ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ నేతల బరితెగింపు
రూ.కోటికి పైగా విలువైన ప్రభుత్వ స్థలం దురాక్రమణ
జేసీబీతో అంగన్‌వాడీ భవనం కూల్చివేత
అడ్డరోడ్లను ఆక్రమించుకుని అమ్ముకుంటున్న తెలుగు తమ్ముళ్లు
సాక్షి టాస్‌్కఫోర్స్ : టీడీపీ అధికారంలోకి వచ్చాక ‘తమ్ముళ్ల’ దురాక్రమణలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ఒకరు వాగులూ వంకలు మింగితే.. మరొకరు చెరువును కొల్లగొడుతున్నారు. ఇంకొకరు ప్రభుత్వ, పోరంబోకు, గ్రామనెత్తం.. ఇలా స్థలం ఏదైనా ఖాళీగా కనిపిస్తే చాలు దర్జాగా కబ్జా చేసేస్తున్నారు. తమ్ముళ్ల ఆగడాలకు అధికారులు “పచ్చ’ జెండా ఊపుతూ రిజి్రస్టేషన్‌కు అనువుగా మారుస్తుండటంతో అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. వీరికి అధికార పార్టీ ప్రజాప్రతినిధి అండగా ఉండడంతో యంత్రాంగం అడ్డుకట్ట వేయలేకపోతోంది. ఆళ్లగడ్డలోని ఓ అంగన్‌వాడీ భవనానిది ఇప్పుడు ఇదే పరిస్థితి. వివరాలు ఏమిటంటే..
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని రామలక్ష్మీ కొట్టాల కాలనీలో సుమారు పాతికేళ్ల క్రితం అంగన్‌వాడీ కేంద్రం కోసమని అప్పటి పంచాయతీ కార్యాలయం 6 సెంట్ల స్థలాన్ని కేటాయించింది. అందులో ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రానికి భవనం నిర్మించి ఇచ్చింది. కాలక్రమేణా భవనం పాతపడటంతో ఈ కేంద్రాన్ని అద్దె భవనంలోకి మార్చారు. అప్పట్లో గ్రామ శివారులో ఉన్న ఈ స్థలం ఇప్పుడు మంచి ధర పలుకుతోంది.
ప్రస్తుతం ఇక్కడ సెంటు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉండడంతో ఈ స్థలంపై ఓ టీడీపీ నేత కన్నుపడింది. అంతే.. జేసీబీతో ఆ భవనాన్ని కూల్చి దాని ఆనవాళ్లు లేకుండా చదును చేసేశాడు. అందరూ అంగన్‌వాడీ కేంద్రాన్ని మళ్లీ నిరి్మస్తున్నారని భావించారు. కానీ, అసలు విషయం తెలుసుకుని సంబంధిత శాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా వారు పట్టించుకోలేదు. దీంతో స్థలం అభివృద్ధి పనులను టీడీపీ నేత వేగవంతం చేశాడు.
అడ్డదారులనూ ఆక్రమించేశారు..
ఇదిలా ఉంటే.. సుమారు 30 ఏళ్ల క్రితం ఏర్పడ్డ ఈ కాలనీలో ప్రధాన రోడ్లకు సమాంతరంగా అడ్డదారులు ఏర్పాటుచేశారు. ఈ దారులపైనా కన్నేసిన తమ్ముళ్లు ఖాళీగా ఉన్న స్థలాలతోపాటు అడ్డరోడ్లను ఆక్రమించుకుని అమ్మేసుకుంటున్నారు. దీంతో ఒక వీధిలో నుంచి మరో వీధిలోకి పోవాలంటే స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
ఉన్నతఅధికారుల దృష్టికి తీసుకెళ్లాం..
ఎవరో అంగన్‌వాడీ భవనం కూల్చి స్థలం ఆక్రమించుకుంటున్నారనే విషయం తెలిసింది. ఈ విషయం వెంటనే పీడీ మేడంకు తెలియబరిచా. ఆమె స్థలాన్ని ఆక్రమించుకుంటున్న వారితో మాట్లాడారు. అక్కడ అపరిశుభ్రంగా ఉంటే క్లీన్ చేశామని చెప్పారంట. – తేజేశ్వరి, సీడీపీఓ
మీ ఆస్తిని మీరు కాపాడుకోవాలి..
అంగన్‌వాడీ భవనం కూల్చి స్థలాన్ని ఆక్రమించుకున్నారని అక్కడి సిబ్బంది వచ్చి చెప్పారు. అది మీ స్థలం, అందులో భవనం కూడా ఉంది.. దాన్ని మీరు కాపాడుకోవాలి అని చెప్పా. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారిస్తామని చెప్పా. అయినా వారు ఇంతవరకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు కూడా చేయలేదు. – రమేష్ బాబు, మున్సిపల్ కమిషనర్
ఐదు నెలల క్రితం నాడు–నేడుకు ఎంపిక
ఐదు నెలల క్రితం గత ప్రభుత్వం అక్కడ కొత్త భవనం నిర్మించాలని నిధులు విడుదల చేసింది. విశాలమైన స్థలం ఉండటంతో నాడు–నేడు కింద మోడల్ అంగన్‌వాడీ కేంద్రం నిర్మించాలని తీర్మానించారు. అధికారులు పరిశీలించడంతో చుట్టుపక్కల కాలనీల వారు సంబరపడ్డారు. అయితే, ఇంతలో ప్రభుత్వం మారడంతో విలువైన స్థలం కబ్జాకు గురైంది., భవనం కూలిపోయింది. మాకు సంబంధం లేదంటే మాకు సంబంధంలేదని ఆయా శాఖలు తప్పించుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment