
తెలుగు చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత వి.మహేశ్ (85) గుండెపోటుతో చనిపోయారు. శనివారం రాత్రి చెన్నైలోని తన ఇంట్లోని బాత్రూమ్ నుంచి బయటకు వస్తూ కాలుజారి పడ్డారు. దీంతో దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు మహేశ్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.
(ఇదీ చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఆ యాక్షన్ సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)
1975లో 'మాతృమూర్తి' సినిమాతో వి.మహేష్ నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ 'మనుష్యులంతా ఒక్కటే', 'మహాపురుషుడు', చిరంజీవి 'సింహపురి సింహం', సుమన్ 'ముసుగు దొంగ' చిత్రాల్ని నిర్మించారు. మనుష్యులంతా ఒక్కటే సినిమాకు ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు అందుకున్నారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్‌లో ప్రసారమైన 'హరి భక్తుల కథలు' సీరియల్‌కి ప్రొడ్యూసర్, రైటర్‌గా పనిచేశారు.
నెల్లూరు జిల్లాలోని కొరుటూరు నిర్మాత మహేశ్ సొంతూరు. పెళ్లి చేసుకోకుండానే చివరివరకు ఉండిపోయారు. ఈయన అంత్యక్రియలు చెన్నైలో సోమవారం మధ్యాహ్నం జరుగుతాయని ఆయన మేనల్లుడు టెలివిజన్ నిర్మాత, దర్శకుడు వల్లభనేని మహీధర్ చెప్పారు.
(ఇదీ చదవండి: అనారోగ్య సమస్యలతో ప్రముఖ దర్శకుడు కన్నుమూత)
Comments
Please login to add a commentAdd a comment