నవ్వించేందుకు సిద్ధమవుతున్న ‘నటరత్నాలు’ | Nataratnalu Movie Latest Updates | Sakshi
Sakshi News home page

నవ్వించేందుకు సిద్ధమవుతున్న ‘నటరత్నాలు’

Published Wed, Jul 20 2022 6:06 PM | Last Updated on Wed, Jul 20 2022 6:06 PM

Nataratnalu Movie Latest Updates - Sakshi

సుదర్శన్, రంగస్థలం మహేష్, అర్జున్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘నటరత్నాలు’.  నర్రా శివనాగు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇనయా సుల్తాన హీరోయిన్‌.  మర్డర్ మిస్టరీ, క్రైం నేపథ్యంలో ఆద్యంతం వినోదభరితంగా సాగే చిత్రాన్ని ఎవరెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డా. దివ్య నిర్మిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా క్రైం, థ్రిల్లర్, మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని దర్శకుడు నర్రా శివనాగు అన్నారు.

టాకీ పార్ట్ పూర్తయిందని, పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని నిర్మాతలు డా. దివ్య, ఆనందాసు శ్రీ మణికంఠ తెలిపారు. త్వరలోనే మిగతా పార్ట్ షూటింగ్ అంతా కూడా పూర్తి చేసి అక్టోబర్‌ మొదటి వారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు చెప్పుకొచ్చారు. 

అర్చన, శృతిలయ, సుమన్ శెట్టి, టైగర్ శేషాద్రి, చంటి, అట్లూరి ప్రసాద్, ఖమ్మం సత్యానారాయణ, సీరియర్ దర్శకులు ఏఎస్ రవికుమార్ చౌదరి, సూర్య కిరణ్, ఎంఎన్ఆర్ చౌదరి, నల్లమల రంజిత్ కుమార్, ఖమ్మం రవి, షైనీ, శాటిలైట్ అమరేంద్ర, మాస్టర్ రిత్విక్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement