ఆదిలాబాద్ అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : ప్రజాస్వామ్యం దేశంలో ఓటు హక్కు ఎంతో కీలకమైందని, ప్రతీ ఒక్కరు ఓటుహక్కును వినియోగించుకొని మంచి ప్రజా నాయకులను ఎన్నుకొని దేశాభివృద్ధికి పాటుపడాలని జిల్లా కలెక్టర్ అహ్మద్‌బాబు అన్నారు. జాతీయ ఓటర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ప్రజాస్వామ్యంలో ప్రపంచంలోనే భారతదేశం మొట్టమొదటిదని తెలిపారు. జిల్లాలో రెండు నెల లుగా జిల్లా యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సం ఘాలు, మీడియా ప్రతినిధుల కృషితో 2 లక్షల పదివేల మంది నూతన ఓటర్లను నమోదు చేసినట్లు వివరించారు. గతంలో 16 లక్షల ఓటర్లు ఉండగా.. ఆ సంఖ్య ప్రస్తుతం 19 లక్షలకు చేరుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికీ నమోదు కాకుండా మిగిలిపోయిన వారు కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఓటర్లుగా నమోదు చేసుకోవాలలని సూచించారు.
ఓటు విలువ ఎనలేనిది : ఎస్పీ
జిల్లా ఎస్పీ గజరావ్‌భూపాల్ మాట్లాడుతూ, ఓటు హక్కు ఎంతో గొప్ప ఆయుధమని, దాని విలువ ఎనలేనిదని అన్నారు. కొంతమంది దాని విలువ తెలియక వినియోగించుకోవడం లేదని, ప్రతి ఒక్కరు తప్పక ఓటు వేయాలని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఎన్నికల ప్రభావా న్ని నిలబెడతామని, కుల, మతం, భాష, వర్గాలకు ప్రభావితం కాకుండా ప్రతి ఒక్కరు నిర్భయంగా ఓటు చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. వృద్ధ మహిళా ఓటర్లు అయిన లక్ష్మీబాయి(96), సుభద్ర(85)లను జిల్లా కలెక్టర్, ఎస్పీ సన్మానించారు.
ఓటర్ల దినోత్సవం సందర్భంగా పది నియోజకవర్గాల్లో ఉపన్యాసాలు, డ్రాయింగ్, పెయింటింగ్, క్విజ్ పోటీలు నిర్వహించి జిల్లాస్థాయిలో గెలుపొందిన వారికి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. జిల్లాస్థాయిలో ప్రథమ స్థానంలో గెలుపొందిన వారిని హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. డీఆర్వో ఎస్‌ఎస్ రాజ్, డబ్ల్యూఎస్‌డీ పనసారెడ్డి, డీఎస్పీ లతామాధురి, ఏఎస్పీ సృజన, ఆర్‌డీఓ ఎన్. సుధాకర్‌రెడ్డి, ఎన్‌సీసీ బెటాలియన్ కమాండెంట్, ఇతర అధికారులు, యువజన సంఘాలు, విద్యార్థులు, ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.
ఓటు విలువను తెలుసుకో అంటూ...
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : ఓటు విలువను ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలంటూ యువజన సంఘాలు, విద్యార్థులు, 32 ఆంధ్రప్రదేశ్ బెటాలియన్ ఎన్‌సీసీ క్యాడెట్లు శనివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ అహ్మద్‌బాబు, ఎస్పీ గజరావ్‌భూపాల్ జెండా ఊపి ప్రారంభించారు. డైట్ మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా జెడ్పీ కార్యాలయం వరకు చేరుకుంది.
ఓటర్లుగా నమోదుకండి.. ఓటరు గుర్తింపుకార్డు పొందండి.. ఓటు విలువను తెలుసుకోండి అనే నినాదాలతో ర్యాలీ కొనసాగించారు. కలెక్టర్‌చౌక్‌లో మానవహారంగా ఏర్పడి విద్యార్థులు, ఇతర అధికారులతో జిల్లా కలెక్టర్, ఎస్పీ ఓటు హక్కు ప్రాముఖ్యతపై నినాదాలు చేయించారు. ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, తహశీల్దార్ సిడాం దత్తు, ఎన్నికల పర్యవేక్షకులు ప్రభాకర్‌స్వామి, ఇతర అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు కీలకం
Published Sun, Jan 26 2014 3:28 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement