దర్జాగా కబ్జా !
► రూ. కోట్ల విలువైన సొసైటీ స్థలం అక్రమార్కుల పరం
► రాజకీయ పలుకుబడితో సొంతం చేసుకున్న వైనం
► మరికొన్ని స్థలాలపైనా కన్ను పట్టించుకోని పాలకులు
ఎకరా ఖాళీ స్థలంతో పాటు పాలకొండ, శ్రీకాకుళం ప్రధాన రహదారికి ఆనుకొని తహశీల్దార్ కార్యాలయం ఎదుట సుమారు 50 సెంట్ల స్థలం, అలాగే జగన్నాథస్వామి ఆలయ సమీపంలో సుమారు ఎకరన్నర ఈ సంస్థకు ఉంది. ప్రస్తుతం ఈ స్థలాలు స్థానిక మార్కెట్ ధర ప్రకారం రూ. 10 కోట్లు నుంచి 15 కోట్ల రూపాయల వరకూ ఉంటుంది. దీంతో ఈ స్థలాలపై పలుకుబడి ఉన్న వ్యక్తుల కన్ను పడింది. ఇప్పటికే నాగవంశపువీధి కూడలిలో ఉన్న గొడౌన్ స్థలం ఓ పక్క నుంచి ఆక్రమణలు సాగుతున్నారుు. ఇదే అదునుగా అధికార పార్టీ అండదండలు ఉన్న కొంతమంది వ్యక్తులు ఈ జాగాను సొంతం చేసుకొనేందుకు చకచకా పావులు కదుపుతున్నారు. జగన్నాథస్వామి ఆలయ సమీపంలో ఉన్న స్థలంలో సుమారు 30 సెంట్లు ఇప్పటికే ఆక్రమణకు గురైంది.
మరోవైపు అత్యంత విలువైన తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న స్థలం ఆక్రమణలు జోరుగా సాగుతున్నారుు. ఈ స్థలాన్ని పలు ప్రభుత్వ కార్యాలయాలకు లేదా క్వార్టర్లకు వినియోగించేలా మరికొంతమంది ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో స్థలాలు అన్యాక్రాంతం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నారుు. ఆ శాఖాధికారులు దృష్టిసారించి వీటిని పర్యవేక్షించాల్సిన అవసరం ఏర్పడింది.
అధికారుల నిర్లక్ష్యం!
కోట్లాది రూపాయల విలువైన స్థలాల పరిరక్షణలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కనిపిస్తుంది. ప్రధానంగా డీసీఎంఎస్ శాఖకు ఆ స్థలాలు ఎక్కడున్నారుు, వాటి పరిస్థితి, ఆక్రమణల పర్వం తదితర అంశాలపై పూర్తి సమాచారం లేదు. గత ఐదేళ్లుగా నాగవంశపు కూడలిలో ఉన్న స్థలంలో రైతు బజారు ఏర్పాటు చేయాలన్న యోచన కార్యరూపం దాల్చలేదు. ఈ స్థలాలపై రెవెన్యూ అధికారులకు ఎటువంటి సమాచారం లేదు. వీటి ఆక్రమణలను ఎవరు అడ్డుకుంటారన్న దానిపైన స్పష్టత కొరవడింది. సొంతంగా డీసీఎంఎస్ శాఖ ఆస్తులు పరిరక్షణ చేపట్టలేక పలుమార్లు రెవెన్యూ అధికారులనే ఆశ్రరుుంచింది. ఈ పరిస్థితి వల్ల ప్రయోజనం కనిపించకపోవడంతో స్థలాలు నిరుపయోగంగా ఉంచింది. వీటిని లీజు రూపంలోనైనా వ్యాపార వర్గాలకు అందజేస్తే ఆదాయం సమకూరుతుంది.
చర్యలు తీసుకుంటాం
డీసీఎంఎస్ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటాం. రైతుబజారు ఏర్పాట్లు ప్రస్తుతం జరుగుతున్నారుు. ఆక్రమణలపై దృష్టి పెడుతున్నాము. అన్నిశాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ స్థలాలపై చర్చిస్తాం.- రెడ్డి గున్నయ్య ఆర్డీవో పాలకొండ