Paruchuri venkateswara rao
-
మా మనవడ్ని ఆదరించాలని కోరుకుంటున్నాం
ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘మిస్టర్ సెలెబ్రిటీ’. చందిన రవికిశోర్ దర్శకత్వంలో చిన్న రెడ్డయ్య, ఎన్.పాండు రంగారావు నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్‌ను ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘మమ్మల్ని ఆదరించినట్టుగానే మా మనవడు సుదర్శన్‌ని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. రవికిశోర్ కొత్త దర్శకుడైనా సినిమాను బాగా తీశారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘నలభై ఏళ్లుగా మమ్మల్ని ఆదరిస్తూనే ఉన్నారు. రాజీపడకుండా నిర్మించిన నిర్మాతలను, అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడ్ని, తొలిసారి వెండితెరపై కనిపించనున్న మా మనవడ్ని ఆదరించి ఈ సినిమాకి విజయం చేకూర్చాలని కోరుకుంటున్నాను’’ అని పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు. -
నా వల్ల మా అన్నయ్య జైలుకు పోయేవాడు..
-
అన్నయ్య అందుకే అలా అయిపోయాడు: పరుచూరి గోపాలకృష్ణ
ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే కదా! వయోభారంతో కృంగిపోతున్న ఆయనకు ఏదో వ్యాధి సోకిందని, అందుకే ఇలా బక్కచిక్కిపోయాడంటూ ఏవేవో కథనాలు కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో పరుచూరి వెంకటేశ్వరరావుకు ఏమైందో తెలియజేస్తూ ఇటీవల ఓ వీడియో రిలీజ్ చేశాడు ఆయన బ్రదర్ పరుచూరి గోపాలకృష్ణ. 'అన్నయ్య బాగానే ఉన్నాడు. కాకపోతే 2017లో ఆస్ట్రేలియా వెళ్లి వచ్చినప్పుడు కొంత తేడా వచ్చింది. పరీక్షలు చేయించుకుంటే కొన్ని ఆహార నియమాలు పాటించమని చెప్పారు. ఆ తర్వాత ఆయన 10 కిలోలు తగ్గారు. ఈ రెండు సంవత్సరాలలో నేనూ 10 కిలోల బరువు తగ్గాను. కానీ ఆయన మేధస్సు అలాగే ఉంది. జుట్టుకు రంగు వేయకపోయేసరికి అలా ఉన్నాడు. ఆ ఫొటో షేర్ చేసిన జయంత్‌ను కూడా అడిగాను. ఎందుకయ్యా అలాంటి ఫొటో పెట్టావు, ఆయన ఎలా ఉన్నాడో మన కంటితో చూడొచ్చుగా అన్నాను. చిక్కిపోయాడు, జుట్టుకు రంగేసుకోలేదని ఇలా చాలామంది అన్నారు. ఒక్క వ్యక్తి మాత్రం 80 ఏళ్లు వచ్చాక ఇంకెలా ఉంటాడు? ఎందుకిలా మాట్లాడుతున్నారు? అని కరెక్ట్‌గా చెప్పాడు. వయసు మీదపడే కొద్దీ శరీర ధర్మాలు మారుతూ ఉంటాయి. అన్నయ్య క్షేమంగానే ఉన్నాడు' అని గోపాల కృష్ణ చెప్పుకొచ్చాడు. చదవండి: తెలుగులో ఎందుకు నటిస్తున్నావ్ అంటున్నారు -
షాకింగ్! పరుచూరి వెంకటేశ్వరరావు ఇలా అయిపోయారేంటి?
తెలుగు ఇండస్ట్రీలోని రచయితలలో పరుచూరి బ్రదర్స్‌ది ప్రత్యేక స్థానం. వీరు ఇండస్ట్రీలో వందలాది సినిమాలకు రచయితగా పనిచేశారు. ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను టాలీవుడ్‌కు అందించిన ఘనత వీరి సొంతం. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు అందరితోనూ కలిసి పని చేశారు. కొన్ని దశాబ్దాల పాటు సినీరంగంలో రచయితలుగా చక్రం తిప్పారు ఈ అన్నదమ్ములు. పరుచూరి బ్రదర్స్‌లో పెద్దవాడైన వెంకటేశ్వరరావు పలు సినిమాల్లో నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ సత్తా చాటారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పరుచూరి వెంకటేశ్వరరావు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. వయోభారంతో కృంగిపోతున్న ఆయనను ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాంజి కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫొటోను శుక్రవారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'నా గురువుగారు పరుచూరి వెంకటేశ్వరరావు ఇలా అయిపోవడం బాధగా ఉంది. కానీ ఆయన మానసిక స్థితి మాత్రం ఎప్పటిలాగే చురుకుగా ఉంది. పరుచూరి బ్రదర్స్ 300 పైచిలుకు సినిమాలకు రచయితగా పని చేయగా అందులో 200కు పైగా సినిమాలు బ్లాక్‌బస్టర్ విజయం సాధించాయి' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. బక్కచిక్కిపోయిన పరుచూరి వెంకటేశ్వరరావు లుక్‌ను చూసిన అభిమానులు గురువుగారు ఇలా అయిపోయారేంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Jayanth C. Paranjee (@jayanthparanji) చదవండి: దుమ్మురేపిన ప్రభాస్.. రికార్డు స్థాయిలో కలెక్షన్స్ -
