రంగంలోకి విజిలెన్స్ | inquires poaching Mavala pond lands | Sakshi
Sakshi News home page

రంగంలోకి విజిలెన్స్

Dec 15 2013 3:48 AM | Updated on Aug 17 2018 2:53 PM

యథేచ్ఛగా సాగిన మావల చెరువు భూ ముల ఆక్రమణల వెనుక ఆసలు సూత్రధారుల గుట్టు త్వరలోనే తేలనుంది.

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :  యథేచ్ఛగా సాగిన మావల చెరువు భూ ముల ఆక్రమణల వెనుక ఆసలు సూత్రధారుల గుట్టు త్వరలోనే తేలనుంది. కలెక్టరేట్ కార్యాలయానికి కూతవేటు దూరంలో.. జాతీయ రహదారి పక్కన ఉన్న అత్యంత విలువైన భూమిని కాజేసిన వైనంపై రెవెన్యూ అధికారుల విచారణ ఇంకా సాగుతోంది. మావల చెరువును కబ్జా చేసి కొత్తగా నిర్మిస్తున్న ఫంక్షన్‌హాల్‌తోపాటు.. ఏళ్ల కిందట నిర్మించి న మరో పంక్షన్‌హాల్ నిర్మాణం అసలు సూత్రధారులను పట్టుకునే పనిలో రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు పడటం చర్చనీయాంశం అవుతోంది.

మావల చెరువు ఆక్రమణలపై ‘సాక్షి’లో వెలువడిన వరుస కథనాల నేపథ్యంలో కలెక్టర్ అహ్మద్ బాబు ఆర్డీవో సుధాకర్‌రెడ్డిని విచారణకు ఆదేశించిన విష యం విదితమే. 1.30 ఎకరాల పట్టాపై ఓ బ్యాంకు అధికారి.. ఆ భూమిని ఆనుకుని ఉన్న చెరువు శిఖా న్ని ఆక్రమించి నాలుగెకరాలకు విస్తరించి ఫంక్షన్‌హాల్ నిర్మించిన వైనాన్ని రెవెన్యూ అ ధికారులు బట్టబయలు చే శారు. అంతేగాకుండా చిల్కూరు ల క్ష్మీ గార్డెన్స్‌లో స్థలాన్ని సైతం గుర్తించారు. అయి తే చెరువు శిఖం ఆక్రమణల కు సూత్రధారిగా వ్యవహరిం చిన ఓ పంచాయతీ మాజీ కార్యదర్శి పాత్రపైనా తాజాగా విజిలెన్స్ ఆరా తీస్తుండటం చర్చనీయాంశం     అవుతోంది.
 హాట్ టాపిక్‌గా చెరువు ఆక్రమణ
 ప్రభుత్వ, అసైన్డ్ భూములే కాదు.. చెరువు శిఖాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కబ్జాదారులకు వరంగా మారాయి. యథేచ్ఛగా సాగుతున్న భూభాగోతాల వెనుక రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన మాజీ అధికారు లు, ఉద్యోగులే ఉండటం ఆందోళన కలిగిస్తోం ది. కొత్తగా వచ్చిన కలెక్టర్ ఐదు మాసాలుగా జిల్లా వ్యాప్తంగా అక్రమాలు, ఆక్రమణలపై  కొరడా ఝుళిపిస్తుండటంతో అక్రమార్కు ల గుట్టురట్టవుతోంది. సుమారు రూ.10 కోట్ల విలువ చేసే మావల చెరువు శిఖం ఆక్రమణలు, అక్రమ కట్టడాలకు గురి కాగా, గతంలో నిర్మించిన చిల్కూరి లక్ష్మీ గార్డెన్, కొత్త నిర్మిస్తున్న ఫంక్షన్‌హాల్‌ల నిర్మాణంలో కొందరు అధికారుల పాత్రే కీలకం కావడం గమనార్హం. మావల చెరువును ఆనుకుని కొత్తగా నిర్మిస్తున్న ఫంక్షన్‌హాల్ యజమాని పేరిట 1.30 భూమికే పట్టా ఉండగా.. సదరు వ్యక్తి నాలుగెకరాల్లో ఫంక్షన్‌హాల్ నిర్మాణం చేపట్టాడు. సుమారు ఎనిమిది మాసాల క్రిత మే ఈ ఫంక్షన్‌హాల్ నిర్మాణానికి శ్రీకారం జరగ్గా అప్పుడున్న ఉన్నతాధికారులతో పాటు రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు ‘మామూలు’గా తీసుకున్నారు. దానిపైనా విజిలెన్స్ అధికారులు తాజాగా రంగంలోకి దిగడం చర్చనీయాంశం అవుతోంది. 1.30 ఎకరాలకు పట్టాపొందిన ఓ ఉన్నతస్థాయి బ్యాంకు అధికారి నాలుగెకరాల్లో ఫంక్షన్‌హాల్ నిర్మించడం.. ఆ తర్వాత రెవెన్యూ అధికారులు ఆక్రమించిన భూమిని స్వాధీనం చేసుకోవడం.. మిగిలిన 1.30 ఎకరాల్లో సదరు వ్యక్తికి ఉన్న లింకుడ్ డాక్యుమెంట్లపైనా వారు ఆరా తీస్తుండటం కలకలం రేపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement