడనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గతంలో కాంట్రాక్టులు చేసిన, చేస్తున్న నాయకులు, ఆర్థిక అవసరాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, నాయకులనే లక్ష్యంగా చేసుకుని నందూ టీం పనిచేయాలని భావించిందని, అందులో భాగంగానే పలువురితో ఇప్పటికే సంప్రదింపులు కూడా చేసిందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇంకో ఏడాది కాలంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఖర్చులకు అవసరమైన ‘రూపాయలు’సమకూర్చుకుంటే చాలనే ఆలోచనతో ఉన్న నేతల కూపీ లాగి వారితో టచ్‌లోకి వెళ్లాడా? అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఎన్నికలకు అవసరమయ్యేంత సమకూరిస్తే డీల్ ఓకే చెప్పిన నాయకులెంతమంది? రాష్ట్రంలోని 50 మందినేతలను వడపోసేందుకు నందకుమార్ ఎంచుకున్న ప్రాతిపదిక ఏంటి? అనే అంశాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. మరి నందకుమార్ డైరీనా... మజాకా? చదవండి: తెలంగాణ తరహాలో ఢిల్లీలో ఎమ్మెల్యేలకు ఎర -
ఈ టైంలో వద్దు.. మునుగోడులో జేపీ నడ్డా సభ రద్దు..!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 31న మునుగోడులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొనాల్సిన బహిరంగసభను రద్దు చేసుకున్నారు. అయితే దీనిపై రాష్ట్ర పార్టీ ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదని ముఖ్యనేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో తాజాగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే ఈ సభ ఆలోచనను విరమించుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలకు పెద్దమొత్తంలో డబ్బు ఎర చూపి ప్రలోభపరిచేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నించిందంటూ టీఆర్ఎస్ నేతలు ఆరోపించడం, దీనికి సంబంధించిన ఆడియో టేపులు కూడా బయటకు రావడం రాష్ట్రరాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎన్నికల ప్రచారసభకు రావడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదనే నిర్ణయానికి పార్టీ నాయకత్వం వచ్చినట్టు సమాచారం. ఈ సభ నిర్వహణకు చేసే వ్యయాన్ని ఎన్నికల ప్రచారానికి మళ్లించి మరింత ప్రభావవంతంగా చేయాలని నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. గతం నుంచే మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొనడానికి నడ్డా అంతగా సుముఖత చూపలేదని తెలుస్తోంది. కొన్నిరోజుల క్రితం మునుగోడు పరిధిలో మల్కాపురంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు నడ్డాకు సమాధిని కట్టడంతో బీజేపీ నాయకత్వం తీవ్రస్థాయిలో స్పందించింది. ఈ నేపథ్యంలో 31న మునుగోడు సభలో పాల్గొనడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీలకు నడ్డా గట్టి జవాబిస్తారని పార్టీ నాయకులు భావించారు. 9 చోట్ల సభలు...: 31న నడ్డా సభకు బదులుగా మునుగోడు పరిధిలోని ఏడు మండల కేంద్రాలు, రెండు మున్సిపాలిటీల్లో నిర్వహించే సభల్లో పలువురు కేంద్రమంత్రులు, జాతీయ నేతలు పాల్గొననున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా ఎక్కడికక్కడ బైక్ ర్యాలీలు, ఎన్నికల ప్రభలు నిర్వహించి వీలైనంత ఎక్కువమంది ప్రజలను కలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ 1న జాతీయ, రాష్ట్రపార్టీ ముఖ్యనేతల రోడ్‌షోలతో పార్టీ ప్రచార కార్యక్రమాలకు ముగింపు పలకనున్నారు. చదవండి: కేసీఆర్ రాజకీయ జీవితం సమాధి... -
పంజాబ్‌లో 'ఆపరేషన్ లోటస్'.. 10 మంది ఆప్ ఎమ్మెల్యేలకు ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: గోవాలో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన రోజే సంచలన ఆరోపణలు చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. పంజాబ్‌లోనూ 'ఆపరేషన్ లోటస్' ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. తమ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ సంప్రదింపులు జరిపిందని బుధవారం తెలిపారు. దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదన్నారు. బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా పంజాబ్, ఢిల్లీలో ఆపరేషన్ లోటస్ విజయవంతం కాదని కేజ్రీవాల్ తేల్చిచెప్పారు. బీజేపీ సంప్రదింపులు జరిపిన ఆప్ ఎమ్మెల్యేల పేర్లను పంజాబ్ మంత్రి హర్పాల్ చీమ వెల్లడించారు. దినేష్ చద్దా, రమణ్ అరోడా, బుధ్ రామ్, కుల్వాంత్ పండోరి, నరీందర్ కౌర్ భరాజ్, రాజ్నీశ్ దహియా, రూపిందర్ సింగ్ హప్పీ, శీతల్ అంగురాల్, మంజీత్ సింగ్ బిలాస్‌పుర్, లాభ్ సింగ్ ఉగోకే, బలీందర్ కౌర్‌లకు బీజేపీ ఫోన్ చేసిందని తెలిపారు. ఫోన్ కాల్స్ ఆధారంగా ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని కేజ్రీవాల్ ఇదివరకే ఆరోపించిన విషయం తెలిసిందే. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20-25 కోట్ల వరకూ ఇస్తామని కమలం పార్టీ ప్రలోభ పెట్టిందని పేర్కొన్నారు. ఆ వారంలోనే ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి తమ ప్రభుత్వ బలాన్ని నిరూపించుకున్నారు. ఆప్ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగరని, బీజేపీ ప్రయత్నాలు ఫలించవని చెప్పారు. చదవండి: బీజేపీ ప్లాన్ సక్సెస్.. గోవాలో కాంగ్రెస్ ఖాళీ! -
జార్ఖండ్ సీఎంకు టెన్షన్ టెన్షన్.. బ్యాగ్‌లు ప్యాక్ చేసుకున్న ఎమ్మెల్యేలు
రాంఛీ: సీఎం హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేసిన నేపథ్యంలో జార్ఖండ్‌లో అస్థిరత నెలకొంది. యూపీఏ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని సోరెన్ ఆరోపించారు. ముందు జాగ్రత్త చర్యగా ఎమ్మెల్యేలను శనివారం తన నివాసానికి పిలిపించారు. చాలా మంది ఎమ్మెల్యేలు లగేజీతో పాటు సీఎం ఇంటికి వెళ్లారు. అనంతరం ఎమ్మెల్యేలను ఎవరూ ప్రలోభాలకు గురి చేసే వీలు లేకుండా అందరినీ కుంటీ జిల్లాలోని గెస్ట్ హౌస్‌కు తరలించారు సోరెన్. పటిష్ఠ భద్రత నడుమ రెండు బస్సుల్లో వీరిని అక్కడకు తీసుకెళ్లారు. ప్రయాణంలో వారితో పాటు బస్సులో సెల్ఫీ దిగారు. దీంతో రిసార్ట్ రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వీరందరినీ గెస్ట్ హౌస్‌కు తరలించడానికి ముందు మూడు సార్లు సమావేశాలు నిర్వహించారు సోరెన్. Two buses, carrying Jharkhand MLAs, left from CM Hemant Soren's residence earlier this afternoon after a meeting of the UPA legislators. Pics from inside the buses. pic.twitter.com/nGodgPV7FY — ANI (@ANI) August 27, 2022 మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో యూపీఏ భాగస్వాములైన జేఎంఎంకు 30 , కాంగ్రెస్‌కు 18, ఆర్జేడీకి ఒక సభ్యుడితో కలిపి మొత్తం 49 మంది ఎమ్మెల్యేల బలముంది. ప్రతిపక్ష బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ప్రజల ఎన్నుకున్న తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని సీఎం సోరెన్ శనివారం ఓ సమావేశంలో ఆరోపించారు. ప్రజల మద్దతు తమకే ఉన్నందుకు ఎలాంటి ఆందోళనా లేదని చెప్పారు. తన చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సోరెన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎన్నికల సంఘం చేసిన సూచన మేరకు గవర్నర్ ఆయన ఎమ్మెల్యే పదవిని శుక్రవారం రద్దు చేశారు. అయితే మిత్రపక్షాల మద్దతుతో సోరెన్ సీఎంగా కొనసాగవచ్చు. మరో ఆరు నెలల్లో తిరిగి శాసనసభకు ఎన్నికకావాల్సి ఉంటుంది. చదవండి: రాహుల్ పాన్ ఇండియా స్టార్.. అంత ఆదరణ కాంగ్రెస్‌లో ఎవరికీ లేదు -
చిత్తూరు జిల్లాలో అడవి ఏనుగుల బీభత్సం
-
చిత్తూర్ జిల్లా లో ఏనుగుల బీభత్సం
-
మఫ్టీలో పోలీసులు అడ్డంగా దొరికిపోయారు!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. త్వరలోనే అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోబోతున్న బీజేపీ.. ప్రతిపక్ష శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎట్టిపరిస్థితుల్లో బలపరీక్షలో నెగ్గేందుకు బీజేపీ తన వ్యూహాలకు పదును పెడుతుండటంతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు అలర్ట్ అయ్యాయి. తమ ఎమ్మెల్యేలు జారిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. తమ ఎమ్మెల్యేలను వేర్వేరు హోటళ్లకు తరలించి.. వారు జంప్ కాకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేశాయి. అయినా ఆయా పార్టీలను ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు కమలనాథులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లక్ష్యంగా ఏకంగా పోలీసులను రంగంలోకి దింపి బీజేపీ నిఘా పెట్టినట్టు ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ముంబైలోని రెనైజాన్స్ హోటల్లో మఫ్టీలో తిరుగుతున్న ఇద్దరు పోలీసులను ఎన్సీపీ నేతలు గుర్తించి నిలదీయడం తీవ్ర కలకలం రేపింది. బీజేపీ సర్కార్ ఉసిగొల్పడంతోనే పోలీసులు ఇలా మాములు చొక్కాలు ధరించి.. తమపై గూఢచర్యం నెరుపుతున్నారని ఎన్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రెనైజాన్స్ హోటల్లో మఫ్టీలో పోలీసులు కనిపించడంతో అప్రమత్తమైన ఎన్సీపీ అధినాయకత్వం తమ ఎమ్మెల్యేలను ఆ హోటల్ నుంచి హోటల్ హయత్‌కు ఆదివారం సాయంత్రం మార్చింది. ముంబై పొవైలోని రెనైజాన్స్ హోటల్లో మఫ్టీలో ఇద్దరు పోలీసులు కనిపించడంతో వారిని ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవ్హాద్ నిలదీశారు. పోలీసుల ఐడీ కార్డులు చెక్‌చేసిన ఆయన.. ‘ఉన్నతమైన పదవుల్లో ఉన్న మీరు ఎలాంటి కారణం లేకుండా ఇక్కడ తిరుగుతున్నారని చెబితే నమ్మడానికి మేమేమైనా పిచ్చివాళ్లమా?’ అంటూ మండిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో బీజేపీ తరఫున పోలీసులు గూఢచర్యం నెరుపుతున్నారని, ఎమ్మెల్యేల గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు బీజేపీకి చెరవేస్తున్నారని ఎన్సీపీ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ సైతం బీజేపీ తమ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మకాం వేసిన హోటల్లో బీజేపీ కూడా రూమ్‌లు బుక్ చేస్తోందని, తద్వారా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను బీజేపీ కాంటాక్ట్ చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో బీజేపీ గాలానికి అందకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జుహూలోని జేడబ్ల్యూ మారియట్ హోటల్‌కు తరలించారు. అటు శివసేన తన ఎమ్మెల్యేలను గట్టి నిఘా నడుమ ముంబై ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలోని లలిత హోటల్లో ఉంచింది. -
ఉద్రిక్తత నడుమ హైస్కూల్ స్థలం ఆక్రమణల తొలగింపు
చోడవరం టౌన్: చోడవరం ప్రభుత్వ హైస్కూల్ ఆవరణలో ఆక్రమణల తొలగింపు శుక్రవారం ఉద్రిక్తతల నడుమ సాగింది. ఆక్రమణలు తొలగించాలంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో రెవెన్యూ యంత్రాంగం శుక్రవారం ఉదయం తొలగింపు కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణ ఆక్రమణకు గురైందని పట్టణానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు ఏఆర్జీ శర్మతో పాటు మరో నలుగురు హై కోర్టుని ఆశ్రయించారు. ఆక్రమణలు మూడు నెలల్లోగా తొలగించాలని దీంతో ఈ ఏడాది జనవరిలో హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే సార్వత్రిక ఎన్నికల కారణంగా ఇప్పటి వరకూ జాప్యం జరిగింది. ఆక్రమణల తొలగింపులో ఎటువంటి ఉద్రిక్తత జరగకుండా రెవెన్యూ అధికారులు, పో లీసులు 144 సెక్షన్ విధించారు. సుమారు 100 మంది సిబ్బందిని అక్కడ మోహరించి పొక్లెయి న్‌తో ఆక్రమణలు తొలగింపు చేపట్టారు. కొం దరు మహిళలు ఆడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు, రెవెన్యూ అధికారులు వారితో చర్చలు జరిపి అక్కడ నుంచి పంపించివేశారు. కాగాపాఠశాల ఆవరణలో సుమారు 29 మంది ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేశామని, వారు ఆ నోటీసులు బేఖాతరు చేయడంతో స్థానికులు కొందరు హైకోర్టుని ఆశ్రయించారని తహసీల్దార్ రవికుమార్ తెలిపారు. తరువాత హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆక్రమణలు తొలగింపు చేపట్టామన్నారు. సర్వే నంబరు 72లో పాఠశాలకు 7ఎకరాల 23 సెంట్లు స్థలం ఉండగా దీనిలో 1094 గజాలు స్థలం ఆక్రమణకు గురయ్యిందన్నారు. ప్రస్తుతం 1094 గజాల్లో 500 గజాలు ఖాళీ స్థలం ఉండగా 594 గజాల్లో పక్కా కట్టడాలు ఉన్నాయని తెలిపారు. వీటిలో కొంత పొక్లెయిన్‌తో తలగించగా, మరి కొందరు ఆక్రమణలు తామే స్వచ్ఛందంగా తొలగిస్తామని గడువు కోరడంతో వారికి సమయం కేటాయించామని తెలిపారు. -
అక్రమ వేట కేసులో ప్రముఖ గోల్ఫ్ ప్లేయర్ అరెస్ట్
లక్నో : అక్రమంగా వేటాడుతున్నరనే కేసులో భారత గోల్ఫర్ జ్యోతి రంధావాను ఉత్తర్ ప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రంధావ వద్ద నుంచి ఏ - 22 రైఫిల్, వాహనం (హెచ్ఆర్26 డీఎన్ 5299)తో పాటు వేట సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. కతెర్నియాఘాట్లోని మోతిపూర్లో రంధావకు వ్యవసాయ క్షేత్రం ఉంది. అక్కడ అనుమానాస్పదంగా వాహనం నడుతుపుతుండటంతో పోలీసులు రంధావాను అరెస్ట్ చేశారు. ఈ సమయంలో అతని వద్ద నుంచి అడవి పంది చర్మం, బైనాక్యులర్‌తో పాటు రంధావ పేరు మీద రిజిస్టర్ అయిన వాహనాన్ని కూడా సీజ్ చేశారు. రంధావాను ప్రస్తుతం కతెర్నియాఘాట్ జిల్లా అటవీ అధికారి విచారిస్తున్నారు. చట్ట పరంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. భారత్ తరఫున ఒకప్పుడు అత్యుత్తమ గోల్ఫర్గా జ్యోతి రంధావ రికార్డులు సృష్టించారు. బాలీవుడ్ నటి చిత్రాంగద సింగ్‌ను పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి బంధం ఎంతో కాలం నిలవలేదు. 2014లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది జ్యోతి రంధావ ప్రొఫెషనల్ గోల్ఫర్గా మారారు. ఆసియా టూర్లో 8 టైటిళ్లు గెలిచారు. 2004లో యూరోపియన్ టూర్లో జానీ వాకర్ క్లాసిక్‌తో కలిసి అత్యుత్తమంగా రెండో స్థానంలో నిలిచారు. గోల్ఫ్ ప్రపంచకప్ టోర్నీల్లో 2005, 2007, 2008, 2009లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించారు. -
దర్జాగా కబ్జా !
► రూ. కోట్ల విలువైన సొసైటీ స్థలం అక్రమార్కుల పరం ► రాజకీయ పలుకుబడితో సొంతం చేసుకున్న వైనం ► మరికొన్ని స్థలాలపైనా కన్ను పట్టించుకోని పాలకులు ఎకరా ఖాళీ స్థలంతో పాటు పాలకొండ, శ్రీకాకుళం ప్రధాన రహదారికి ఆనుకొని తహశీల్దార్ కార్యాలయం ఎదుట సుమారు 50 సెంట్ల స్థలం, అలాగే జగన్నాథస్వామి ఆలయ సమీపంలో సుమారు ఎకరన్నర ఈ సంస్థకు ఉంది. ప్రస్తుతం ఈ స్థలాలు స్థానిక మార్కెట్ ధర ప్రకారం రూ. 10 కోట్లు నుంచి 15 కోట్ల రూపాయల వరకూ ఉంటుంది. దీంతో ఈ స్థలాలపై పలుకుబడి ఉన్న వ్యక్తుల కన్ను పడింది. ఇప్పటికే నాగవంశపువీధి కూడలిలో ఉన్న గొడౌన్ స్థలం ఓ పక్క నుంచి ఆక్రమణలు సాగుతున్నారుు. ఇదే అదునుగా అధికార పార్టీ అండదండలు ఉన్న కొంతమంది వ్యక్తులు ఈ జాగాను సొంతం చేసుకొనేందుకు చకచకా పావులు కదుపుతున్నారు. జగన్నాథస్వామి ఆలయ సమీపంలో ఉన్న స్థలంలో సుమారు 30 సెంట్లు ఇప్పటికే ఆక్రమణకు గురైంది. మరోవైపు అత్యంత విలువైన తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న స్థలం ఆక్రమణలు జోరుగా సాగుతున్నారుు. ఈ స్థలాన్ని పలు ప్రభుత్వ కార్యాలయాలకు లేదా క్వార్టర్లకు వినియోగించేలా మరికొంతమంది ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో స్థలాలు అన్యాక్రాంతం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నారుు. ఆ శాఖాధికారులు దృష్టిసారించి వీటిని పర్యవేక్షించాల్సిన అవసరం ఏర్పడింది. అధికారుల నిర్లక్ష్యం! కోట్లాది రూపాయల విలువైన స్థలాల పరిరక్షణలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కనిపిస్తుంది. ప్రధానంగా డీసీఎంఎస్ శాఖకు ఆ స్థలాలు ఎక్కడున్నారుు, వాటి పరిస్థితి, ఆక్రమణల పర్వం తదితర అంశాలపై పూర్తి సమాచారం లేదు. గత ఐదేళ్లుగా నాగవంశపు కూడలిలో ఉన్న స్థలంలో రైతు బజారు ఏర్పాటు చేయాలన్న యోచన కార్యరూపం దాల్చలేదు. ఈ స్థలాలపై రెవెన్యూ అధికారులకు ఎటువంటి సమాచారం లేదు. వీటి ఆక్రమణలను ఎవరు అడ్డుకుంటారన్న దానిపైన స్పష్టత కొరవడింది. సొంతంగా డీసీఎంఎస్ శాఖ ఆస్తులు పరిరక్షణ చేపట్టలేక పలుమార్లు రెవెన్యూ అధికారులనే ఆశ్రరుుంచింది. ఈ పరిస్థితి వల్ల ప్రయోజనం కనిపించకపోవడంతో స్థలాలు నిరుపయోగంగా ఉంచింది. వీటిని లీజు రూపంలోనైనా వ్యాపార వర్గాలకు అందజేస్తే ఆదాయం సమకూరుతుంది. చర్యలు తీసుకుంటాం డీసీఎంఎస్ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటాం. రైతుబజారు ఏర్పాట్లు ప్రస్తుతం జరుగుతున్నారుు. ఆక్రమణలపై దృష్టి పెడుతున్నాము. అన్నిశాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ స్థలాలపై చర్చిస్తాం.- రెడ్డి గున్నయ్య ఆర్డీవో పాలకొండ -
వక్ఫ్ భూములు కాపాడాలి
♦ భూముల సమాచారం పక్కాగా ఉండాలి ♦ రిజిస్ట్రేషన్లు చేయొద్దు ఆక్రమణలు వాస్తవమే ♦ శాసనసభ కమిటీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సంగారెడ్డి జోన్: రాష్ట్రంలో వక్ఫ్ భూములను కాపాడాలని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణపై ఏర్పాటైన శాసనసభ కమిటీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అధికారులను ఆదేశించారు. భూములు ఆక్రమణకు గురైన విషయం వాస్తవమేనని అంగీకరించారు. వక్ఫ్ భూముల విచారణకు నియమించిన శాసన సభ కమిటీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సభ్యులు ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, సయ్యద్ అల్తాఫ్ హుస్సేన్ రజ్వీలు మంగళవారం సంగారెడ్డిలో పర్యటించారు. ఈ మేరకు వారు కలెక్టరేట్ సమావేశ మందిరంలో తహసీల్దార్లతో స మీక్ష నిర్వహించారు. చైర్మన్ బాజిరెడ్డి మాట్లాడు తూ... గతంలో నియమించిన కమిటీ నివేదిక లో స్పష్టత లేకపోవడంతో శాసన సభ్యులు, శాసన మండలి సభ్యుల విజ్ఞప్తి మేరకు సీఎం స్పందించి వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం శాసన సభ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణలో పెద్ద ఎత్తున వక్ఫ్ భూములు ఆక్రమణకు గురైనందున వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక రూపొందిస్తామన్నారు. రెవెన్యూ పో లీస్, వక్ఫ్ అధికారులు సమన్వయంతో పనిచేసి వక్ఫ్ భూములు, ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలని సూచించారు. ఆస్తుల విషయంలో గందరగోళం... జిల్లాలో 23,910.11 ఎకరాల వక్ఫ్ భూములున్నట్టు సమాచారం ఉండగా, వక్ఫ్‌బోర్డు ఇన్స్పెక్టర్ మాత్రం 20,806 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు నివేదిక అందించారని చైర్మన్ బాజిరెడ్డి తెలిపారు. జిల్లాలో వక్ఫ్ బోర్డు ఆధీనంలో 4,480 ఎకరాలు ఉండగా, 7,728.3 ఎకరాలు ఓఆర్సీ, ఇతరుల కబ్జాలో ఉందన్నారు. 8,603.2 ఎకరాల భూమి వివరాలను తేల్చాల్సి ఉందన్నారు. వక్ఫ్ బోర్డు నుంచి ఆదాయం రూ.5 కోట్లు వస్తుండగా అంతే మొత్తంలో ఖర్చవుతుందన్నారు. వక్ఫ్ భూములను కొందరు దాతలు విరాళంగా అందజేశారన్నారు. వాటిని విద్య, వైద్యం, ఇతర సామాజిక అంశాలకు వినియోగించాలనే వారి లక్ష్యమన్నారు. కాని వారి లక్ష్యం నెరవేరకపోగా, ఆస్తులను కొందరు ఆక్రమించుకొని అనుభవిస్తున్నారన్న ఆరోపణలపై తమ కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు. రిజిస్ట్రేషన్లు జరగకుండా నియంత్రించాలి... వక్ఫ్ భూములు రిజిస్ట్రేషన్ జరగకుండా చూడాలని బాజిరెడ్డి అధికారులను ఆదేశించారు. సర్వే నంబర్ల వారీగా వివరాలను సంబంధిత రిజిస్ట్రార్లకు అందజేయాలని సూచించారు. ఆస్తుల ఆక్రమణను తీవ్రంగా పరిగణిస్తామన్నారు. వక్ఫ్ బోర్డు వివరాలను, రెవెన్యూ రికార్డులకు సరిచూసుకుని త్వరగా నివేదికలు అందజేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. జిల్లా నుంచి వచ్చే నివేదిక ఆధారంగా మిగిలిన తొమ్మిది జిల్లాల్లో తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టత వస్తుందన్నారు. సమైక్య రాష్ట్రంలోని వక్ఫ్‌బోర్డు పట్ల తీవ్ర నిర్లక్ష్యం జరిగిందన్నారు. వక్ఫ్ ఆస్తులతో ప్రభుత్వానికి సంబంధం లేకుండా చేశారన్నారు. వక్ఫ్ ఆస్తులను రెవెన్యూ శాఖకు అప్పగించి, వాటి పరిరక్షణకు శాసన సభ కమిటీ చర్యలు చేపట్టిందన్నారు. బోర్డులు ఏర్పాటు చేయాలి... క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న తహసీల్దార్లు వక్ఫ్‌భూములను కాపాడాలని కమిటీ సభ్యులు ఫారూక్ హుస్సేన్, సయ్యద్ అల్తాఫ్ హుస్సేన్ రజ్వీ అధికారులకు సూచించారు. సదరు భూ ముల్లో బోర్డులను ఏర్పాటుచేసి అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కోహీర్‌లో అత్యధికంగా భూములున్న నేపథ్యంలో వాటి పరిరక్షణకు సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 175 దరఖాస్తులు ఆర్డీఓల వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించి వివరాలను వక్ఫ్ బోర్డుకు అందజేయాలన్నారు. వక్ఫ్ భూములు లీజుకు పొందిన, ఆస్తుల విషయంలో అద్దె పెంచకుండా, ఖాళీ చేయకుండా బోర్డుకు ఆదాయం రాకుండా కబ్జా చేస్తున్న వాటి వివరాలను అందజేయాలన్నారు. జిల్లాలో వక్ఫ్ భూములను క్షేత్రస్థాయిలో గుర్తించడానికి మరో ఐదుగురు ఇన్స్పెక్టర్లను కేటాయించాలని కలెక్టర్ రోనాల్డ్ రోస్ అన్నారు. పహాణీల్లో వక్ఫ్‌భూములను ప్రత్యేకంగా నమోదు చేయాలని సూచించారు. ఉదయం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో శాసన సభా కమిటీ సభ్యుల సమావేశంలో కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వక్ఫ్ భూముల వివరాలు వెల్లడించారు. సమావేశంలో శాసన సభ్యులు మహిపాల్ రెడ్డి, డీఆర్ఓ దయానంద్, వక్ఫ్ సీఈఓ మహ్మద్ అసదుల్లా, సంగారెడ్డి, మెదక్ ఆర్డీఓలు శ్రీనివాస్ రెడ్డి, మెంచు నగేశ్, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
అక్కడే ఎక్కువ!
సంపన్న ప్రాంతాల్లోనే అధిక ఆక్రమణలు బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులతో వెల్లడి సిటీబ్యూరో: సాధారణంగా నగరంలో అక్రమ నిర్మాణాలు ఎక్కడ ఉంటాయి..! బస్తీల్లోను, దిగువ మధ్య తరగతి నివాసం ఉండే ప్రాంతాల్లోనే అనుకుంటారు. ఆర్థిక స్థోమత లేనివారు, తక్కువ స్థలం ఉన్నవారు తమ అవసరాల నిమిత్తం కొంత స్థలం ఆక్రమించుకుంటారు.. ఇంతకాలం చాలామందిలో ఇదే అభిప్రాయం ఉంది. కానీ, అక్రమ నిర్మాణాలు, అక్రమ లే ఔట్లు ఎక్కువగా సంపన్నుల ప్రాంతాల్లోనే ఉన్నట్టు తాజాగా తేలింది. అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ల కోసం జీహెచ్ఎంసీకి అందిన దరఖాస్తులను పరిశీలిస్తే ఈ విషయం బయటపడింది. సిటీలో సంపన్న ప్రాంతాలైన అమీర్‌పేట, సోమాజిగూడ, వెంగళరావు నగర్, నాగోల్, హయత్‌నగర్, వనస్థలిపురం, కేపీహెచ్‌బీ కాలనీ, మూసాపేట, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కాప్రా నుంచి ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు అందాయి. వీటిల్లో బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ రెండింటిలోనూ ఎల్బీనగర్ (3ఏ) సర్కిల్ ప్రథమ స్థానంలో ఉంది. అక్రమ భవనాలు, అక్రమ లే ఔట్లు ఇక్కడే ఎక్కువ. ఈ సర్కిల్లోని నాగోల్, మన్సూరాబాద్, హయత్‌నగర్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్, హస్తినాపురం వంటి డివిజన్లు ఉన్నాయి. వేలల్లో దరఖాస్తులు.. ఎల్బీనగర్(3ఏ) సర్కిల్ నుంచి బీఆర్ఎస్కు 22,200 దరఖాస్తులు అందగా, ఎల్ఆర్ఎస్ కోసం 21,921 వచ్చాయి. అక్రమ భవనాలకు సంబంధించిన దరఖాస్తులు ఖైరతాబాద్-ఏ, కూకట్పల్లి-ఏ సర్కిళ్ల పరిధిలో ఎక్కువగా ఉండగా, లే ఔట్ల అక్రమాలు ఎల్బీనగర్-ఏ, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి-1 సర్కిళ్లలో అధికంగా ఉన్నాయి. బీఆర్ఎస్కు ఎక్కువ దర ఖాస్తులు (2వ స్థానం) ఖైరతాబాద్ (10ఏ) సర్కిల్ నుంచి అందాయి. ఇక్కడి నుంచి 14,784 దరఖాస్తులు వచ్చాయి. దీని పరిధిలో వెంగళరావు నగర్, సోమాజిగూడ, యూసుఫ్‌గూడ, రహ్మత్‌నగర్, బోరబండ తదితర ప్రాంతాలు ఉన్నాయి. ఇక మూడో స్థానంలో ఉన్న కూకట్పల్లి (14ఏ) సర్కిల్ నుంచి 14, 644 దరఖాస్తులందాయి. దీని పరిధిలో కేపీహెచ్‌బీ కాలనీ, మూసాపేట, మోతీనగర్, ఫతేనగర్ తదితర ప్రాంతాలు ఉన్నాయి. ఎల్ఆర్ఎస్కు ఎల్బీనగర్-ఏ తర్వాత కుత్బుల్లాపూర్ నుంచి అత్యధికంగా 6,248 దరఖాస్తులు వచ్చాయి. తర్వాతి స్థానాల్లో శేరిలింగంపల్లి-1, కాప్రా సర్కిళ్లు ఉన్నాయి. ప్రస్తుతం వీటి పరిశీలనలో ఉన్న అధికారులు బీఆర్ఎస్ అనంతరం ఆస్తిపన్ను, ట్రేడ్ లెసైన్సుల ఫీజులు, తదితర వాటి ద్వారా జీహెచ్ఎంసీ ఆదాయం గణనీయంగా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్పై హైకోర్టు స్టే ఉన్నందున వాటిని పక్కనపెట్టి ఎల్ఆర్ఎస్లను పరిష్కరిస్తున్నారు. ఈ నెలాఖరుకు 10 వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలనేది లక్ష్యం. ఇప్పటికి ఏడువేల దరఖాస్తులను పరిష్కరించారు. జీహెచ్ఎంసీకి బీఆర్ఎస్ కోసం 1.30 లక్షల ద రఖాస్తులు అందగా, ఎల్ఆర్ఎస్ కోసం 73 వేల దరఖాస్తులు అందాయి. -
కబ్జా కోరల్లో బుడమేరు
ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు గజం రూ.20 వే లకు విక్రయం రామకృష్ణాపురం, ఇందిరానాయక్ నగర్లో ఆక్రమణలు పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు విజయవాడ : బుడమేరు కబ్జా కోరల్లో చిక్కుకుంది. విజయవాడ 53వ డివిజన్ పరిధిలోని రామకృష్ణాపురం ప్రాంతంలో ఈ కబ్జా దర్జాగా సాగిపోతోంది. ఏకంగా ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు. ఇప్పటికే 40 ప్లాట్లు అమ్మేశారు. గజం రూ.20 వేలు వంతున ఒక్కో ప్లాటు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల చొప్పున విక్రయించేశారు. కొనుగోలు చేసినవారు ప్రహరీలు కట్టుకోవటం, మట్టి తోలి బుడమేరును పూడ్చేయటం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇందిరానాయక్ నగర్ ప్రాంతంలోనూ బుడమేరును కబ్జా చేసి ప్లాట్ల అమ్మకాలు చేపట్టినట్లు సమాచారం. టీడీపీ ఎమ్మెల్యే అండ! నగరంలోని ఒక టీడీపీ ఎమ్మెల్యే అండతో ఈ అక్రమ తంతు యథేచ్ఛగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయనకూ వాటాలు వెళుతున్నాయని సమాచారం. బుడమేరు కాలువలో డ్రెయినేజీ నీరుతో పాటు వరద నీరు కూడా వస్తుంది. సత్యనారాయణపురం పైభాగానికి వచ్చేసరికి వెడల్పు సుమారు అర కిలోమీటరు వరకు ఉంటుంది. ఇక్కడే ఈ కబ్జాలు జోరుగా జరుగుతున్నాయి. రానురానూ కాలువను పూడ్చి ఇళ్లు కట్టుకుంటున్నారు. పలు ప్రాంతాలకు ముప్పు వరదల సమయంలో బుడమేరు ఉగ్రరూపం దాల్చినప్పుడు భగత్‌సింగ్ నగర్, ఆంధ్రప్రభ కాలనీ, పాయకాపురం, ప్రకాష్ నగర్లు మునకకు గురవుతుంటాయి. కబ్జాలు ఎక్కువ కావడంతో బుడమేరు మార్గం కుంచించుకుపోవటమే దీనికి ప్రధాన కారణం. ప్రస్తుత కబ్జాలతో ముంపు తీవ్రత మరింత పెరిగే ప్రమాదముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. -
చెరువులను చెరబట్టారు
జిల్లాలోని చెరువులను అధికార పార్టీ నేతలు చెరబట్టారు. ప్రభుత్వ భూములు అయిపోయాయేమో.. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులను పోటీలుపడి ఆక్రమిస్తున్నారు. వాటిల్లో బోర్లువేసి, మోటార్లు బిగించి పంటలు సాగుచేస్తున్నారు. అధికారులు సైతం వారిని అడ్డుకునేందుకు సాహసించలేకపోతున్నారు. - శ్రుతిమించుతున్న అధికార పార్టీ నేతల ఆగడాలు - బోర్లు వేసి పంటలు సాగుచేస్తున్న వైనం - జిల్లా వ్యాప్తంగా చెరువుల్లో 5వేల ఎకరాల ఆక్రమణ సాక్షి,చిత్తూరు : జిల్లాలో ఆక్రమణల పరంపర కొనసాగుతోంది. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్నారు. చిన్నగొట్టిగల్లు మండలంలోనే 72 ఎకరాల చెరువు భూములు ఆక్రమణలకు గురయ్యాయని తహశీల్దార్ నారాయణమ్మ చెప్పడం చూస్తే ఆక్రమణలు ఏ స్థాయిలో జరిగాయో తెలుస్తోంది. ఒక్క చిన్నగొట్టిగల్లు చెరువులోనే అధికార పార్టీ నేతలు 15 ఎకరాల భూమిని ఆక్రమించి సాగుచేస్తున్నారు. ఆక్రమణలను తొలగించేందుకు పూనుకుంటే అధికారపార్టీ నేతలు దాడులకు దిగుతున్నారని, ఇటాంటి పరిస్థితిలో ఉద్యోగాలు చేయడమే కష్టంగా ఉందని తహశీల్దార్ నారాయణమ్మ శనివారం కలెక్టరేట్ వద్ద విలేకరులతో వాపోయారు. జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీ నేతలది ఇదే తీరు. జిల్లాలో పంచాయతీరాజ్, చిన్ననీటి పారుదల శాఖల పరిధిలో 8,083 చెరువులున్నాయి. వీటిలో వంద ఎకరాలలోపు ఆయకట్టు ఉన్న చెరువులు 7,395 ఉండగా, వంద ఎకరాల పైబడి ఆయకట్టు ఉన్న చెరువులు 683 ఉన్నాయి. శ్రీకాళహస్తి, సత్యవేడు, చిత్తూరు, చంద్రగిరి, పూతలపట్టు, జీడీనెల్లూరుతోపాటు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో చెరువులు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి. 66 మండలాల పరిధిలో 5 వేల ఎకరాలకు పైనే ఆక్రమణకు గురయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఆక్రమిత చెరువుల్లో పంటలు సాగు చేస్తుండగా తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు, మదనపల్లె తదితర నగర, పట్టణ ప్రాంతాల చెరువులను ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కోట్లు దండుకుంటున్నారు. కొందరు రెవెన్యూ అధికారులు సైతం అధికారపార్టీ నేతలకు సహకరిస్తూ లక్షల్లో దండుకంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని అన్ని చెరువుల ఆక్రమణలు తొలగించి ఆధునికీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలో అమలుకు నోచుకోలేదు. ఏ ఒక్క చెరువులోనూ ఆక్రమణలు తొలగించేందుకు అధికారులు ముందుకు రాలేదు. మరోవైపు చెరువుల ఆధునికీకరణ ముందుకు సాగలేదు. వేసవి ప్రారంభం నుంచే పనులు మొదలు పెట్టి చేయా ల్సి ఉన్నా, వేసవి ముగింపు సమయంలో 3,715 చెరువులు, చిన్న కుంటల్లో మాత్రమే అధికారులు పనులు చేపట్టడంపై విమర్శలు ఉన్నాయి. ఇప్పటికీ 60 శాతానికి పైగా చెరువుల్లో పనులు మొదలు కాలేదు. ఆధునికీకరణ పనులు పూర్తికాకపోతే చెరువుల్లో వాననీరు పూర్తి స్థాయిలో నిలిచే పరిస్థితి ఉండదు. అదే జరిగితే రైతులకు వ్యవసాయ పనులకేకాక భూగర్భ జలాల పెరుగుదలకూ నష్టమే. జిల్లా వ్యాప్తంగా దాదాపు 90 శాతానికి పైగా చెరువుల కట్టలు, తూములు, పంటకాలువలు ఇప్పటికే దెబ్బతిన్నాయి. -
చస్తే.. చావే!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: బతకాలంటే కూడు, గూడు, గుడ్డ అవసరం. చచ్చాక ఆరడుగుల నేల తప్పనిసరి. ఆ అవసరాల తీర్చుకోవటానికి ప్రతి మనిషి నిత్యం సమస్యలతో సావాసం చేస్తుంటారు. క్షణం తీరికలేకండా గడుపుతుంటారు. కోట్లు సంపాదించిన వారైనా.. అడుక్కుతినే వారైనా చివరకు తనువు చాలించాల్సిందే. తనువు చాలించాక ఆరడుగుల నేల అవసరం. మృతదేహాన్ని పూడ్చిపెట్టేందుకు ఏర్పాటు చేసిన శ్మశాన వాటికలు సైతం పలుకుబడి, అధికారం ఉన్న కొందరు ఆక్రమించుకుని అనుభవిస్తున్నారు. జిల్లాలో అనేక గ్రామాల్లో శ్మశానాలు లేకపోగా.. మరి కొన్ని ప్రాంతాల్లో ఉన్న శ్మశానాలు ఆక్రమణలకు గురయ్యాయి కొన్ని పల్లెల్లో శ్మశానాలకు దారుల్లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సైదాపురం మండలం తురుమెళ్లలో ఆదివారం స్థానికులకు ఎదురైన సంఘటనే నిదర్శనం. తురుమెళ్ల అరుంధతి వాడకు చెందిన పసుపల వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో మరణించాడు. అతన్ని పూడ్చిపెట్టడానికి ఆరడుగుల నేల దొరకలేదు. శ్మశాన వాటికను స్థానిక టీడీపీ నేత ఒకరు ఆక్రమించి సాగు చేస్తున్నాడు. అధికార పార్టీ నాయకుడు కావడంతో అందులోకి వెళ్లేందుకు దళితులు సాహసించలేకపోయారు. అరుంధతివాడ వాసులంతా చర్చింకుని ఒక్కటిగా వెళ్లి అంత్యక్రియలు జరిపిం చారు. శ్మశాన వాటికకు వెళ్లేందుకూ దారి సౌకర్యం లేకపోవటంతో తీవ్ర ఇబ్బం దుల పడాల్సి వచ్చింది. శ్మశానాలను వదలని కబ్జాకోరులు... నెల్లూరు నగరంలోని బొడిగాడితోట శ్మశాన వాటిక ఆక్రమణకు గురైంది. అందులో నివాస గృహాలు సైతం ఏర్పాటు చేసుకున్నారు. ఆక్రమణలను గురించి ప్రశ్నించే వారు గాని.. చర్యలు తీసుకునే ధైర్యం గానీ అధికారులు చేయలేకపోతున్నారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం కొండూరుపాళెం, పెనుబలి శ్మశాన వాటికలకు దారుల్లేవు. విడవలూరు మండలం భద్రాచలంలో శ్మశాన వాటికకు వెళ్లాలంటే ప్రవహిస్తున్న వాగును దాటుకుని వెళ్లాల్సి ఉంది. కొడవలూరు మండలం నార్త్‌రాజుపాళెంలో శ్మశాన స్థలం లేకపోవటంతో రైల్యేట్రాక్ పక్కనే పూడ్చిపెడుతున్నారు. వెంకటగిరి పట్టణం చెవిరెడ్డిపల్లిలో శ్మశానం దారి ఆక్రమణకు గురైంది. దీంతో దారిలోనే మృతులకు అంత్యక్రియలు జరుపుతున్నారు. బాలాయపల్లి మండలం వెంకిరెడ్డిపల్లి, పాతవూరు, అంబలపూడి శ్మశాన స్థలాలను ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారు. దీంతో ఈ ప్రాంతాల్లో ఎవరైనా మరణిస్తే పంట పొలాల్లోనే పూడ్చిపెట్టాల్సిన దుస్థితి. నిండలి గ్రామంలో శ్మశానానికి కేటాయించిన మూడు ఎకరాల్లో రెండు ఎకరాలు భూమి ఆక్రమణకు గురైంది. ముత్తుకూరు మండలంలోని గురవయ్యసాల, వెంకనపాళెం, మామిడిపూడి దళితవాడకు శ్మశానాలు లేవు. రిలయన్స్, జెన్కో కాలనీలకు దారి సౌకర్యాలు లేవు. పొదలకూరు శ్మశానం ఆక్రమణలకు గురైంది. విరువూరు, కాకాణి నగర్‌లకు శ్మశానం లేదు. మనుబోలు, బద్దెవోలు గ్రామాల శ్మశానాలు ఆక్రమణలకు గురయ్యాయి. తోటపల్లి గూడూరు, వెంకటాచలం మండలంలోని నక్కావారిపాళెం, ముంగలదొరువు, వెంకటాచలం, మంగళంపాడు గ్రామాలకు శ్మశానాలు లేవు. సూళ్లూరుపేట మండలంలో దాదాపు అన్ని గ్రామాల్లో శ్మశానాలు ఆక్రమణలకు గురయ్యాయి. సుగ్గుపల్లి, అబాక, నెల్లూరుపాడు, పుదిరి గ్రామాల్లోని శ్మశానాలకు దారుల్లేవు. సూళ్లూరుపేట టౌన్‌లోని శ్మశాన వాటి ఆక్రమణకు గురైంది. కావలి పరిధిలో వైకుంఠపురం, గౌరవరం శ్మశాన వాటికలు ఆక్రమణకు గురైతే.. రుద్రకోట తదితర ప్రాంతాల్లోని శ్మశాన వాటికలకు దారుల్లేవు. ఇంకా గూడూరు, ఉదయగిరి, ఆత్మకూరు నియోజక వర్గాల పరిధిలోని అనేక గ్రామాల్లోని శ్మశానాలు ఆక్రమణలకు గురైతే.. మరి కొన్నిచోట్ల దారులు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికులు అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి శ్మశాన వాటిక సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. -
రంగంలోకి విజిలెన్స్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : యథేచ్ఛగా సాగిన మావల చెరువు భూ ముల ఆక్రమణల వెనుక ఆసలు సూత్రధారుల గుట్టు త్వరలోనే తేలనుంది. కలెక్టరేట్ కార్యాలయానికి కూతవేటు దూరంలో.. జాతీయ రహదారి పక్కన ఉన్న అత్యంత విలువైన భూమిని కాజేసిన వైనంపై రెవెన్యూ అధికారుల విచారణ ఇంకా సాగుతోంది. మావల చెరువును కబ్జా చేసి కొత్తగా నిర్మిస్తున్న ఫంక్షన్‌హాల్‌తోపాటు.. ఏళ్ల కిందట నిర్మించి న మరో పంక్షన్‌హాల్ నిర్మాణం అసలు సూత్రధారులను పట్టుకునే పనిలో రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు పడటం చర్చనీయాంశం అవుతోంది. మావల చెరువు ఆక్రమణలపై ‘సాక్షి’లో వెలువడిన వరుస కథనాల నేపథ్యంలో కలెక్టర్ అహ్మద్ బాబు ఆర్డీవో సుధాకర్‌రెడ్డిని విచారణకు ఆదేశించిన విష యం విదితమే. 1.30 ఎకరాల పట్టాపై ఓ బ్యాంకు అధికారి.. ఆ భూమిని ఆనుకుని ఉన్న చెరువు శిఖా న్ని ఆక్రమించి నాలుగెకరాలకు విస్తరించి ఫంక్షన్‌హాల్ నిర్మించిన వైనాన్ని రెవెన్యూ అ ధికారులు బట్టబయలు చే శారు. అంతేగాకుండా చిల్కూరు ల క్ష్మీ గార్డెన్స్‌లో స్థలాన్ని సైతం గుర్తించారు. అయి తే చెరువు శిఖం ఆక్రమణల కు సూత్రధారిగా వ్యవహరిం చిన ఓ పంచాయతీ మాజీ కార్యదర్శి పాత్రపైనా తాజాగా విజిలెన్స్ ఆరా తీస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. హాట్ టాపిక్‌గా చెరువు ఆక్రమణ ప్రభుత్వ, అసైన్డ్ భూములే కాదు.. చెరువు శిఖాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కబ్జాదారులకు వరంగా మారాయి. యథేచ్ఛగా సాగుతున్న భూభాగోతాల వెనుక రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన మాజీ అధికారు లు, ఉద్యోగులే ఉండటం ఆందోళన కలిగిస్తోం ది. కొత్తగా వచ్చిన కలెక్టర్ ఐదు మాసాలుగా జిల్లా వ్యాప్తంగా అక్రమాలు, ఆక్రమణలపై కొరడా ఝుళిపిస్తుండటంతో అక్రమార్కు ల గుట్టురట్టవుతోంది. సుమారు రూ.10 కోట్ల విలువ చేసే మావల చెరువు శిఖం ఆక్రమణలు, అక్రమ కట్టడాలకు గురి కాగా, గతంలో నిర్మించిన చిల్కూరి లక్ష్మీ గార్డెన్, కొత్త నిర్మిస్తున్న ఫంక్షన్‌హాల్‌ల నిర్మాణంలో కొందరు అధికారుల పాత్రే కీలకం కావడం గమనార్హం. మావల చెరువును ఆనుకుని కొత్తగా నిర్మిస్తున్న ఫంక్షన్‌హాల్ యజమాని పేరిట 1.30 భూమికే పట్టా ఉండగా.. సదరు వ్యక్తి నాలుగెకరాల్లో ఫంక్షన్‌హాల్ నిర్మాణం చేపట్టాడు. సుమారు ఎనిమిది మాసాల క్రిత మే ఈ ఫంక్షన్‌హాల్ నిర్మాణానికి శ్రీకారం జరగ్గా అప్పుడున్న ఉన్నతాధికారులతో పాటు రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు ‘మామూలు’గా తీసుకున్నారు. దానిపైనా విజిలెన్స్ అధికారులు తాజాగా రంగంలోకి దిగడం చర్చనీయాంశం అవుతోంది. 1.30 ఎకరాలకు పట్టాపొందిన ఓ ఉన్నతస్థాయి బ్యాంకు అధికారి నాలుగెకరాల్లో ఫంక్షన్‌హాల్ నిర్మించడం.. ఆ తర్వాత రెవెన్యూ అధికారులు ఆక్రమించిన భూమిని స్వాధీనం చేసుకోవడం.. మిగిలిన 1.30 ఎకరాల్లో సదరు వ్యక్తికి ఉన్న లింకుడ్ డాక్యుమెంట్లపైనా వారు ఆరా తీస్తుండటం కలకలం రేపుతోంది. -
అటవీ భూంఫట్..!
సాక్షి, గుంటూరు : జిల్లాలో అటవీభూములకు సంబంధించి అటు రెవెన్యూ, ఇటు అటవీశాఖలో ఉన్న రికార్డుల్లో పొంతనలేని సమాచారాన్ని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. నిర్భయంగా భూములను ఆక్రమించుకుని సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా 1.64 లక్షల హెక్టార్లలో అటవీ భూములు విస్తరించి ఉన్నాయి. వీటిల్లో సుమారు 3,260 హెక్టార్లు(8,058 ఎకరాలు) అన్యాక్రాంతమైనట్లు అటవీ శాఖ రికార్డులు చెబుతున్నాయి. జిల్లాలోని నల్లమల, కాకిరాల అటవీప్రాంత భూములతో పాటు మంగళగిరి, తాడేపల్లి, అచ్చంపేట, బెల్లంకొండ తదితర మండలాల్లో అటవీభూములు పెద్ద ఎత్తున ఆక్రమణల బారినపడ్డాయి. గుంటూరు రేంజ్‌లోనే మొత్తం 1630 హెక్టార్లు, మాచర్ల రేంజ్ పరిధిలో 1394 హెక్టార్లు, వినుకొండ రేంజ్‌లోని 20 హెక్టార్లు అన్యాక్రాంతం కాగా, రేపల్లె రేంజ్‌కు చెందిన 226.37 హెక్టార్ల అటవీభూములు ఆక్రమణలకు గురయ్యాయి. చదును భూములపై కన్నేస్తూ.. జిల్లాలో పట్టణాలు విస్తరిస్తున్నకొద్దీ సమీపంలోని అటవీభూములు ఆక్రమణలబారిన పడుతున్నాయి. కొం డలు, అడవుల్లో చదునుగా ఉన్న భూములపై కొం దరు కన్నేస్తున్నారు. సొసైటీలు, యువజన సంఘాల పేరుతో పాగా వేయడం, అనంతరం వాటిని గజాల చొప్పున పేదలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని తెలిసింది. ఈ ప్రకారం పల్నాడు డివిజన్లో అనేక చోట్ల అటవీభూముల్లో గుడిసెలు వెలిశాయి. దాచేపల్లి మండలం మాదినపాడు గ్రామంలో 210 హెక్టా ర్లు, మాచవరం మండలంలోని కోనంకి, నకరికల్లు మండలంలోని కొంతభాగం, పిడుగురాళ్ల సమీపాన గుత్తికొండ, రాజుపాలెం మండలంలోని గుడ్లపల్లి, త్రిపురాపురం, దుర్గి సమీపాన కాకిరాల, ముటుకూరు, మంచాలపాడు తదితర అటవీభూములు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి. మాచర్ల రేంజ్ పరిధిలోనే కారంపూడి, రెంటచింతల, వెల్దుర్తి మండలాల్లో సుమారు 1394 హెక్టా ర్లు కబ్జాదారుల కబంధహస్తాల్లో చిక్కుకుంది.పొంతనలేని రికార్డులు.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గత నెల రెండు మార్లు జిల్లాకొచ్చి ఆక్రమణలపై పరిశీలన జరిపారు. కొన్ని ప్రాంతాల్లోని కబ్జా భూములకు సంబంధించి గ్రామమ్యాప్లు, సర్వే రికార్డులకు వ్యత్యాసం ఉండటం ఆక్రమణదారులకు అనువుగా మారినట్లు వారు గుర్తించారు. సాధారణంగా సర్వే రికార్డులు తయారైన తర్వాత విలేజ్ మ్యాప్‌లు ఏర్పడ్డాయి. అయితే, అటవీభూములకు సంబంధించి సర్వే రికార్డుల్లో కొండపోరంబోకుగా చూపితే, విలేజ్మ్యాప్లో మాత్రం అసైన్డ్గా పేర్కొన్నారు. దీంతో పేదలకు అసైన్డ్ భూములు పంపిణీచేయవచ్చనే సాకుతో ఆక్రమణదార్లు ముందుగా గుడిసెలు వేయడం, ఆ తర్వాత రెవెన్యూ కార్యాలయాలపై ఒత్తిళ్లు తెచ్చి పట్టాలు సాధించుకోవడం పరిపాటిగా మారింది. మరి కొన్ని చోట్ల అన్‌సర్వే భూములుండటం విశేషం. ఉదాహరణకు బెల్లంకొండ మండలం, చండ్రాజుపాలెం గ్రామంలో సర్వేనంబర్ ఒకటి, క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో సర్వేనంబర్ 337/18లు గ్రామమ్యాప్లో అటవీశాఖకింద ఉండగా, సర్వే రికార్డుల్లో మాత్రం అసైన్డ్ భూమలుగా పేర్కొని ఉండటంతో అధికారులు ఎటూ తేల్చుకోలేక తికమకపడుతున్నారు. కొరవడుతున్న సమన్వయం.. అటవీభూముల పరిరక్షణకు రెవెన్యూ శాఖ సహకరించడం లేదంటూ అటవీశాఖాధికారులు వాపోతున్నారు. తమ భూములకు పట్టాలిచ్చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిని రెవెన్యూ శాఖ కొట్టిపారేస్తున్నారు. మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో కొన్నిచోట్ల అటవీభూములు అన్యాక్రాంతం కాగా, అక్కడ నివసించే వారికి రెవెన్యూ అధికారులు అన్ని సదుపాయాలు కల్పించడంపై అటవీశాఖాధికారులు తప్పుపడుతున్నారు. అయితే, మానవహక్కుల చట్టం మేరకు వసతులు కల్పిస్తున్నామని వారు వాదిస్తున్నారు. కాగా రేపల్లె, మంగళగిరి ఏరియాల్లో విలువైన భూములు కూడా కబ్జా కాటుకు హరించుకుపోతున్నాయని పలువురు పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మాచర్ల, బెల్లంకొండ ఏరియాల్లో కొన్నిచోట్ల గిరిజనుల పేరిట బినామీలు ఆక్రమించుకుని అటవీహక్కు చట్టం కింద పట్టాల కోసం తిరుగుతున్నట్లు అధికారులకు ఫిర్యాదులందాయి. ఈ మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ తనిఖీలు వాస్తవాలు వెలుగు చూసే అవకాశముంది.