– పరుచూరి బ్రదర్స్
ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘మిస్టర్ సెలెబ్రిటీ’. చందిన రవికిశోర్ దర్శకత్వంలో చిన్న రెడ్డయ్య, ఎన్.పాండు రంగారావు నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్‌ను ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘మమ్మల్ని ఆదరించినట్టుగానే మా మనవడు సుదర్శన్‌ని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను.
రవికిశోర్ కొత్త దర్శకుడైనా సినిమాను బాగా తీశారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘నలభై ఏళ్లుగా మమ్మల్ని ఆదరిస్తూనే ఉన్నారు. రాజీపడకుండా నిర్మించిన నిర్మాతలను, అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడ్ని, తొలిసారి వెండితెరపై కనిపించనున్న మా మనవడ్ని ఆదరించి ఈ సినిమాకి విజయం చేకూర్చాలని కోరుకుంటున్నాను’’ అని పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment