ఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యేలకు ఎర వేసేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ చేసిన ఆరోపణలకు గాను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు శనివారం పోలీసులు నోటీసులిచ్చారు. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను మూడు రోజుల్లో అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా ఐదు గంటలు హైడ్రామా జరిగింది.
కేజ్రీవాల్ నివాసంలో అధికారులు తాము నోటీసులు తీసుకుంటామని చెప్పగా పోలీసులు నిరాకరించారు. సీఎంకే ఇస్తామన్నారు. చివరికి కేజ్రీవాల్ బయటకు రాగా నోటీసులిచ్చారు. మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తామిచ్చిన ఐదు నోటీసులకు కేజ్రీవాల్ స్పందించలేదంటూ ఈడీ అధికారులు శనివారం అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దివ్యా మల్హోత్రాకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఈ నెల 7వ తేదీన విచారణ చేపడతామని మేజిస్ట్రేట్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment