యుద్ధం ఆరంభం | Nandamuri Kalyan Ram starrer Arjun Son Of Vyjayanthi Poster Release | Sakshi
Sakshi News home page

యుద్ధం ఆరంభం

Published Thu, Mar 13 2025 4:49 AM | Last Updated on Thu, Mar 13 2025 4:49 AM

Nandamuri Kalyan Ram starrer Arjun Son Of Vyjayanthi Poster Release

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా, విజయశాంతి మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్‌–ప్యాక్డ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’. ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకాలపై అశోక్‌ వర్ధన్‌ ము΄్పా, సునీల్‌ బలుసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అర్జున్‌ పాత్రలో కల్యాణ్‌ రామ్, వైజయంతి పాత్రలో విజయశాంతి నటిస్తున్నారని తెలుస్తోంది. 

కాగా ‘అర్జున్‌ బ్యాటిల్‌ బిగిన్స్‌’ అంటూ ఈ నెల 14న ఈ సినిమా ప్రీ టీజర్‌ను రిలీజ్‌ చేస్తున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించి, కల్యాణ్‌రామ్‌ కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ‘‘టాకీ పార్టు పూర్తయింది. మిగిలిన షూట్‌ కూడా పూర్తయ్యాక రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్‌ చేస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. కాగా ఇది తల్లీకొడుకుల బలమైన భావోద్వేగాల నేపథ్యంలో సాగే యాక్షన్‌ ఫిల్మ్‌ అని తెలుస్తోంది. సోహైల్‌ ఖాన్, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, ‘యానిమల్‌’ ఫేమ్‌ పృథ్వీరాజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement