పులివెందుల మహేశ్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘స్కూల్ లైఫ్’. సావిత్రీ కృష్ణ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నైనీషా, రాహుల్ త్రిశూల్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లోప్రారంభమైంది. ఈ మూవీ పూజా కార్యక్రమానికి హీరో కిరణ్ అబ్బవరం, డైరెక్టర్ వి. సముద్ర ముఖ్య అతిథులుగా హాజరై, యూనిట్‌కి అభినందనలు తెలిపారు. పులివెందుల మహేశ్ మాట్లాడుతూ– ‘‘స్కూల్ లైఫ్’ నా ఒక్కడిదే కాదు.
సినిమా మీద ఉన్న ఇష్టంతో పాటు కథ నచ్చి క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన డబ్బుతో పాటు నా ఇల్లు అమ్మి ఈ సినిమా తీస్తున్నాను. మా బడ్జెట్ సరిపోకపోవడంతో కథ నచ్చి, నన్ను నమ్మి సహకారం అందిస్తున్న నిర్మాత రాహుల్ త్రిశూల్‌గారికి కృతజ్ఞతలు’’ అన్నారు. రాహుల్ త్రిశూల్ మాట్లాడుతూ– ‘‘స్కూల్ లైఫ్’ రెగ్యులర్ షూటింగ్‌ని ఆగస్టు 2నప్రారంభించి సెప్టెంబర్ 2 వరకు సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ధర్మ ప్రభ, సంగీతం: హర్ష ప్రవీణ్.
Comments
Please login to add a commentAdd a comment