Writer Paruchuri Venkateswara Rao Shocking Look In Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Paruchuri Venkateswara Rao: పరుచూరి వెంకటేశ్వరరావు లేటెస్ట్‌ ఫొటో చూసి షాకవుతున్న ఫ్యాన్స్‌!

Published Sat, Mar 12 2022 3:56 PM | Last Updated on Sat, Mar 12 2022 4:31 PM

Writer Paruchuri Venkateswara Rao Shocking Look In Pic Goes Viral - Sakshi

తెలుగు ఇండస్ట్రీలోని రచయితలలో పరుచూరి బ్రదర్స్‌ది ప్రత్యేక స్థానం. వీరు ఇండస్ట్రీలో వందలాది సినిమాలకు రచయితగా పనిచేశారు. ఎన్నో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను టాలీవుడ్‌కు అందించిన ఘనత వీరి సొంతం. స్టార్‌ హీరోల నుంచి చిన్న హీరోల వరకు అందరితోనూ కలిసి పని చేశారు. కొన్ని దశాబ్దాల పాటు సినీరంగంలో రచయితలుగా చక్రం తిప్పారు ఈ అన్నదమ్ములు. పరుచూరి బ్రదర్స్‌లో పెద్దవాడైన వెంకటేశ్వరరావు పలు సినిమాల్లో నటించి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానూ సత్తా చాటారు. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం పరుచూరి వెంకటేశ్వరరావు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. వయోభారంతో కృంగిపోతున్న ఆయనను ప్రముఖ దర్శకుడు జయంత్‌ సి పరాంజి కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫొటోను శుక్రవారం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. 'నా గురువుగారు పరుచూరి వెంకటేశ్వరరావు ఇలా అయిపోవడం బాధగా ఉంది. కానీ ఆయన మానసిక స్థితి మాత్రం ఎప్పటిలాగే చురుకుగా ఉంది. పరుచూరి బ్రదర్స్‌ 300 పైచిలుకు సినిమాలకు రచయితగా పని చేయగా అందులో 200కు పైగా సినిమాలు బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించాయి' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. బక్కచిక్కిపోయిన పరుచూరి వెంకటేశ్వరరావు లుక్‌ను చూసిన అభిమానులు గురువుగారు ఇలా అయిపోయారేంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: దుమ్మురేపిన ప్రభాస్‌.. రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement