మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకం కోల్పోయిన భారత మహిళా గోల్ఫర్ అదితి అశోక్ ‘పారిస్’ క్రీడల్లో ప్రభావం చూపలేకపోయింది. మహిళల వ్యక్తిగత స్ట్రోక్‌ప్లేలో అదితి 290 పాయింట్లతో 29వ స్థానంతో సరిపెట్టుకుంది. తొలి మూడు రోజులు పెద్దగా ఆకట్టుకోలేకపోయిన అదితి... పోటీల చివరి రోజు శనివారం మెరుగైన ప్రదర్శన కనబర్చింది. 11 స్థానాలు మెరుగు పర్చుకుంది.
భారత్‌కే చెందిన మరో గోల్ఫర్ దీక్ష డాగర్ 301 పాయింట్లతో 49వ స్థానంతో సరిపెట్టుకుంది. న్యూజిలాండ్ గోల్ఫర్ లిడియా కో 278 పాయింట్లతో స్వర్ణం గెలుచుకోగా... ఎస్తెర్ హెన్సెలైట్ (280 పాయింట్లు; జర్మనీ), లిన్ జియా జానెట్ (281 పాయింట్లు; చైనా) వరసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు.
‘తొలి మూడు రోజులు సరైన షాట్‌లు ఆడలేకపోయా. అందుకే వెనుకబడ్డా.. చివర్లో పుంజుకున్నా అప్పటికే ఆలస్యమైంది. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో మరింత మెరుగైన ప్రదర్శనతో పతకం సాధించేందుకు ప్రయత్నిస్తా’ అని అదితి పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment