బహామస్ గ్రేట్ అబాకో క్లాసిక్ గోల్ఫ్ టైటిల్ నెగ్గిన తెలుగు సంతతి కెనడా గోల్ఫర్
అబాకో క్లబ్ (బహామస్): కెనడాకు చెందిన తెలుగు సంతతి గోల్ఫర్ ఎల్లమరాజు సుదర్శన్ తన కెరీర్‌లో గొప్ప విజయం అందుకున్నాడు. ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్ (పీజీఏ)లో ద్వితీయ శ్రేణి ఈవెంట్‌గా పరిగణించబడే కోర్న్ ఫెర్రీ టూర్‌లో భాగంగా జరిగిన బహామస్ గ్రేట్ అబాకో క్లాసిక్ టోర్నమెంట్‌లో సుదర్శన్ విజేతగా నిలిచాడు. 23 ఏళ్ల సుదర్శన్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో జన్మించాడు.
నాలుగేళ్ల వయసులో తల్లిదండ్రులతో పాటు అతను కెనడాకు వెళ్లి అక్కడేస్థిరపడ్డాడు. కాగా బహామస్ టోర్నీలో అసామాన ప్రదర్శనతో సుదర్శన్ ఆకట్టుకున్నాడు. కచ్చితత్వంతో కూడిన షాట్లతో విజయం సాధించాడు. కేవలం ఐదే ఐదు షాట్లలో విజేతగా నిలిచాడు. 8–అండర్–64లో 263 పాయింట్ల స్కోరుతో టైటిల్ నెగ్గాడు.
ద్వితీయ శ్రేణి ఈవెంట్ అయినప్పటికీ అనామక ఆటగాళ్లు బరిలోకి దిగారనుకుంటే తప్పులో కాలేసినట్లే! ఎందుకంటే రెండు సార్లు పీజీఏ టూర్ విజేత, జపాన్ స్టార్ గోల్ఫర్ కెన్సెయ్ హిరాత ఇక్కడ టైటిల్ కోసం శ్రమించినప్పటికీ సుద ర్శన్ ప్రదర్శనతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ‘కాలక్షేపం కోసం నాన్న టీవీలో గోల్ఫ్ పోటీలను చూసేవాడు. పక్కనే నేను కూ ర్చునేవాణ్ని.
అలా చిరుప్రాయంలో చూసిన ఆటలో ఇప్పుడు విజేతగా నిలువడం... అది కూడా నాన్న పుట్టిన రోజు (జనవరి 22)న టైటిల్ అందుకోవడం ఆనందంగా ఉంది. అప్పట్లో మేం కెనడాకు వలస వెళ్లినపుడు చాలా కష్టపడాల్సి వచ్చింది. తర్వాత పరి స్థితులు చక్కబడ్డాక అమ్మనాన్నలిద్దరూ నన్ను ప్రోత్సహించారు’ అని సుదర్శన్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment