Sudarshan
-
హీరోగా టాలీవుడ్ రచయిత మనవడు.. ఆసక్తిగా ట్రైలర్!
ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు సుదర్శన్ పరుచూరి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం మిస్టర్ సెలెబ్రిటీ. ఈ సినిమాకు రవి కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్పీ సినిమాస్ బ్యానర్‌పై ఎన్ పాండురంగారావు, చిన్నా రెడ్డి నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.(ఇది చదవండి: అతనంటే చిరాకు.. ఆ షో అంతా ఓ చెత్త: సినీయర్ నటుడు ఆగ్రహం)ట్రైలర్ చూస్తే ఒక సెలబ్రిటీగా మారాలనుకునే యువకుడి కథనే సినిమాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హనుమాన్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనుంది. అంతేకాకుండా సీనియర్ నటి ఆమని,శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. Wishing best wishes to #ParuchuriSudarshan and the entire team of #MrCelebrity!The trailer looks very promising 👍🏻https://t.co/wxnwA3YIQCIn theatres from October 4th@varusarath5 #ChandinaRaviKishore #NPandurangarao— Rana Daggubati (@RanaDaggubati) October 2, 2024 -
మా మనవడ్ని ఆదరించాలని కోరుకుంటున్నాం
ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘మిస్టర్ సెలెబ్రిటీ’. చందిన రవికిశోర్ దర్శకత్వంలో చిన్న రెడ్డయ్య, ఎన్.పాండు రంగారావు నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్‌ను ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘మమ్మల్ని ఆదరించినట్టుగానే మా మనవడు సుదర్శన్‌ని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. రవికిశోర్ కొత్త దర్శకుడైనా సినిమాను బాగా తీశారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘నలభై ఏళ్లుగా మమ్మల్ని ఆదరిస్తూనే ఉన్నారు. రాజీపడకుండా నిర్మించిన నిర్మాతలను, అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడ్ని, తొలిసారి వెండితెరపై కనిపించనున్న మా మనవడ్ని ఆదరించి ఈ సినిమాకి విజయం చేకూర్చాలని కోరుకుంటున్నాను’’ అని పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు. -
గిల్, సాయి శతకాల మోత
అహ్మదాబాద్: గుజరాత్‌పై గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో పడదామనుకున్న డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు టైటాన్స్ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ చుక్కలు చూపించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సూపర్‌కింగ్స్ ఊహించని ఉపద్రవంతో చేతులెత్తేసింది. దీంతో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 35 పరుగుల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. మొదట టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 231 పరుగులు చేసింది. గిల్ (55 బంతుల్లో 104; 9 ఫోర్లు, 6 సిక్స్‌లు), సుదర్శన్ (51 బంతుల్లో 103; 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగారు.తుషార్ దేశ్‌పాండేకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసి ఓడింది. డారిల్ మిచెల్ (34 బంతుల్లో 63; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), మొయిన్ అలీ (36 బంతుల్లో 56; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించారు. మోహిత్ శర్మ 3, రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశారు. జోరు కాదు... ఓపెనర్ల హోరు... పవర్ ప్లేలో 58/0 స్కోరు చేసిన టైటాన్స్ ఓపెనర్లు ఆ తర్వాత మరింత రెచ్చిపోయారు. ఈ క్రమంలో ముందుగా సాయి సుదర్శన్ 32 బంతుల్లో, గిల్ 25 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తి చేశారు. పేస్, స్పిన్, స్లో మీడియం ఇలా ఆరుగురు చెన్నై బౌలర్లు 17 ఓవర్ల వరకు వైవిధ్యం చూపినా... వాళ్లిద్దరు మాత్రం అడ్డు అదుపు లేకుండా శరవేగంగా పరుగుల్ని రాబట్టారు. సెంచరీ మాత్రం ముందుగా శుబ్‌మన్ 50 బంతుల్లో పూర్తిచేయగా, తర్వాత సుదర్శన్ కూడా 50 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ పరుగుల తుఫాన్‌ను ఎట్టకేలకు డెత్ ఓవర్లకు గానీ విడగొట్టలేకపోయారు. తుషార్ వేసిన 18వ ఓవర్లో భారీ షాట్‌కు యత్నించిన సాయి సుదర్శన్... శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి నిష్క్ర మించాడు.దీంతో ఓపెనింగ్ వికెట్‌కు 210 పరుగుల భాగస్వామ్యానికి తెరపడటంతో చెన్నై శిబిరంలో తొలిసారి ఆనందం కనబడింది. అదే ఓవర్లో కెపె్టన్ గిల్ కూడా అవుట్ కావడంతో సూపర్‌కింగ్స్ ఊపిరి పీల్చుకుంది. అన్ని ఫోర్లు, ఇన్ని సిక్సర్లు... ఇద్దరివే! 17.2 ఓవర్లు ఓపెనర్లే ఆడారు. దీంతో స్కోరు బోర్డు పరుగందుకుంది. మెరుపులతో జోరందుకుంది. ఓపెనింగ్‌కు ఇరువైపుల వేగం, వేగం కనిపించడంతో మోదీ స్టేడియం గుజరాత్ అభిమానుల కేరింతలతో మార్మోగింది. సుదర్శన్, గిల్ ఇద్దరు అదేపనిగా దంచేయడంతో ఫోర్లతో సిక్సర్లు కూడా పోటీపడ్డాయి. 14 ఫోర్లు, 13 సిక్స్‌లు బాదేయడంతో 210 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యంలో 134 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. ఆరో ఓవర్లో 50కి చేరిన గుజరాత్ స్కోరు... 100 పరుగుల్ని పదో ఓవర్లో దాటింది. 150 పరుగుల్ని మరింత వేగంగా 13వ ఓవర్లోనే అధిగమించింది. 17వ ఓవర్లో 200 మైలురాయికి చేరింది. ఆరంభంలోనే దెబ్బ తొలి ఓవర్లో రచిన్ రవీంద్ర (1), రెండో ఓవర్లో రహానే (1), మూడో ఓవర్లో కెపె్టన్ రుతురాజ్ (0) వరుస కట్టడంతో కొండంత లక్ష్యఛేదన చెన్నైకి అసాధ్యంగా మారింది. మిచెల్, మొయిన్ అలీ అర్ధసెంచరీలతో చేసిన పోరాటం సూపర్‌కింగ్స్ ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే ఉపయోగపడింది తప్ప... లక్ష్యంవైపు నడిపించలేకపోయింది. హిట్టర్ శివమ్ దూబే (21; 2 ఫోర్లు, 1 సిక్స్), జడేజా (18; 2 ఫోర్లు, 1 సిక్స్) టైటాన్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తలొగ్గారు. ధోని (11 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఆఖర్లో సిక్సర్లతో అలరించాడు. 2 ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఒకే జట్టుకు చెందిన ఇద్దరు ఓపెనర్లు సెంచరీలు సాధించడం ఇది రెండోసారి. 2019లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు బెయిర్‌స్టో, వార్నర్ తొలుత ఈ ఘనత సాధించారు.100 శుబ్‌మన్ గిల్ శతకం ఐపీఎల్ టోర్నీ చరిత్రలో 100వ సెంచరీ కావడం విశేషం. ఐపీఎల్ ప్రారంభమైన ఏడాది 2008 ఏప్రిల్ 18న జరిగిన తొలి మ్యాచ్‌లోనే కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ బ్రెండన్ మెకల్లమ్ మొదటి సెంచరీ చేశాడు. మొత్తం 17 ఐపీఎల్ సీజన్లలో ఇప్పటి వరకు 1084 మ్యాచ్‌లు జరిగాయి. 2 ఐపీఎల్ టోర్నీ చరిత్రలో తొలి వికెట్‌కు 200 అంతకంటే ఎక్కువ పరుగుల భాగ స్వామ్యం నమోదు కావడం ఇది రెండోసారి మాత్రమే. 2022లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు కేఎల్ రాహుల్ (68 నాటౌట్), డికాక్ (140 నాటౌట్) తొలి వికెట్‌కు అజేయంగా 210 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) దూబే (బి) తుషార్ 103; శుబ్‌మన్ గిల్ (సి) జడేజా (బి) తుషార్ 104; మిల్లర్ (నాటౌట్) 16; షారుఖ్ ఖాన్ (రనౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 231. వికెట్ల పతనం: 1–210, 2–213, 3–231. బౌలింగ్: సాన్‌ట్నర్ 2–0–31–0, తుషార్ 4–0–33–2, శార్దుల్ 4–0–25–0, సిమర్జీత్ 4–0–60–0, జడేజా 2–0–29–0, మిచెల్ 4–0–52–0. చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రహానే (సి) తెవాటియా (బి) సందీప్ వారియర్ 1; రచిన్ (రనౌట్) 1; రుతురాజ్ (సి) రషీద్ ఖాన్ (బి) ఉమేశ్ 0; మిచెల్ (సి) షారుఖ్ (బి) మోహిత్ 63; అలీ (సి) నూర్ అహ్మద్ (బి) మోహిత్ 56; దూబే (సి) నూర్ (బి) మోహిత్ 21; జడేజా (సి) మిల్లర్ (బి) రషీద్ 18; ధోని (నాటౌట్) 26; సాన్‌ట్నర్ (బి) రషీద్ 0; శార్దుల్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–2, 2–2, 3–10, 4–119, 5–135, 6–165, 7–169, 8–169. బౌలింగ్: ఉమేశ్ 3–0–20–1, సందీప్ వారియర్ 3–0–28–1, త్యాగి 4–0–51–0, నూర్ అహ్మద్ 2–0–25–0, రషీద్ ఖాన్ 4–0–38–2, మోహిత్ 4–0–31–3. ఐపీఎల్లో నేడుకోల్‌కతా X ముంబై వేదిక: కోల్‌కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
సుదర్శన్ సేతును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ!
ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. దీనిలో భాగంగా అరేబియా సముద్రంపై నిర్మించిన దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన ‘సుదర్శన్ సేతు’ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. #WATCH | Gujarat: Prime Minister Narendra Modi at Sudarshan Setu, country’s longest cable-stayed bridge of around 2.32 km, connecting Okha mainland and Beyt Dwarka. pic.twitter.com/uLPn4EYnFM — ANI (@ANI) February 25, 2024 దీనికి ముందు ప్రధాని మోదీ ద్వారక ఆలయంలో పూజలు నిర్వహించారు. సుదర్శన్ సేతు దేశంలోనే అతి పొడవైన సిగ్నేచర్ బ్రిడ్జిగా నిలిచింది. ఓఖా ప్రధాన భూభాగాన్ని, బేట్ ద్వారకా ద్వీపాన్ని కలుపుతూ సుమారు 980 కోట్ల రూపాయలతో నిర్మించిన సుదర్శన్ సేతును ద్వారకలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. #WATCH | Gujarat: Prime Minister Narendra Modi performs pooja and darshan at Beyt Dwarka temple. pic.twitter.com/U2gZUVB3k4 — ANI (@ANI) February 25, 2024 -
‘సుదర్శన్ సేతు’ ప్రత్యేకత ఏమిటి?
దేశంలో మౌలిక సదుపాయాలకు (ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్వెల్) మరో ప్రత్యేక ఉదాహరణ మన కళ్ల ముందుకు వస్తోంది. అదే సుదర్శన సేతు. ఈ వంతెన దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన. దీని పొడవు 2.32 కిలోమీటర్లు. దాదాపు రూ.980 కోట్లతో నిర్మించిన ఈ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం)జాతికి అంకితం చేయనున్నారు. ఈ కేబుల్ వంతెన ఓఖా ప్రధాన భూభాగాన్ని సముద్రం మధ్యలో ఉన్న బేట్ ద్వారకతో అనుసంధానం చేస్తుంది. ప్రత్యేకమైన డిజైన్‌తో సుదర్శన్ బ్రిడ్జిని రూపొందించారు. బ్రిడ్జికి ఇరువైపులా శ్రీకృష్ణుని చిత్రాలతో అలంకరించారు. ఇందులో ఫుట్‌పాత్ పైభాగంలో సోలార్ ఎనర్జీ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ వంతెన ద్వారక- భేట్-ద్వారక మధ్య ప్రయాణించే భక్తుల రాకపోకలను సులభతరం చేయడమే కాకుండా, చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. సుదర్శన్ సేతు నిర్మాణానికి ముందు భేట్ ద్వారక చేరుకోవడానికి ప్రయాణికులు చాలా కష్టపడాల్సి వచ్చేది. పడవపైనే ఆధారపడేవారు. వాతావరణం ప్రతికూలంగా ఉంటే ప్రయాణానికి మరింత జాప్యం జరిగేది. అయితే ఇప్పుడు ఈ ఐకానిక్ వంతెన నిర్మితం కావడంతో భక్తుల కష్టాల తీరనున్నాయి. అలాగే దేవభూమి ద్వారకలో మరో ప్రధాన పర్యాటక ఆకర్షణ అందరినీ అలరించనుంది. ఈ వంతెన నిర్మాణానికి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 2016లో ఆమోదం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ 2017, అక్టోబర్ 7న ఓఖా- భేట్ ద్వారకలను కలిపే వంతెనకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.962 కోట్లు కాగా, తర్వాత దానిని రూ.980 కోట్లకు పెంచారు. ఈ వంతెన కారణంగా లక్షద్వీప్‌లో నివసిస్తున్న సుమారు 8,500 మందికి కూడా ప్రయోజనం చేకూరనుంది. ఈ వంతెన డెక్ మిశ్రమ ఉక్కు-రీన్ఫోర్స్డ్ కాంక్రీటుతో తయారయ్యింది. దీని వెడల్పు 27.2 మీటర్లు (89 అడుగులు). ఈ వంతెనకు ఇరువైపులా 2.5 మీటర్లు (8 అడుగులు) వెడల్పు గల ఫుట్‌పాత్ కూడా ఉంది. ఈ వంతెన మొత్తం పొడవు 2,320 మీటర్లు (7,612 అడుగులు). ఇది భారతదేశంలోనే అతి పొడవైన తీగల వంతెనగా నిలిచింది. -
నేటి గుజరాత్ పర్యటలో ప్రధాని మోదీ షెడ్యూల్ ఇదే..
ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) గుజరాత్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రూ.52,250 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 25న ఉదయం 7:45 గంటలకు ప్రధాని ద్వారకా ఆలయాన్ని సందర్శించి పూజలు చేయనున్నారు. అనంతరం సుదర్శన్ వంతెనను సందర్శిస్తారు. ప్రధాని మోదీ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ద్వారకలో రూ.4,150 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. దీని తర్వాత మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రధాని మోదీ రాజ్‌కోట్‌కు వెళ్లనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు రాజ్‌కోట్‌లోని రేస్ కోర్స్ గ్రౌండ్లో రూ. 48,100 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ద్వారకలో జరిగే బహిరంగ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఓఖా ప్రధాన భూభాగంతో బేట్ ద్వారకా ద్వీపాన్ని కలుపుతూ సుమారు రూ. 980 కోట్లతో నిర్మించిన సుదర్శన్ సేతును జాతికి అంకితం చేయనున్నారు. ఇది దాదాపు 2.32 కిలోమీటర్ల పొడవుతో దేశంలోనే అతి పొడవైన కేబుల్ సపోర్ట్ బ్రిడ్జిగా గుర్తింపు పొందింది. వదినార్, రాజ్‌కోట్-ఓఖా, రాజ్‌కోట్-జెతల్సర్-సోమ్‌నాథ్ మరియు జెతల్సర్-వాన్సజలియా రైలు విద్యుదీకరణ ప్రాజెక్టుల వద్ద పైప్‌లైన్‌ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఫిబ్రవరి 26న దేశంలోని 550 అమృత్ భారత్ స్టేషన్లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బండేల్లో రూ.307 కోట్ల అంచనా వ్యయంతో ప్రపంచ స్థాయి స్టేషన్‌ను నిర్మించనున్నారు.టెలికాన్ఫరెన్సింగ్ ద్వారా బెంగాల్, జార్ఖండ్, బీహార్‌లోని 28 స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. -
అర్ష్‌దీప్, అవేశ్ అదుర్స్
వాండరర్స్ వేదికపై ఆఖరి టి20లో ధనాధన్ మెరుపులతో సునాయాసంగా 200 పైచిలుకు పరుగులు చేసిన భారత్... తర్వాత సఫారీ మెడకు స్పిన్ ఉచ్చు బిగించి మ్యాచ్ గెలిచింది. సిరీస్‌ను సమం చేసింది. మారని వేదికపై మారిన ఫార్మాట్లో అలాంటి విజయంతోనే టీమిండియా వన్డే సిరీస్‌లో శుభారంభం చేసింది. అయితే ఇందులో ముందు దక్షిణాఫ్రికాను కుప్ప కూల్చేసి తర్వాత సులువైన లక్ష్యాన్ని టీమిండియా చకచకా ఛేదించేసింది. ఈ గెలుపుతో భారత్ మూడు వన్డేల సిరీస్‌లో 1–0తో ఆధిక్యం సంపాదించింది. రెండో వన్డే రేపు పోర్ట్ ఎలిజబెత్‌లో జరుగుతుంది. జొహన్నెస్‌బర్గ్: పేస్ బౌలర్లు అర్ష్ దీప్ సింగ్ (5/37), అవేశ్ ఖాన్ (4/27)ల అసాధారణ స్పెల్... అరంగేట్రం మ్యాచ్‌లోనే సాయి సుదర్శన్ (43 బంతుల్లో 55 నాటౌట్; 9 ఫోర్లు), సీనియర్ శ్రేయస్ అయ్యర్ (45 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు.. వెరసి దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచి శుభారంభం చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 27.3 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. ఎనిమిదో వరుసలో బ్యాటింగ్‌కు దిగిన ఫెలుక్వాయో (49 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్! అనంతరం భారత్ 16.4 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసి గెలిచింది. కెరీర్‌లోని తొలి మూడు వన్డేల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన అర్ష్ దీప్ తన నాలుగో వన్డేలో ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకున్నాడు. అంతేకాకుండా దక్షిణాఫ్రికాపై వన్డేల్లో ఐదు వికెట్లు తీసిన తొలి భారత పేస్ బౌలర్‌గా అర్ష్ దీప్ గుర్తింపు పొందాడు. ఆ నలుగురితోనే... ముందు బౌలింగ్‌లో ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఇద్దరిద్దరు చేసిన ప్రదర్శనతో టీమిండియా గర్జించింది. టాస్ గెలవగానే బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాపై అర్ష్ దీప్ తన తొలిఓవర్ (ఇన్నింగ్స్ రెండో)లోనే చావుదెబ్బ తీశాడు. వరుస బంతుల్లో హెన్డ్రిక్స్ (0), డసెన్ (0)లను డకౌట్ చేశాడు. అడపాదడపా ఫోర్లు, సిక్స్‌లు కొడుతున్న మరో ఓపెనర్ టోని డి జోర్జి (28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)ని కూడా అర్ష్ దీప్ అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా కుదేలైంది. ఆ తర్వాత పదో ఓవర్ ఆఖరి బంతికి క్లాసెన్ (6)నూ అతనే పెవిలియన్ చేర్చితే... 11వ ఓవర్ తొలి రెండు బంతుల్లో అవేశ్... మార్క్రమ్ (12), ముల్డర్ (0)లను పడగొట్టడంతో 52 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. ఫెలుక్వాయో చేసిన ఆ కాస్త పోరాటంతో సఫారీ వంద పైచిలుకు స్కోరు చేయగలిగింది. సాయి, అయ్యర్ ఫిఫ్టీ–ఫిఫ్టీ రుతురాజ్ (5) విఫలమైనా... సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్ ఆతిథ్య బౌలర్లపై పరుగుల భరతం పట్టడంతో ఏ దశలోనూ భారత్‌కు ఇబ్బందే ఎదురవలేదు. ఇద్దరు బౌండరీలతో స్కోరు వేగాన్ని పెంచారు. ఈ క్రమంలోనే భారత్ 8.4 ఓవర్లో 50 పరుగుల్ని, 15.1 ఓవర్లో వంద పరుగుల్ని అధిగమించింది. 16వ ఓవర్లోనే సుదర్శన్ 41 బంతుల్లో... అయ్యర్ 44 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నారు. లక్ష్యానికి చేరువయ్యాక అయ్యర్ అవుటయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తిలక్ వర్మ (1 నాటౌట్)తో సాయి సుదర్శన్ మిగతా లాంఛనాన్ని పూర్తి చేశాడు. 253 భారత్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన 253వ ప్లేయర్‌గా తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల సాయి సుదర్శన్ గుర్తింపు పొందాడు. 116 స్వదేశంలో వన్డేల్లో దక్షిణాఫ్రికా జట్టుకిదే అత్యల్ప స్కోరు. 2018లో సెంచూరియన్‌లో భారత్‌పైనే దక్షిణాఫ్రికా 118 పరుగులకు ఆలౌటైంది. 17 భారత్ తరఫున అరంగేట్రం వన్డేలోనే అర్ధ సెంచరీ చేసిన 17వ ప్లేయర్‌గా సాయి సుదర్శన్ నిలిచాడు. 6 వన్డే మ్యాచ్‌లో ఇద్దరు భారత పేస్ బౌలర్లు నాలుగు అంత కంటే ఎక్కువ వికెట్ల చొప్పున తీయడం ఇది ఆరోసారి మాత్రమే. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: హెన్డ్రిక్స్ (బి) అర్ష్ దీప్ 0; టోని (సి) రాహుల్ (బి) అర్ష్ దీప్ 28; డసెన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అర్ష్ దీప్ 0; మార్క్రమ్ (బి) అవేశ్ 12; క్లాసెన్ (బి) అర్ష్ దీప్ 6; మిల్లర్ (సి) రాహుల్ (బి) అవేశ్ 2; ముల్డర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అవేశ్ 0; ఫెలుక్వాయో (ఎల్బీడబ్ల్యూ) (బి) అర్ష్ దీప్ 33; కేశవ్ (సి) రుతురాజ్ (బి) అవేశ్ 4; బర్గర్ (బి) కుల్దీప్ 7; షమ్సీ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (27.3 ఓవర్లలో ఆలౌట్) 116. వికెట్ల పతనం: 1–3, 2–3, 3–42, 4–52, 5–52, 6–52, 7–58, 8–73, 9–101, 10–116. బౌలింగ్: ముకేశ్ 7–0–46–0, అర్ష్ దీప్ 10–0–37–5, అవేశ్ 8–3–27–4, కుల్దీప్ 2.3–0–3–1. భారత్ ఇన్నింగ్స్: రుతురాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ముల్డర్ 5; సాయి సుదర్శన్ (నాటౌట్) 55; అయ్యర్ (సి) మిల్లర్ (బి) ఫెలుక్వాయో 52; తిలక్‌వర్మ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (16.4 ఓవర్లలో 2 వికెట్లకు) 117. వికెట్ల పతనం: 1–23, 2–111. బౌలింగ్: బర్గర్ 5.4–1–35–0, ముల్డర్ 4–0–26–1, కేశవ్ 3–0–19–0, షమ్సీ 3–0–22–0, ఫెలుక్వాయో 1–0–15–1. -
కామెడీ.. థ్రిల్
పరుచూరి సుదర్శన్, శ్రీ జంటగా రవికిషోర్ బాబు చందిన దర్శకత్వంలో ఓ కామెడీ థ్రిల్లర్ ఫిల్మ్ తెరకెక్కుతోంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాకు ‘రూమర్స్ డిస్ట్రాయ్ లైఫ్స్’ అనేది ఉపశీర్షిక. యన్. పాండు రంగారావు, కోయ చిన్నరెడ్డయ్య నిర్మిస్తున్న చిత్రం ఇది. శనివారం సుదర్శన్ బర్త్ డే. ఈ సందర్భంగా శుక్రవారం ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. యోగి, దొరబాబు, జబర్దస్త్ రాజమౌళి, జబర్దస్త్ బాబి, సునీతా మోహన్, రాజేశ్వరి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య. -
సాయి సుదర్శన్ అజేయ సెంచరీ
కొలంబో: ఎమర్జింగ్ కప్ ఆసియా అండర్–23 క్రికెట్ టోర్నీ లీగ్ దశలో భారత్ ‘ఎ’ జట్టు అజేయంగా నిలిచింది. పాకిస్తాన్ ‘ఎ’తో బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ ‘ఎ’ 48 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. ఖాసిమ్ అక్రమ్ (48; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో రాజ్వర్ధన్ హంగార్గేకర్ 42 పరుగులిచ్చి 5 వికెట్లు, మానవ్ సుథర్ 36 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత ‘ఎ’ జట్టు 36.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (110 బంతుల్లో 104 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) పాక్ బౌలర్ల భరతంపట్టి అజేయ సెంచరీ చేశాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సాయి సుదర్శన్ తొలి వికెట్‌కు అభిõÙక్ శర్మ (20; 4 ఫోర్లు)తో 58 పరుగులు... రెండో వికెట్‌కు నికిన్ జోస్ (64 బంతుల్లో 53; 7 ఫోర్లు)తో 99 పరుగులు... మూడో వికెట్‌కు కెపె్టన్ యశ్ ధుల్ (21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్)తో 53 పరుగులు జోడించాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన టీమిండియా ఆరు పాయింట్లతో గ్రూప్ ‘బి’లో అగ్రస్థానం పొందింది. నాలుగు పాయింట్లతో పాకిస్తాన్ రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్లు ఇప్పటికే సెమీఫైనల్ చేరాయి. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో శ్రీలంక ‘ఎ’తో పాకిస్తాన్ ‘ఎ’; బంగ్లాదేశ్ ‘ఎ’తో భారత్ ‘ఎ’ తలపడతాయి. ఫైనల్ 23న జరుగుతుంది. -
మావోయిస్టు అగ్రనేత కటకం కన్నుమూత
సాక్షి, హైదరాబాద్/ బెల్లంపల్లి/ చర్ల: మావోయిస్టు పార్టీ అగ్రనేత, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ (69) అలియాస్ ఆనంద్ కన్నుమూశారు. ఐదు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఆయన కొంతకాలం నుంచి దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి, మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో దండకారణ్యం గెరిల్లా జోన్లో మే 31న మధ్యాహ్నం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. దీనిపై మావోయిస్టు కేంద్ర కమిటీ మీడియా ప్రతినిధి అభయ్, మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ వేర్వేరుగా ప్రకటనలు జారీ చేశారు. వందలాది మంది పార్టీ, ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం (పీఎల్జీఏ) కార్యకర్తలు, నాయకులు, కమాండర్ల సమక్షంలో విప్లవ సాంప్రదాయాలతో సుదర్శన్ అంత్యక్రియలు నిర్వహించినట్టు తెలిపారు. సుదర్శన్ భార్య, కుటుంబ సభ్యులు, స్నేహితులకు మావోయిస్టు పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. సుదర్శన్ మృతికి సంతాపంగా సోమవారం నుంచి ఆగస్టు 3 వరకు దేశవ్యాప్తంగా స్మారక సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ర్యాడికల్ విద్యార్థి సంఘంతో మొదలై.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నాల బస్తీకి చెందిన పేద కార్మిక కుటుంబంలో పుట్టిన కటకం సుదర్శన్.. 1974లో మైనింగ్ డిప్లొమా చదువుతున్న సమయంలో విప్లవ పోరాటంలో అడుగుపెట్టారు. 1975లో ర్యాడికల్ విద్యార్థి సంఘం ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషించారు. తర్వాత బెల్లంపల్లి పార్టీ సెల్ సభ్యుడిగా, సింగరేణి కార్మిక ఉద్యమం, ర్యాడికల్ విద్యార్థి యువజన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. నక్సల్బరీ, శ్రీకాకుళం సంఘర్షణ విముక్తి, పోరాటాల ప్రేరణతో అప్పటి పీపుల్స్‌వార్ పార్టీలో చేరారు. 1978లో లక్సెట్టిపేట, జన్నారం ప్రాంతాల్లో పార్టీ ఆర్గనైజర్‌గా బాధ్యతలు చేపట్టి రైతాంగాన్ని విప్లవోద్యమంలో సమీకరించారు. 1980లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడిగా దండకారణ్య ప్రాంతంలోకి విప్లవోద్యమాన్ని విస్తరించడంలో కీలకంగా పనిచేశారు. 1987లో దండకారణ్య కమిటీ సభ్యుడిగా, తర్వాత ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఇంద్రవెల్లి ఆదివాసీ రైతాంగ ఉద్యమానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించారు. 1995లో ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2001లో భారత కమ్యూనిస్టు పార్టీ (పీపుల్స్ వార్) 9వ కాంగ్రెస్‌లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికై పొలిట్‌బ్యూరో సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. ఐదు దశాబ్దాల ప్రస్థానం.. 2004లో పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(ఎంసీసీఐ) కలిసి భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)గా ఆవిర్భవించాయి. ఈ క్రమంలో 2007లో మరోమారు కేంద్ర కమిటీకి ఎన్నికై పొలిట్ బ్యూరో సభ్యుడిగా, సెంట్రల్ రీజనల్ బ్యూరో కార్యదర్శిగా పనిచేశారు. మొత్తంగా 2001 నుంచి 2017 వరకు సెంట్రల్ రీజనల్ బ్యూరో (సీఆర్బీ) కార్యదర్శిగా కొనసాగిన ఆయన.. తర్వాత అనారోగ్య కారణాలతో ఆ బాధ్యతల నుంచి వైదొలగి పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగారు. ఐదు దశాబ్దాల సుదీర్ఘ విప్లవోద్యమ ప్రస్థానంలో సుదర్శన్ కీలక బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు. మావోయిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రచురితమైన పలు విప్లవ పత్రికలకు సంపాదకుడిగా కూడా వ్యవహరించారు. జీవిత భాగస్వామి ఎన్కౌంటర్లో మృతి విప్లవోద్యమంలో చేరిన తర్వాత సుదర్శన్ సహచర విప్లవకారిణి కోలం లలితాబాయి అలియాస్ లలితక్కను విప్లవ సిద్ధాంతం ప్రకారం వివాహం చేసుకున్నారు. లలితక్క పార్టీలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ కార్యదర్శి స్థాయికి ఎదిగారు. 2003లో కుమురం భీం జిల్లా బెజ్జూర్ మండలం అగర్‌గూడ అటవీ ప్రాంతంలో జరిగిన పోలీసుల ఎదురుకాల్పుల్లో ఆమె మృతి చెందారు. తర్వాత సుదర్శన్ మరో సహచర విప్లవకారిణి పద్మను ద్వితీయ వివాహం చేసుకున్నట్టు ప్రచారంలో ఉంది. ప్రభుత్వాల ఫాసిస్టు విధానాల వల్లే సుదర్శన్ మరణం: మావోయిస్టులు విప్లవోద్యమ నాయకులకు, కార్యకర్తలకు మందులు, వైద్య చికిత్స అందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఫాసిస్టు దాడి ఫలితంగానే సుదర్శన్ మరణించారని మావోయిస్టు కేంద్ర కమిటీ మీడియా ప్రతినిధి అభయ్ ఒక ప్రకటనలో ఆరోపించారు. తీవ్ర అనారోగ్యంతో వైద్యం కోసం మావోయిస్టు, పీఎల్ఏ కార్యకర్తలు, నాయకులు పట్టణాలకు వెళ్తే.. పట్టుకుని హత్యలు చేయడం, లొంగిపోతేనే మెరుగైన వైద్యం అందిస్తామని ప్రకటించడం క్రూరమైన చర్య అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ కొత్త ప్లాన్.. వారికి ఎక్కువ సీట్ల కేటాయింపు! -
విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీకి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నరేష్ అగస్త్య, కౌశిక్, మౌర్య సిద్ధవరం, వైవా హర్ష, ప్రియాంక శర్మ, బ్రహ్మాజి, సుదర్శన్, రియా సుమన్, ప్రియాంక శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం మెన్‌టూ (#MenToo). బీయింగ్ ఏ మ్యాన్ ఈజ్ నాట్ ఈజీ. అనేది ఉపశీర్షిక. శ్రీకాంత్ జి.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. హీరోగా నటించిన మౌర్య సిద్ధవరం నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం మే 26న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే కేవలం రెండు వారాల్లోనే ఈ చిత్రం ఓటీటీకి రానుంది. (ఇది చదవండి: Mentoo Movie: #మెన్‌టూ మూవీ రివ్యూ) ఈ మూవీ జూన్ 9 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. సినిమా స్టిల్‌ని షేర్ చేస్తూ.. ప్రపంచ పురుషోత్తములారా.. ఈ బిగ్ అనౌన్స్మెంట్ మీ కోసమే అంటూ క్యాప్షన్ పెట్టింది. పురుషుల కష్టాలు ఎలా ఉంటాయో చూపించే కథతో ఈ సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రం కామెడీతో మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించేందుకు వచ్చేస్తోంది. థియేటర్లలో చూడలేనివారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. (ఇది చదవండి: టీవీ షోలో నాపై చవకబారు కామెంట్లు.. యాంకర్ విరగబడి నవ్వింది) Prapancha Purushothhamulaara...!🙋♂️ A Big Announcement for you....👉#MENTOO Antu vachesthunnaru ee frustrated front uu...!😛#MenTooOnAHA Premiers June 9th!@nareshagastya @kaushikghan @PriyankaOffl @IRiyaSuman @MouryaSIddavar1 @SrizTweets @harshachemudu pic.twitter.com/fQHDbnvosK — ahavideoin (@ahavideoIN) June 2, 2023 -
#మెన్‌టూ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: #మెన్‌టూ(MenToo) నటీనటులు : నరేష్ అగస్త్య, కౌశిక్, మౌర్య సిద్ధవరం, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, రియా సుమన్, ప్రియాంక శర్మ తదితరులు రచన, దర్శకత్వం : శ్రీకాంత్ జి. రెడ్డి నిర్మాత : మౌర్య సిద్ధవరం సినిమాటోగ్రఫీ : పీసీ మౌళి సంగీతం : ఎలీషా ప్రవీణ్, ఓషో వెంకట్ విడుదల తేదీ: మే 26, 2023 నరేష్ అగస్త్య, కౌశిక్, మౌర్య సిద్ధవరం, వైవా హర్ష, ప్రియాంక శర్మ, బ్రహ్మాజి, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం #MenToo. . శ్రీకాంత్ జి.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. హీరోగా నటించిన మౌర్య సిద్ధవరం నిర్మాతగా వ్యవహరించారు. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం యూత్‌ను ఎలా అలరించిందో చూద్దాం . అసలు కథేంటంటే.. ఓ నలుగురు యువకులు ఆదిత్య(నరేష్ అగస్త్య), సంజు(కౌశిక్), మున్నా(మౌర్య సిద్ధవరం), రాహుల్(వైవా హర్ష) నలుగురు యువకులు ఓ పబ్‌లో రెగ్యులర్ కలుసుకుని తమ జీవితాల్లో జరిగిన కష్టనష్టాలను ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇందులో ఆ పబ్ ఓనర్(బ్రహ్మాజి), అందులో పనిచేసే బాయ్(సుదర్శన్) కూడా వారి సాదక, బాధకాలు షేర్ చేసుకుంటారు. ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో ఎక్సీపీరియన్స్. ఒకరు భార్య వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది షేర్ చేసుకుంటే... ఇంకొకరేమో తనను అనవసరంగా వేధింపులతో తనువు చాలించడం... మరొకరేమో విదేశాలకు వెళ్లడం ఇష్టం లేక ప్రియురాలికి దూరం కావడం... ఒకరేమో ప్రియురాలి ఎక్స్పేక్టేషన్స్ అందుకోలేకపోవడం లాంటి సమస్యలతో ఇబ్బందులు పడే మగాళ్లంతా... చివరకు ఏమి చేశారనేదే మిగతా కథ. కథ ఎలా సాగిందంటే.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్‌కి మంచి ఆదరణే ఉంటుంది. ఇలాంటి సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. కొంచెం మెసేజ్ ఓరియంటెడ్‌గా సినిమా తీస్తే... యూత్ బాగా ఆదరిస్తారని ఇది వరకు చాలా సినిమాలు నిరూపించాయి. అలాంటి సినిమానే #MenToo. కేవలం అమ్మాయిలే కాదు... వేధింపులకు గురై బాధపడే అబ్బాయిలు కూడా ఉంటారు అనే నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో నిత్యం మనం చుట్టూ యువతీ యువకుల్లో జరిగే అంశాల ఆధారంగా కొంత మెసేజ్ ఇస్తూనే... యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా మలిచారు దర్శకుడు. కథ... కథనాలతో ఎక్కడా బోర్ లేకుండా నలుగురు యువకుల మధ్య జరిగిన సంఘటనలను ఎంతో ఎమోషనల్‌గా తెరపై ఆవిష్కరించారు దర్శకుడు. ఫస్ట్ హాఫ్‌లో రాహుల్ కథతో ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ నిచ్చిన దర్శకుడు... ఆ తరువాత ద్వితీయార్థం అంతా ఎమోషనల్‌గా నడిపించి ఆడియన్స్ ని సినిమాలోని మల్టిపుల్ ట్రాక్స్ కి కనెక్ట్ చేయడంలో విజయం సాధించారు. వర్క్ ప్లేస్‌లో కేవలం అమ్మాయిలకే ప్రాధాన్యం ఇచ్చే ఎంఎన్సీ కంపెనీలు... అబ్బాయిలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని, అలాగే అమ్మాయిల అభిప్రాయాలను గౌరవించాలనే దానిని ఆదిత్య పాత్రతోనూ, అమ్మాయిలు... అబ్బాయిలకు కారణం లేకుండా బ్రేకప్ చెప్పడం లాంటి వాటిని ఫేస్ చేసే పాత్రలో సంజు పాత్రను, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినా... తన ప్రియురాలికి తన ప్రేమను చెప్పలేని పాత్రలో మున్నా పాత్రని ఎంతో ఎమోషనల్‌గా తెరమీద చూపించారు దర్శకుడు. అబ్బాయిలు కూడా అమ్మాయిల్లాగే అన్ని విధాలుగా ఇబ్బందులు అన్నిచోట్లా ఎదుర్కొంటూనే ఉంటారు. వారికి కూడా ఓ వేదిక కావాలి అభిప్రాయాలను పంచుకోవడానికి అనేదానితో తెరకెక్కిన ఈచిత్రం ఆద్యంతం అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే... ఇందులో నరేష్ అగస్త్య పాత్ర చాలా మంది యువతకు మెసేజ్ ఇస్తుంది. అలాగే కౌషిక్ కూడా కాస్త తన నటనతో మెప్పించాడు. మున్నా పాత్రలో చిత్ర నిర్మాత మౌర్య ఆకట్టుకుంటాడు. గీతా పాత్రలో రియా సుమన్... గ్లామరస్‌గా కనిపించి మెప్పించింది. భార్య బాధితునిగా బ్రహ్మాజీ నవ్వించాడు. బార్లో పనిచేసే యువకుని పాత్రలో సుదర్శన్ ఆకట్టుకుంటాడు. వైవా హర్షా చేసిన పాత్ర కూడా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. ఇక మిగత పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకుంటాయి. సాంకేతికత విషయానికొస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త కత్తెర పడాల్సింది. సంగీతం పర్వాలేదు. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నాయి. -
IPL 2023 DC Vs GT: టైటాన్స్ ఆడుతూ పాడుతూ... గెలిపించిన రషీద్, సుదర్శన్
Delhi Capitals vs Gujarat Titans Scorecard: గుజరాత్ టైటాన్స్... దాదాపు తొలి మ్యాచ్ తరహాలోనే... ఎలాంటి హంగామా, వ్యక్తిగతంగా మెరుపు ప్రదర్శనలు లేవు... విధ్వంసక ఆట లేదు... అంతా సమష్టి తత్వం, అటు బౌలర్లు, ఇటు బ్యాటర్లు తలా ఓ చేయి వేశారు... ముందుగా చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థి కట్టడి, ఆపై ప్రశాంతంగా లక్ష్య ఛేదన...డిఫెండింగ్ చాంపియన్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సత్తా చాటింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ సొంత మైదానంలో ఆడుతున్న ప్రయోజనాన్ని ఏమాత్రం ఉపయోగించుకోలేక చతికిలపడింది. ఫలితమే వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. న్యూఢిల్లీ: ఐపీఎల్ కొత్త సీజన్లో గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయంతో తమ స్థాయిని ప్రదర్శించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (32 బంతుల్లో 37; 7 ఫోర్లు), అక్షర్ పటేల్ (22 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), సర్ఫరాజ్ ఖాన్ (34 బంతుల్లో 30; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. రషీద్ ఖాన్, షమీ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం గుజరాత్ 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 163 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సాయి సుదర్శన్ (48 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, మిల్లర్ (16 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 29 బంతుల్లోనే 56 పరుగులు జోడించారు. సమష్టి వైఫల్యం... తొలి మ్యాచ్‌తో పోలిస్తే ఈసారి కూడా ఢిల్లీ బ్యాటింగ్ ఏమాత్రం మెరుగుపడలేదు. పృథ్వీ షా, మిచెల్ మార్ష్ మళ్లీ విఫలం కాగా, వార్నర్ మరోసారి తన శైలికి భిన్నంగా దాదాపు అదే తరహాలో 115 స్ట్రయిక్‌రేట్‌తో ఆడాడు. టైటాన్స్ బౌలర్లు ఆరంభం నుంచి ప్రత్యర్థిని కట్టి పడేశారు. తన వరుస రెండు ఓవర్లలో పృథ్వీ షా (7), మార్ష్ (4)లను షమీ వెనక్కి పంపగా, వార్నర్ చేసిన పరుగులతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 52/2కు చేరింది. అనంతరం వరుస బంతుల్లో వార్నర్, రోసో (0)లను అవుట్ చేసి జోసెఫ్ ఢిల్లీని దెబ్బ కొట్టాడు. మరో ఎండ్‌లో సర్ఫరాజ్ నిలబడినా, అతనూ వేగంగా ఆడలేకపోయాడు. 13 పరుగుల వద్ద జోష్ లిటిల్ క్యాచ్ వదిలేసి మరో అవకాశం దక్కినా అతను దానిని ఉపయోగించుకోలేదు. అభిషేక్ పోరెల్ (11 బంతుల్లో 20; 2 సిక్స్‌లు) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా అది ఎక్కువసేపు సాగలేదు. అయితే 101/5 వద్ద క్రీజ్‌లోకి వచ్చిన అక్షర్ కీలక పరుగులు సాధించాడు. చివర్లో అతను కొట్టిన మూడు సిక్సర్లతోనే ఢిల్లీ చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగింది. కీలక భాగస్వామ్యం... ఖలీల్ వేసిన తొలి ఓవర్లోనే 2 ఫోర్లు, సిక్స్ కొట్టి వృద్ధిమాన్ సాహా (14) జోరుగా ఇన్నింగ్స్ మొదలు పెట్టగా, ముకేశ్ వేసిన తర్వాతి ఓవర్లో శుబ్‌మన్ గిల్ (14) రెండు ఫోర్లు కొట్టాడు. అయితే అద్భుత బంతులతో నోర్జే వీరిద్దరిని క్లీన్‌బౌల్డ్ చేశాడు. హార్దిక్ పాండ్యా (5) కూడా విఫలమయ్యాడు. ఇలాంటి దశలో సుదర్శన్, విజయ్ శంకర్ (23 బంతుల్లో 29; 3 ఫోర్లు) కీలక భాగస్వామ్యంతో టైటాన్స్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఎలాంటి సాహసాలకు పోకుండా వీరిద్దరు జాగ్రత్తగా ఆడుతూ లక్ష్యం దిశగా నడిపించారు. ఈ క్రమంలో కొన్ని చక్కటి షాట్లతో సుదర్శన్ ఆకట్టుకున్నాడు. నాలుగో వికెట్‌కు 44 బంతుల్లో 53 పరుగులు జోడించిన అనంతరం శంకర్‌ను అవుట్ చేసి ఈ జోడీని విడదీశాడు. అయితే వచ్చీ రాగానే మిల్లర్ తన దూకుడును ప్రదర్శించాడు. ముకేశ్ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్ బాది టైటాన్స్ పని సులువు చేశాడు. 44 బంతుల్లో సుదర్శన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, మరో 11 బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ విజయాన్నందుకుంది. విలియమ్సన్ స్థానంలో షనక మోకాలి గాయంతో ఐపీఎల్‌కు దూరమైన స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ స్థానంలో శ్రీలంక జట్టు కెప్టెన్ దాసున్ షనకను గుజరాత్ టైటాన్స్ జట్టు తీసుకుంది. గత ఐపీఎల్ వేలంలో షనకను ఎవరూ కొనుగోలు చేయలేదు. ఇప్పుడు విలియమ్సన్ స్థానంలో షనకతో అతని కనీస ధర రూ. 50 లక్షలకు గుజరాత్ టైటాన్స్ ఒప్పందం చేసుకుంది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (బి) జోసెఫ్ 37; పృథ్వీ షా (సి) జోసెఫ్ (బి) షమీ 7; మార్ష్ (బి) షమీ 4; సర్ఫరాజ్ (సి) లిటిల్ (బి) రషీద్ 30; రోసో (సి) తెవాటియా (బి) జోసెఫ్ 0; పోరెల్ (బి) రషీద్ 20; అక్షర్ (సి) మిల్లర్ (బి) షమీ 36; అమన్ ఖాన్ (సి) పాండ్యా (బి) రషీద్ 8; కుల్దీప్ (నాటౌట్) 1; నోర్జే (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–29, 2–37, 3–67, 4–67, 5–101, 6–130, 7–148, 8–158. బౌలింగ్: షమీ 4–0–41 –3, లిటిల్ 4–0–27–0, పాండ్యా 3–0–18–0, జోసెఫ్ 4–0–29–2, యష్ దయాల్ 1–0–12–0, రషీద్ ఖాన్ 4–0–31–3. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (బి) నోర్జే 14; గిల్ (బి) నోర్జే 14; సుదర్శన్ (నాటౌట్) 62; పాండ్యా (సి) పోరెల్ (బి) ఖలీల్ 5; విజయ్ శంకర్ (ఎల్బీ) (బి) మార్ష్ 29; మిల్లర్ (నాటౌట్) 31; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (18.1 ఓవర్లలో 4 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–22, 2–36, 3–54, 4–107. బౌలింగ్: ఖలీల్ 4–0–38–1, ముకేశ్ 4–0–42–0, నోర్జే 4–0–39–2, మార్ష్ 3.1–0–24–1, కుల్దీప్ 3–0–18–0. ఐపీఎల్లో నేడు రాజస్తాన్ vs పంజాబ్ (రాత్రి గం. 7:30 నుంచి ) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటారు
సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’. బ్రహ్మాజీ, సుదర్శన్ కీలక పాత్రలు చేశారు. వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 4న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రభాస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా సంతోష్ శోభన్ మాట్లాడుతూ– ‘‘కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు’’ అన్నారు. ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. ప్రారంభం నుంచి చివరి వరకు నవ్వుతూనే ఉంటారు’’ అన్నారు మేర్లపాక గాంధీ. ‘‘జాతిరత్నాలు’ తర్వాత అందరూ నన్ను చిట్టీ అని పిలుస్తున్నారు. ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ చూశాక నేను చేసిన వసుధ పాత్రే గుర్తుంటుంది’’ అన్నారు ఫరియా అబ్దుల్లా. ‘‘ఈ నెల 29న మా సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నాం’’ అన్నారు వెంకట్ బోయినపల్లి. నటులు బ్రహ్మాజీ, సుదర్శన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకటరత్నం పాల్గొన్నారు. -
నవ్వించేందుకు సిద్ధమవుతున్న ‘నటరత్నాలు’
సుదర్శన్, రంగస్థలం మహేష్, అర్జున్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘నటరత్నాలు’. నర్రా శివనాగు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇనయా సుల్తాన హీరోయిన్. మర్డర్ మిస్టరీ, క్రైం నేపథ్యంలో ఆద్యంతం వినోదభరితంగా సాగే చిత్రాన్ని ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డా. దివ్య నిర్మిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా క్రైం, థ్రిల్లర్, మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని దర్శకుడు నర్రా శివనాగు అన్నారు. టాకీ పార్ట్ పూర్తయిందని, పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని నిర్మాతలు డా. దివ్య, ఆనందాసు శ్రీ మణికంఠ తెలిపారు. త్వరలోనే మిగతా పార్ట్ షూటింగ్ అంతా కూడా పూర్తి చేసి అక్టోబర్ మొదటి వారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు చెప్పుకొచ్చారు. అర్చన, శృతిలయ, సుమన్ శెట్టి, టైగర్ శేషాద్రి, చంటి, అట్లూరి ప్రసాద్, ఖమ్మం సత్యానారాయణ, సీరియర్ దర్శకులు ఏఎస్ రవికుమార్ చౌదరి, సూర్య కిరణ్, ఎంఎన్ఆర్ చౌదరి, నల్లమల రంజిత్ కుమార్, ఖమ్మం రవి, షైనీ, శాటిలైట్ అమరేంద్ర, మాస్టర్ రిత్విక్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. -
చికెన్ ఖీమా దోసె.. తిన్నారంటే.. మామూలుగా ఉండదు మరి..
శ్రీకాకుళం (కంచిలి): చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి.. అటు తమిళనాడు నుంచి పైన పశి్చమ బెంగాల్ వరకు ఎన్నో రుచులను పరిచయం చేస్తూ ఉంటుంది. వాటిలో సిక్కోలుకూ స్థానముంది. ఈ దారిలో ఒక్కో ఊరూ దాటిన కొద్దీ ఒక్కో రుచి ఆవిష్కృతమవుతూ ఉంటుంది. ఒకవేళ ఇచ్ఛాపురం వైపుగా మీ బండి వెళ్తుంటే.. కంచిలి మండలం భైరిపురం జంక్షన్లో కమ్మటి సువాసనలతో దోసెలు మనసు దోచేలా ప్రయాణికులను పిలుస్తూ ఉంటాయి. ‘సుదర్శన్ టిఫిన్ సెంటర్’ పేరుతో ఉండే ఈ టిఫిన్ సెంటర్లో దోసె తినకపోతే హైవే జర్నీ సంపూర్ణం కానట్టే లెక్క. ఒకప్పుడు ఫైవ్‌స్టార్ హొటల్లో చెఫ్‌గా పనిచేసిన సుదర్శన్.. ఆ తర్వాత సొంత ఊరికి వచ్చి ఈ టిఫిన్ సెంటర్ పెట్టుకున్నారు. ఆ ఏముందిలే.. అన్ని ఊళ్లలోనూ ఉన్నవే కదా అనుకుంటే.. తప్పులో కాలేసినట్టే. అన్ని హొటళ్లలా ఉండకపోవడమే దీని స్పెషాలిటీ. జిల్లాలో చాలా హొటళల్లో దోసెలు దొరుకుతాయి. అన్నీ కలిపి లెక్కేస్తే ఓ ఆరు రకాలు కూడా ఉండవు. కానీ సుదర్శన్ మాత్రం తన హొటల్ లో రకరకాల దోసెల రుచి చూపిస్తారు. ఇప్పుడు అదే ప్రత్యేక ఆకర్షణ అయ్యింది. ఈ టిఫిన్ సెంటర్లో ప్రత్యేకతను గుర్తించిన వినియోగదారులు అటు బరంపురం, ఇచ్ఛాపురం నుంచి ఇటు కంచిలి, సోంపేటల వైపు నుంచి వచ్చి ఈ రుచుల్ని ఆస్వాదించడం నిత్యం కనిపిస్తుంది. రవ్వ దోసె, ఉల్లి దోసెతోపాటు పన్నీర్ దోసె, స్వీట్ కార్న్ దోసె, ఎగ్ ఖీమా దోసె, చికెన్ ఖీమా దోసె, సుదర్శన్ స్పెషల్ దోసెలు ఇక్కడ నోరూరిస్తాయి. రేటు కూడా మరీ ఎక్కువ కాదు. చికెన్ ఖీమా దోసె రూ.70 పెడితే వచ్చేస్తుంది. మిగతా దోసెలు కూడా రూ.40 నుంచి రూ.60 మధ్యలోనే ఉన్నాయి. అందుకే ఈ టిఫిన్ సెంటర్ ప్రయాణికులతో పాటు చుట్టుపక్కల వాసుల మనసు కూడా దోచింది. కస్టమర్ల సంతృప్తే ముఖ్యం నా టిఫిన్ సెంటర్‌కు వచ్చి తినే వినియోగదారుల సంతృప్తే నాకు దీవెనలు. ఫైవ్ స్టార్ హోటల్లో పనిచేసిన అనుభవంతో ఈ టిఫిన్ సెంటర్‌ను ప్రారంభించా. ఆ తరహాలో సౌకర్యాలు, రుచులతో నిర్వహించాలనే కోరికతో మాత్రమే నిర్వహిస్తున్నారు. లాభాపేక్ష నాకు లేదు. తక్కువ ధరలకే ఇలాంటి టిఫిన్స్‌ను అందించి, అందరి మన్ననలు అందుకోవడం నాకు కొండంత బలాన్నిస్తుంది. – సుదర్శన్, కుక్, టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు రుచులు అమోఘం నేతితో తయారు చేసే వివిధ రకాల దోసెలు ఇక్కడ టిఫిన్ సెంటర్లో స్పెషల్. వీటి రుచులు కూడా అమోఘంగా ఉన్నాయి. కాస్త దూరమైనా అంతా ఇక్కడికి వచ్చి టిఫిన్స్ చేస్తుంటాం. ఇక్కడ తయారు చేస్తున్న దోసెల రుచి ప్రత్యేకం. జిల్లాతోపాటు, వివిధ పట్టణాల్లో సైతం దోసెలు తిన్నా కూడా, ఇక్కడ లభ్యమయ్యేవి చాలా బాగుంటాయి. – రంగాల సుమన్, వినియోగదారుడు -
మొన్న ఆర్జీవీ.. ఇప్పుడు సుశాంత్.. యాంకర్‌పై ఆగ్రహం
Hero Sushanth Fire On Anchor: యంగ్ హీరో సుశాంత్ తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టాడు. 'మా నీళ్ల ట్యాంక్' అనే వెబ్ సిరీస్‌తో డిజిటల్ ప్లాట్ఫామ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ వెబ్ సిరీస్‌ను 'వరుడు కావలెను' ఫేమ్ లక్ష్మీ సౌజన్య డైరెక్ట్ చేశారు. ఈ సిరీస్‌లో ప్రియా ఆనంద్ హీరోయిన్గా నటించగా.. సుదర్శన్, ప్రేమ్ సాగర్, బిగ్‌బాస్ ఫేమ్ దివి, రామరాజు, అన్నపూర్ణమ్మ, నిరోషా, అప్పాజీ అంబరీష ముఖ్యపాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో జులై 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే దీనికి ముందు గురువారం (జులై 14) నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో యాంకర్‌పై హీరో సుశాంత్ ఫైర్ అయ్యాడు. 'సినిమాల్లేకపోతేనే సిరీస్‌లు చేయాలా? మంచి కథలు ఉన్నప్పుడు సినిమాలే కాదు.. వెబ్ సిరీస్‌లు కూడా చేస్తాను. మా నీళ్ల ట్యాంక్ వెబ్ సిరీస్‌లో మంచి కంటెంట్ ఉందా? లేదా? అనేది చూశాక మాట్లాడు' అంటూ యాంకర్‌పై అసహనం వ్యక్తం చేశాడు హీరో సుశాంత్. అయితే ఇదంతా నిజంగా కాదులేండి. ఈ సిరీస్ ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా హీరో సుశాంత్, నటుడు, కమెడియన్ సుదర్శన్ సరదాగా ఓ స్కిట్ చేశారు. ఇందులో సుశాంత్‌ను ఇంటర్వ్యూ చేసే యాంకర్‌గా స్టేజ్‌పైకి వచ్చి సందడి చేశాడు. ఈ క్రమంలో వెబ్ సిరీస్ గురించి సుశాంత్ చెబుతుంటే 'మనలో మన మాట సినిమాల్లేవా?' అని సుదర్శన్ ప్రశ్నించడంతో 'సినిమాల్లేకపోతేనే ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేయాలా? చూస్తేనే కదా ఇది ఎలా ఉందో తెలిసేది. చూడకుండా ఎలా మాట్లాడుతున్నావ్? కంటెంట్ ఉందో లేదో సిరీస్ చూస్తేనే తెలుస్తుంది' అని కోపంతో సమాధానమిచ్చాడు సుశాంత్. అయితే దీనికి సంబంధించిన వీడియోను సుశాంత్ ఇన్‌స్టా వేదికగా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ఆకట్టుకుంటుంది. కాగా ఇటీవల జరిగిన'లడ్కీ: ఎంటర్ ది డ్రాగన్ గర్ల్' ప్రీరిలీజ్ ఈవెంట్లో యాంకర్ శ్యామలపై సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఆర్జీవీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ బుధవారం (జులై 13) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించింది శ్యామల. మార్షల్ ఆర్ట్స్ బేస్డ్ మూవీ కాబట్టి ఓ గేమ్ ఆడదామని అడిగింది. ఇప్పటివరకూ ఇతర భాషల్లో వచ్చిన మార్షల్ ఆర్ట్స్ సినిమాలను తెలుగులో చెప్తాను, ఆ సినిమా టైటిల్ ఏంటో కరెక్ట్‌గా గెస్ చేయాలంది. దీనికి వర్మ ఏమీ సమాధానమివ్వకుండా మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. చంపూ రశీదు సినిమా ఒరిజినల్ టైటిల్ ఏంటో చెప్పమని శ్యామల మొదటి ప్రశ్న అడిగింది. దీనికి వర్మ ఆ పేరెప్పుడూ వినలేదే అని తల గోక్కున్నాడు. దీంతో శ్యామల కిల్ బిల్ అని ఆన్సరిస్తూ నవ్వేసింది. ఇది జోకా? అని ఓ చూపు చూసిన వర్మ.. ప్రస్తుతం నేను ఎమోషనల్‌గా ఉన్నాను. ఇది సీరియస్ సినిమా. ఇలాంటి జోకులు వద్దు అంటూ స్టేజీపై నుంచి విసురుగా వెళ్లిపోయాడు. దీంతో శ్యామల.. ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే సారీ అంటూ క్షమాపణలు చెప్పింది. View this post on Instagram A post shared by Sushanth A (@iamsushanth) -
సన్నీ-కాజల్ రిలేషన్‌పై నోరు జారిన సుదర్శన్.. వీడియోతో క్లారిటీ
Comedian Sudharshan Says Sorry To Sunny And Kajal Fans: బిగ్‌బాస్ రియాలిటీ షోలో వీకెండ్ ఎపిసోడ్స్ మరింత స్పెషల్‌గా ఉంటాయన్నది తెలిసిందే. సండే(నవంబర్21)ఫండేగా సాగిన ఎపిసోడ్లో 'అనుభవించు రాజా' టీం సందడి చేసింది. హీరోహీరోయిన్లు రాజ్ తరుణ్, కౌశిష్, నటుడు నెల్లూరు సుదర్శన్ కాసేపు హౌస్‌మేట్స్‌తో చిట్‌చాట్ చేసి అందరినీ సరదాగా నవ్వించారు. అయితే అంతవరకు బాగానే ఉన్నా కాజల్-సన్నీల రిలేషన్‌ను తప్పుబడుతూ సుదర్శన్ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరి గేమ్‌పై అప్పటివరకు సరదాగా పంచులేసిన సుదర్శన్..'చివర్లో కాజల్ మీరు అలిగినప్పుడు చాలా బాగుంటుంది. సన్నీ వచ్చి ఓదార్చడం..అదో టైప్ రొమాన్స్ బాగుంది'.. అంటూ నోరుజారాడు. దీంతో షాక్ అయిన సన్నీ.. మాది బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే సన్నీ-కాజల్‌ల రిలేషన్‌పై తప్పుగా మాట్లాడినందుకు కమెడియన్ సుదర్శన్‌ను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఫ్రెండ్స్‌లా ఉన్న వాళ్లు మీకు రొమాన్స్ చేస్తూ ఎప్పుడు కనిపించారు? అయినా సినిమా ప్రమోషన్స్‌కి వచ్చి ఇలాంటి చీప్ కామెంట్స్ చేయడం సన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తప్పు తెలుసుకున్న సుదర్శన్ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాడు. 'మేం చాలా మాట్లాడుకున్నాం. కానీ ఎడిటింగ్ వల్ల కేవలం 5నిమిషాలే చూపించారు. కాజల్-సన్నీ రిలేషన్ గురించి తప్పుగా మాట్లాడే ఉద్దేశం నాకు లేదు. బయటకు వచ్చిన వీడియో వల్ల నెగిటివ్‌గా అనుకుంటున్నారు. సన్నీ ఫ్యాన్స్, కాజల్ ఫ్యామిలీకి క్షమాపణలు చెబుతున్నా' అంటూ వీడియో రిలీజ్ చేశాడు సుదర్శన్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
ఒప్పంద పత్రం
తెల్లవారుఝాము నాలుగు కావస్తోంది. ఊరంతా లేచి వ్యవసాయ పనుల్లో తలదూర్చడానికి సమాయత్తమవుతోంది. ఇంతలో రాంసింగ్ ఇంట్లో నుండి ఏడ్పులు, పెడబొబ్బలు వినరావడంతో జనమంతా అటువైపు పరుగులు తీశారు. రాంసింగ్ నేల మీద నిద్ర పోతున్నట్లు పడిపోయి ఉన్నాడు. అతని గుండెలమీద తల వాల్చి అడ్డంగా అచేతనంగా పడివుంది అతని అర్ధాంగి జానకమ్మ. బహుశా రాత్రి నిద్దట్లోనే ఇద్దరి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి పోయి ఉంటాయని.. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం వెలిబుచ్చసాగారు. అక్కడి దృశ్యం చూస్తుంటే రాంసింగ్ చనిపోగానే, జానకమ్మ గుండె హఠాత్తుగా ఆగిపోయి ఉండవచ్చనే నిర్ణయం అందరిలో బలపడింది. మద్దనపల్లి గిరిజన తాండా. రాంసింగ్ ఊళ్ళో ఎవరికీ ఎలాంటి కష్టమొచ్చినా ఆదుకుంటాడు. రాంసింగ్, జానకమ్మలకు ఒక కుమారుడు ధరంసింగ్. ఒక కూతురు యమునాబాయి. ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు చేస్తూ హైదరాబాదులో స్థిరపడ్డారు. ఆ రోజు తాండా వాసులంతా పనులకు స్వస్తి చెప్పి రాంసింగ్ పిల్లలు వచ్చే వరకు వాళ్ళ వంశానుసారం అంతిమ సంస్కారానికి అన్ని ఏర్పాట్లు చెయ్యాలని చేయీ, చేయీ కలుపసాగారు. తాండాకు ఉత్తరాన శ్మశానవాటికలో ఖననం చేయడానికి వీలుగా రెండు గోతులు ప్రక్క, ప్రక్కనే తవ్వించారు. ధరంసింగ్, యమునాబాయి కలిసి కారులో మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో వచ్చారు. రాంసింగ్ దంపతుల అంతిమ సంస్కారం ముగిసే సరికి సాయంత్రం దాదాపు ఆరయ్యింది. ధరంసింగ్, యమునాబాయిలను ఓదార్చుతూ మరో గంట సేపు గడిపి అంతా వెళ్లి పోయారు. ధరంసింగ్ మనసు శూన్యమయ్యింది. తల్లిదండ్రులిద్దరూ ఒకేసారి పరమపదించడం జీర్ణించుకోలేక పోతున్నాడు. అదే విషయం చెల్లెలు యమునాబాయితో చాలా సేపు చర్చించాడు. రాత్రంతా ఉన్న ఒక్క చెక్క బీరువా సర్దుతూ ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని ఆశగా వెదికాడు. ఆమధ్య తనతో సంప్రదించి ఎస్టీ కార్పోరేషన్ బ్యాంకులో అప్పు తీసుకుని కొన్న ట్రాక్టరు కాగితాలు ఒక నల్లని హ్యాండు బ్యాగులో ఉన్నాయి. అవి తప్ప మరేవీ లేవు. ‘ట్రాక్టరు అమ్మేశానన్నాడే..కాగితాలన్నీ కొన్నవాడు తీసుకోలేదా..’ అని ఆలోచిస్తూ మంచం మీద నడుం వాల్చాడు ధరంసింగ్. ఆ మరునాడు ఉదయమే తన అనుమానం తీరక మళ్ళీ నల్లబ్యాగు తెరచి చూశాడు ధరంసింగ్. అందులో ఒక రహస్యపు అర వుంది. దాని జిప్ లాగి చూడగానే.. ట్రాక్టరు దేవదాసుకు అమ్మి కుదుర్చుకున్న ఒప్పంద పత్రం కనబడింది. అందులో దేవదాసు ఒక లక్ష రూపాయలు నగదు అడ్వాన్సుగా ఇచ్చినట్లు, మిగతా కిస్తులు తాను కట్టుకునే విధంగా రాసి వుంది. అయితే కిస్తులన్నీ కట్టడం పూర్తయ్యాక కాగితాలు తీసుకునే వాడేమో! అనుకున్నాడు. కాని రెండు కిస్తులు కట్టనట్లు బ్యాంకు నుంచి వచ్చిన నోటీస్ ఉంది. కిస్తులు కట్టుకుంటానన్న దేవదాసు ఎందుకు కట్టలేదు. ఇందులో ఏమైనా తిరకాసు వుందా? అని ఆలోచించసాగాడు. కిస్తులు కట్టకుంటే ఒప్పందపత్రం ప్రకారం నలుగురు పెద్దమనుషుల ముందు అడిగించే ధైర్యం నాన్న చేస్తాడే తప్ప ఇలా మనోవేదనతో గుండె ఆగి మరణించడం నమ్మబుద్ధి కావడం లేదు. వెంటనే యమునాబాయికి చెప్పి ములుగు బయలుదేరాడు. నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్ళాడు ధరంసింగ్. ధరంసింగ్‌ను చూసి హడావుడిగా బయటకు వెళ్ళబోతున్న పోలీసు ఇన్స్పెక్టర్ విజయశేఖర్ ఆగిపోయాడు. ‘‘సర్..నా పేరు ధరంసింగ్. మీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను’’ అంటూ రెండు చేతులు కట్టుకుని వినయంగా అన్నాడు ధరంసింగ్. ‘‘చెప్పండి’’ అన్నాడు ఇన్స్పెక్టర్. ‘‘సర్..మాది మద్దనపల్లి. మా నాన్న పేరు రాంసింగ్. మా అమ్మ పేరు జానకమ్మ. నిన్న రాత్రి హఠాత్తుగా ఇద్దరూ చనిపోయారు’’ అంటూ కన్నీళ్లు పెట్టుకోసాగాడు ధరంసింగ్. ‘‘సారీ ధరంసింగ్.. ఆ వార్త విని నేనూ బాధపడ్డాను. మీ నాన్న నాకు బాగా తెలుసు. చాలా అమాయకుడు’’ ‘‘అవును సార్. నాన్న అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఎవరైనా మోసం చేశారా అనే అనుమానం వుంది’’ అంటూ కర్చీఫ్‌తో కళ్ళుతుడుచుకోసాగాడు. ‘‘మోసమా! ఈ మధ్య మీ నాన్న ఏమైనా లావాదేవీలు చేశాడా?’’ ‘‘ఒక ట్రాక్టరు బ్యాంకు లోనుతో కొన్నాడు సర్. దాన్ని దేవదాసుకు అమ్మాడు. అతను మిగతా కిస్తులు కట్టుకుంటానని ఒప్పందపత్రం రాసిచ్చాడు. రెండు కిస్తుల తరువాత మరో రెండు కిస్తులు కట్టలేదు. బ్యాంకు నోటీసు వచ్చింది. ఆ కోణంలో ఆలోచించి మీ దగ్గరకు వచ్చాను’’ ‘‘అంటే దేవదాసు మీద అనుమానమున్నదా?’’ అంటూ అడిగాడు విజయశేఖర్. ‘‘అవును సర్. వారిది సహజ మరణం కాదేమోనని అనుమానంగా వుంది’’ ‘‘అయితే శవాలను పోస్ట్‌మార్టం చేస్తే గాని విషయం బయటపడదు. అప్పుడే కేసు పరిశోధనకు వీలవుతుంది. పోస్ట్‌మార్టం చెయ్యాలంటే నువ్వు కంప్లైంట్ ఇవాల్సి ఉంటుంది’’ అంటూ టేబుల్ పై ఉన్న బెల్ కొట్టి ఒక రైటర్ రమణయ్యను పిలిచాడు. పోలీసు ఫార్మాలిటీస్ పూర్తీ కాగానే ధరంసింగ్‌ను, మరో ఇద్దరు కానిస్టేబుల్స్‌ను ఇంకా పోలీసు డిపార్ట్మెంటు ఫోటోగ్రాఫర్‌ను తీసుకుని జీపులో మద్దనపల్లి తాండాకు బయలుదేరాడు విజయశేఖర్. పోలీసులు వచ్చారని తెలియగానే తాండా అంతా అట్టుడికి పోయింది. గ్రామ సర్పంచ్ బిక్కు బిక్కు మంటూ శ్మశాన గడ్డకు పరుగులు తీశాడు. కాసేపట్లోనే తహసిల్దారూ వచ్చాడు. ఇన్స్పెక్టర్ ఆదేశాలతో శవాలను బయటికి తీయడం, పంచనామా జరపడం, పోస్ట్‌మార్టం కోసం ములుగు హాస్పిటల్‌కు తరలించడం జరిగింది. మరునాడు ఉదయం ధరంసింగ్ పోలీసు స్టేషన్లో అడుగు పెట్టగానే విజయశేఖర్ పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ అప్పుడే చదవడం పూర్తి చేశాడు. ‘‘ధరంసింగ్.. నీ అనుమానం నిజమేనని తేలింది’’ అన్నాడు విజయశేఖర్. ధరంసింగ్ విస్తుపోయి చూస్తూండగా ‘‘మీ పేరంట్స్ది సహజమరణం కాదు. ఆత్మహత్యా కాదు. హత్య. వాళ్ళ మీద పొటాషియం సైనైడ్ విషప్రయోగం జరిగింది’’ అనగానే కుప్ప కూలిపోయాడు ధరంసింగ్. కానిస్టేబుల్ ఓబయ్య గబుక్కున గ్లాసుతో మంచినీళ్ళు తీసుకువచ్చి, ధరంసింగ్ ముఖం మీద చిలకరించాడు. ‘‘నువ్వు ధైర్యంగా ఉండు. హంతకులను పట్టుకుని శిక్ష వేయించే పూచీ నాది’’ అంటూ ధరంసింగ్‌ను ఓదార్చాడు విజయశేఖర్. ‘ఈ హత్యలు చేసిన వాణ్ణి పట్టుకోవాలంటే ముందుగా సైనైడ్ విషయం తేలాలి’ అంటూ కొద్ది సేపు ఆలోచించి ‘‘పద వెళ్దాం..’’ అంటూ లేచి జీపు తీయమంటూ డ్రైవర్‌ను ఆదేశించాడు విజయశేఖర్. ములుగులో ఉన్నది ఒకే ఒక కాశీనాథం కంసాలి షాపు. అందులో కస్టమర్ల అభిరుచి మేరకు బంగారు నగలు వర్కర్లతో తయారు చేయించడం, అమ్మడం కాశీనాథం వ్యాపారం. సైనైడ్ అతని షాపులో తప్ప మరో చోట దొరకడం అసాధ్యం. నేరుగా కాశీనాథం షాపు ముందు ఆగింది పోలీసు జీపు. ‘‘నమస్కారం సర్. రండి.. రండి..’’ అంటూ రెండుచేతులా నమస్కరిస్తూ ఆహ్వానించాడు కాశీనాథం. ‘‘మీతో ఒక ముఖమైన కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందామని వచ్చాను’’ అంటూ విజయశేఖర్ తనకు కావాల్సిన విషయం అడిగాడు. ‘‘అలాగే సర్..’’ అంటూ లోపలి గదిలోకి ఇద్దరినీ తీసుకెళ్ళాడు. సీసీ కెమెరాలో గతవారం రికార్డయిన దృశ్యాలపై దృష్టి సారించాడు విజయశేఖర్. రెండు రోజుల క్రితం తాలూకు దృశ్యాలలో ఒకతను సైనైడ్ దొంగిలిస్తున్నాడు. ‘‘నగలు దొంగతనం చెయ్యడం రివాజు. కాని వీడేమో సైనైడ్ దొంగిలించడం.. చావడానికా సర్..’’ అంటూ వ్యంగ్యంగా అడిగాడు కాశీనాథం. ‘‘చావడానికి కాదు చంపడానికి. అయినా అత్యంత భద్రంగా దాచాల్సింది అంత నిర్లక్ష్యంగా ఎందుకు బయట పెట్టావు?’’ అంటూ చిరుకోపం ప్రదర్శించాడు. ‘‘వాణ్ణి గుర్తుపట్టగలవా?’’ అంటూ ప్రశ్నించాడు . ‘‘మన ఊరి వాడే సర్. దేవదాసు..’’ ‘‘అతనే సర్.. ’’ అంటూ ధరంసింగ్ చిన్నగా కేక వేసినంత పని చేశాడు. విజయశేఖర్ ఆదేశం మేరకు దాన్ని కాపీ చేసిచ్చాడు కాశీనాథం. వీడియో కాపీని తీసుకొని స్టేషన్‌కు బయలుదేరారు. స్టేషన్లోకి అడుగు పెడ్తూనే కానిస్టేబుల్ ఓబయ్యను పిలిచి దేవదాసును అర్జంటుగా తీసుకు రమ్మని హుకుం జారీ చేశాడు విజయశేఖర్. ధరంసింగ్ ఇచ్చిన చిరునామాతో ఓబయ్యకు దేవదాసు ఇల్లు కనుక్కోవడంలో పెద్ద కష్టమేమీ కాలేదు. నెమ్మదిగా వెళ్ళి తలుపు తట్టాలనుకున్నాడు ఓబయ్య. ఇంతలో ఎవరో ట్రాక్టరు గురించి లోన మాట్లాడుకోవడం వినరావడంతో నెమ్మదిగా కిటికీ పక్కకు వెళ్ళాడు. హాల్లో నుంచి వాళ్ళ మాటలు స్పష్టంగా వినవస్తున్నాయి. వెంటనే వారి మాటలను తన దగ్గరి సెల్‌ఫోన్‌తో రికార్డు చెయ్యసాగాడు. వారి సంభాషణ ఆగిపోయింది. వారు బయటికి వస్తున్నట్లు గమనించి చటుక్కున తిరిగి వీధిలో పడ్డాడు ఓబయ్య. వెళ్తున్నది బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్. ఓబయ్యకు బాగా తెలుసు. అప్పులు కావాలంటే ఆతనే శరణ్యం. ఆతను వెళ్ళిపోయేదాకా చూసి దేవదాసు ఇంటి తలుపు తట్టాడు ఓబయ్య. కానిస్టేబుల్‌ను చూడగానే కంగు తిన్నాడు దేవదాసు. ‘‘ఎస్సైగారు మిమ్మల్ని అర్జంటుగా తీసుకురమ్మన్నారు’’ అని చెప్పాడు. ‘‘ఎందుకు?’’ గంభీరంగా అడిగాడు దేవదాసు. లోలోన భయమనిపించినా బయటకు కనపడకుండా– ‘‘నాకేం తెలుసు సర్. పెద్దల వ్యవహారం’’ నింపాదిగా సమాధానిమిచ్చాడు ఓబయ్య. ‘‘సరే..బట్టలు మార్చుకుని వస్తాను’’ అంటూ లోనికి వెళ్ళాడు దేవదాసు. ఇద్దరూ పోలీసు స్టేషన్ చేరుకున్నారు. అక్కడి వాతావరణం చూసే సరికి దేవదాసుకు ఒంట్లో వణుకు పుట్టింది. పోలీసుస్టేషన్ హాల్లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయబడి వుంది. ఓబయ్య నేరుగా విజయశేఖర్ దగ్గరికి వెళ్లి తాను రికార్డు చేసిన విషయం వినమని తన సెల్‌ఫోన్ ఇచ్చాడు. అది వినగానే విజయశేఖర్లో మరింత ఉత్సాహం పెల్లుబికింది. దేవదాసును తన గదిలోకి తీసుకెళ్ళాడు. అతడి గుండె వేగం తగ్గింది. అయినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ. ‘‘సర్.. ఎందుకో పిలిచారట’’ అన్నాడు రెండు చేతులతో నమస్కరిస్తూ. ‘‘అతను రాంసింగ్ కొడుకు ధరంసింగ్. రాంసింగ్ దంపతులు చనిపోవదానికి నువ్వే కారణమని నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు..’’ అంటూ బయట నిలబడ్డ ధరంసింగ్‌ను చూపించాడు విజయశేఖర్. ‘‘నాకేమీ తెలియదు సర్. దేవుని మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నాకు ఎలాంటి సంబంధం లేదు’’ అంటూ దేవదాసు భయం, భయంగా అన్నాడు. ‘‘చూడు దేవదాసు. అనవసరంగా నా లాఠీకి పని చెప్పకు. నా దగ్గర ఆధారాలన్నీ ఉన్నాయి. నిజం చెప్పలేదనుకో లాఠీ దెబ్బలు రుచి చూడాల్సి వస్తుంది’’ అంటూ గద్దించాడు విజయశేఖర్. దేవదాసు మెడపై చెయ్యి వేసి హాల్లోకి తోశాడు. ‘‘అటు చూడు’’ అంటూ గద్దిస్తూ కాశీనాథం షాపులో రికార్డు అయిన క్లిప్పింగులు తెరపై ప్రదర్శించమని రమణయ్యను ఆదేశించాడు. అందులో సైనైడ్ తస్కరిస్తున్నట్లు కనబడేసరికి కనుగుడ్లు తేలేశాడు దేవదాసు. ‘‘సైనైడ్ రాంసింగ్ దంపతుల మీద ప్రయోగించావు. ఇదిగో పోస్ట్‌మార్టం రిపోర్ట్స్’’ అంటూ దేవదాసు ముఖమ్మీద టప టపలాడించి విలేఖరుల ముందుంచాడు విజయశేఖర్. ‘‘నాకేం అవసరం సర్. వాళ్ళనెందుకు చంపుతాను’’ బింకంగా అన్నాడు దేవదాసు. ‘‘ఎందుకా..ఇది విను’’ అంటూ ఓబయ్య వంక చూశాడు విజయశేఖర్. దేవదాసు ఇంటికి వెళ్ళినప్పుడు తాను బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్‌ను చూసిన విషయం చెబుతూ సెల్‌ఫోన్ స్పీకర్ ఆన్ చేశాడు ఓబయ్య. ‘‘దేవదాసూ, చిన్న పొరబాటు చేశావు. రాంసింగ్‌కు రాసిచ్చిన ఒప్పందపత్రం తీసుకోవాల్సింది’’ ‘‘దాని సంగతి వదిలేయండి సార్. ధరంసింగ్ నుండి ఎలాగోలా నేను సంపాదిస్తాను కాని ముందుగా ఈ విషయం చెప్పండి, రాంసింగ్ పోయాడు కదా... ఇక కిస్తులు కట్టాల్సిన పనిలేదు కదా!’’ ‘‘కాని డెత్ సర్టిఫికేట్ తీసుకుని ఇన్సూరెన్స్ వాళ్లకు సబ్మిట్ చెయ్యాలి. వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వాలి. మా బ్యాంకుకు ఒక కాపీ వస్తుంది. కొంత సమయం పడ్తుంది’’ ‘‘సమయం పట్టనివ్వండి. కిస్తులు కట్టాల్సిన అవసరం లేదని నాకు తెలుసు గాని..ఆమాట మీ నోట వినాలని..’’ ‘‘కిస్తులు కట్టాల్సిన అవసరం లేదు..’’ ‘‘అయితే రాత్రికి పార్టీ ఇస్తాను. ఘనంగా బక్షీసు ఇస్తాను. మనవారందరినీ తీసుకుని రావాలి’’ ఓబయ్య సెల్‌ఫోన్ ఆగి పోయింది. ‘‘ఇప్పటికైనా వాస్తవం ఒప్పుకో.. లేకుంటే..’’ అంటూ వీరావేశంతో లాఠీ ఝళిపించాడు విజయశేఖర్. దేవదాసుకు నోరు విప్పక తప్పలేదు. ‘‘సర్..నిజం చెబుతాను’’ అంటూ తాను చేసిన నిర్వాకం వివరించసాగాడు.... ‘‘రాంసింగ్‌తో నమ్మకంగా మెలిగేవాణ్ణి. లక్ష రూపాయలిచ్చి ట్రాక్టర్ తీసుకున్నాను. మిగతా కిస్తులన్నీ నేనే కట్టుకుంటానని ఒప్పంద పత్రం రాసి ఇచ్చాను. రెండు కిస్తులు సకాలంలో కట్టాను. ఆతరువాత డబ్బులకు ఇబ్బంది వచ్చింది. బాగా ఆలోచించాను. ట్రాక్టరు ఇంకా నా పేరు మీద బదిలీ కాలేదు. రాంసింగ్ ఇన్సూరెన్స్ చేశాడు కనుక అతడు చనిపోతే కిస్తులు కట్టాల్సిన అవసరం ఉండదని ప్లాను వేశాను. ఎవరికీ అనుమానం రాకుండా సైనైడ్ తస్కరించాను. దాన్ని విస్కీలో కలుపుకొని వారి ఇంటికి వెళ్లాను. తాండా అంతా నిర్మానుష్యంగా ఉంది. మూడు గ్లాసుల్లో విస్కీ నీళ్ళు కలిపి వారికి ఇచ్చాను. నేను తాగుతున్నట్లు నటించాను. వాళ్ళు క్షణాల్లో చనిపోయారు. ఎవరికీ అనుమానం రాకుండా మందు బాటిల్ గ్లాసులు అన్నీ సర్దుకుని బయటపడ్డాను’’ అంటూ భోరుమన్నాడు దేవదాసు. ధరంసింగ్ ఆవేశంగా లేచి దేవదాసును కొట్టబోయాడు. ఓబయ్య అడ్డుకున్నాడు. ‘తగిన శాస్తి నేను చేస్తాగా’ అన్నట్టు ధరంసింగ్ వంక చూశాడు ఇన్స్పెక్టర్ విజయశేఖర్. -
ఎడారి దేశంలో కుమిలిన ‘కమల’
కమ్మర్పల్లి (బాల్కొండ): ఉపాధి నిమిత్తం విదేశానికి వెళ్లి అష్టకష్టాల పాలైన ఓ మహిళా ఎంపీ చొరవతో స్వదేశానికి చేరుకుంది. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం చౌట్పల్లికి చెందిన కమల, సుదర్శన్ దంపతులు. సుదర్శన్ తాగుడుకు బానిసవడం.. రోజురోజుకు కుటుంబ పోషణ భారమవడం.. ఈ క్రమంలో రూ.3 లక్షల దాకా అప్పులయ్యాయి. వీటిని తీర్చడానికి సుదర్శన్‌కు ప్రత్యామ్నాయ మార్గం కనిపించకపోవడంతో భార్యను ఉపాధి నిమిత్తం ఒమన్ దేశంలోని మస్కట్‌కు పంపించాడు. అక్కడ అరబ్‌షేక్ ఇంట్లో భాష సమస్య, 24 గంటల పనితో నరకయాతన అనుభవించింది. చేసిన పనులకు ఏదో వంకలు పెట్టి తీవ్రంగా హింసించేవారు. ఈ విషయాన్ని ఏజెంట్ రాజు, భర్త సుదర్శన్‌కు సమాచారం చేరవేసింది. పైసలు కావాలంటే బాగా కష్టపడాలని ఏజెంట్ ఉచిత సలహా ఇవ్వడంతో ఆమె షేక్ పెట్టిన కష్టాలను భరించి పని చేసింది. చివరకు వేధింపులకు తాళలేక తాను ఇక్కడ పని చేయనని కుటుంబ సభ్యులకు (భర్తకు కాదు) ఫోన్లో తెలిపింది. మస్కట్‌లో పడుతున్న కష్టాలను వివరించింది. ఇక్కడి నుంచి ఎలాగైన రప్పించాలని వేడుకుంది. కమల ఆవేదనను అర్థం చేసుకున్న సమీప బంధువులు స్పందించి అక్కడి, ఇక్కడి ఏజెంట్లతో మాట్లాడి రూ.70 వేలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. కానీ వారూ నమ్మించి మోసం చేశారు. దీంతో కమల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే.. కమల దీనస్థితిని ఆమె సమీప బంధువు వెంకటేశ్ ఎంపీ కవిత దృష్టికి తీసుకెళ్లాడు. స్పందించిన కవిత అక్కడి రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడి కమలను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకున్నారు. రెండు రోజుల క్రితం కమల స్వదేశం చేరుకుంది. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులు భూమయ్య, లక్ష్మితో కలసి చౌట్పల్లిలోనే ఉంటోంది. కవితమ్మకు రుణపడి ఉంటా: కమల ఉపాధి నిమిత్తం మస్కట్ వెళ్లిన తాను అక్కడి కష్టాలను తట్టుకొని మళ్లీ చౌట్పల్లి చూస్తాననుకోలేదు. అక్కడ పడిన కష్టం జన్మలో చూడలేదు. 6 గంటలే పని అని చెప్పి రోజంతా పని చేయించుకున్నారు. పని సరిగ్గా చేయకపోతే దెబ్బలు కొట్టారు. తినడానికి సరిగ్గా తిండి, తాగడానికి నీళ్లు కూడా సరిగ్గా ఇవ్వలేదు. పని కారణంగా నీరసపడితే విశ్రాంతి తీసుకోనివ్వలేదు. ఆరోగ్యం బాగా లేకున్నా పని చేయించుకున్నారు. ఇక్కడే నా చావు రాసి పెట్టింది ఉం దనుకున్నా. అదృష్టం కొద్దీ ఎంపీ కవితమ్మ కృషితో ఇక్కడికి వచ్చాను. ఆమెకు జీవితాంతం రుణపడి ఉంటా. -
వైద్యుల నిర్లక్ష్యానికి నిండు గర్భిణి బలి
► తప్పు కప్పిపుచ్చేందుకు వైద్యులయత్నాలు ► మరణించిన గంటన్నర తర్వాత పెద్దాసుపత్రికి రెఫర్ జైనూర్(ఆసిఫాబాద్): వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండు గర్భిణి బలైంది. పురిటి నొప్పులు, వాంతులతో బాధపడుతూ చికి త్స కోసం ఆస్పత్రికి వచ్చిన గిరిజన గర్భిణి గంటసేపు నరక యాతన అనుభవించింది. చేసిన తప్పును కప్పిపుచ్చేందుకు వైద్యులు సవాలక్ష ప్రయత్నాలు చేశారు. గర్భిణి మరణించిన గంట సేపు తర్వాత మరో ఆస్పత్రికి రెఫర్ చేశారు. మృతి చెందిన తర్వాత ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించినా.. తమ నిర్వాకం బహిర్గతం కాకుండా ఉండేందుకు డెత్ సర్టిఫి కెట్ అవసరం ఉంటుందని మెప్పించినట్లు బాధిత కుటుంబీ కులు తెలిపారు. జైనూర్ మండల కేంద్రం రాంనగర్‌కు చెం దిన ఆత్రం అరుణకు పురిటినొప్పులు రావడంతో శనివారం జైనూర్ ఆస్పత్రి తీసుకెళ్లారు. ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో ఆమె భర్త సుదర్శన్ డాకర్ట్స్ క్వార్టర్స్‌కు వెళ్లి విషయం చెప్పారు. గంటసేపు తర్వాత వచ్చి న వైద్యుడు రెండు ఇంజక్షన్లు ఇచ్చాడు. అప్పటికే పరిస్థితి విషమించడంతో అరుణ కొద్ది సేపటికే కన్నుమూసింది. మర ణించిన గంట తర్వాత అరుణను అవ్వాల్ అంబులెన్స్‌లో ఉట్నూర్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. శవాన్ని ఉట్నూర్ ఎందుకు పంపిస్తున్నారని వైద్యులను నిలదీయగా ..డెత్ సర్టిపికెట్ కోసం ఉట్నూర్ వెళ్లాల్సిందేనని చెప్పినట్లు సుదర్శన్ వివరిం చాడు. అయితే, అంబులెన్స్‌లో ఉట్నూర్ వెళ్లగా అప్పటికే ఫోన్ మాట్లాడుకున్న ఉట్నూర్ ఆస్పత్రి వైద్యుడు వాహనం వద్దకే వచ్చి శ్వాస ఆడక మృతి చెందిందని చెప్పి తిరిగి పంపించినట్లు కుటుంబీకులు తెలిపారు. గైనకాలజిస్ట్ ఒపినియన్ కోసం పంపించాం అరుణ మరణించిన తర్వాత ఉట్నూర్ ఆస్పత్రికి పంపించిన విషయమై వైద్యుడు నరేశ్‌ను సంప్రదించగా, మృతికి గల కారణాలతో పాటు.. మరణించినట్లు ధ్రువీకరించేందుకు గైనకాలజిస్ట్ ఒపినియన్ కోసం పంపించానన్నారు. తాను వెంటనే చికిత్స ప్రారంబించానని ఎలాంటి నిర్లక్ష్యం చేయలేదని పేర్కొన్నారు. -
నిధుల దుర్వినియోగంపై విచారణ
► పూర్తిస్థాయి పరిశీలన అనంతరం చర్యలు ► డీపీవో సుదర్శన్ జూలపల్లి: వడ్కాపూర్ గ్రామ సర్పంచ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని కలెక్టర్‌కు వార్డు సభ్యులు ఈనెల 11న ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం జిల్లా పంచాయతీ అధికారి సుదర్శన్ పంచాయతీ కార్యాలయంలో విచారణ జరిపారు. వార్డు సభ్యుల తీర్మానం లేకుండానే పనులు చేస్తున్నారని, పంచాయతీలో వసూలైన ఇంటి పన్ను, నల్లా బిల్లు, నూతన నల్లా కనెక్షన్ల డబ్బులు, గ్రామంలో ప్రతి శుక్రవారం జరిగే అంగడిలో వసూలు చేస్తున్న డబ్బులు ఎస్టీవోలో జమ చేయకుండానే సొంతానికి వాడుకుంటున్నారని పేర్కొన్నారు. కాగా సర్పంచ్ కనకట్ల కళ గతంలో వార్డు సభ్యులకు రూ.5వేల చొప్పున ఇచ్చినట్లు, మరిన్ని డబ్బుల కోసమే వేధిస్తున్నారని డీపీవోకు రాసి ఇ చ్చారు. పంచాయతీ రికార్డులను స్వాదీనం చేసుకున్న డీపీవో పూర్తిస్థాయిలో పరిశీలన అనంతరం చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎంపీడీవో శ్రీనివాస్, ఈవోపీఆర్డీ విజయలక్ష్మి, సెక్రటరీ అంజ య్య, ఉప సర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
సుదర్శన్‌కు మూడు పతకాలు
వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ పి. సుదర్శన్ మెరిశాడు. ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో జరుగుతోన్న పోటీల్లో ఈ 93 ఏళ్ల క్రీడాకారుడు... మూడు పతకాలను కై వసం చేసుకున్నాడు. భారత్ తరఫున 90-95 వయోవిభాగంలో తలపడిన సుదర్శన్ షాట్‌పుట్ విభాగంలో పసిడి పతకాన్ని సాధించగా... జావెలిన్ త్రో, డిస్కస్ త్రో విభాగాల్లో రజత పతకాలను గెలుపొందాడు. మొత్తం ఈ చాంపియన్‌షిప్‌లో 92 దేశాలకు చెందిన 4000 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. -
మెడికోలకు రూ.4 లక్షల జరిమానా
- వీధికుక్కను వేధించిన కేసులో తీర్పు సాక్షి ప్రతినిధి, చెన్నై రోగులకు ప్రాణాలు పోసే వైద్యవృత్తిని అభ్యసిస్తున్న ఇద్దరు మెడికోలు వీధికుక్కపై రాక్షసంగా ప్రవర్తించిన ఫలితంగా రూ.4 లక్షలు జరిమానా చెల్లించుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై కున్రత్తూరుకు చెందిన సుదర్శన్, ఆశిష్ అనే ఇద్దరు వైద్య విద్యార్థులు ఒక వీధికుక్కను మూడో అంతస్తుపై నుంచి కిందకు విసిరివేశారు. ఈ వికృతచేష్టను మొబైల్లో చిత్రీకరించి ఆనందించారు. అంతేగాక ఈ దృశ్యాన్ని వాట్సాప్‌లో పెట్టి పలువురికి తమ ఘనతను చాటుకున్నారు. ఆరు నెలల క్రితం చోటుచేసుకున్న ఈ సంఘటన పెద్ద ఎత్తున కలకలం సృష్టించింది. జంతుసంక్షేమ సంఘం ప్రతినిధి ఆంథోనీ సదరు మెడికోలను గుర్తించి శిక్షించాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇద్దరు మెడికోలు శ్రీపెరంబుదూరు న్యాయస్థానంలో లొంగిపోయారు. వీరిద్దరినీ మెడికల్ కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. అదృష్టవశాత్తు తీవ్రగాయాలతో ప్రాణాపాయం నుంచి బైటపడిన కుక్కకు జంతుప్రేమికులు భద్ర అని పేరుపెట్టి అత్యున్నత చికిత్స అందజేశారు. కుక్క చికిత్సకు అయిన ఖర్చును, అపరాధం చెల్లించేలా మెడికోలను ఆదేశించాల్సిందిగా మద్రాసు హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. చెరి రూ.2 లక్షలను జంతు సంరక్షణ కేంద్రానికి చెల్లించాల్సిందిగా కోర్టు నియమించిన విచారణ బృందం మెడికోలను ఆదేశించింది. రూ.4 లక్షలను చెల్లించారు. దీంతో మెడికోల సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేసి అడ్మిషన్ కల్పించాల్సిందిగా వైద్యకళాశాల యాజమాన్యాన్ని హైకోర్టు సోమవారం ఆదేశించింది. -
షికారుకెళితే...
మహేశ్, సుదర్శన్, సురేశ్, ఇషికాసింగ్, ప్రియాంక నటీనటులుగా మాదాల కోటేశ్వర్రావు దర్శకత్వంలో మధు, అనీశ్, అభిరామ్ నిర్మించిన చిత్రం ‘కారులో షికారుకెళితే’. వచ్చే నెలలో విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శకుడు మాదాల కోటేశ్వర్ రావు మాట్లాడుతూ - ‘‘యువతను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన వినోదాత్మక చిత్రమిది. త్వరలో సెన్సార్ పూర్తవుతుంది. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: లక్కీ, ప్రదీప్ నామాని, కెమేరా: వేమూరి చంద్రశేఖర్, సంగీతం: మీనాక్షీ భుజంగ్.