golfer
-
వెల్డన్... సుదర్శన్
అబాకో క్లబ్ (బహామస్): కెనడాకు చెందిన తెలుగు సంతతి గోల్ఫర్ ఎల్లమరాజు సుదర్శన్ తన కెరీర్లో గొప్ప విజయం అందుకున్నాడు. ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్ (పీజీఏ)లో ద్వితీయ శ్రేణి ఈవెంట్‌గా పరిగణించబడే కోర్న్ ఫెర్రీ టూర్లో భాగంగా జరిగిన బహామస్ గ్రేట్ అబాకో క్లాసిక్ టోర్నమెంట్లో సుదర్శన్ విజేతగా నిలిచాడు. 23 ఏళ్ల సుదర్శన్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో జన్మించాడు. నాలుగేళ్ల వయసులో తల్లిదండ్రులతో పాటు అతను కెనడాకు వెళ్లి అక్కడేస్థిరపడ్డాడు. కాగా బహామస్ టోర్నీలో అసామాన ప్రదర్శనతో సుదర్శన్ ఆకట్టుకున్నాడు. కచ్చితత్వంతో కూడిన షాట్లతో విజయం సాధించాడు. కేవలం ఐదే ఐదు షాట్లలో విజేతగా నిలిచాడు. 8–అండర్–64లో 263 పాయింట్ల స్కోరుతో టైటిల్ నెగ్గాడు. ద్వితీయ శ్రేణి ఈవెంట్ అయినప్పటికీ అనామక ఆటగాళ్లు బరిలోకి దిగారనుకుంటే తప్పులో కాలేసినట్లే! ఎందుకంటే రెండు సార్లు పీజీఏ టూర్ విజేత, జపాన్ స్టార్ గోల్ఫర్ కెన్సెయ్ హిరాత ఇక్కడ టైటిల్ కోసం శ్రమించినప్పటికీ సుద ర్శన్ ప్రదర్శనతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ‘కాలక్షేపం కోసం నాన్న టీవీలో గోల్ఫ్ పోటీలను చూసేవాడు. పక్కనే నేను కూ ర్చునేవాణ్ని. అలా చిరుప్రాయంలో చూసిన ఆటలో ఇప్పుడు విజేతగా నిలువడం... అది కూడా నాన్న పుట్టిన రోజు (జనవరి 22)న టైటిల్ అందుకోవడం ఆనందంగా ఉంది. అప్పట్లో మేం కెనడాకు వలస వెళ్లినపుడు చాలా కష్టపడాల్సి వచ్చింది. తర్వాత పరి స్థితులు చక్కబడ్డాక అమ్మనాన్నలిద్దరూ నన్ను ప్రోత్సహించారు’ అని సుదర్శన్ అన్నాడు. -
‘భారత్‌తో నా అనుబంధం ప్రత్యేకం’
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్ (పీజీఏ) టూర్లో తీగల సాహిత్ రెడ్డి గత నాలుగేళ్లుగా నిలకడగా రాణిస్తున్నాడు. గత ఏడాది ఫోర్టినెట్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకొని తన ఖాతాలో తొలి టైటిల్‌ను వేసుకున్నాడు. అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్న సాహిత్ ప్రస్తుతం వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 12వ స్థానంలో ఉన్నాడు. కాలిఫోర్నియాలో పుట్టి పెరిగిన అతనికి భారత్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. సాహిత్ తల్లిదండ్రులు మురళీధర్, కరుణ హైదరాబాద్‌కు చెందినవారు. ఐఐటీ మద్రాస్‌లో చదువు పూర్తి చేసుకున్న అనంతరం మురళీధర్ 1980ల్లో అమెరికాకు వలస వెళ్లిపోయారు. అయితే ఆయన తన మూలాలు మాత్రం మర్చిపోలేదు. తన పిల్లల్లో కూడా ‘భారతీయత’ అనే భావన ఉండేలా వారిని పెంచారు. ప్రతీ ఏటా ఒక్కసారైనా ఈ కుటుంబం భారత్‌కు వచ్చి వెళుతుంది. ‘నా భారత సంస్కృతి, వారసత్వం అంటే నాకు చాలా ఇష్టం. కొద్ది రోజుల క్రితం భారత్‌లోనే ఉన్నాను. నాకు ఇక్కడ లభించిన ఆదరాభిమానాలను మరచిపోలేను’ అని సాహిత్ చెప్పాడు. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలను తన పిల్లలు తరచుగా కలిస్తే భారత్‌తో అనుబంధం కొనసాగుతుందనే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నామని మురళీధర్ వెల్లడించారు. తమ కుటుంబానికి ఆంధ్ర రుచులు అంటే ఎంతో ఇష్టమని... అమెరికాలోనే కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వాటిని తినేందుకే తాము ఆసక్తి చూపిస్తామని ఆయన చెప్పారు. ప్రొఫెషనల్ గోల్ఫర్గా మారిన తర్వాత సాహిత్ తొలిసారి హైదరాబాద్‌కు వచ్చాడు. ‘భారత్‌లోనే ఉండే సన్నిహితులు నా ఆటను ప్రశంసిస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. టూర్లో ఫలితాల గురించి ప్రస్తుతం ఆలోచించడం లేదు. కెరీర్‌కంటే కూడా ఈ అనుబంధాలు సంతృప్తినిచ్చాయి. నేను గోల్ఫర్గా మారడంలో నా తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంది. భారత్ నుంచి వచ్చిన ఎన్నో ఏళ్ల తర్వాత కూడా అవే విలువలు కొనసాగించారు. వాటి మధ్య మమ్మల్ని పెంచడం కొంత ఆశ్చర్యకరంగా, గర్వంగా కూడా అనిపిస్తుంది’ అని సాహిత్ వ్యాఖ్యానించాడు. అయితే తన వ్యక్తిగత విజయాలకంటే రాబోయే తరపు భారత గోల్ఫర్లకు స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నట్లు సాహిత్ తెలిపాడు. ‘భారత్‌లో గోల్ఫ్ పరిస్థితి మారుతోంది. కొంత డబ్బు, ఇతర సౌకర్యాలు రావడం వల్ల కుర్రాళ్లకు కోచింగ్ అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. దేశంలో అంతా క్రికెట్ విస్తరించి ఉందనే విషయం నాకూ తెలుసు. ఇలాంటి సమయంలో ప్రతిభ ఉన్న భారత గోల్ఫర్లు విదేశాలకు వెళ్లి భారత మూలాలు ఉన్న ఆటగాళ్లుగా గుర్తింపు తెచ్చుకుంటూ ప్రపంచవ్యాప్తంగా మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. ఇలాంటివారు నన్ను చూసి స్ఫూర్తి పొందుతారని ఆశిస్తున్నా’ అని సాహిత్ అభిప్రాయ వ్యక్తం చేశాడు. -
ప్రెసిడెంట్స్ కప్‌లో తీగల సాహిత్ రెడ్డి
మాంట్రియాల్: భారత సంతతి గోల్ఫర్ తీగల సాహిత్ రెడ్డి ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ కప్‌లో అమెరికా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత సంతతి గోల్ఫర్గా సాహిత్ చరిత్రకెక్కాడు. గురువారం ప్రారంభమైన ఈ టోర్నీలో అమెరికా జట్టు... యూరోప్ దేశాల మినహా ఇతర దేశాల ఆటగాళ్లతో కూడిన రెస్ట్ ఆఫ్ వరల్డ్ జట్టుతో పోటీపడుతోంది. రాయల్ మాంట్రియాల్ గోల్ఫ్ క్లబ్లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో ఆడటం చాలా సంతోషంగా ఉందని పీజీఏ టూర్ టైటిల్ సాధించిన సాహిత్ పేర్కొన్నాడు. సాహిత్ తల్లిదండ్రులు మురళీధర్, కరుణ 1980 దశకంలో హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. సాహిత్ కాలిఫోర్నీయాలో పుట్టి పెరిగాడు. ‘మా నాన్న భారత్ నుంచి అమెరికాకు వచ్చినప్పుడు ఇలాంటి ఒక రోజు వస్తుందని కచ్చితంగా ఊహించి ఉండడు. ప్రెసిడెంట్స్ కప్‌లో పాల్గొనడం అంటే మామూలు విషయం కాదు. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకు ఎలా సాగాలో మా నాన్న నుంచే నేర్చుకున్నా. ప్రతిష్టాత్మక టోర్నీలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి మించి ఏం ఉంటుంది. మెరుగైన ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తా. కుటుంబ సభ్యుల సమక్షంలో ఆడనుండటం మరింత ఉత్సహాన్నిస్తోంది’అని సాహిత్ పేర్కొన్నాడు. 1994 నుంచి ఈ టోర్నీని నిర్వహిస్తుండగా... ఇప్పటి వరకు 14 ఎడిషన్లు జరిగాయి. అందులో 12 సార్లు గెలిచిన అమెరికా జట్టు ఒకసారి ఓడిపోయింది. మరో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. -
భారత గోల్ఫర్ అదితికి 29వ స్థానం
మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకం కోల్పోయిన భారత మహిళా గోల్ఫర్ అదితి అశోక్ ‘పారిస్’ క్రీడల్లో ప్రభావం చూపలేకపోయింది. మహిళల వ్యక్తిగత స్ట్రోక్‌ప్లేలో అదితి 290 పాయింట్లతో 29వ స్థానంతో సరిపెట్టుకుంది. తొలి మూడు రోజులు పెద్దగా ఆకట్టుకోలేకపోయిన అదితి... పోటీల చివరి రోజు శనివారం మెరుగైన ప్రదర్శన కనబర్చింది. 11 స్థానాలు మెరుగు పర్చుకుంది. భారత్‌కే చెందిన మరో గోల్ఫర్ దీక్ష డాగర్ 301 పాయింట్లతో 49వ స్థానంతో సరిపెట్టుకుంది. న్యూజిలాండ్ గోల్ఫర్ లిడియా కో 278 పాయింట్లతో స్వర్ణం గెలుచుకోగా... ఎస్తెర్ హెన్సెలైట్ (280 పాయింట్లు; జర్మనీ), లిన్ జియా జానెట్ (281 పాయింట్లు; చైనా) వరసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. ‘తొలి మూడు రోజులు సరైన షాట్లు ఆడలేకపోయా. అందుకే వెనుకబడ్డా.. చివర్లో పుంజుకున్నా అప్పటికే ఆలస్యమైంది. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో మరింత మెరుగైన ప్రదర్శనతో పతకం సాధించేందుకు ప్రయత్నిస్తా’ అని అదితి పేర్కొంది. -
అమెరికా గోల్ఫ్‌లో తెలుగు కెరటం
నపా (అమెరికా): అమెరికాకు చెందిన తెలుగు గోల్ఫర్ తీగల సాహిత్ రెడ్డి ఫార్టీనెట్ వరల్డ్ ర్యాంకింగ్ గోల్ఫ్ టోర్నమెంట్లో మెరిశాడు. 73 మంది పాల్గొన్న ఈ టోర్నీలో అతను 11 పాయింట్ల స్కోరుతో సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాడు. టాప్–10లో నిలిచిన సాహిత్‌కు 2 లక్షల 70 వేల డాలర్లు (రూ.2 కోట్ల 15 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. రికీ ఫాలెర్, నిక్ టేలర్లు కూడా 11 స్కోరు చేయడంతో ముగ్గురు ఆరో స్థానాన్ని పంచుకున్నారు. 24 ఏళ్ల ఈ తెలుగు గోల్ఫర్ తాజా ప్రదర్శనతో ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్ (పీజీఏ) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఏడు స్థానాలు ఎగబాకి 51వ స్థానానికి చేరుకున్నాడు. ఎవరీ తీగల సాహిత్? సాహిత్ రెడ్డి జన్మతః అమెరికన్ అయినప్పటికీ భారతీయుడు. హైదరాబాద్‌కు చెందిన తీగల మురళీధర్ రెడ్డి ఉన్నత విద్యాభ్యాసం కోసం 1987లో అమెరికాకు వెళ్లారు. ఉన్నత విద్య పూర్తయ్యాక తెలుగమ్మాయి కరుణను వివాహమాడి కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. వీరికి సాహిత్‌తో పాటు మరో కుమారుడు సహన్ రెడ్డి ఉన్నాడు. ఇప్పటికీ అతని కుటుంబం ప్రతీ రెండేళ్లకోసారి హైదరాబాద్‌కు వచ్చి వెళుతుంది. 2001లో సాహిత్ తల్లి థైరాయిడ్ క్యాన్సర్ బారిన పడటంతో ఇద్దరి పిల్లల బాగోగులు అమ్మమ్మ విజయలక్ష్మి చూసుకునేది. చిన్నప్పటి నుంచి సాహిత్‌కు గోల్ఫ్ అంటే సరదా. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఆటను ఆపలేదు. దీని ఫలితం ఇప్పుడు ప్రొఫెషనల్ అయ్యేందుకు దోహదపడింది. 2020లో ప్రొఫెషనల్ గోల్ఫర్గా మారిన సాహిత్ ఈ రెండున్నరేళ్లతోనే సంచలన ప్రదర్శనతో అది కూడా అసాధారణ పోటీ ఉండే అమెరికాలో ఈ స్థాయికి దూసుకురావడం గొప్ప ఘనత. 6 అడుగుల 3 అంగుళాల ఎత్తు, 90 కేజీల బరువున్న సాహిత్ 2021–22 సీజన్లో జోరు పెంచాడు. మొత్తం నాలుగు టోర్నీల్లో టాప్–10లో నిలిచాడు. దీంతో ఈ సీజన్లోనే సాహిత్ 17 లక్షల డాలర్లు (రూ.13 కోట్ల 54 లక్షలు) ప్రైజ్‌మనీ రూపేణా సంపాదించడం గమనార్హం. ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్ టోర్నీల్లో భారత ఆటగాళ్లు చాలా మందే ఆడుతున్నారు కానీ ఓ హైదరాబాదీ ఈ స్థాయిలో రాణిస్తుండటం విశేషం. -
హైదరాబాద్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్, గోల్ఫర్ ట్వెసాకు 15 లక్షల చెక్
Kakinada Sea Ports Limited Sponsorship: హైదరాబాద్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ ప్రణవిచంద్ర, గోల్ఫర్ ట్వెసా మలిక్‌లకు స్పాన్సర్షిప్ ఇచ్చేందుకు కాకినాడ సీపోర్ట్ సంస్థ ముందుకు వచ్చింది. సంస్థ కార్యదర్శి విభా జైన్ ఈ ఇద్దరు క్రీడాకారిణులకు చెరో రూ. 15 లక్షల చెక్‌లు అందించగా... తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు వి.చాముండేశ్వరీనాథ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: IND vs WI: క్రికెట్ అభిమానులకు భారీ షాక్.. భారత్- విండీస్ తొలి వన్డే వాయిదా! -
చేరువై..దూరమై
టోక్యో: పతకం తెచ్చేట్లు కనిపించిన భారత మహిళా గోల్ఫర్ అదితి అశోక్‌కు నిరాశ ఎదురైంది. ఒకే ఒక్క స్ట్రోక్‌తో ఒలింపిక్ పతకానికి దూరమైంది. శనివారం జరిగిన చివరిదైన నాలుగో రౌండ్‌లోని 18 హోల్స్‌ను ఆమె 68 అండర్ –3 స్ట్రోక్‌ల్లో పూర్తి చేసింది. దాంతో మొత్తం 72 హోల్స్‌ను 269 అండర్ –15 స్ట్రోక్‌ల్లో పూర్తి చేసి నాలుగో స్థానంలో నిలిచింది. అంటే 72 హోల్స్‌ను పూర్తి చేయడానికి 284 స్ట్రోక్‌లను నిర్దేశించగా... అదితి 15 తక్కువ స్ట్రోక్ల్లోనే పూర్తి చేసింది. అయితే మూడో స్థానంలో నిలిచిన లిడియా కో (న్యూజిలాండ్) 72 హోల్స్‌ను పూర్తి చేయడానికి 268 స్ట్రోక్‌లను మాత్రమే తీసుకుంది. దాంతో ఒకే ఒక్క స్ట్రోక్‌తో అదితికి కాంస్యం చేజారింది. అమెరికా గోల్ఫర్ నెల్లీ కోర్డా 267 అండర్ –17 స్ట్రోక్‌లతో తొలి స్థానంలో నిలిచి స్వర్ణాన్ని... మోనె ఇనామి (జపాన్) 268 అండర్ –16తో రజతాన్ని సొంతం చేసుకున్నారు. చివర్లో మోనె, లిడియా కో సంయుక్తంగా రెండో స్థానంలో నిలువగా.. వీరిద్దరికీ ప్లే ఆఫ్ నిర్వహించారు. ఇందులో మోనె నెగ్గింది. నాలుగో రౌండ్‌ను అదితి అద్భుతంగా ఆరంభించింది. హోల్ నంబర్ 5, 6, 8, 13, 14లను నిర్దేశించిన స్ట్రోక్‌ల కంటే ఒక స్ట్రోక్ తక్కువ (బర్డీ)లోనే ముగించింది. అయితే 9, 11వ హోల్స్‌ను పూర్తి చేయడానికి మాత్రం నిర్దేశించిన దాని కంటే ఒక స్ట్రోక్ (బొగీ)ను అదనంగా తీసుకుంది. 16వ హోల్ పూర్తయ్యేసరికి అదితి పతక స్థానంలోనే ఉంది. అయితే తుపాను రావడంతో కాసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది. ఈ బ్రేక్ వల్ల అదితి ఏకాగ్రత చెదరడంతో చివరి రెండు హోల్స్‌ను తక్కువ స్ట్రోక్‌ల్లో ముగించలేకపోయింది. ‘పతకం గెలిచేందుకు 100 శాతం నేను ప్రయత్నించా. ఇతర టోర్నీల్లో నాలుగో స్థానం వచ్చింటే నేను చాలా సంతోషించేదాన్ని.. కానీ ఒలింపిక్స్‌లో అలా కాదు. టాప్–3కి మాత్రమే పతకాలను ఇస్తారు. త్రుటిలో మెడల్‌ను చేజార్చుకున్నందుకు చాలా బాధగా ఉంది. నేను కొన్ని చాన్స్‌లను మిస్ చేసుకున్నాను. చివరి తొమ్మిది హోల్స్‌లో నేను మరింత బాగా ఆడాల్సి ఉండాలి. ఈ రోజు నాకు కలిసి రాలేదు.’ – అదితి -
Aditi Ashok: ఊహించని పతకం లభించేనా..?
టోక్యో: అంతా అనుకున్నట్లు జరిగితే... టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాభిమానులెవరూ ఊహించని పతకం శనివారం లభించే అవకాశం ఉంది. మహిళల గోల్ఫ్ వ్యక్తిగత స్ట్రోక్ ప్లే ఈవెంట్లో భారత గోల్ఫర్ అదితి అశోక్ పతకం రేసులో ఉంది. శుక్రవారం మూడో రౌండ్ పూర్తయ్యే సమయానికి అదితి టోటల్ పార్ స్కోరులో 201తో రెండో స్థానంలో ఉంది. అమెరికా గోల్ఫర్ నెల్లీ కోర్డా (పార్ 198)తో అగ్రస్థానంలో ఉంది. నిర్ణీత నాలుగు రౌండ్లు ముగి శాక తక్కువ పార్ స్కోరు ఉన్న టాప్– 3 గోల్ఫర్లకు పతకాలు లభిస్తాయి. -
అక్రమ వేట కేసులో ప్రముఖ గోల్ఫ్ ప్లేయర్ అరెస్ట్
లక్నో : అక్రమంగా వేటాడుతున్నరనే కేసులో భారత గోల్ఫర్ జ్యోతి రంధావాను ఉత్తర్ ప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రంధావ వద్ద నుంచి ఏ - 22 రైఫిల్, వాహనం (హెచ్ఆర్26 డీఎన్ 5299)తో పాటు వేట సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. కతెర్నియాఘాట్లోని మోతిపూర్లో రంధావకు వ్యవసాయ క్షేత్రం ఉంది. అక్కడ అనుమానాస్పదంగా వాహనం నడుతుపుతుండటంతో పోలీసులు రంధావాను అరెస్ట్ చేశారు. ఈ సమయంలో అతని వద్ద నుంచి అడవి పంది చర్మం, బైనాక్యులర్‌తో పాటు రంధావ పేరు మీద రిజిస్టర్ అయిన వాహనాన్ని కూడా సీజ్ చేశారు. రంధావాను ప్రస్తుతం కతెర్నియాఘాట్ జిల్లా అటవీ అధికారి విచారిస్తున్నారు. చట్ట పరంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. భారత్ తరఫున ఒకప్పుడు అత్యుత్తమ గోల్ఫర్గా జ్యోతి రంధావ రికార్డులు సృష్టించారు. బాలీవుడ్ నటి చిత్రాంగద సింగ్‌ను పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి బంధం ఎంతో కాలం నిలవలేదు. 2014లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది జ్యోతి రంధావ ప్రొఫెషనల్ గోల్ఫర్గా మారారు. ఆసియా టూర్లో 8 టైటిళ్లు గెలిచారు. 2004లో యూరోపియన్ టూర్లో జానీ వాకర్ క్లాసిక్‌తో కలిసి అత్యుత్తమంగా రెండో స్థానంలో నిలిచారు. గోల్ఫ్ ప్రపంచకప్ టోర్నీల్లో 2005, 2007, 2008, 2009లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించారు. -
వరల్డ్ క్లాస్ గోల్ఫర్గా అనిర్బాన్ లాహిరి
-
లెజెండ్స్ ఇద్దరూ.. ఒకే చోట
న్యూఢిల్లీ: ఒకరు ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్. మరొకరు గోల్ఫ్ మేటి. ఈ దిగ్గజాలు తొలిసారి ఒకే చోట దర్శనమిచ్చారు. ఈ అరుదైన సన్నివేశానికి ఢిల్లీ వేదికైంది. వారిద్దరే టీమిండియా బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్.. అమెరికా స్టార్ గోల్ఫర్ టైగర్ వుడ్స్. భారత పర్యటనకు వచ్చిన వుడ్స్ మంగళవారం ఓ హోటల్లో సచిన్, అతని కుటుంబ సభ్యుల్ని కలిశాడు. ఈ విషయాన్ని వుడ్స్ ట్విట్టర్లో వెల్లడించాడు. 'సచిన్ చాలా ప్రశాంతంగా ఉంటాడు. ప్రేమ పూర్వకంగా స్వాగతం పలికాడు' అని వుడ్స్ ట్వీట్ చేశాడు. ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం వుడ్స్ ఢిల్లీకి రాగా, మంగళవారం భారతరత్న అవార్డు స్వీకరించేందుకు ఢిల్లీకి వచ్చాడు. మాస్టర్‌కు గోల్ఫ్ అంటే చాలా ఇష్టం.