ఏజెంట్ అగ్ని... తనకి ఏ మాత్రం భయం లేదు. ఉన్నదల్లా తెగువ మాత్రమే. ఆమె సాహసాల్ని చూడాలంటే అక్టోబర్ వరకూ వేచి చూడాలి. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘థాకడ్’. రజనీష్ రాజీ ఘయ్ దర్శకత్వం వహిస్తున్నారు. అగ్ని అనే గూఢచారి పాత్రలో కంగన కనిపిస్తారు. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో కనిపిస్తారామె. ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించి, కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘థాకడ్’ నా కెరీర్‌లో బెంచ్‌మార్క్ సినిమా అవుతుంది. భారీ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ఇది ప్రత్యేకంగా ఉండబోతోంది’’ అన్నారు కంగనా రనౌత్.
Comments
Please login to add a commentAdd a comment