డ్రగ్స్ అమ్మేవాళ్లను పట్టుకోవాలి... తీసుకునేవాళ్లను కరెక్ట్ చేయాలి
– డి. సురేశ్‌బాబు ఓ స్టంట్ మాస్టర్... ఇద్దరు నిర్మాతలు... ముగ్గురు యువ హీరోలు... నలుగురు దర్శకులు... మొత్తం పది మంది సినీ ప్రముఖులకు డ్రగ్స్ కేసులో తెలంగాణ ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసిందనే వార్త తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనూ, ప్రజల్లోనూ సంచలనమైంది. ఈ వార్తలపై తెలుగు సినిమా పెద్దలు స్పందించారు. డ్రగ్ కల్చర్‌ను ప్రోత్సహించేది లేదని స్పష్టం చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత డి. సురేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం, పోలీసులు ఎంతో సంయమనంతో వ్యవహరిస్తున్న తీరు అభినందనీయం. స్కూల్స్, ఐటీ కంపెనీలు, ప్రతిచోటా చాలా సెన్సిబుల్‌గా హ్యాండిల్ చేస్తున్నారు. సమస్యను సమూలంగా నిర్మూలించేందుకు కృషి చేస్తున్నారు. ముందు డ్రగ్స్ సప్లై చేసేవారిని పట్టుకోవాలి. తర్వాత డ్రగ్స్ తీసుకునేవాళ్లను కరెక్ట్ చేయాలి. మా ఇండస్ట్రీలోనూ అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే సరి చేయాలి. దీనికోసం అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తాం. మా తరఫున ఎలాంటి సహాయం చేయడానికైనా రెడీ’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘సమాజంలోనూ, చిత్ర పరిశ్రమలోనూ 0.001 శాతం మంది డ్రగ్స్‌కి బానిసలయ్యారనే వార్త విచారకరం. దాన్ని కూడా నిర్మూలించాలి. ప్రభుత్వ సూచనలను సీరియస్‌గా తీసుకోవాలి. అయితే... ఈ సమస్యను సెన్సేషన్ చేసి, వాళ్లనూ–వీళ్లనూ అరెస్ట్ చేసి, హడావిడి చేయకుండా ప్రభుత్వాధికారులు ఎంతో సెన్సిబుల్‌గా వ్యవహరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. చిత్ర పరిశ్రమలోని పది–పదిహేను మంది వల్ల సినిమా రంగం అంతటికీ చెడ్డ పేరొస్తుంది. దీనిపై వాళ్లంతా ఆలోచించుకోవాలి. తొలిసారి డ్రగ్స్‌ను టేస్ట్ చేయాలనుకుని, తర్వాత వాటికి బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అసలు డ్రగ్స్‌ను టేస్ట్ చేయకుండా ఉండడమే ఉత్తమం’’ అన్నారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ– ‘‘మంచి పనులు చేయడంలో తెలుగు చిత్రసీమ ఎప్పుడూ ముందుంటుంది. గతంలో ‘నీరు–మీరు’, ‘హుదూద్’, మొక్కలు నాటే కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు డ్రగ్స్ మహమ్మారిని తరిమేయాలని అనుకుంటున్నాం. తెలుగు చిత్రసీమలో ముప్ఫైవేలమంది కార్మికులున్నారు. వాళ్లలో 0.001 శాతం మంది డ్రగ్స్ వాడటం వల్ల ఆ ప్రభావం అందరి మీదా పడుతోంది. దీనికి పరిష్కార మార్గం ఆలోచించే ప్రయత్నంలో ఉన్నాం’’ అన్నారు. రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘మన సొసైటీలో సినిమా జనాల సంఖ్య చాలా తక్కువైనా... ఇండస్ట్రీ అంతా పర్ఫెక్ట్గా ఉండాలన్నది మా తాపత్రయం. అలాగే, ప్రజలు కూడా మన ఇంట్లో ఎవరూ డ్రగ్స్ తీసుకోవడం లేదు కదా.. పక్కింటి పిల్లలు తీసుకుంటే మనకేంటి? అని వదిలేయొద్దు. వాళ్లను మందలించండి. వాళ్ల పేరెంట్స్‌కి చెప్పండి. అందులో తప్పు లేదు. వాళ్లూ మన పిల్లలే అనుకుని, ముందడుగు వేస్తే సొసైటీ నుంచి డ్రగ్స్ మహమ్మారిని తరిమేయొచ్చు’’ అన్నారు. ‘మా’ సభ్యులు శ్రీకాంత్, ‘సీనియర్’ నరేశ్, ఏడిద రాజా పాల్గొన్నారు. ముంబయ్ టు హైదరాబాద్ వయా రేవ్ పార్టీస్! డ్రగ్ కల్చర్ రేవ్ పార్టీల ద్వారా ముంబయ్ నుంచి హైదరాబాద్ వచ్చిందని అల్లు అరవింద్ అన్నారు. డ్రగ్స్‌కు యంగ్‌స్టర్స్ ఎలా ఎడిక్ట్ అవుతున్నారనే విషయం గురించి ఆయన మాట్లాడుతూ– ‘‘ముంబయ్‌లోని ఓ యంగ్‌స్టర్‌ను నేను ఓసారి ఏంటిది? అని ప్రశ్నిస్తే... ‘అంకుల్! రేవ్ పార్టీలకు వందలమంది వెళ్తుంటారు. అందులో నలుగురో... పది మందో... సపరేట్గా పక్కకు వెళ్లి డ్రగ్స్ తీసుకుంటారు. తర్వాత మళ్లీ కలిసినప్పుడు డ్రగ్స్ అంటే ఆసక్తి ఉన్నోళ్లను తమ బ్యాచ్‌లోకి లాక్కునేందుకు ప్రయత్నిస్తారు. ఇదంతా వందలో 20, 30 మందికి తెలుస్తుంది’ అన్నాడు. అలాంటి రేవ్ పార్టీలు మన దగ్గర కూడా జరుగుతున్నాయని చెప్పడానికి విచారిస్తున్నా. యువతకు నేను చేసే హెచ్చరిక ఏంటంటే... రేవ్ అండ్ డ్రగ్స్ పార్టీల నుంచి తప్పుకోండి. ‘మేం కళ్లు మూసుకుని పాలు తాగుతున్నాం. ఏం ఫర్వాలేదు’ అనుకోకండి. డ్రగ్స్ వలలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనేది ప్రభుత్వానికి తెలుసు. వాళ్ల దగ్గర మీ లిస్టుంది. మీ జీవితాలు నాశనమవుతాయి. మీ ఫ్యామిలీ బాధ్యత తీసుకుని మిమ్మల్ని (డ్రగ్ ఎడిక్ట్ యంగ్‌స్టర్స్) కంట్రోల్ చేస్తుందో... మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారో మీ ఇష్టం’’ అన్నారు. -
ఒకే వేదికపైకి అన్ని కళాపరిషత్‌లు
ఆ దిశగా కృషి చేస్తున్నామన్న పరుచూరి వెంకటేశ్వరరావు పల్లెకోన (భట్టిప్రోలు): రాష్ట్రంలోని అన్ని కళాపరిషత్‌లు కలిపి ఒక వేదికపైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు పరుచూరి రఘుబాబు మెమోరియల్ మేనేజింగ్ ట్రస్టీ పరుచూరి వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం పల్లెకోనలో నిర్వహిస్తున్న అఖిల భారత నాటకోత్సవాలకు హాజరైన ఆయన విలేకర్లతో మాట్లాడారు. దాతల సహకారంతో రూ 1.10 కోట్ల వ్యయంతో పల్లెకోనలో కళా మండపం నిర్మించామన్నారు. స్థల దాత వేములపల్లి సుబ్బారావుకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది ఖమ్మం, పల్లెకోనలో నాటకోత్సవాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఆదివారం సినీనటులు తనికెళ్లభరణి, రఘుబాబు, రావు రమేష్, 2న ‘శరణం గచ్ఛామి’ చిత్ర యూనిట్ విచ్చేస్తున్నట్లు వెల్లడించారు. సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ఆడిటోరియం ఏర్పాటు వెనుక పరుచూరి బ్రదర్స్ కృషి అనిర్వచనీయమన్నారు. 26 ఏళ్లుగా నాటకోత్సవాలు నిర్వహించటం ముదావహని పేర్కొన్నారు. ‘ప్రేమించుకుందాంరా’’ సినిమాలో రాయలసీమ మాండలికం డైలాగులు పెట్టాలని సూచించిన వెంటనే పరుచూరి బ్రదర్స్ ఆచరించారని తెలిపారు. సమావేశంలో పరుచూరి వెంకటేశ్వరరావు మనుమలు వెలగపూడి రఘు ఆదిత్య, వేదవ్యాస్, ట్రస్ట్ కోశాధికారి డాక్టర్ వెలగపూడి రాజగోపాల్ పాల్గొన్నారు. -
21 నుంచి పల్లెకోనలో నాటకోత్సవాలు
భట్టిప్రోలు, న్యూస్‌లైన్: గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పల్లెకోనలో ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకు పరుచూరి రఘుబాబు స్మారక అఖిల భారత నాటకోత్సవాలు జరగనున్నాయి. రఘుబాబు మెమోరియల్ ట్రస్టీ, సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు గురువారం ‘న్యూస్‌లైన్’తో ఫోన్లో మాట్లాడుతూ, రఘుబాబు స్మారకంగా 2008 వరకు హైదరాబాద్‌లో ఈ నాటకోత్సవాలు నిర్వహించామన్నారు. అయితే గత నాలుగేళ్లుగా వీటిని పల్లెకోనలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏటా ఏప్రిల్ 27 నుంచి 5 రోజులపాటు నాటకోత్సవాలు జరిగేవని, అయితే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా వీటిని మే 21వ తేదీకి వాయిదా వేశామన్నారు.