Vijayashanti
-
'పుష్ప2' ఘటన.. వాళ్లకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్లాన్: విజయశాంతి
పుష్ప2 సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనతో తెలంగాణ ప్రభుత్వం, చిత్ర పరిశ్రమ మధ్య దూరం పెరుగుతుందనే వాదన వినిపిస్తోంది. ఈ ఘటనపై ఇప్పటికే చాలామంది రాజకీయ నేతలు తీవ్రమైన వ్యాఖ్యలు చేయడమే దీనికి కారణమని చెప్పవచ్చు. ఇదే అంశంపై తాజాగా సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు మాజీ ఎంపీ విజయశాంతి స్పందించారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని ఆమె ఇలా చెప్పుకొచ్చారు.'ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఈ సంఘటన చాలా దురదృష్టకరం. అయితే, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో విభజన రేఖలు తెచ్చే వరకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజుల పరిణామాలు, ప్రెస్ మీట్లు తదనంతర భావోద్వేగాలలో ఇదే కనిపిస్తుంది. ఈ ఘటన తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీకి చెందిన తెలుగు రాష్ట్రాల నేతల ప్రకటనలు ఉన్నాయి. ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసుందాం అనే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి.. అలా కాకుండా మళ్లీ ప్రజల మనోభావాల మధ్య విభజనలు వచ్చే వరకు నడవాలనేది ఈ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీల ప్రయోగంగా కనిపిస్తుంది. సినిమా పరిశ్రమను నాశనం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ కేంద్రమంత్రులు ఆరోపణలు చేయడం గర్హనీయం. సినీ పరిశ్రమకు అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణ అవసరం. ఇలాంటి ఘటనలు జరగకుండా సినిమా పరిశ్రమ కూడా పరిశీలన చేయాలి.. పరిష్కరించుకునే ప్రయత్నం జరగాలి.’ అని పేర్కొన్నారు.పుష్ప2 సినిమా విడుదల సమయంలో డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. ఈ ఘటనపై రాజకీయ నాయకుల కామెంట్లు వల్ల పరిస్థితి మారిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా రేవతి మరణం గురించి వ్యాఖ్యలు చేయండంతో పాటు ఆ సమయంలో అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు బాగాలేదని ఆయన అన్నారు. దీంతో అల్లు అర్జున్ కూడా మీడియా సమావేశం పెట్టి తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు. ఆపై పలు రాజకీయ పార్టీ నేతలు బన్నీకి సపోర్ట్‌గా మాట్లాడటంతో వివాదం మరింత ఎక్కువ అయింది అని చెప్పవచ్చు. -
అసలైన లేడీ సూపర్‌స్టార్.. విజయశాంతి బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
రాములమ్మ ఆలోచనలు ఏంటి? కాంగ్రెస్‌లో కొనసాగుతారా.. లేక?
సినీ హీరోయిన్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి క్రమంగా ప్రజలకు దూరం అవుతున్నారు. అనేక పార్టీలు మారిన రాములమ్మ ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు. అప్పుడప్పుడు ట్వీట్లు చేస్తూ తన ఉనికి చాటుకుంటున్నారు. తాజాగా బీజేపీ నేత కిషన్‌రెడ్డి కామెంట్స్ మీద ట్వీట్ చేసి సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. ఇంతకీ రాములమ్మ ఆలోచనలు ఏంటి? ఆమె కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారా? లేక మరో గూటికి చేరాలనుకుంటున్నారా? లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న విజయశాంతి ఒకప్పుడు అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లోనూ ఫైర్ బ్రాండే. 1998లో పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీతో రాజకీయ అరంగేట్రం చేసిన విజయశాంతి కమలం, కాంగ్రెస్ పార్టీలకు రెండు సార్లు రాజీనామాలు చేసి, మళ్ళీ చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి తర్వాత ఆ పార్టీని గులాబీ పార్టీలో విలీనం చేాశారు. కేసీఆర్‌తో వచ్చిన విభేదాల కారణంగా కాంగ్రెస్‌లో చేరిపోయారు. కొన్ని రోజులు హస్తం పార్టీలో యాక్టీవ్ గానే ఉన్నా.. ఆతర్వాత కాంగ్రెస్‌లో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని రెండోసారి బీజేపీలో చేరారు. బీజేపీ నాయకత్వం సీనియర్‌గా ఆమెకు గుర్తింపు ఇచ్చినా కొద్ది రోజులకే మళ్ళీ హస్తం గూటికి వచ్చారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి పలు జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం చేాశారు. ఎన్నికల అనంతరం ఏమైందో తెలియదు కానీ మళ్ళీ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర నుంచి లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు ఆరు నెలల పాటు విజయశాంతి పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. కానీ అడపాదడపాగా సోషల్ మీడియా వేదికగా పార్టీకి అనుకూలంగానో వ్యతిరేకంగానో తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విజయశాంతి. తాజాగా సోషల్ మీడియాలో విజయశాంతి పెట్టిన పోస్ట్ మరోసారి చర్చకు దారితీసింది.బీఆర్ఎస్ మీద కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వాఖ్యలకు కాంగ్రెస్ నేతగా విజయశాంతి కౌంటర్ ఇవ్వడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ట్వీట్ చేసారు. కిషన్ రెడ్డి అభిప్రాయం సమంజసం కాదని, ఆత్మగౌరవం, పోరాట తత్వం దక్షిణాది రాష్ట్రాల సహజ లక్షణమంటూ కిషన్ రెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చారు. దక్షిణాది స్వీయ గౌరవ అస్థిత్వాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు బీజేపీ అర్థం చేసుకోలేక పోయిందంటూ చురకలు అంటించారు విజయశాంతి. అయితే కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ను విమర్శిస్తే విజయశాంతి స్పందించడమే ఇప్పుడు చర్చకు దారితీసింది.చాలా రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విజయశాంతి ప్రస్తుత పోస్ట్ చూస్తుంటే మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా అనే అనుమానం రాజకీయ వర్గాల్లో కలుగుతోంది. కిషన్ రెడ్డి వాఖ్యలను బీఆర్ఎస్ నేతలే పట్టించుకోలేదు అలాంటిది కాంగ్రెస్ నేత అయిన విజయశాంతికి ఏమవసరం అని పార్టీలో చర్చ జరుగుతోంది. మొత్తానికి సొంత పార్టీని ఇరకాటంలో పెట్టడంలో విజయశాంతి స్టైలే వేరనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. -
నన్ను హీరోయిన్గా పరిచయం చేసింది ఆమెనే: విజయశాంతి
తెలుగు చిత్రసీమలో నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా వెండితెరపై తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్న నటి విజయనిర్మల. ఒక మహిళ దర్శకురాలిగా 44 సినిమాలు తీసి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నారు. అలా ఆమె ఎనలేని ఘనతలతో పాటు కొన్ని వేల కోట్లకు అధిపతి కూడా అయ్యారు. 2019 జూన్‌లో విజయనిర్మల కన్నుమూయగా భర్త సూపర్ స్టార్ కృష్ణ కూడా 2022లో మరణించారు. 1946, 20 ఫిబ్రవరిలో తమిళనాడులో జన్మించిన విజయ నిర్మల సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక ముద్రవేశారు. అయితే ఇవాళ ఆమె జయంతి సందర్భంగా సినీయర్ హీరోయిన్ విజయశాంతి ట్వీట్ చేశారు. తనను ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం చేసిన విజయ నిర్మలను గుర్తు చేసుకుంది. నన్ను కళాకారిణిగా విశ్వసించి.. సూపర్ స్టార్ కృష్ణతో హీరోయిన్గా నా మొదటి తెలుగు సినిమాకు నన్ను నడిపించి.. నాకు తరగని గెలుపు ధైర్యమిచ్చిన ఆంటీ విజయనిర్మలపై అభిమానం ఎప్పటికీ మరిచిపోలేనని ట్విటర్ రాసుకొచ్చారు. అంతే కాకుండా ఆ సినిమా సెట్లో దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న రాములమ్మ చివరిసారిగా మహేశ్ బాబు నటింతిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కనిపించింది. నన్ను కళాకారిణిగా విశ్వసించి సూపర్ స్టార్ కృష్ణ గారితో హీరోయిన్ గా నా మొదటి తెలుగు సినిమాకు నన్ను నడిపించి, నాకు తరగని గెలుపు ధైర్యమిచ్చిన ఆంటీ విజయనిర్మల గారు... మీ పై ఆ అభిమానం ఆ గౌరవం, ఎప్పటికీ మిమ్మల్ని గుర్తుగా ఉంచుకునే జ్ఞాపకం తో... జన్మదిన శుభాకాంక్షలతో...💐 మీ… pic.twitter.com/Cicx5jWKUI — VIJAYASHANTHI (@vijayashanthi_m) February 20, 2024 -
విజయశాంతికి ఎంపీ టికెట్..?
-
రాములమ్మ రీ ఎంట్రీ.. ఆ హీరో సినిమాతోనే!
రాజకీయాలతో బిజీగా ఉన్న రాములమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల గుడ్ బై చెప్పి పాలిటిక్స్‌లో వెళ్లి విజయశాంతి మళ్లీ పెద్దగా కనిపించలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి ప్రచారం చేశారు. గతంలో బీజేపీలో ఉన్న ఆమె బయట ఎక్కడా పెద్దగా కనిపించలేదు. అయితే మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు రాములమ్మ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేసింది. విజయశాంతి తన ట్వీట్లో రాస్తూ..' నన్ను తమ ప్రాణంగా భావిస్తూ జన్మంతా ఎన్నడూ నా వెన్నంటి ఉంటూనే ఉన్న నా అభిమాన దైవాలకు ఎన్నటికీ తీర్చుకోలేని కృతజ్ఞతతో మీ కోసం.... నిజం చెప్పాలంటే మీ అభిమానం కోసం నేను మళ్లీ ఒక సినిమా చేస్తున్నాను కావచ్చు.. 5 దశాబ్ధాల ఈ నా సినీ ప్రయాణంలో మీ దీవెనలు ఎప్పటికీ ఉంటాయి. 1979 నుంచి నేటి వరకు ఉన్నట్లు.. మీ విజయశాంతి కళాకారిణిగా ఉన్నంతవరకు ఎప్పటికీ అట్లనే ఉంటాయని విశ్వసిస్తున్నా' అంటూ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా నందమూరి కల్యాణ్ రామ్, దర్శకుడు ప్రదీప్ చిలుకూరికి అభినందనలు అంటూ పోస్ట్ చేసింది. దీంతో విజయశాంతిని వెండితెరపై చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. విజయశాంతి చివరిసారిగా 2020లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో విడుదలైన చిత్రం సరిలేరు నీకెవ్వరులో కనిపించింది. ఈ చిత్రంలో మహేష్ బాబు, రష్మికా మందన్న, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటించారు. నన్ను తమ ప్రాణంగా భావిస్తూ జన్మంతా ఎన్నడూ నా వెన్నంటి ఉంటూనే ఉన్న నా అభిమాన దైవాలకు ఎన్నటికీ తీర్చుకోలేని కృతజ్ఞతతో మీ కోసం..... నిజం చెప్పాలంటే మీ అభిమానం కోసం, మల్ల ఒక సినిమా చేస్తున్నాను కావచ్చు... 5 దశాబ్ధాల ఈ నా సినీ గమనంలో మీ దీవెనలు ఎన్నటికీ , 1979 నుండి నేటి వరకు… pic.twitter.com/NriNNvgMgO — VIJAYASHANTHI (@vijayashanthi_m) December 6, 2023 -
'యుద్ధానికి సిద్ధంగా ఉండాలి' : విజయశాంతి
సాక్షి, మహబూబ్‌నగర్: ప్రజలు అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి అన్నారు. రాష్ట్రంలో దొరను దింపుతామని చాలెంట్ చేయాలన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో అభివృద్ధి జరగలేదన్నారు. నాలుగు కోట్ల మంది ప్రజలు నలుగురుగా ఉన్న కేసీఆర్‌పై దండయాత్ర చేయాలన్నారు. బీజేపీ 420 పార్టీతో కుమ్మక్కైందన్నారు. ఈసారి సామ ధాన బేధ దండోపయాలు ప్రయోగించి బీజేపీ కేసీఆర్‌ను మరోసారి గద్దెమీద ఎక్కించడానికి కుట్ర పన్నుతుందని, ప్రజలు వీటిని తిప్పికొట్టాలన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇస్తే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని గ్యారెంటీ ఇవ్వాలని కోరారు. ఇవి చదవండి: కోడ్ ఉల్లంఘనులపై కఠిన చర్యలు.. : రాహుల్‌రాజ్ -
కేసీఆర్ అవినీతిపై కేంద్రం చర్యలేవి?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని.. అవి తెర ముందు ఒకలా, తెర వెనక మరోలా వ్యవహరిస్తున్నాయని టీపీసీసీ ప్రచార, ప్రణాళిక కమిటీ చీఫ్ కోఆర్డినేటర్, మాజీ ఎంపీ విజయశాంతి ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీ లు ఒక్కటై బీజేపీ కార్యకర్తలు, ప్రజలు, ఉద్యమకారులను పిచ్చి వాళ్లను చేశాయని.. అందుకే బీజేపీని వీడానని తెలిపారు. శనివారం గాందీభవన్‌లో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ మీడియా ఇన్చార్జి అజయ్‌కుమార్‌లతో కలసి ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకుంటామంటేనే గతంలో బీజేపీలో చేరాను. నెలలు, ఏళ్లు గడిచినా కేసీఆర్‌పై చర్యలు తీసుకోలేదు. ఉద్యమకారులకు ఇచ్చిన మాటను బీజేపీ అధిష్టానం మర్చిపోయింది. కేసీఆర్ అవినీతిపై ఆధారాలు ఉన్నాయని తెలంగాణకు వచ్చిన ప్రతీసారి మాట్లాడే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. కాళేశ్వరంలో అవినీతి జరిగి, మేడిగడ్డ పిల్లర్లు కుంగినా చర్యలు చేపట్టడం లేదేం? మీరు మీరు (బీజేపీ, బీఆర్ఎస్) ఒక్కటై ప్రజలు, బీజేపీ కార్యకర్తలు, ఉద్యమకారులను పిచ్చోళ్లను చేశాయి. అందుకే బీజేపీకి రాజీనామా చేశాను..’’అని విజయశాంతి పేర్కొన్నారు. బీజేపీ తనను మోసం చేసిందేతప్ప తాను ఎవరినీ మోసం చేయలేదన్నారు. కాంగ్రెస్‌లో చేరి, పాత మిత్రులను కలుసుకోవడం సంతోషకరంగా ఉందని చెప్పారు. ఆ నాయకుడితోనే భూస్థాపితం బీజేపీలో ఒక నాయకుడిని మొక్క నాటినట్టు నాటారని, ఆ నాయకుడితోనే బీజేపీ పని భూస్థాపితం అవుతోందని విజయశాంతి వ్యా ఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ వ్యక్తి మీద పెట్టిన అసైన్డ్ భూముల కేసు ఏమైందో చెప్పాలని నిలదీశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలని ఆ నేత పదేపదే చెప్పారని.. ఎన్నికల సమయంలో రాష్ట్ర అధ్యక్షుడిని మార్చొద్దని చాలా మంది చెప్పినా బీజేపీ అధిష్టానం వినలేదని పేర్కొన్నారు. బండి సంజయ్‌ను మార్చిన తర్వాత బీజేపీ గ్రాఫ్ పడిపోయిందన్నారు. తనను తిట్టే హక్కు బీజేపీ, బీఆర్ఎస్లకు లేదని.. తాను డబ్బు, పదవులకు లొంగే వ్యక్తిని కాదని చెప్పారు. తన గురువు అద్వానీ అని, ఆయన విలువైన రాజకీయాలు నేర్పారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. టీపీసీసీ ప్రచార, ప్రణాళిక కమిటీ చీఫ్ కో–ఆర్డినేటర్‌గా నియామకం సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన మరునాడే సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతికి ఆ పార్టీ కీలక పదవి అప్పగించింది. ఆమెను టీపీసీసీ ప్రచార, ప్రణాళిక కమిటీ చీఫ్ కో–ఆర్డినేటర్‌గా నియమించింది. ఈ కమిటీకి మరో 15 మందిని కన్వీనర్లుగా ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీచేశారు. కన్వినర్ల జాబితాలో సమరసింహారెడ్డి, పుష్పలీల, మల్లు రవి, ఎం.కోదండరెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, ఈరవర్తి అనిల్, రాములు నాయక్, పిట్ల నాగేశ్వర్రావు, ఒబేదుల్లా కొత్వాల్, రమేశ్ ముదిరాజ్, పారిజాతరెడ్డి, సిద్ధేశ్వర్, రామ్మూర్తి నాయక్, అలీబిన్ ఇబ్రహీం మస్కతీ, దీపక్ జాన్ తదితరులు ఉన్నారు. -
కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నాయకురాలు విజయశాంతి కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని, కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్ పరిమితం చేయాలనే కాంగ్రెస్‌లో చేరానని తెలిపారు. కాగా, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పొలిటికల్ పార్టీల నుంచి అభ్యర్థుల ఖరారు, నామినేషన్ల ప్రక్రియ, ఉప సంహరణ అన్నీ ముగిసిపోయినప్పటికీ జంపింగ్‌లు మాత్రం ఆగడం లేదు. నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరుతూనే ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌లోకి కొందరు నేతలు క్యూ కట్టగా.. సీనియర్ నేత విజయశాంతి కూడా కాంగ్రెస్‌లోకి చేరారు. గత కొంత కాలంగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆమె అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో బీజేపీ హైకమాండ్ నిర్ణయాలపై విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు. చదవండి: కేసీఆర్ ఇక అక్కడే ఉండిపోతారు: ఖర్గే -
బీజేపీకి విజయశాంతి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. బీజేపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. పార్టీకి విజయశాంతి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆమె రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపారు. గత కొంత కాలంగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆమె అసంతృప్తితో ఉన్నారు. తాజాగా విజయశాంతి కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం వినిపిస్తుండగా.. ఇప్పుడు రాజీనామా పరిణామంతో అది ఖాయంగానే కనిపిస్తోంది. ఇదీ చదవండి: నైంటీస్లోనే బీజేపీకి స్టార్ క్యాంపెయినర్‌గా రాములమ్మ -
తెలంగాణ బీజేపీకి షాక్..!
-
vijayashanti: కాంగ్రెస్‌లోకి విజయశాంతి!
సాక్షి, హైదరాబాద్: సీనియర్ సినీ నటి, మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆమెకు ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. అలాగే చాలాకాలంగా ఆమె పార్టీ పట్ల అసంతృప్తి ఉన్నారు. బీజేపీ అధికారిక కార్యక్రమాల్లోనూ ఆమె పాల్గొనడం లేదు. మరోవైపు స్టార్ క్యాంపెయినర్ జాబితాలోనూ ఆమె పేరు లేకపోవడం చర్చనీయాంశాలుగా మారాయి. ఈ తరుణంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి ఈ విషయాన్ని ధ్రువీకరించారు కూడా. సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే విజయశాంతి బీజేపీకి మద్దతుదారుగా ఉన్నారు. తమిళనాడులో 1996 ఎన్నికల సమయంలో అన్నాడీఎంకేకు, అటుపై లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించి పరోక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్వయహరించారు. అటుపై 1998లో బీజేపీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లో తన ప్రస్థానం ప్రారంభించారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి సోనియా గాంధీపై విజయశాంతి బీజేపీ తరఫున పోటీ చేయాలనుకున్నారు. అయితే సోనియా గాంధీ బళ్లారి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో.. విజయశాంతి కడప రేసు నుంచి తప్పుకున్నారు. దాదాపు దశాబ్దంపాటు బీజేపీలో కొనసాగిన ఆమె.. 2009లో బయటకు వచ్చి తల్లీ తెలంగాణ అనే సొంత పార్టీని స్థాపించారు. అటుపై ఆ పార్టీని బీఆర్ఎస్(అప్పటి టీఆర్ఎస్)లో విలీనం చేశారు. 2009లోనే మెదక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి నెగ్గారు. కేసీఆర్‌తో విభేదాల వల్ల 2014లో ఆమె కాంగ్రెస్‌లో చేరారు. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. నాలుగేళ్ల తర్వాత కాంగ్రెస్‌లో ఆమెకు ఎన్నికల స్టార్ క్యాంపెయినర్, టీపీసీసీకి ఎన్నికల ప్రచార కమిటీ సలహాదారుగా నియమించారు అప్పటి ఏఐసీసీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ. 2019లో ప్రధాని మోదీపై ఆమె చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. 2020లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విజయశాంతి.. అదే ఏడాది డిసెంబర్లో అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరారు. -
ఏరోజూ పదవి కోరుకోలేదు.. విజయశాంతి ఆసక్తికర ట్వీట్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి తాజాగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. 25 సంవత్సరాల రాజకీయ ప్రయాణం తనకెప్పుడూ సంఘర్షణ మాత్రమే ఇచ్చిందని, ఏరోజూ పదవి కోరుకోలేదని తెలిపారు. తన పోరాటం తెలంగాణ బిడ్డల సంక్షేమ కోసమే తప్ప.. నేటి బీఆర్ఎస్కు వ్యతిరేకం కాదని అన్నారు. కేసీఆర్ కుటుంబ దోపిడి, కొందరు బీఆర్ఎస్ నేతల అరాచకత్వంపై తప్ప, తనతో కలిసి తెలంగాణా ఉద్యమంలో ప్రాణం అడ్డుపెట్టి పనిచేసిన బీఆర్ఎస్ కార్యకర్తలపై మాత్రం కాదని స్పష్టం చేశారు. ‘25 సంవత్సరాల నా రాజకీయ ప్రయాణం, అప్పుడు ఇప్పుడు కూడా ఎందుకో సంఘర్షణ మాత్రమే నాకు ఇస్తూ వచ్చింది. ఏ పదవి ఏనాడు కోరుకోకున్న. ఇప్పటికీ అనుకోకున్న కూడా.. అయితే ప్రస్తుతం ఇది తెలంగాణ బిడ్డలకు చెప్పాల్సిన సత్యం మన పోరాటం నాడు దశాబ్ధాల ముందు తెలంగాణ ఉద్యమ బాట నడిచినప్పుడు, మొత్తం అందరు తెలంగాణ బిడ్డల సంక్షేమం తప్ప, ఇయ్యాల్టి బీఆర్ఎస్కు వ్యతిరేకం అవుతాం అని కాదు. నా పోరాటం నేడు కేసీఆర్ కుటుంబ దోపిడి, కొందరు బీఆర్ఎస్ నేతల అరాచకత్వంపై తప్ప, నాతో కలిసి తెలంగాణా ఉద్యమంలో ప్రాణం అడ్డుపెట్టి పనిచేసిన బీఆర్ఎస్ కార్యకర్తలపై మాత్రం కాదు. రాజకీయ పరంగా విభేదించినప్పటీకి, అన్ని పార్టీల మొత్తం తెలంగాణ బిడ్డలు సంతోషంగా, సగౌరవంగా ఎన్నటికే ఉండాలనీ మనఃపూర్వకముగా కోరుకోవటం మీ రాములమ్మ ఒకే ఒక్క ఉద్దేశ్యం.. ఎప్పటికీ’ అని విజయశాంతి పేర్కొన్నారు. 25 సంవత్సరాల నా రాజకీయ ప్రయాణం , అప్పుడు ఇప్పుడు కూడా ఎందుకో సంఘర్షణ మాత్రమే నాకు ఇస్తూ వచ్చింది.... ఏ పదవి ఏనాడు కోరుకోకున్న... ఇప్పటికీ అనుకోకున్న కూడా... అయితే ప్రస్తుతం ఇది తెలంగాణ బిడ్డలకు చెప్పాల్సిన సత్యం మన పోరాటం నాడు దశాబ్ధాల ముందు తెలంగాణ ఉద్యమ బాట నడిచినప్పుడు,… pic.twitter.com/LloTyHlGxe — VIJAYASHANTHI (@vijayashanthi_m) October 31, 2023 తెలంగాణ ఫైర్ బ్రాండ్ విజయశాంతి గత కొంతకాలంగా బీజేపీ తీరుపై అసంతృప్తిగా కనిపిస్తున్నారు. బీజేపీలో తనకు సముచిత స్థానం ఇవ్వలేదని, తన శక్తి సామర్థ్యాలను పార్టీ సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక దశలో ఆమె పార్టీ వీడతారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే అసమ్మతి రాగం వినిపిస్తున్న రాములమ్మను బుజ్జగించేందుకు రంగంలోకి దిగిన పార్టీ అధిష్టానం తెలంగాణ బీజేపీ నిరసనల కమిటీ చైర్మన్ పదవి అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా విజయశాంతి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ కార్యకర్తలను ప్రస్తావించడంతో ఆమె ఈ ట్వీట్ చేయడం వెనుక ఏ ఉద్దేశ్యం ఏంటనేదానిపై రాములమ్మ అభిమానులు, బీజేపీ శ్రేణులు యోచిస్తున్నారు. -
రాములమ్మ దారెటు...?
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యురాలు విజయశాంతి తాజాగా చేసిన సుదీర్ఘ ట్వీట్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం..గుర్తింపు దక్కడం లేదంటూ కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ఆమె ఇకపై ఏం చేస్తారో అన్నదానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోనియాను అభిమానిస్తామని ఇటీవల విజయశాంతి చేసిన ట్వీ ట్‌తో అసలు ఆమె బీజేపీలో ఉంటారా? లే దా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ‘బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడగొట్టగలిగే అభ్యర్థిని గెలిపించి లేదా గెలుపు వరకు తెచ్చిన ఓటర్లు తమ ఓటు చీలకుండా, మూడోపార్టీ ప్రధాన పోటీలో లేకపోతే జాతీయపార్టీ అయినా డిపాజిట్ రాని స్థాయికి ఈ పార్టీలను గతంలో పరిమితం చేశారని అదే తెలంగాణ జనశ్రేణుల విచక్షణ అంటూ’ఎక్స్ (ట్విటర్)వేదికగా ట్వీట్ చేశారు. ఇదే అంశంపై ‘బీఆర్ఎస్ను గద్దె దింపాల నుకునే విపక్ష పార్టీలు..ఆ ప్రజావిశ్వాసాన్ని తమ వైపు తిప్పుకునే ప్రజాస్వామ్య పోరాటానికి పెద్దఎత్తున సన్నద్ధులవుతారని తెలంగాణ ఎదురుచూస్తోందని..ప్రజల నుంచి అందు తున్న సమాచారంగా నా తోటి తెలంగాణ ఉద్యమకారులు తెలుసుకుంటున్నట్టు అభిప్రాయపడుతున్నారంటూ’సుదీర్ఘ ట్వీట్లో పేర్కొన్నారు. ఇది తెగింపుల సంగ్రామం. ‘తెలంగాణ ఉద్యమకారుల తిరుగుబాటులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు మ రో సార్వత్రిక స్వతంత్ర పోరాటం. తెలంగాణబిడ్డలు ఇప్పటికే బీఆర్ఎస్ బరువు దించుకోడానికి సన్నద్ధమయ్యారు. ఆ ఫలితాలే దు బ్బాక, గ్రేటర్ హైదరాబాద్, టీచర్స్ ఎమ్మె ల్సీ, హు జూరాబాద్, దగ్గరదగ్గరగా మును గోడు, నాగార్జునసాగర్ మొదలైనవి ఉన్నాయంటూ’ ట్వీట్ ప్రారంభంలో పేర్కొన్నారు. పార్టీలో తగిన ప్రాధాన్యం లభించడం లేదనే అసంతృప్తితో ఆమె ఉన్నట్టు సమాచారం. -
బీజేపీలో చర్చనీయాంశంగా విజయశాంతి వ్యవహారం
-
చచ్చిన అలాంటి క్యారెక్టర్స్ చేయను..!
-
నయనతారకు అలాంటి అర్హతే లేదు: కస్తూరి
సౌత్ ఇండియా లేడీ సూపర్‌స్టార్‌గా పేరుగాంచిన నయనతార ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండాలని కోరుకునే హీరోయిన్లలో ఒకరు. కానీ కెరీర్ ప్రారంభం నుంచి నయనతారపై గాసిప్‌లు, వివాదాలు వచ్చాయి. ప్రేమలు, ప్రేమ వైఫల్యాలు ఆమె జీవితాన్ని మార్చేశాయి. అయితే ఇన్ని సమస్యలు ఎదురైనా తన కెరీర్‌కు చాలా ప్రాధాన్యత ఇచ్చింది. అలా 2013 తర్వాత వరుస హిట్లతో తన కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకుంది. ఎందరో నటీమణులు వచ్చినా సౌత్ ఇండియాలో లేడీ సూపర్ స్టార్ స్థాయికి ఎదగగలిగింది మాత్రం నయనతార మాత్రమేనని ఆమెకు కితాబు ఉంది. తాజాగ నయనతార గురించి నటి కస్తూరి చెసిన కామెంట్ వైరల్ అవుతుంది. సౌత్ ఇండియాలో నయనతారను లేడీ సూపర్‌స్టార్‌గా అంగీకరించలేమని కస్తూరి చెప్పింది. కోలీవుడ్‌లో రజనీకాంత్ బిగ్గెస్ట్ స్టార్. అజిత్ , విజయ్ , కమల్ హాసన్‌లు ఉన్నప్పటికీ రజనీకాంత్‌ను మాత్రం ఎవరూ భర్తీ చేయలేరని కస్తూరి అన్నారు. నటీమణుల్లో లేడీ సూపర్‌స్టార్ ఎవరు అని అడిగినప్పుడు, కస్తూరి అలనాటి నటీమణులు కెపి సుందరాంబల్, విజయశాంతి పేర్లను ప్రస్తావించింది. ఇంతకుముందు కూడా నయనతార సరోగసీ ద్వారా బిడ్డలను స్వీకరించినందుకు కస్తూరి కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. జనవరి 2022 నుంచి భారతదేశంలో సరోగసీని నిషేధించారని, వైద్యపరంగా ఇది క్షమించరాని నేరమని కస్తూరి ట్వీట్ చేశారు. కానీ ఈ విషయంలో కస్తూరిపై విమర్శలు వచ్చాయి. మరొకరి వ్యక్తిగత జీవితంలోకి ఎందుకు చొరబడుతున్నారని కస్తూరిని పలువురు ప్రశ్నించారు. అప్పుడు ఈ విషయం కూడా పెద్ద దుమారమే రేగింది. ఇప్పుడు మళ్లీ కస్తూరి వ్యాఖ్యలపై నయనతార ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. (ఇదీ చదవండి: ఆరుదైన ఫీట్ చేరుకున్న రాధిక శరత్‌కుమార్) -
కిషన్‌రెడ్డికి తొలిరోజే షాక్! బీజేపీలో మళ్లీ అసమ్మతి గోల.. వేదికపైనే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కిషన్‌రెడ్డికి తొలిరోజే షాక్ తగిలింది. వేదికపైనే ఆ పార్టీ నాయకుల ఇంటిపోరు బయటపడింది. అసంతృప్త నేతలపై ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం ఆపాలని, కనీసం కిషన్‌రెడ్డినైనా స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వాలని హితవు పలికారు. ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లడంతోనే తన పదవి పోయిందని బండి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఎడమొహం, పెడమొహం ఇక వేదికపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నూతన అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. కిషన్‌రెడ్డి ముందు నుంచే వెళ్లిన రాజగోపాల్‌రెడ్డి, కిషన్‌రెడ్డికి అటు వైపు, ఇటువైపు ఉన్నవారితో కరచాలనం చేశారు తప్ప ఆయనను పట్టించుకోలేదు. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. (చదవండి: తమాషాలొద్దు.. ఎంపీ అరవింద్‌కు ఎమ్మెల్సీ కవిత వార్నింగ్) అందుకే త్వరగా వెళ్లిపోయా.. మరోవైపు కిషన్‌రెడ్డి పదవీ స్వీకార కార్యక్రమం నుంచి విజయశాంతి మధ్యలోనే వెళ్లిపోయారనే వార్తలు సైతం హాట్‌టాపిక్‌గా మారాయి. ‘నాడు తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణవాదాన్ని ఉక్కుపాదంతో అట్టడుగుకు అణిచివేయాలని ప్రయత్నించిన వారు ఎవ్వరైనా ఉన్న సందర్భంలో, అక్కడ ఉండటం నాకు అసౌకర్యం, అసాధ్యం. ఆ పరిస్థితి వల్ల ముందుగానే వెళ్లవలసి వచ్చింది’ అని ఆమె ట్విటర్ వేదికగా వివరణ ఇచ్చారు. నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి కార్యక్రమం వెనుదిరిగానని విజయశాంతి చెప్పుకొచ్చారు. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అయితే, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని ఉద్దేశించే విజయశాంతి ఈ వ్యాఖ్యలు చేశారని పార్టీల్లో వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాగా, నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం కిషన్‌రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. (చదవండి: ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం మానుకోండి: బండి సంజయ్) -
రేవంత్, ఈటల మాటల యుద్ధంలోకి విజయశాంతి ఎంట్రీ
-
రేవంత్, ఈటల సవాళ్లపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు..
సాక్షి, హైదరాబాద్: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సవాళ్లు విసురుకోవడంపై విజయశాంతి స్పందించారు. విపక్ష నేతల ఛాలెంజ్‌లు బీఆర్ఎస్కు వేడుకలు అవుతున్నాయని ఆమె అన్నారు. దుర్మార్గ వ్యవస్థపై పోరాడటం మన కర్తవ్యమని పిలుపునిచ్చారు. రేవంత్, ఈటల ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకోవద్దని విజయశాంతి సూచించారు. కాగా.. మునుగోడు ఉపఎన్నిక సమయంలో కేసీఆర్ నుంచి రేవంత్ రెడ్డి రూ.25కోట్లు తీసుకున్నారని ఈటల ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై రేవంత్ తీవ్రంగా స్పందించారు. తనకు డబ్బులు తీసుకునే ఖర్మ పట్టలేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా తానే పోరాడుతున్నట్లు పేర్కొన్నారు. రూ.25 కోట్లు తీసుకోలేదని దేవుడిపై ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని, ఈటల సిద్ధమా అని సవాల్ విసిరారు. శనివారం సాయంత్రం 6 గంటలకు తాను భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేస్తానని, ఈటల కూడా రావాలన్నారు. లేదా ఈటల ఏ గుడికి రమ్మంటే తాను అక్కడకు వెళ్లేందుకు సిద్ధమన్నారు. ఈ సవాళ్ల నేపథ్యంలో విజయశాంతి స్పందించారు. విపక్ష నేతలు ఒకరిపైఒకరు ఇలా ఆరోపణలు చేసుకుంటే అధికార బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్నారు. తెలంగాణ ప్రస్తుత పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న ఇద్దరికీ.. నిరంతర తెలంగాణ ఉద్యమకారిణిగా ప్రజల అభిప్రాయం చెప్పడం ఈ సందర్భంలో నా బాధ్యత అనిపించిందని ఆమె వరుస ట్వీట్లు చేశారు. చదవండి: కేసీఆర్ నుంచి పైసలు తీస్కునే ఖర్మ నాకేందీ? -
మంటల్లో కాలిపోతుంటే ఆ హీరో కాపాడాడు: విజయశాంతి
స్టార్ హీరోలతో సినిమాలు చేసిన విజయశాంతి లేడీ ఓరియంటెడ్ మూవీలతోనూ మెప్పించింది. ఎన్నో సినిమాలను ముందుండి నడిపించిన ఆమె లేడీ అమితాబ్ అన్న బిరుదును దక్కించుకుంది. ఓ పక్క గ్లామర్ హీరోయిన్గా నటిస్తూనే కర్తవ్యం నుంచి ఒసేయ్ రాములమ్మ దాకా ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసింది. తాజాగా విజయశాంతి తన సినీకెరీర్ గురించి మాట్లాడింది. 'నేను దాదాపు 180 దాకా సినిమాలు చేశాను, అన్ని భాషల్లో నటించాను. అందులో లేడీ ఓరియంటెడ్ చిత్రాలే నాకు ఎక్కువ ఇష్టం. నా చిన్నవయసులోనే నాన్న గుండెపోటుతో మరణించారు. ఆ బెంగతో అమ్మ మంచానపడింది. కొన్నాళ్లకే అమ్మ కూడా చనిపోయారు. ఆ తర్వాత నేను ఎవరి మీదా ఆధారపడకుండా బతికాను. నా పెళ్లి కూడా నేనే చేసుకున్నాను. నా ఫస్ట్ రెమ్యునరేషన్ ఐదు వేలు, కానీ అందులో కొంత ఎగ్గొట్టి మూడు వేలే ఇచ్చారు. మూడు వేల నుంచి కోటి రూపాయలు తీసుకునే స్థాయికి వెళ్లాను. ఆ కాలంలో భారత్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాప్ 3 సినీతారల్లో రజనీకాంత్, అమితాబ్‌తో పాటు నేను కూడా ఉన్నాను. చాలాసార్లు నేను చచ్చి బతికాను. ఓసారి విమాన ప్రమాదం.. మరోసారి నీళ్లలో కొట్టుకుపోయాను. ఇంకోసారి మంటల్లో చిక్కుకున్నాను, మరోసారి ట్రైన్ నుంచి కిందపడిపోబోయాను.. ఇంతా జరిగినా బతికిపోయాను. లేడీ బాస్ క్లైమాక్స్‌లో రైలు కంపార్ట్మెంట్ మారాలి. నేను బయటకు వస్తుండగా నా చేతు స్లిప్ అవడంతో కింద రాడ్ పట్టుకున్నాను. రైలు కదులుతూనే ఉంది, నేను గాల్లో ఎగురుతున్నాను. ఎలాగోలా తిరిగి కంపార్ట్మెంట్లోకి వెళ్లాను. ఏమాత్రం స్లిప్ అయినా లోయలో పడేదాన్ని. అప్పటికే అందరూ భయపడి ఏడ్చేశారు. ఈ షాట్ వద్దన్నారు. కానీ నేను మాత్రం పర్వాలేదని మరో టేక్‌లో పూర్తి చేశాను. తమిళ సినిమా షూటింగ్లో నన్ను కుర్చీలో బంధించి గుడిసెకు నిప్పు పెట్టే సన్నివేశం అది. నన్ను తాళ్లతో కట్టేశారు. గుడిసెకు నిప్పు పెట్టారు. అప్పుడు గాలి ఎక్కువగా వీయడంతో నా చీరకు, జుట్టుకు నిప్పంటుకుంది. అది చూసిన హీరో విజయ్‌కాంత్ వెంటనే లోపలకు వచ్చి నన్ను కాపాడాడు. ఇలా చాలాసార్లు చావు చివరి అంచుల దాకా వెళ్లి వచ్చాను' అని చెప్పుకొచ్చింది విజయశాంతి. చదవండి: దంగల్ను దాటేసిన పఠాన్.. నెం1 మూవీగా రికార్డు -
మళ్లీ బీజేపీలోకి రండి.. పార్టీని వీడిన నేతలకు బండి సంజయ్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో గతంలో చిన్న చిన్న సమస్యలతో ఇబ్బందిపడి, భావోద్వేగాలతో పార్టీని వీడిన వారు, సైద్ధాంతిక భావాలున్న నేతలు తిరిగి పార్టీలోకి రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. అందరం కలిసి కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడి బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామిక తెలంగాణను సాధించుకుందామన్నారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే ప్రజలు బిచ్చమెత్తుకునే పరిస్థితులు ఏర్పడతాయన్నారు. శుక్రవారం రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యురాలు విజయశాంతి 25 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమెను పార్టీనేతలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ బీజేపీలో కార్యకర్తలు కూడా ప్రధాని, రాష్ట్రపతి అయ్యే అవకాశాలుంటాయన్నారు. పార్టీలో తాను తప్పు చేసినా అడిగే హక్కు కార్యకర్తలకు ఉంటుందని, తాను సరిచేసుకోకపోతే ఢిల్లీనాయకత్వానికి చెప్పే వీలుంటుందన్నారు. బీఆర్ఎస్లో ఆ పరిస్థితి ఉంటుందా అని ప్రశ్నించారు. సినిమా గ్లామర్ ప్రపంచం. రాజకీయాల్లో ప్రశంసలకంటే విమర్శలే ఎక్కువ, అవన్నీ తట్టుకుని తెలంగాణ ఉద్యమకారిణిగా గర్జిస్తూ విజయశాంతి 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం సంతోషమన్నారు. కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.,. విజయశాంతి ఎవరికీ తలవంచకుండా పనిచేసి రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారన్నారు. తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడేందుకు విజయశాంతి ఎంతో పోరాటం చేస్తున్నారని రాష్ట్రపార్టీ ఇన్చార్జీ తరుణ్‌చుగ్ ప్రశంసించారు. నన్ను ఓడించేందుకు కేసీఆర్ ప్రయత్నించారు టీఆర్ఎస్ నేతగా ఉన్నపుడే ఎన్నికల్లో తనను ఓడించేందుకు కేసీఆర్ ప్రయత్నించారని విజయశాంతి చెప్పారు. అందుకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన రోజే తనను సస్పెండ్ చేశారన్నారు. ‘కేసీఆర్ ఒక విషసర్పం. ఆయనకు మరోసారి అధికారమిస్తే రాష్ట్రంలో ప్రజలు బతకలేని పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పటికే రాష్ట్రం రాంగ్ పర్సన్ చేతుల్లోకి వెళ్లింది. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి’ అని కోరారు. చదవండి: మంత్రి కేటీఆర్‌కు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సవాల్ -
పాతికేళ్ల ప్రయాణం.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: సినీ నటిగానే కాదు.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర కోసం ప్రయత్నించారు విజయశాంతి. ఆమె రాజకీయాలు పూర్తి చేసుకుని ఈ జనవరి 26తో పాతికేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా శుక్రవారం బీజేపీ సంబురాలు నిర్వహించగా.. పార్టీ కీలక నేతల సమక్షంలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతోనే తన రాజకీయ ప్రస్థానం మొదలైందన్న ఆమె.. గతంలో బాధగానే ఆ పార్టీని వీడినట్లు.. ఇప్పుడు ఆ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పోరాడతానని ప్రకటించారామె. మాజీ ఎంపీ విజయశాంతి మాట్లాడుతూ.. ‘‘43ఏళ్లుగా సినిమా పరిశ్రమ లో పనిచేసాను. కానీ, ఈ 25 ఏళ్లు సుదీర్ఘ ప్రయాణంగా అనిపించింది. అప్పట్లో విద్యాసాగర్ రావు, వెంకయ్య నాయుడులు నన్ను బీజేపీ లో చేరమని అడిగారు. 1998 జనవరి 26న వాజ్‌పేయి, అద్వానీల సమక్షంలో బీజేపీలో చేరాను. అవినీతి లేని, క్రమశిక్షణ గల పార్టీ కాబట్టే బీజేపీని ఎంచుకున్నా. తెలంగాణ కావాలి.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని నాకు చిన్నప్పటి నుంచి ఉంది. తెలంగాణ కోసం మొదటి నుంచి పోరాటం చేసిన పార్టీ బీజేపీ. సోనియా గాంధీ కి వ్యతిరేకంగా పోటీ చేయమని అద్వానీ కోరారు. కష్టాలైనా , నష్టాలైనా ఇబ్బందులు, వెన్ను పోటులు పడినా పోరాడుతూ వచ్చాను. తెలంగాణ కోసం పోరాడుతూ అందరికీ శత్రువు గా మారాను. తెలంగాణ వాదం వదులుకుంటే ఎన్నో పదవులు వచ్చేవి. అసలు తెలంగాణ కోసమే నేను బీజేపీ నుంచి బయటకు వచ్చాను. సమైక్య వాదులు నాపై ఒత్తిడి చేస్తూ వచ్చారు.. ఎంతో బాధతో బీజేపీ నుంచి బయటకు వచ్చా. ఆ తర్వాత తెలంగాణ సమస్యలపై పోరాడుతుంటే.. కేసీఆర్ అనే రాక్షసుడు నా జీవితంలో ఎంటర్ అయ్యాడు యూపీఏలో కేసీఆర్ కేంద్రమంత్రిగా తీసుకున్నప్పుడు.. బుద్దుందా? అని అడిగాను. మెదక్ లో ఎంపీ గా టికెట్ ఇచ్చి కేసీఆర్ నన్ను ఓడించేందుకు కుట్ర చేశాడు. ఆ తర్వాత అకారణంగా నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. బిల్లు రోజు నన్ను పోడియం వద్దకు పంపించి కేసీఆర్ సభ నుంచి జారుకున్నాడు. అందమైన తెలంగాణ ఇప్పుడు అసమర్దుడి చేతిలోకి వెళ్ళింది. కానీ, తెలంగాణను బీజేపీ అభివృద్ధి చేస్తుందనే నమ్మకం నాకుంది. కేసీఆర్ ను అధికారంలో నుండి దింపడానికి అంతా కలిసి పనిచేద్దాం. ఇదొక్కసారి కష్టపడితే బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని ఆమె పేర్కొన్నారు. తెలంగాణలో మరోసారి కేసీఆర్‌కు అధికారం దక్కితే.. ఎవరూ బ్రతకరు. కేసీఆర్ అనే వ్యక్తి ఒక విషసర్పం. అందరినీ చాపకింద నీరులా చంపేస్తూ వస్తాడు. మరోసారి అధికారంలోకి వస్తే ఏ పెన్షన్లు ఇవ్వడు. నేతలు లేరు అనే విమర్శలు పట్టించుకోకుండా పని చేసుకుపోవాలి. బీజేపీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలి అని ఆమె పిలుపు ఇచ్చారు. ఆమెది కీలక పాత్ర బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ మాట్లాడుతూ విజయశాంతిపై ప్రశంసలు గుప్పించారు. ‘‘25ఏళ్ల రాజకీయ ప్రస్థానం లో అనేక పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమం లో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ అస్తిత్వం కోసం చేసిన పోరాటాలు మరువలేనివి. లోక్ సభ లో కూడా విజయశాంతి తెలంగాణ కోసం పోరాటం చేసింది. బిల్లు అమలు సమయంలో కూడా కేసీఆర్ సభలో లేడు. బంగారు తెలంగాణ కావాలన్న ప్రజలను కలలను పక్కన పెట్టి కుటుంబం ను బంగారు కుటుంబం చేసుకుంటున్నారు. మరో 50ఏళ్ళు ఆమె బీజేపీ లోనే ఉండాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. ఆ పని చేసింది విజయశాంతి మాత్రమే పాతికేళ్లపాటు రాజకీయాల్లో కొనసాగడం మామూలు విషయమేమీ కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. విజయశాంతిని ఉద్దేశించి పేర్కొన్నారు. తెలంగాణ కోసం పార్లమెంట్ లో కొట్లాడింది విజయశాంతి మాత్రమే అని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి విజయ శాంతి అని కొనియాడారు. అలాగే.. కేసీఆర్ ఎంతో మంది ఉద్యమకారులను మోసం చేశారని విమర్శించారు బండి సంజయ్. పార్టీని వీడిన నేతలంతా తిరిగి కాషాయ కండువా కప్పుకోవాలన్న ఆయన.. చిన్న చిన్న సమస్యలుంటే సర్థుకుని సిద్దాంతం కోసం పనిచేద్దామన్న పిలుపు ఇచ్చారు. బీజేపీలో ఉంటేనే అవకాశాలు వస్తాయి. బీజేపీలో ప్రజాస్వామ్యం ఉంటుంది. పని చేయకపోతే పక్కకు తప్పించి బాధ్యతలు వేరే వాళ్ళకు ఇస్తారు. ప్రాంతీయ, కుటుంబ పార్టీల్లో ఇలాంటి అవకాశం ఉండదు. బీజేపీ కోసం రెండు తరాలు త్యాగం చేశాయి. ఇంకా ఎంతో మంది త్యాగాలు చేస్తున్నారు. చిన్న చిన్న సమస్యలతో పార్టీ వీడిన నేతలంతా సిద్దాంతం కోసం పనిచేద్దాం తిరిగి రండి. తెలంగాణలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు.. వారిని ఆదుకునేందుకు కలిసి పోరాటం చేద్దాం అని పిలుపు ఇచ్చారాయన. -
నవరాత్రులు - సినిమాల్లో నారీమణులు: హీరోయినే.. హీరో
ఐదేళ్ల కెరీర్. బానే ఉన్నట్టు. పదేళ్లు. అబ్బో కేక. చాలా పెద్ద హీరోయిన్. ఒక దశాబ్దం పాటు తెలుగు సినిమాని ఏలేసింది అంటారు. అదే హీరోలకైతే పదేళ్లు అన్నది చాలా తక్కువ టైమ్. వాళ్లకి 60 దాటినా హీరోలే. సో విషయం ఏంటంటే హీరోయిన్స్ లైఫ్ స్పాన్ చాలా చిన్నది. ఇలా వచ్చారు. అలా వెళ్లిపోయారు అన్నట్టుగా ఉంటుంది. ఈ టైమ్‌లో వాళ్లు పోషించే ఛాలెంజింగ్ పాత్రలే ఆ తర్వాత కూడా వాళ్ల గురించి మాట్లాడుకునేలా చేస్తాయి. లేదా వాళ్ల లైఫ్ స్పాన్స్ని పెంచుతాయి. లేడి ఓరియంటెడ్ సినిమాలే తెలుగులో తక్కువ. అందులో ఒక గ్లామర్ హీరోయిన్ ఏకంగా లేడి అమితాబ్ అన్న బిరుదును దక్కించుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. విజయశాంతికి అది ఎందుకు సాధ్యమైందంటే తను అసామాన్యురాలు కాబట్టి. ఒకటి కాదు. రెండు కాదు. తానే ముందుండి నడిపించిన సినిమాల లిస్ట్ ఒసేయ్ రాములమ్మ దాకా చాలా పెద్దదే ఉంది. అయితే వీటన్నింటికీ పునాది మాత్రం కర్తవ్యం సినిమానే. అందులో పోలీస్ ఆఫీసర్‌గా విజయశాంతి పెర్ఫామెన్స్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సావిత్రి బయోపిక్ తీస్తున్నారు. కీర్తిసురేష్ సావిత్రిగా చేస్తుందన్న వార్త బయటకు రాగానే రకరకాల రియాక్షన్స్ వచ్చాయి. సావిత్రిని మరిపించేలా కీర్తి సురేష్ నటించగలదా అన్న సందేహాలు కూడా వ్యక్తమైయ్యాయి. కానీసావిత్రి పాత్రలో పరాకాయ ప్రవేశం చేసింది కీర్తి సురేష్. సావిత్రి జీవితంలోని ప్రతి దశను అద్భుతంగా వెండి తెర మీద ఆవిష్కరించింది. శివపుత్రుడు చిత్రంలో గోమతి క్యారెక్టర్‌తో అందరినీ ఆశ్చర్యపర్చింది సంగీత. అందులో గంజాయి అమ్మే యువతి పాత్రలో డీ గ్లామర్‌గా కనిపించింది. ఆ పాత్రలో జీవించింది. ఇండస్ట్రీకి వచ్చిన ఐదేళ్ల తర్వాత 2002లో ఖడ్గంతో హిట్ అందుకుంది సంగీత. ఆ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా ఫిలిమ్‌ఫేర్ అవార్డు తెలుగు అందుకుంది. ఆ వెంటనే పితామగన్ చిత్రంలో గంజాయి అమ్మే పాత్రకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. గ్లామర్ పాత్రలతో ఇల్లు చక్కపెట్టుకోవాల్సిన టైమ్‌లో ఇలాంటి రోల్స్ అవసరమా అని సలహాలు కూడా ఇచ్చారట. కానీ డైరెక్టర్ బాలా మీద నమ్మకంతో డేట్స్ ఇచ్చేసింది సంగీత. హీరోయిన్ అంటే గ్లామర్ రోల్. అంతే అని ఇండస్ట్రీ అంతా ఫిక్స్ అయిన టైమ్ సోలో గా కథలను లీడ్ చేసే ప్రతిభను ప్రదర్శించిఅవకాశాలనూ దక్కించుకున్న అతి కొద్ది మంది హీరోయిన్లలో సమంత ఒకరు. పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ తొలి నుంచి సమంతకి దక్కు తూనే ఉన్నాయి. ఏమాయ చేశావే, రంగస్థలం, ఓ బేబీఇలా చాలా సినిమాల్లో నటిగా తన సత్తాని చాటింది. ఛాలెంజింగ్ రోల్స్ గురించి ప్రస్తావించాలంటే అనుష్క గురించి చాలా చాలా మాట్లాడుకోవాలి. కేవలం గ్లామర్ డాల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన అనుష్క ఆ తర్వాత అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకుంది. అయితే అనుష్కలోని ప్రత్యేకత ఏంటంటే ఒక మూస లోనే ఉండకపోవడం. అరుంధతి విడుదలైన తర్వాత ఇక అనుష్కకి గ్లామర్ పాత్రలు పెద్దగా రావంటూ చాలా విశ్లేషణలు వచ్చాయి. కానీ ఆ అంచనాలను తప్పని నిరూపించింది. అటు గ్లామర్ రోల్స్, అటు ఛాలెంజింగ్ రోల్స్ అదరగొట్టింది. విభిన్నమైన పాత్రలు చేయాలని సహజంగానే ఎవరికైనా ఉంటుంది. కానీ దాని కోసం కెరీర్‌ని రిస్‌లో పెట్టడానికి కూడా వెనుకాడని వాళ్లు అతి అరుదుగా ఉంటారు. నటన పై వారికున్న గౌరవానికి అతి ప్రతీక. స్వీటి ఆ కోవలోకే వస్తుంది. అసలు హీరోయిన్ అంటేనేగ్లామర్. కేవలం ఒక పాత్ర కోసం బరువు పెరగడం అంటే కెరీర్ చుట్టూ క్వశ్చన్ మార్క్‌లు పెట్టుకోవడమే. ఆ సాహసాన్ని అనుష్క చేసింది. సైజ్ జీరో సినిమా కోసం 17 కేజీలు బరువు పెరిగింది. -
ఆ సీన్ చేసేటప్పుడు విజయశాంతి నన్ను విసుక్కున్నారు: శరత్‌కుమార్
కోలీవుడ్ సీనియర్ హీరో శరత్‌కుమార్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఇటీవలె పరంపర వెబ్‌సిరీస్‌తోనూ ఆకట్టుకున్నారాయన. కాగా ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో మూవీ టీం ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శరత్‌కుమార్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 'నా మొదటి సినిమా తెలుగులోనే చేశాను. విజయశాంతి మెయిన్ లీడ్‌లో నటించిన సమాజంలో స్త్రీ అనే సినిమాలో నేను కూడా నటించాను. ఆరోజు ఓ సీన్లో ఆర్టిస్ట్ రాలేదు. ఆ నిర్మాత నాకు ఫ్రెండ్ కావడంతో నన్ను ఆ సీన్ చేయమని అడిగాడు. కానీ నాకు యాక్టింగ్ రాకపోవడంతో చాలా టేకులు తీసుకున్నా. అప్పటికే విజయశాంతి గారు చాలా ఓపిక పట్టారు. కానీ చాలా టేకులు అవుతుండటంతో.. నేను వెంటనే చెన్నై వెళ్లిపోవాలి. కొత్తవాళ్లని తీసుకొచ్చి నా టైమ్ ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? మంచి ఆర్టిస్టులను పెట్టొచ్చు కదా అని విసుక్కున్నారు. అయితే కొన్నాళ్లకు నటుడిగా నేను బిజీగా ఉన్న సమయంలో ఓ సినిమాలో మళ్లీ విజయశాంతి కాంబినేషన్లో నటించాల్సి వచ్చింది. అప్పుడు మీరు నన్ను ఆ సినిమాలో విసుక్కున్నారు అని సరదాగా చెప్పగా అయ్యో సారీ అండీ అని చెప్పి ఫీలయ్యారు' అని అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. -
చెన్నైలో శశికళను కలిసిన విజయశాంతి, కారణమేంటీ?
నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. బలవంతపు మత మార్పిడిని తట్టుకోలేక ఇటీవల ఓ విద్యార్థిని ఆత్మహత్య పాల్పడిన సంఘటన దేశవవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనిని వ్యతిరేకిస్తూ బీజేపీ తమిళనాడులో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువత్తాయి. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ ఘటనపై ఓ కమిషన్ వేయగా.. దీనికి విజయశాంతి సారథ్యం వహిస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న విజయశాంతి తంజావూరులోని బాలిక తల్లిదండ్రులను కలిశారు. అనంతరం చెన్నై వెళ్లి దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళను కలిశారు. శశికళ ఇంటికి వెళ్లి కాసేపు ఆమెతో భేటీ అయ్యారు. విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ.. శశికళతో మర్యాదపూర్వకంగా సమావేశం అయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జయలలిత తనపై చూపిన ప్రేమ గురించి విజయశాంతి గుర్తు చేసుకున్నారు. విజయశాంతి కలవడంపై శశికళ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా విజయశాంతి, శశికళను కలవడం ప్రస్తుతం హట్‌టాపిక్ మారింది. ఓ నటిగా జయలలితని గుర్తు చేసుకుంటూ శశికళని కలిశారా? లేదా పార్టీ పరంగా కలిశారా? అనేది తమిళనాడు రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. -
కరోనా కట్టడిలో సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నానాటికీ పెరుగుతున్న కరోనా కేసులతో ప్రజలు కలవరపడుతుంటే కేసీఆర్ సర్కార్ తగిన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. కరోనా కట్టడికి కేంద్రప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం రాష్ట్రం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయకపోగా.. మొదటి డోసు వ్యాక్సినేషన్ 100 శాతం వేశామని, రెండవ డోసు 80 శాతం వేశామని అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు అమలు చేయకుండా మద్యం అ మ్మకాలతో సొమ్ము చేసుకుంటున్న సర్కార్ కరోనా నిబంధనలు గాలికొదిలేసిందని ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. రోజూ లక్షకు పైగా కరోనా టెస్టు లు చేయాలని హై కోర్టు మొట్టికాయ లు వేస్తే, మళ్లీ జ్వర సర్వే పేరుతో పట్ట ణ, గ్రామీణ కార్యకర్తలను పరుగులు పెట్టిస్తున్నారన్నారు. కనీసం వారికి రక్షణగా మాస్కులు, శానిటైజర్లు అందించకపోవడంతో వారు తమ సొంత డబ్బులతో కొనుక్కోవాల్సిన దుస్థితి నెలకొందని విమర్శించారు. హెల్త్ డిపార్ట్మెంట్లో 10 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని రెండేళ్ల కిందట అసెంబ్లీలో స్వ యంగా వెల్లడించిన కేసీఆర్.. వాటి భర్తీకి ఎలాంటి చర్యలు తీసుకోకుండా జాప్యం చేస్తున్నారన్నారు. ప్రజల ప్రాణాలంటే లెక్క లేని ఈ నిర్లక్ష్యపు ముఖ్యమంత్రిని రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజానీకం గద్దె దించడం ఖాయమని హెచ్చరించారు. -
రావణరాజ్యం పోవాలంటే బీజేపీ గెలవాలి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రావణరాజ్యం పోయి రాముని రాజ్యం రావాలంటే బీజేపీని గెలిపించాలని మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. గురువారం ఆమె హుజూరాబాద్, జమ్మికుంటల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన రోడ్‌షోల్లో మాట్లాడుతూ, కేసీఆర్‌కు ఉద్యమకారులను మోసం చేయడం అలవాటేనని.. గతంలో ఆలె నరేంద్ర, తర్వాత తనను, నేడు ఈటలను పార్టీ నుంచి వెళ్లగొట్టారని విమర్శించారు. హుజూరాబాద్ ప్రజలు, సోషల్ మీడియాలో నెటిజన్ల ఉత్సాహం చూస్తుంటే రాజేందర్ విజయం ఖాయమైనట్లేనని విజయశాంతి అన్నారు. ఎన్నికల కోసమే ఈ పథకాన్ని తీసుకువచ్చారని దళితబంధు పథకాన్ని మూడునెలల కిందట ప్రకటించినా.. లబ్ధిదారులందరికీ రూ.10 లక్షలు ఎందుకు ఇవ్వలేదన్నారు. -
MAA Elections 2021: సీవీఎల్ నరసింహారావుకు విజయశాంతి మద్దతు
-
మా ఎన్నికలు: సీవీఎల్ నరసింహారావుకు విజయశాంతి మద్దతు
సాక్షి, హైదరాబాద్: 'మా' అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగిన సీవీఎల్ నరసింహారావుకు నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి మద్దతు తెలిపారు. 'మా' సభ్యురాలిని కాకున్నా ఒక కళాకారిణిగా ఈ అంశంపై స్పందిస్తున్నానన్నారు. ఎన్నికలపై సీవీఎల్ ఆవేదన న్యాయమైనదని వ్యాఖ్యానించారు. కాగా మధ్య తరగతి, చిన్న కళాకారులు, తెలంగాణ కళాకారులకు న్యాయం జరగటం కోసం పోటీ చేస్తున్నానంటూ సీవీఎల్ నరసింహారావు ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. 'మా'కు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రెండు విభాగాలు చేసి, రెండింటికీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. చదవండి: ఇండస్ట్రీకి సేవ చేయడమే నా కర్తవ్యం: మంచు విష్ణు -
నంబర్ వన్‌గా నిలబెట్టిన...గ్యాంగ్ లీడర్
ఒక్కో హీరో కెరీర్లో ఒక్కో సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. చరిత్ర ఉంటుంది. నటుడిగా మొదలై స్టార్‌గా ఎదిగి, మెగాస్టార్‌గా, ఆపై నంబర్ వన్‌గా మారే క్రమంలో హీరో చిరంజీవి చూసిన అలాంటి ఓ బాక్సాఫీస్ శిఖరం – ‘గ్యాంగ్ లీడర్’. విజయ బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి నటించగా బాక్సాఫీస్‌ను రప్ఫాడించి, చిరు మెగా ఇమేజ్ను సుస్థిరం చేసిన ‘గ్యాంగ్ లీడర్’ (1991 మే 9)కు నేటితో 30 వసంతాలు. అచంచల అగ్రపీఠికపై... తెలుగు సినీసీమలో తన తరంలో నంబర్ వన్ హీరోగా చిరంజీవిని ఆ స్థానంలో స్థిరంగా నిలబెట్టిన సినిమా అంటే ‘గ్యాంగ్ లీడర్’. ఫ్లాష్ బ్యాక్‌కి వెళితే.. ‘ప్రాణం ఖరీదు’(1978)తో తెర మీదకొచ్చిన చిరు ‘ఖైదీ’ (1983 అక్టోబర్ 28)తో స్టార్ హీరో అయ్యారు. తర్వాత అనేక సక్సెస్‌లు! తోటి హీరోలతో పోటీలు!! బిగ్ హిట్ ‘పసివాడి ప్రాణం’ (1987)తో పరిశ్రమ రేసులో చిరంజీవి ముందంజలోకి వచ్చారు. అయితే, నాగార్జున ‘శివ’ (1989 అక్టోబర్ 5) లాంటి హిట్లు ఆయనకు మళ్ళీ సవాలు విసిరాయి. దాన్ని విజయవంతంగా ఎదుర్కొని, ‘జగదేక వీరుడు – అతిలోక సుందరి’ (1990 మే 9)తో తన లీడ్‌ను నిలబెట్టుకున్నారు చిరు. కానీ, ‘రాజా విక్రమార్క’(1990), ‘స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్’ (1991 జనవరి 9) – వరుసగా రెండు చిత్రాలు నిరాశపరిచాయి. ‘గ్యాంగ్ లీడర్’ అప్పుడొచ్చింది. ‘జగదేక...’ రిలీజైన ఏడాదికి సరిగ్గా అదే తేదీన వచ్చింది. బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది. చిరంజీవి తిరుగులేని నంబర్ వన్ అని సుస్థిరపరిచింది. దటీజ్ ది హిస్టారికల్ ప్లేస్ ఆఫ్ ‘గ్యాంగ్ లీడర్’! టైటిల్ ఎలా వచ్చిందంటే.. నిజానికి, ముందు విజయ బాపినీడు తీయాలనుకున్న సినిమా ఇది కాదు. ఒకప్పుడు తాను తీసిన, మనసుకు బాగా నచ్చిన బ్లాక్ అండ్ వైట్ ఫ్యామిలీ డ్రామా ‘బొమ్మరిల్లు’ (’78) ప్రేరణతో, నాగబాబుతో ఓ సినిమా తీయాలనుకున్నారు. ‘షోలే’లోని గబ్బర్ సింగ్ పాత్రధారి అమ్జాద్ ఖాన్ డైలాగ్ ప్రేరణతో ‘అరె ఓ సాంబా’ అని టైటిల్ పెట్టాలనుకున్నారు. తీరా చిరంజీవి ఓ సినిమా చేద్దామని పిలిచేసరికి, అది పక్కనపెట్టి ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. ఆ ఫ్యామిలీ డ్రామాకే యాక్షన్ జోడించి ఈ కొత్త సినిమా తీశారు. అప్పటికే హీరో చిరంజీవికీ, ఫ్యా¯Œ ్సకూ వారధిగా నిలిచేలా ‘మెగాస్టార్ చిరంజీవి’ అనే ఓ మాసపత్రికను బాపినీడు నడుపుతున్నారు. సినీ రచయిత సత్యమూర్తి (సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తండ్రి) అందులో ‘గ్యాంగ్ లీడర్’ అనే ఓ సీరియల్ రాస్తున్నారు. ఆ పేరు మీద మోజుపడ్డ బాపినీడు, చిరంజీవిని ఒప్పించి మరీ దాన్నే టైటిల్‌గా పెట్టారు. ప్రజాభిప్రాయం తీసుకొని, వారు ఎంపిక చేసిన లోగో డిజైనే వాడారు. మధ్యతరగతి కుటుంబ కథ... పేరు యాక్షన్ సినిమాలా అనిపించినా, ఇది రఘుపతి (మురళీమోహన్), రాఘవ (శరత్ కుమార్), రాజారామ్ (చిరంజీవి) – అనే ముగ్గురు అన్నదమ్ముల సెంటిమెంట్ కథ. స్నేహితులతో కలసి అల్లరిచిల్లరగా తిరిగే నిరుద్యోగ యువకుడైన హీరో విచ్ఛిన్నం కాబోతున్న తన కుటుంబాన్ని కాపాడుకోవడమే కాక, సొంత అన్నయ్యను అన్యాయంగా చంపిన విలన్లను తుదముట్టించడం కథాంశం. మధ్యతరగతి యువకుడికి తగ్గట్టు రంగురంగుల కాటన్ షర్ట్స్, ఫేడెడ్ జీ¯Œ ్సతో చిరంజీవి వెరైటీ కాస్ట్యూమ్స్ అప్పట్లో ఓ క్రేజ్. సినిమా అంతా పూర్తయ్యాక ఫైనల్ వెర్షన్ ప్రివ్యూ చూసినప్పుడు, లె¯Œ ్త ఎక్కువైందని అరవింద్ బృందం భావించింది. అప్పటికప్పుడు నిడివి తగ్గించారు బాపినీడు. దానికి తగ్గట్టు చిరంజీవి మళ్ళీ డబ్బింగ్ చెప్పారు. ఇలా సమష్టి కృషి ‘గ్యాంగ్ లీడర్’. వాళ్ళందరికీ... కెరీర్ బ్రేక్ ఫిల్మ్! తెలుగులో బప్పీలహరి హవా ఓ ప్రభంజనమైంది ‘గ్యాంగ్ లీడర్’తోనే! దీంతోనే భువనచంద్ర క్రేజీ రచయిత య్యారు. అంతకు ముందు ‘జగదేక..’కి తండ్రి సుందరంకి సహాయకుడిగా ఉంటూ, సర్వం తానే అయి స్టెప్పులు సమకూర్చిన యువ ప్రభుదేవా ఈ చిత్రానికి అధికారిక డ్యా¯Œ ్స మాస్టర్ హోదాలో వాన పాట లాంటివాటితో కనువిందు చేశారు. సీనియర్ డ్యా¯Œ ్స మాస్టర్ తార అయితే సరేసరి... విశ్వరూపం చూపారు. బాపినీడుకు అల్లుడైన వల్లభనేని జనార్దన్‌కు నటుడిగా వరుస పాత్రలు అందించిందీ ‘గ్యాంగ్ లీడ’రే! ఒకే రోజు 4చోట్ల శతదినోత్సవం! అప్పట్లో స్పెషల్ ఫ్లైట్ ఆసరాగా ఒకే రోజున (చిరంజీవి బర్త్‌డే 1991 ఆగస్ట్ 22న) నాలుగు కేంద్రాల్లో (తిరుపతి, హైదరాబాద్, ఏలూరు, విజయ వాడ) ‘గ్యాంగ్ లీడర్’ శతదినోత్సవం ఓ అరుదైన విన్యాసం. అతిరథ మహారథులు రాగా, బాపినీడు ఏకంగా చిరంజీవికి స్వర్ణకిరీట ధారణ చేసి, చేతికి రాజదండమిచ్చి ఘనంగా సత్కరించడం మరో విశేషం. అప్పట్లో ‘అప్పుల అప్పారావు’ చిత్రకథలో నటి అన్నపూర్ణది చిరంజీవి ఫ్యా¯Œ ్స అసోసియేషన్ ప్రెసిడెంట్ పాత్ర. ఏలూరు శతదినోత్సవ బహిరంగ సభ దృశ్యాలను, వేదికపై చిరంజీవిని అన్నపూర్ణ స్వాగతించే దృశ్యాలను కథానుగుణంగా ఆ చిత్రంలో వాడారు. హ్యాట్రిక్ హిట్ల చిరంజీవితం! ‘గ్యాంగ్ లీడర్’ తరువాత ‘రౌడీ అల్లుడు’, ఆ వెంటనే ‘ఘరానా మొగుడు’ – ఇలా హ్యాట్రిక్ హిట్లు చిరంజీవి సాధించారు. వాటిలో ‘ఘరానా మొగుడు’ బాక్సాఫీస్ వద్ద çసృష్టించిన ప్రభంజనం మరో పెద్ద కథ. హీరోగా నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టినఫిల్మ్గా గ్యాంగ్ లీడర్ మెగాస్టార్‌కు సదా ఓ ఆకుపచ్చ జ్ఞాపకం. సూపర్ హిట్ సాంగ్స్ అప్పట్లో కొన్నేళ్ళ పాటు ‘గ్యాంగ్ లీడర్’ పాటలు వినపడని ఊరు, ఊగిపోని కుర్రకారు లేదు. తెలుగులో ‘సింహాసనం’ (1986) లాంటి చిత్రాలతో పాపులరైన బప్పీలహరి కూర్చిన బాణీలవి. ‘స్టేట్ రౌడీ’ (1989) తర్వాత చిరంజీవితో ఆయన పనిచేసిన రెండో సినిమా ఇది. వేటూరి, భువనచంద్ర సాహిత్యం సమకూర్చారు. విజయ బాపినీడు ‘నాకూ పెళ్ళాం కావాలి’ (’87) ద్వారా పరిచయమైన రచయిత భువనచంద్ర. ‘గ్యాంగ్ లీడర్’లో రెండు పాటలు (‘పాలబుగ్గ..’, ‘వయసు వరసగున్నది వాటం..’) వేటూరి రాస్తే, మిగతావన్నీ భువనచంద్ర రచనలు. టైటిల్ సాంగ్ మొదలు ‘వానా వానా వెల్లువాయె..’, ‘భద్రాచలం కొండ..’, ‘సండే అననురా...’ – ఇలా అరుదైన రీతిలో... ఆల్బమ్‌లోని ఆరు పాటలూ హిట్టే. బప్పీలహరి సంగీతం, చిరంజీవి స్టెప్పులు, విజయశాంతి గ్లామర్, ఎస్పీబీ – చిత్ర గాత్రంలోని భావవ్యక్తీకరణ అన్నీ ఈ పాటల్లో హైలైటే! ఈ తరం మోస్ట్ పాపులర్ వానపాటల్లో మొదటి వరుసలో నిలబడ్డ ‘వాన వాన వెల్లువాయె..’ భువనచంద్రకు తొలి సినీ వాన పాట. హైదరాబాద్ నుంచి మద్రాసుకు రైలులో బయలుదేరిన భువనచంద్ర పొద్దున్న రైలు దిగే లోగా... ఈ పాటతో సహా నాలుగు పాటలూ రాసేశారు. ఆడియో రిలీజయ్యాక ఆ పాటలన్నీ ఛార్ట్ బస్టర్ గా నిలిచిపోవడం ఓ చరిత్ర. ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సాలూరి వాసూరావు సమకూర్చారు. సరిగ్గా 21 ఏళ్ళకు ‘గ్యాంగ్ లీడర్’లోని అదే ‘వాన వాన వెల్లువాయె...’ పాటను మళ్ళీ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌తో ‘రచ్చ’ (2012)లో మణిశర్మ రీమిక్స్ చేశారు. ‘వాన..’ పాటలో సెట్స్‌పై మెగా జోడీ, యువ ప్రభుదేవా హిందీలోనూ..! ఆకాశానికెత్తిన మీడియా!! ‘గ్యాంగ్‌లీడర్’ అదే పేరుతో తమిళంలోకి అనువాదమై, 1991 లోనే నవంబర్ 30న తమిళనాట రిలీజై, సక్సెస్ సాధించింది. తమిళంలో చిరంజీవికి సాయికుమార్ డబ్బింగ్ చెప్పడం విశేషం. కేరళలో తమిళ వెర్షన్‌ను రిలీజ్ చేస్తే, అక్కడా మంచి వసూళ్ళు సాధించింది. తరువాత హిందీ నిర్మాత ఎన్.ఎన్. సిప్పీ ఇదే కథను చిరంజీవితోనే హిందీలో రీమేక్ చేశారు. చిరంజీవికి ఇది రెండో హిందీ సినిమా. తొలి హిందీ సినిమా ‘ప్రతిబంధ్’ (తెలుగు ‘అంకుశం’కి రీమేక్ – 1990 సెప్టెంబర్ 28) లానే ఈ రీమేక్‌కీ రవిరాజా పినిసెట్టి దర్శకులు. చిరంజీవి సరసన మీనాక్షీ శేషాద్రి నటించగా, ఆనంద్ – మిళింద్ సంగీతంలో ఈ రీమేక్ ‘ఆజ్కా గూండా రాజ్’ (1992 జూలై 10) పేరుతో విడుదలైంది. తెలుగులో చిరంజీవి పిన్ని కొడుకు దుర్గబాబు నటించిన ఫ్రెండ్ పాత్రను ఆ హిందీ వెర్షన్లో నేటి తరం హీరో రవితేజ పోషించడం విశేషం. గమ్మత్తేమిటంటే, తెలుగునాట చిరుకు ఉన్న క్రేజ్ దష్ట్యా ఆ కొత్త హిందీ బాణీలకు తెలుగులో పాటలు రాయించి, ఆ డబ్బింగ్ సాంగ్స్‌ను ఇక్కడ రిలీజ్ చేయడం. అప్పట్లో ‘గూండా రాజ్’ పేరిట లియో సంస్థ ద్వారా ఆ డబ్బింగ్ పాటల క్యాసెట్లు మార్కెట్లోకి వచ్చాయి. ఒక హీరో తెలుగు సినిమా హిందీలో రీమేకై, మళ్ళీ ఆ హిందీ రీమేక్ పాటలు తెలుగులోకి డబ్బింగ్ అవడం అరుదైన ఘటన. డ్యాన్స్, ఫైట్లలో ఉత్తరాదినీ సమ్మోహనపరచిన చిరంజీవి గురించి ఇంగ్లీష్ మేగజైన్లు ముఖచిత్ర కథనాలు రాసి, ఆకాశానికెత్తాయి. ‘ఆజ్ కా గూండారాజ్’లో మీనాక్షీ శేషాద్రితో... 50 కేంద్రాలు... 100 రోజులు... ‘గ్యాంగ్ లీడర్’ పెద్ద హిట్. దాని రిలీజ్‌కు 5 వారాల ముందు తెలుగునాట టికెట్ రేట్లు పెరిగాయి. అదే సమయంలో తెలుగుగడ్డపై తీసిన చిత్రాలకు వినోదపన్నులో భారీ రాయితీ కల్పించింది ప్రభుత్వం. అప్పటికి ఉన్న ట్యాక్స్‌లో ఏకంగా పెద్ద సినిమాలకు దాదాపు 40 శాతం, చిన్న సినిమాలకు 70 శాతం మేర రాయితీ ఇచ్చారు. అలా టికెట్లు రేట్లు పెరిగాక, రాయితీలిచ్చాక వచ్చిన తొలి పెద్ద హిట్ ఇదే! నిజానికి, పెరిగిన టికెట్ రేట్ల ప్రభావం తెలియక ముందే, ఈ సినిమా ప్రదర్శన హక్కులను మామూలు వ్యాపార లెక్కల చొప్పున అమ్మేశారు. తీరా రిలీజయ్యాక పెరిగిన టికెట్ రేట్లలోనూ జనాదరణ బ్రహ్మాండంగా ఉండడంతో, ‘గ్యాంగ్ లీడర్’ వసూళ్ళ వర్షం కురిపించింది. బయ్యర్లందరికీ లాభాల పంట చేతికి అందింది. 75కి పైగా ప్రింట్లతో రిలీజై, ఏకంగా 30 కేంద్రాలలో నేరుగా, మరో 15 – 20 కేంద్రాలలో నూన్‌షోలతో... అన్నీ కలిపి 50 సెంటర్లలో ‘గ్యాంగ్ లీడర్’ వంద రోజులు పూర్తి చేసుకుంది. హైదరాబాద్ సుదర్శన్ 70 ఎం.ఎంలో ఏకంగా 162 రోజులు ఆడింది. చిరంజీవి ‘రౌడీ అల్లుడు’ వచ్చి, సిల్వర్ జూబ్లీ మిస్సయింది. తెలుగు సినీ రాజధాని విజయవాడలో శాంతి థియేటర్‌ను శాంతి, ప్రశాంతి అంటూ రెండుగా చేశాక, వాటిలో వచ్చిన తొలి సినిమా ‘గ్యాంగ్ లీడ’రే! ఏకకాలంలో ఆ రెండిట్లోనూ 6 వారాలాడింది. అంతకు ముందు శారద– శోభన్‌బాబుల ‘మనుషులు మారాలి’(’69) ఇలాగే విజయవాడలో ఒకేసారి రెండు (లీలామహల్, శేష్ మహల్) హాళ్ళలో 6 వారాలాడిన ఘనత దక్కించుకుంది. తర్వాత మళ్ళీ 22ఏళ్ళకు గ్యాంగ్‌లీడర్ సినీలవర్ల బెజవాడలో ఆ అరుదైన విన్యాసం చేసింది. ఇటు మెగాస్టార్... అటు లేడీ అమితాబ్... ‘గ్యాంగ్‌లీడర్’కు చిరంజీవితో పాటు విజయశాంతి పెద్ద ప్లస్. ‘కర్తవ్యం’ (1990 జూన్ 29) హిట్టయ్యాక, యాక్షన్ హీరోలకు దీటుగా విజయశాంతికి ‘లేడీ అమితాబ్’ అనే ఇమేజ్ ఉన్న రోజులవి. ‘కర్తవ్యం’ నుంచి ప్రేక్షక, ట్రేడ్ వర్గాలు రెండూ ఆమెను ఒక హీరోలా చూడడం మొదలెట్టాయి. అలా ఆ కాలంలోనే ‘ఆశయం’, ‘పోలీస్ లాకప్’ లాంటివి ఆమెతో వచ్చాయి. అందుకే, ట్రేడ్ వర్గాల దృష్టిలో ‘గ్యాంగ్ లీడర్’ ఏకంగా ‘డబుల్ స్టారర్’గా నిలిచింది. ఊటీలో ‘గ్యాంగ్ లీడర్’లోని ‘భద్రాచలం కొండ...’ పాట షూటింగ్ జరుగుతున్నప్పుడే, ‘కర్తవ్యం’లో ఉత్తమ నటిగా విజయశాంతికి నేషనల్ అవార్డ్ వరించింది. వార్త తెలిసిన వెంటనే చిరంజీవి ఆమెను అభినందించి, అందరికీ పార్టీ ఇచ్చారు. ‘గ్యాంగ్ లీడర్’లో చిరు, విజయశాంతి పోటీ పడి నటించారు. ఆ ముందు ‘యముడికి మొగుడు’ (’88), ‘స్టేట్‌రౌడీ’(’89)లాంటి వాటితో చిరంజీవి పక్కన డ్యా¯Œ ్స అంటే హీరోయిన్ రాధ తప్ప మరొకరు లేరనే భావన ఉండేది. కానీ ‘గ్యాంగ్ లీడర్’తో డ్యాన్సులో చిరంజీవితో ఢీ అంటే ఢీ అన్నారు విజయశాంతి. టైటిల్ సాంగ్ మినహా, 5 పాటలూ హీరో, హీరోయిన్ మధ్యే ఉండడం, అన్నీ మ్యూజిక్ – డ్యాన్సుల్లో హిట్టవడం మరో అరుదైన ఘటన. అది ఈ జంటకే సాధ్యమైంది. అయితే, ‘గ్యాంగ్ లీడర్’ ఘనత తమదంటే తమదని వారిద్దరూ అనుకున్నట్టు గుసగుసలొచ్చాయి. ∙చిరంజీవి, విజయశాంతి పరుచూరి బ్రదర్స్ శకంలో... ‘గ్యాంగ్ లీడర్’ సూపర్ హిట్‌కు డైలాగ్స్ కూడా కారణం. బాపినీడు తొలిసారిగా పరుచూరి బ్రదర్స్‌ను డైలాగ్ రైటర్స్‌గా పెట్టుకున్నారు. బాపినీడు తన మనసుకు దగ్గరైన పాత ‘బొమ్మరిల్లు’ కథకు, సెకండాఫ్‌లో హిందీ ‘ఘాయల్’ను అనుసరిస్తూ ఈ కథ సిద్ధం చేసుకున్నారు. కథ సిద్ధం కావడంలో ఎం.వి.వి.ఎస్. బాబూరావు సహకరించారు. కథలో, స్క్రీన్‌ప్లేలో పరుచూరి సోదరుల సలహాలూ ఉపకరించాయి. అప్పట్లో ఆ అన్నదమ్ములు రాసిందల్లా బాక్సాఫీస్ బంగారమైంది. ముఖ్యంగా, 1990 – 91 కాలంలో ఇండస్ట్రీలో సంచలనమైన – విజయశాంతి ‘కర్తవ్యం’, వెంకటేశ్ ‘బొబ్బిలిరాజా’, బాలకృష్ణ ‘లారీ డ్రైవర్’, శోభన్‌బాబు – సుమన్‌ల ‘దోషి – నిర్దోషి’, హరీశ్ – మాలాశ్రీల ‘ప్రేమఖైదీ’, మోహన్‌బాబు ‘అసెంబ్లీ రౌడీ’, చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’– ఈ ఏడు సినిమాలూ రచయితలుగా పరుచూరి బ్రదర్స్ కలం చేసుకున్నవే. వేర్వేరు ఇమేజ్లున్న ఆ ఏడు చిత్రాల హీరోలనూ ఆ సినిమాలు కొత్త ఎత్తులకు తీసుకువెళ్ళడం మరో చరిత్ర. ‘గ్యాంగ్ లీడర్’లో రావు గోపాలరావుతో ‘‘కన్నాంబకు ఎక్కువ – కాంచనమాలకు తక్కువ’’అంటూ చిత్రమైన మేనరిజమ్ డైలాగ్స్ పెట్టారు. జనజీవితంలో ఈ ఫక్కీలో డైలాగ్స్ చెప్పుకోవడం అప్పట్లో ఓ క్రేజ్. అసలీ తరహా డైలాగ్ మూలసృష్టికర్త– సినీ రచయిత ఎం.వి.ఎస్. హరనాథరావు. ‘నవయుగం’(’90) చిత్రంలో ‘‘వీడు కత్తికి ఎక్కువ, బాంబుకు తక్కువ’’ అని ఒకే ఒక్క డైలాగ్ రాశారాయన. అదిచూసి ముచ్చట పడ్డ పరుచూరి గోపాలకృష్ణ, ‘గ్యాంగ్ లీడర్’లో పాత్రకు సినిమా అంతటా ఈ తరహా డైలాగ్స్ పెట్టడం హిట్ పాయింటైంది. అలాగే, చిరంజీవి సొంత ఐడియా ‘రప్ఫాడిస్తా’ అనే ఊతపదం మోస్ట్ పాపులరైంది. బామ్మ నిర్మలమ్మతో ఫోటోలో నుంచి వచ్చినట్టు తాత గెటప్‌లో చిరంజీవి మాట్లాడే సీన్లు, ‘శబరీ’ డైలాగ్ ట్రాక్ చిరంజీవి చేసిన ఇంప్రొవైజేషన్లే! అవీ హిట్! సెట్స్‌పై బాపినీడు, పరుచూరి గ్యాంగ్‌తో... – రెంటాల జయదేవ -
‘కేసీఆర్, జానారెడ్డిలు తోడుదొంగలే..’
హైదరాబాద్: సీఎం కేసీఆర్ రాకతో నాగార్జున సాగర్ ఉపఎన్నిక ప్రచారం మరింత జోరందుకుంది. హాలియాలో జరిగిన సీఎం కేసీఆర్ ప్రచార సభను ఉద్దేశించి తెలంగాణ బీజేపీ నాయకురాలు, సినీ నటి విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రచార సభలో సీఎం ప్రసంగం పాత చింతకాయ పచ్చడి మాదిరిగానే ఉందని విమర్శించారు. రానున్న రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు . ఈ విషయం కేసీఆర్ కళ్లల్లో స్పష్టంగా కన్పిస్తోందని విజయశాంతి తెలిపారు. అంతేకాకుండా తెలంగాణ కాంగ్రెస్ నేతలను కూడా విజయశాంతి విమర్శించారు. కేసీఆర్, జానారెడ్డిలు తోడు దొంగలని, వారు మంచి మిత్రులనే విషయాన్ని గుర్తుచేశారు. ఒప్పందం ప్రకారమే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతిని సరైన సమయంలో ప్రజల ముందు ఉంచుతామని విజయశాంతి తెలిపారు. హాలియాలో జరిగిన ప్రచార సభలో సీఎం పోడు భూముల సమస్యలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల తలకాయలు చావు నోట్లో ఉన్నాయని విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంబేడ్కర్ జయంతికి కనీసం నివాళులర్పించలేని పరిస్థితిలో సీఎం కేసీఆర్ ఉన్నారని విమర్శించారు. అంతేకాకుండా, సీఎం కేసీఆర్ దొంగ నిరాహార దీక్ష వలన తెలంగాణ రాలేదని అభిప్రాయపడ్డారు. ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు ఆపేస్తామని టీఆర్ఎస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. చదవండి: సభను అడ్డుకునేందుకు ప్రయత్నించారు: కేసీఆర్ -
నాంపల్లి హైకోర్టుకు హాజరైన విజయశాంతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటాలు చేసిన ఉద్యమకారులను ముఖ్యమంత్రి కేసీఆర్ అణిచివేయలని చూస్తున్నాడని నటి, బీజేపీ నేత విజయశాంతి విమర్శించారు. ఈ మేరకు గురువారం రాములమ్మ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనపై అక్రమ కేసులు పెట్టి, భయాందోళనకు గురి చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నాడని మండిపడ్డారు. 2012 మహబూబ్ నగర్లో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు అనుమతి లేదని తనకు నాలుగు రోజుల క్రితం నాంపల్లి కోర్టు నుంచి నోటీసులు వచ్చాయన్నారు. ఆ సభను నిర్వహించింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని, కేసు పెడితే పార్టీ అధ్యక్షుడుగా ఉన్న ఆయన పైననే పెట్టాలని డిమాండ్ చేశారు. 2012లో జరిగిన ఘటనకు తొమ్మిదేళ్ల తరువాత కేసు పెట్టించడంలో ముఖ్యమంత్రి భయం అర్థం అవుతుందన్నారు. న్యాయ వ్యవస్థ పట్ల తనకు నమ్మకం ఉందని, ఆ దిశగా పోరాడుతానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎన్ని కేసులు పెట్టించినా తాను బయపడనని స్పష్టం చేశారు. చదవండి: ప్రముఖ సీనియర్ నటికి బ్లడ్ క్యాన్సర్.. -
‘కేసీఆర్‌తో కలిసి పనిచేసినందుకు సిగ్గుపడుతున్నా’
సాక్షి, సూర్యాపేట: గుర్రంపోడు గిరిజన రైతులకు బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. న్యాయం కోసం పోరాడితే పోలీసులు లాఠీఛార్జ్ చేశారని మండిపడ్డారు. ఆదివారం ఆయన బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్,రఘునందన్ రావు, ఆ పార్టీ సీనియర్ నాయకురాలు విజయ శాంతి,మాజీ ఎంపీ వివేక్లతో కలిసి ‘గిరిజన భరోసాయాత్ర’ పేరుతో గిరిజన భూముల సందర్శించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. గిరిజనుల దాడిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేవారు. గిరిజనుల ప్రతి కన్నీటి చుక్క టీఆర్ఎస్పై ఎదురుదాడికి దిగుతుందని హెచ్చరించారు. టీఆర్ఎస్ కరెప్షన్ ఉన్న క్యారెక్టర్ లేని పార్టీ అని విమర్శించారు. బీజేపీకి ఓట్లు, సీట్లు ముఖ్యం కాదని, పేదల బాగోగులే ముఖ్యమని చెప్పారు. పేదల ఉసురు సీఎం కేసీఆర్‌కు తగలకమానదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు న్యాయం: విజయశాంతి అధికారం ఉందని సీఎం కేసీఆర్ దోచుకుంటున్నారని బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. కేసీఆర్‌తో కలిసి పనిచేసినందుకు సిగ్గు పడుతున్నానని అన్నారు. టీఆర్ఎస్కు రెండోసారి అధికారం ఇచ్చి ప్రజలు తప్పు చేశారని ఆమె పేర్కొన్నారు. ఇంకా పదేళ్లు కేసీఆర్ సీఎంగా ఉంటే తెలంగాణ ఏమై పోతుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు టీఆర్ఎస్ నేతలపై తిరగబడాలని పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని విజయశాంతి చెప్పుకొచ్చారు. -
అన్నదాతల పాలిట రాబందు కేసీఆర్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతు బంధు సంగతి దేవుడెరుగు, రాష్ట్రాన్ని చూస్తుంటే రైతు అన్ని విధాలుగా ‘బంద్’ అయ్యేలా సీఎం కేసీఆరే అన్నదాతల పాలిట రాబందులా కనిపిస్తున్నారని బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. దీంతో పరిస్థితులు ఘోరంగా మారిపోయాయని ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని మూసేస్తామని కేసీఆర్ అలా అన్నారో లేదో దాదాపు 4 వేల కొనుగోలు కేంద్రాలకు తాళాలు పడ్డాయని సోషల్ మీడియా వేదికగా దుయ్యబాట్టారు. ఫలితంగా మిల్లర్లు, వ్యాపారులు రైతులకు చుక్కలు చూపిస్తూ ధర తగ్గించేశారని అన్నారు. చదవండి: కేసీఆర్ హామీలు పిట్టలదొర కబుర్లే మరోవైపు రైతుల దగ్గరే దాదాపు 40 లక్షల టన్నుల ధాన్యం మిగిలిపోయినట్లు తెలుస్తోందన విజయశాంతి తెలిపారు. ఈ ధాన్యం సంగతేమిటో తెలంగాణ రైతుకు మిగిలేదేమిటో సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీఆరెస్ ప్రభుత్వానిదే అని ఆమె డిమాండ్ చేశారు. ఎంఎస్పీ లేదా కొనుగోలు కేంద్రాలపై కేంద్రం చెప్పని ప్రయోగాలను తెలంగాణలో చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలపై పగ తీర్చుకునే కార్యక్రమాన్ని చేపట్టారని విమర్శించారు. -
బీజేపీలో చేరిన విజయశాంతి
-
రేపు బీజేపీలో చేరనున్న విజయశాంతి
సాక్షి, ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో విజయశాంతి భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో వెళ్లి అమిత్‌షాను కలిశారు. రేపు బీజేపీలో విజయశాంతి చేరనున్నారు. భేటీ అనంతరం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ విజయశాంతి తిరిగి మాతృ సంస్థకు చేరడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆమె క్రియాశీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ను ఎదుర్కొనే ఏకైక పార్టీ బీజేపీయేనన్నారు. తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ అణచివేశారని ఆయన విమర్శించారు. కుటుంబ, అవినీతి పాలనపై పోరాటం చేస్తామన్నారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై అమిత్ షా అభినందించారని ఆయన వెల్లడించారు. తాము ఆకర్ష్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదని, తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయంగా ఆయన పేర్కొన్నారు. (చదవండి: బీజేపీ: ఆపరేషన్ ఆకర్ష్..) -
బీజేపీలోకి రాములమ్మ
-
ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, సినీ నటి విజయశాంతి పార్టీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆదివారం ట్వీట్ చేశారు. తెలంగాణలో బీజేపీ బలపడిందంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతల్లో కొందరిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రలోభపెట్టి, మరికొందరిని భయపెట్టి టీఆర్ఎస్లోకి తీసుకున్నారని, ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చి పార్టీలో కి ఫిరాయింపులు చేయించారని రాములమ్మ ఆరోపించారు. కాంగ్రెస్‌ను బలహీనపరచడమే పనిగా పెట్టుకున్న కేసీఆర్‌కు.. ఇప్పుడు బీజేపీ సవాలు విసిరే స్థాయికి వచ్చిందని అన్నారు. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత సీఎం కేసీఆర్‌కు వర్తిస్తుందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌గా మాణిక్కం ఠాగూర్ మరికొంత ముందుగా వచ్చి ఉంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు మెరుగ్గా ఉండేవని విజయశాంతి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని కాలం, ప్రజలే నిర్ణయించాలని ఆమె ట్విటర్లో పేర్కొన్నారు. -
విజయశాంతి కాంగ్రెస్‌లోనే ఉంటారు..
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి పార్టీ మారుతారంటూ వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. విజయశాంతి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ తెలిపారు. ఆయన బుధవారం విజయశాంతితో భేటీ అనంతరం మాట్లాడుతూ... ‘విజయశాంతికి రాహుల్ గాంధీ, సోనియాగాంధీ అంటే ఎంతో గౌరవం. కరోనా కారణంగా ఆమె ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఆమె పార్టీలోనే ఉంటారు. పార్టీ మారుతారనేది ప్రచారం మాత్రమే. విజయశాంతిని మేమంతా ఎంతో గౌరవిస్తాం. కరోనా కారణంగానే కొత్త ఇన్ఛార్జ్ను కలవలేకపోయినట్లు చెప్పారు’ అని అన్నారు. కాగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సోమవారం విజయశాంతి నివాసానికి వెళ్లి ఆమెతో దాదాపు గంటపాటు భేటీ అయిన విషయం తెలిసిందే. (పాతగూటికి ‘రాములమ్మ’?) విజయశాంతితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కుసుమ కుమార్ -
పాతగూటికి ‘రాములమ్మ’?
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్, మాజీ ఎంపీ విజయశాంతి అడుగులు ఎటువైపనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి సోమవారం విజయశాంతి నివాసానికి వెళ్లి ఆమెతో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు ఇరువురూ చర్చలు జరిపారు. పార్టీ ప్రచార కమిటీకి సారథ్యం వహిస్తోన్న ఆమె తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచారానికి వెళ్లకపోవడం, చాలాకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో కిషన్‌రెడ్డితో భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. పాతగూటికి రావాలని, బీజేపీలోకి వస్తే తగిన ప్రాధాన్యం కల్పిస్తామని విజయశాంతిని కిషన్‌రెడ్డి ఆహ్వానించారని, తనకు కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలి పట్ల అసంతృప్తి ఉన్నా ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని ఆమె చెప్పారనే ప్రచారం జరుగుతోంది. (ఉపఎన్నిక.. ‘దుబ్బాక’ కాక) రావడం లేదెందుకో? వాస్తవానికి విజయశాంతి కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో చాలాకాలంగా స్తబ్దుగా ఉంటున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పార్టీ ప్రచార కమిటీ బాధ్యతలు అధిష్టానం అప్పగించినా రాష్ట్ర నాయకత్వం సహకరించలేదనే అసంతృప్తి ఆమెకు ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె కాంగ్రెస్ కార్యకలాపాల్లో చురుకుగా పాలు పం చుకోవట్లేదు. పార్టీ సమావేశాలకు కూడా వరుసగా గైర్హాజరు అవుతున్నారు. ఇటీవల పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా మాణిక్యం ఠాగూర్ తొలిసారి రాష్ట్రానికి వచ్చినప్పుడు జరిగిన సమావేశాలకు ఆమెను ఆహ్వానించినా వెళ్లకుండా తన ఉద్దేశాన్ని ఢిల్లీ పెద్దలకు తెలిపారు. ఇక, దుబ్బాక ఎన్నికల వ్యవహారంలో ఆమెను పార్టీ కానీ, పార్టీని ఆమె కానీ పట్టించుకున్నట్టు కనిపించలేదు. రాష్ట్ర నాయకత్వం కూడా విజయశాంతి వస్తే స్వాగతిస్తామని, పార్టీ కా ర్యకలాపాలకు ప్రత్యేక ఆహ్వానాలు ఉండవనే ధోరణిలోనే వ్యవహరిస్తోంది. దీంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులకు, విజయశాంతికి మధ్య రాజకీయదూరం పెరిగింది. కాగా, పార్టీ మారే ఆలోచన ప్రస్తుతానికి లేదని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేమని రాములమ్మ వర్గం వ్యాఖ్యానిస్తోంది. -
‘రాములమ్మ’కి మహేశ్ బర్త్‌డే విషెష్
సాక్షి, హైదరాబాద్ : లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పుట్టిన రోజు నేడు(జూన్ 24). ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ‘రాములమ్మ’కు శుభాకాంక్షలు తెలియజేశారు. సూపర్ స్టార్ మహేశ్‌బాబు సైతం విజయశాంతికి బర్త్ డే విషెస్ తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్ డే విజయశాంతి గారు. ఎల్లప్పుడూ ఆరోగ్యం, సంతోషం మీ వెంటే ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ సూపర్‌స్టార్ మహేశ్ ట్విటర్ ద్వారా విజయశాంతికి పుట్టినరోజు అభినందనలు తెలిపారు. దీనికి ఆమె 'థ్యాంక్యూ సూపర్ స్టార్ మహేశ్‌బాబు గారు' అని రిప్లై ఇచ్చారు. అలాగే ‘సరిలేరు నీకెవ్వరు’ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా విజయశాంతికి బర్త్ డే విషెష్ తెలిపారు. ‘హ్యాపీ బర్త్ డే విజయశాంతి గారు.. మీరు నటించే సినిమాకు మీరే అతి పెద్ద ఆస్తి, బలం. సరిలేరు నీకెవ్వరు చిత్రానికి మీరు అందించిన కృషి మాటల్లో వర్ణించలేను' అని ట్వీట్ చేశారు. (చదవండి : మహేశ్‌తో 'జనగణమన' నా డ్రీమ్) 90వ దశకంలో అగ్రతారలందరితో నటించి లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకున్నారు విజయశాంతి. తనదైన నటనతో గ్లామర్ సినిమాలే కాదు, మహిళా ప్రధాన చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. అప్పటి హీరోలకు ధీటుగా యాక్షన్ సినిమాల్లోనూ, విప్లవాత్మక చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి, కొద్ది కాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. చాలా కాలం తర్వాత సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా చేసిన‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ తర్వాత విజయశాంతికి భారీగానే ఆఫర్లు వచ్చాయట. కానీ విజయశాంతి వేటిని అంగీకరించలేదని తెలుస్తోంది. -
మహేశ్ బాబు భావోద్వేగ ట్వీట్
71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తన జీవితంలో మరపురానివని సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అన్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా సరిలేరు నీకెవ్వరూ చిత్ర బృందం హైదరాబాద్‌లోని భద్రతా బలగాలను కలిసింది. దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ ధైర్య, సాహసాలతో విధులు నిర్వర్తించే మన జవాన్లను కలవడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని సినీనటుడు మహేశ్ బాబు వెల్లడించారు. ఈమేరకు ట్వీట్ చేశారు. (సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ చెప్పనున్న మహేశ్!) 'మనల్ని ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుతున్న భారత హీరోలకు సెల్యూట్ చేస్తూ.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు' తెలుపుతున్నట్టుగా సూపర్‌స్టార్ పేర్కొన్నారు. లేడీ అమితాబ్ విజయశాంతి, చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి కూడా మహేశ్‌తో ఉన్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు జవాన్‌గా నటించిన విషయం తెలిసిందే. (సరిలేరు నీకెవ్వరు : మూవీ రివ్యూ) It was such an honour meeting all the brave soldiers. This was undoubtedly one of my most memorable days! Huge salute to the nation's heroes who continue to protect us everyday🙏🏼#SarileruMeekevvaru🙏🏻🙌#HappyRepublicDay! 🇮🇳 pic.twitter.com/YIqDafYuUg — Mahesh Babu (@urstrulyMahesh) January 26, 2020 -
వరంగల్ లో ’సరిలేరు నీకెవ్వరు‘ విజయోత్సవ సభ
-
వందకోట్ల క్లబ్బులో సరిలేరు
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజామూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సంక్రాంతి పండుగ వేళ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేలా తెరకెక్కిన ఈ సినిమా తొలి మూడురోజుల్లోనే వందకోట్ల మార్క్‌ను దాటేసింది. బ్లాక్‌బస్టర్ కా బాప్‌గా బాక్సాఫీస్ వద్ద హల్చల్ చేస్తున్న ఈ సినిమా మూడు రోజుల్లో 103 కోట్ల రియల్ గ్రాస్ వసూలు చేసిందని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు మహేశ్‌బాబుతో కూడిన సరిలేరు నీకెవ్వరు పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.46.77 కోట్ల షేర్ సాధించిన విషయం తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ.32.77 కోట్ల షేర్ రాబట్టినట్లు సమాచారం. ఇక, రెండోరోజు శనివారం సుమారు 20 కోట్ల వరకు ఈ సినిమా రాబట్టిందని అంటున్నారు. మొత్తానికి తొలిమూడురోజుల్లోనే ఈ సినిమా వందకోట్లు వసూలు చేసిందని చిత్రయూనిట్ వెల్లడించింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి 13ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. భరత్ అనే నేను, మహర్షి వంటి హిట్స్ తర్వాత మహేశ్ నటిస్తున్న సినిమా కావడం.. పటాస్ నుంచి ఎఫ్2 వరకు కమర్షియల్ పంథాలో సినిమాలు తీస్తూ హిట్స్ ఇస్తున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడంతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో పెద్దగా కథ లేకపోయినా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే అంశాలపై దర్శకుడు అనిల్ బాగా ఫోకస్ చేశాడని రివ్యూలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పండుగ సీజన్లో బాక్సాఫీస్ వద్ద ‘సరిలేరు నీకెవ్వరు’ భారీగానే వసూళ్లు రాబట్టినట్టు ట్రెడ్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. -
సరిలేరు నీకెవ్వరు
-
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా స్టిల్స్
-
సీఎం జగన్‌కు విజయశాంతి అభినందనలు
సాక్షి, హైదరాబాద్: యావత్ దేశాన్ని కదిలించిన దిశ ఘటన నేపథ్యంలో అత్యాచార బాధిత మహిళలకు సత్వర న్యాయం అందించేందుకు కొత్త చట్టం తీసుకురావాలని నిర్ణయించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్, సినీ నటి విజయశాంతి అభినందించారు. ‘వెటర్నరీ డాక్టర్ దిశపై జరిగిన అమానుష దాడితో యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడి పడింది. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ఉండాలన్న లక్ష్యంతో బాధిత మహిళలకు సత్వర న్యాయం జరిగేవిధంగా కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్టు పేర్కొన్న సీఎం వైఎస్ జగన్‌ను అభినందిస్తున్నాను. ఈ కొత్త చట్టం గురించి అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం జగన్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా ద్వారా మహిళలపై అసభ్య సందేశాలు పంపే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం హర్షనీయం. మహిళల భద్రత కోసం ఏపీతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే తరహా చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాను’ అని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన కేసుల్లో నిందితులకు సత్వరమే శిక్ష పడేలా చట్టాల్లో మార్పు తీసుకు రావాల్సిన అవసరం ఉందని సీఎం వైఎస్ జగన్ సోమవారం ఏపీ అసెంబ్లీలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ‘మహిళా భద్రతపై స్వల్పకాలిక చర్చ’లో భాగంగా ముఖ్యమంత్రి సోమవారం అసెంబ్లీలో ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. రాష్ట్రంలో చిన్నపిల్లలపై జరుగుతున్న సంఘటనలతో పాటు హైదరాబాద్‌లో జరిగిన ‘దిశ’ ఉదంతం తన మనసును ఎంతో కలిచివేసిందని, తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, ఓ తండ్రిగా ఆ బాధను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఆడపిల్ల, తల్లి, చెల్లి సురక్షితంగా ఉండాలన్న ముఖ్యమంత్రి అఘాయిత్యాలకు పాల్పడిన వారికి మూడు వారాల్లో శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. వారంలో విచారణ, రెండో వారంలో ట్రయిల్, మూడో వారంలో శిక్ష పడేలా చట్టంలో మార్పులు తీసుకు వస్తామని ఆయన స్పష్టం చేశారు. -
‘మాకు విజయశాంతే కావాలి అనేవారు’
సుమారు దశాబ్ద కాలం తర్వాత సీనియర్ నటి విజయశాంతి ‘సరి లేరు నీకెవ్వరు’ తో రీఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు టాలీవుడ్లో తన నటన, డ్యాన్స్‌లతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న నాటి అగ్రనటి రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమాలకు దూరమయ్యారు. నాయుడమ్మ(2006) తర్వాత మళ్లీ మేకప్ వేసుకుని కెమెరా ముందుకు రాబొతున్న విజయశాంతి తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత హీరోయిన్లలో సినిమా పట్ల శ్రద్ద కొరవడిందని విమర్శించారు. ‘గతంలో మేము ఏడాదికి 17-18 సినిమాల్లో నటించేవాళ్లం. రోజుకు ఆరు షిఫ్టుల్లో పనిచేసేవాళ్లం. ఒక్కొసారి ఉదయం ఐదు గంటలకు షూటింగ్‌కు వెళితే మరుసటి రోజు ఉదయం ఐదు గంటలకు ఇంటికి వచ్చే వాళ్లం. అంతలా క్రమశిక్షణ, నిబద్ధతతో సినిమాలు చేసేవాళ్లం. అప్పట్లో అందరు డైరెక్టర్లు, నిర్మాతలు మాకు విజయశాంతే కావాలనేవారు. నేను మాత్రం ఎన్ని సినిమాల్లో నటించగలను. చాలా సినిమాలు డేట్స్ కుదరక వదిలేశాను. ఇక ప్రస్తుత హీరోయిన్లు జనాలను ఆకట్టుకునే విధంగా నటించడం లేదు’అంటూ విజయశాంతి వ్యాఖ్యానించారు. ఇక ‘మహర్షి’ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత మహేశ్ బాబు నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా.. విజయశాంతి కీలకపాత్రలో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాం విడుదల కానుంది. -
బోనమెత్తిన రాములమ్మ, సింధు, పూనమ్
సాక్షి, హైదరాబాద్ : పాతబస్తీ లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలో బోనాల జాతర వైభవంగా జరుగుతోంది. తెల్లవారుజామున నుంచే భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సామాన్యులే కాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా బోనం సమర్పించేందుకు అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఆదివారం లాల్‌దర్వాజా సింహవాహని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. అమ్మవారికి బోనం సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. అందరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. అమ్మవారి ఆశీస్సుల ఉంటే నేను ఇంకా బాగా ఆడతానని అన్నారు. కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అమ్మవారికి బోనం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆమె అమ్మవారిని కోరుకున్నారు. ప్రభుత్వం అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అన్నారు. సినీనటి పూనమ్‌కౌర్ కూడా బోనమెత్తారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారికి బోనం సమర్పించి.. దర్శనం చేసుకున్నారు. -
అలాంటి పాత్రలు చేయను : విజయశాంతి
నన్ను ఎవరైనా ఏమైనా అంటే ‘పోరా’ అంటా. అంతకంటే ఎక్కువ చేస్తే పోరాడతా. స్త్రీ అంటే ఆటబొమ్మ అయిపోయింది. నిజజీవితంలో, సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, నిర్భీతిగా మహిళల వ్యక్తిత్వాన్ని వలువల్లా ఒలుస్తున్నారు. చిన్న పిల్లలనీ చూడరు. ముసలివాళ్లనీ చూడరు. వాయీ వరసా చూడరు. ఉసురు తీసుకుంటున్నారు. దీనికొక్కటే సమాధానం. వీళ్లని ఉరి తీయాలి. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చివరిగా కనిపించిన చిత్రం ‘నాయుడమ్మ’ (2006). ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ అయి, సినిమాలకు దూరం అయ్యారు. ఇన్నేళ్లల్లో మళ్లీ ఆమెను సినిమాలు చేయమని ఇండస్ట్రీ నుంచి బోలెడన్ని ఆఫర్లు వచ్చాయి. ఇప్పుడు విజయశాంతి తెర మీద కనిపించడానికి ఓకే అన్నారు. మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న ‘సరి లేరు నీకెవ్వరు’ సినిమాలో కీలకంగా నిలిచే పాత్ర చేస్తున్నారు. సోమవారం విజయశాంతి బర్త్‌డే. ఈ సందర్భంగా నటిగా ఆమె కమ్‌బ్యాక్ గురించి స్పెషల్ ఇంటర్వ్యూ. బర్త్‌డే ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? సెలబ్రేషన్ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఫ్యాన్స్, నన్ను అభిమానించే వాళ్లు విషెస్ పంపుతారు. నాకు మాత్రం సింపుల్‌గా ఉండటం ఇష్టం. మొదటినుంచీ అదే అలవాటు. ఈసారి బర్త్‌డే సోమవారం. అంటే శివుడి రోజు. నేను శివభక్తురాలిని. ఆ దేవుడే నన్ను మంచి స్థాయికి చేర్చాడని నమ్ముతాను. టీనేజ్లోనే కెరీర్ స్టార్ట్ చేశారు. సపోర్ట్ లేకుండా ఇంతదాకా వచ్చిన మీ లైఫ్ జర్నీ గురించి? లైఫ్ జర్నీ చాలా వండర్‌ఫుల్‌గా సాగింది. ఒక క్రమశిక్షణ పెట్టుకొని ట్రావెల్ చేశాను. చిన్న వయసులోనే మా అమ్మానాన్న పోయారు. నన్ను గైడ్ చేయడానికి ఎవరూ లేరు. అమ్మానాన్న చనిపోవడం నాకు పెద్ద ఎదురుదెబ్బ అనుకుంటాను. పైగా ఒక్క సంవత్సరం గ్యాప్‌లోనే ఆరోగ్య సమస్యలతో ఇద్దరూ చనిపోయారు. వృత్తినే దైవంగా భావించాను. ప్రతి పాత్రకూ 100 శాతం న్యాయం చేయాలని చాలెంజ్‌గా తీసుకున్నాను. యాక్షన్, గ్లామర్, పెర్ఫార్మెన్స్.. మూడూ బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేశాను. ఒంటరిగా ఎలా కొనసాగాలనే భయం ఉండేదా? నా జీవితంలో ఎప్పుడూ భయం లేదు. కానీ ఎలా హ్యాండిల్ చేయాలా? అని ఆలోచించేదాన్ని. చిన్న వయసులో హీరోయిన్ అయిపోయాను. నాకు నేనుగా మిలిటరీ క్రమశిక్షణ పెట్టుకున్నాను. పని తప్ప వేరే ధ్యాస ఉండేది కాదు. అందుకే నన్ను ‘పని రాక్షసి’ అనేవారు. సంవత్సరానికి 17–18 సినిమాలతో బిజీగా ఉండేదాన్ని. రోజుకి ఆరేడు షిఫ్ట్‌లు చేసేదాన్ని. భోజనానికి టైమ్ ఉండేది కాదు. నైట్ షూట్ అంటే నిద్ర మాత్రమే కాదు.. ఒక్కోసారి భోజనం కూడా త్యాగం చేయాల్సి వచ్చేది. తింటే నిద్ర వచ్చేస్తుందని భయం. అప్పట్లో నెలా నెలన్నరలో సినిమా పూర్తి చేసేవాళ్లం. మహా అయితే 2 నెలలు. ‘ప్రతిఘటన’ సినిమాని నెలలోనే పూర్తి చేశాం. నా కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ‘ప్రతిఘటన’ ఒకటి. అయితే దర్శకుడు టి. కృష్ణగారు ఆ సినిమాకి అడిగినప్పుడు డేట్స్ ఖాళీ లేవు. ఆయనేమో మా శాంతమ్మే చెయ్యాలి అన్నారు. ఇతర ప్రొడ్యూసర్స్‌తో మాట్లాడి, ఆ సినిమాకి కష్టం మీద డేట్స్ ఇవ్వగలిగాను. అలాగే ‘పడమటి సంధ్యారాగం’ సినిమా కోసం నెల రోజులు అమెరికా వెళ్లాను. తిరిగొచ్చేసరికి 3, 4 సినిమా లు వెయిటింగ్. ఇంత వర్క్ చేస్తున్నాం అని రిగ్రెట్ అయిన సందర్భాలేమైనా? అస్సలు లేదు. అయితే రాత్రీ పగలూ, తిండీ నిద్రా.. ఇలా దేని గురించీ ఆలోచించకుండా పని చేయడంతో అప్పుడప్పుడూ హెల్త్ కొంత ఇబ్బంది పెట్టేది. కానీ రెండు రోజులు రెస్ట్ తీసుకుంటా అంటే ప్రొడ్యూసర్లు బాబోయ్ అనేవారు. ఇప్పుడు సిస్టమ్ వేరు అప్పటి సిస్టమ్ వేరు. అయితే కష్టం అనేది తెలిస్తేనే లైఫ్ వేల్యూ›తెలుస్తుంది. అందుకే ఇంత హార్డ్ వర్క్ చేసినందుకు ‘ఐయామ్ హ్యాపీ’. మీ అమ్మానాన్న మీ సినిమా కెరీర్‌ను చూశారా? కొంతవరకూ చూశారు. ‘ప్రతిఘటన’ వరకూ మా అమ్మ ఉన్నారు. ఆ సినిమాకి నంది అవార్డు తీసుకోవడం చూశారు. నాన్నగారు ‘నేటి భారతం’ వంటి నా హిట్ సినిమాలను చూశారు. ‘దేవాలయం’ సినిమా సమయానికి నాన్నగారు పోయారు. యాక్షన్ హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకున్నారు. సెట్లో గాయాలపాలై ఉంటారేమో? చాలా దెబ్బలు తగిలాయి. చచ్చిపోయి బతకడం వరకూ జరిగింది. పంచభూతాలను దాటి వచ్చాను. గాలి, నీరు, నిప్పు, ఆకాశం.. ఇలా అన్ని గండాలను దాటాను. ఇంకేం బ్యాలెన్స్ లేదనుకుంటా. ఇంకా భూమి మీద చేయాల్సిన పని ఉంది కాబట్టే దేవుడు నన్నింకా ఉంచాడు. ఒకసారి ఏకంగా ఓ సినిమాకి మంటల్లో చిక్కుకున్నాను. అదే సినిమాకి నీళ్లలో కొట్టుకుపోయా కూడా. ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి తెలిసిందే. నేను చిరంజీవిగారు, బాలకృష్ణగారు అందరం ఉన్నాం. అందులోంచి బయటపడ్డాం. ‘లేడీ బాస్’లో ట్రైన్‌కి సంబంధించిన సీన్ తీస్తున్నప్పుడు కొద్దిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఇలాంటివి జరిగినప్పుడు ఎందుకీ యాక్షన్ సినిమాలు అనిపించేదా? ఎప్పుడూ అనిపించలేదు. ఇంకా చాలెంజ్‌గా తీసుకున్నాను. హీరోయిన్ అంటే ఎప్పుడూ పాటలు, డ్యాన్స్, గ్లామరేనా? చెట్టు చుట్టూ తిరుగుతూ పాటలు పాడే క్యారెక్టర్సేనా? ఏదైనా కొత్తదనం ఉండాలి. హీరోలకంటే మనం ఏం తక్కువ? యాక్షన్ కూడా చేద్దాం అనుకున్నాను. ఏదీ ప్రత్యేకంగా నేర్చుకున్నది లేదు. సెట్లో చెప్పడం, చేయడం. నేను క్లాసికల్ డ్యాన్సర్‌ని. కూచిపూడి, భరతనాట్యం నేర్చుకున్నాను. ఫైట్లు అన్నీ ఆన్ ది స్పాట్. గాడ్స్ గిఫ్ట్ ఏంటంటే నేను ఏదైనా చూడగానే చేయగలను. కాలు విరిగినా బాధపడలేదు. నిర్మాతలకు నష్టం కలగకూడదని ఆ గాయాలతోనే షాట్ పూర్తి చేసి వెళ్లిన రోజులున్నాయి. ఇంత కష్టపడ్డాను కాబట్టే ఆ దేవుడు నన్ను హైట్స్‌కు తీసుకెళ్లాడు. ఇప్పుడంటే చాలావరకు కంఫర్ట్బుల్ లైఫ్. అప్పట్లో మాకు గ్రాఫిక్స్ లేవు. 30 అడుగుల ఎత్తులో నుంచి దూకాలంటే దూకడమే. ధైర్యం ఉంటే దూకమనేవారు. అయితే ఫోర్స్ చేసేవారు కాదు. ధైర్యం చేసి, నేనే చేసేదాన్ని. అంత కష్టపడ్డారు కాబట్టే ‘లేడీ అమితాబ్’ అనే ట్యాగ్ వచ్చింది. ఏదైనా సందర్భంలో అమితాబ్ గారితో ఈ విషయం చెప్పారా? రివల్యూషనరీ సినిమాలు, యాంగ్రీ యంగ్ ఉమెన్ అనిపించే క్యారెక్టర్స్ చేశాను. ఆయన నా ‘కర్తవ్యం’ హిందీ వెర్షన్ ‘తేజస్విని’ సినిమా ప్రివ్యూ చూడ్డానికి వచ్చారు. ఓ సినిమా ఓపెనింగ్ అప్పుడు బోనీ కపూర్‌గారు అమితాబ్‌గారితో విజయశాంతిని సౌత్‌లో ‘లేడీ అమితాబ్’ అంటారు అన్నారు. ‘తేజస్వినీ’ హిట్ అయిపోతే ఇక నన్ను ‘జెంట్ విజయశాంతి’ అంటారా? అన్నారు (నవ్వుతూ). ఒకప్పుడు హీరోతో సమానంగా, ఒక్కోసారి వారికన్నా ఎక్కువే పారి తోషికం అందుకున్నారు, ఆ రికార్డ్‌ని సౌత్‌లో ఎవరూ బ్రేక్ చేయలేదు.. నాకు అలాంటి పాత్రలు ఇచ్చిన దర్శక–నిర్మాతలు, వాటికి న్యాయం చేయడానికి నేను పడ్డ కష్టం, ఆ సినిమాలను అంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులు, నా అభిమానులు... అన్నీ కరెక్ట్‌గా కుదిరాయి. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఎక్కువ ఇస్తారు. కానీ హీరోలతో కలిసి చేసిన సినిమాలకి కూడా కొందరి హీరోల కంటే ఎక్కువే తీసుకున్నాను. మనది మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ. హీరోలతో పాటు సమానంగా తీసుకుంటే తట్టుకోగలిగారా? వాళ్లకన్నా ఎక్కువ కావాలని డిమాండ్ చేసేవారా? ఒక రేంజ్‌కి వచ్చాక మేం డిమాండ్ చేయొచ్చు, వాళ్లు కూడా ఇవ్వొచ్చు. స్టార్డమ్ పెరుగుతున్న కొద్దీ డిమాండ్ ఉంటుంది. నిర్మాతలు కూడా ‘మేం అంత ఇస్తాం.. ఇంత ఇస్తాం’ అని క్యూలో నిలబడేవాళ్లు. అందరికీ డేట్స్ ఇవ్వడానికి ఇబ్బంది అయ్యేది. ఇక హీరోలు ఏమనుకుంటున్నారనే విషయాన్ని పట్టించుకునేదాన్ని కాదు. ఇప్పుడు ‘సరి లేరు నీకెవ్వరు’ సినిమా చేయడానికి ఎవరు ఒప్పించారు? విజయశాంతిని ఎవరూ ఒప్పించరు. నా నిర్ణయం నేనే తీసుకుంటాను. ఎన్నికలు అయిపోయాయి. గెలుపోటములు అన్నది రాజకీయాల్లో సాధారణం. ఇప్పుడు చిన్న గ్యాప్ దొరికింది. మళ్లీ సినిమాలు చేయాలని ఎప్పటినుంచో అడుగుతున్నారు. నేనే ఆసక్తిగా లేను. ఎప్పటినుంచో అడుగుతున్నవాళ్లల్లో దర్శకుడు అనిల్ రావిపూడి ఒకరు. ఒక్కసారి కథ వినండి అన్నారు. విన్నాను, బాగా నచ్చింది. కమ్ బ్యాక్‌కి ఇది బెటర్‌గా ఉంటుంది. అన్నీ రాములమ్మలు అన్నీ కర్తవ్యాలు అంటే కుదరవు. అయితే ఉన్నదాంట్లో ఇది బావుంది అనుకున్నాను. ఒప్పుకున్నాను. ఈ సినిమాలో మహేశ్‌బాబుతో మీది ఏ రిలేషన్ ? రిలేషన్ ఏమీ ఉండదు. కానీ మా పాత్రలు రెండూ ప్యారలల్‌గా వెళ్తుంటాయి. మీ పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయా? లేదు. విజయశాంతి నెగటివ్ షేడ్సా? నో. నేను పాజిటివ్ పర్సన్. చేసే పాత్రలూ అలానే ఉండాలని కోరుకుంటాను. ఇందులో నాది చాలా పాజిటివ్ పాత్ర. అందరికీ నచ్చుతుంది. నాకు డబ్బులు ముఖ్యం కాదు. స్క్రిప్ట్, డైరెక్టర్ అన్నీ కుదరాలి. విజయశాంతి నెగటివ్ షేడ్సా అన్నారు? ఏం చేయరా? నెగటివ్ ఎందుకు? ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటే బెటర్ కదా. వెనక్కి తిరిగి చూసుకుంటే ఆర్టిస్ట్‌గా ఇది చేయలేదు అని ఏదైనా అసంతృప్తి ఉందా? ఏదీ లేదు. నా సైడ్ నుంచి హ్యాపీ. కొత్తకొత్త ఐడియాలతో దర్శకులు వచ్చినప్పుడు ఇంకా కొత్తగా చేయాలనుకుంటాను. అలాంటివి వస్తే కచ్చితంగా ఆడుకుంటాను (నవ్వుతూ). ఆ నమ్మకం నాకుంది. అమ్మానాన్నల తర్వాత మీకు అండగా నిలిచిన వ్యక్తి ఎవరు? నా భర్త శ్రీనివాస్ ప్రసాద్‌గారు. అమ్మానాన్న ఉన్నప్పుడే ప్రసాద్‌గారిని కలిశారా? లేదు. నా లైఫ్ పార్ట్నర్ని నేనే ఎన్నుకొన్నాను. పెద్దవాళ్లు ఉంటే వాళ్లు పెళ్లి చేయాలి. కానీ వాళ్లు లేరు. వాళ్లు చనిపోయిన రెండు మూడేళ్లకు పెళ్లి చేసుకున్నాను. దానికి ప్రత్యేకంగా ప్రిపరేషన్లు ఏం లేవు. అలా అనుకున్నాం.. ఇలా పెళ్లి చేసుకున్నాం. 30 ఏళ్లుగా హ్యాపీగా ఉన్నాం. ఇన్నేళ్లుగా నా వెనకే ఉంటూ నన్ను గైడ్ చేస్తూ ఉన్నారు. ఈయన మనకు కరెక్టా? కాదా? అని ఎలా ఊహించగలిగారు? అందుకే నేను దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటాను. మంచి కెరీర్ ఇచ్చావు, మంచి భర్తను ఇచ్చావు అని. అన్నీ నాకు ఇచ్చాడు. దేవుడికి బాగా ఇష్టమైన కూతుర్ని అనుకుంటాను. లక్కీ ఉమెన్ను. అప్పట్లో మీ ట్రాక్ స్పెషల్ కాబట్టి వేరే హీరోయిన్లతో పోటీ లేకపోవడం రిలీఫ్‌గా ఉండేదా? నేను కేవలం గ్లామర్ పాత్రలే చేయలేదు కాబట్టి మీరన్నట్లు పోటీ ఉండేది కాదు. నటిగా నా సామర్థ్యం చూపించే సినిమాలు చేయాలనుకున్నా. గ్లామర్ నాకు నచ్చేదే కాదు. కొన్నిసార్లు గొడవలు కూడా పడేదాన్ని.. ఈ డ్రెస్సేంటి అని. సెట్ నుంచి వెళ్లిపోయిన సినిమాలున్నాయా? అలిగి కూర్చునేదాన్ని. నిర్మాతలు ‘అమ్మా చేయండి.. బావుంటుంది’ అనేవారు. ఏ బావుంటాయండీ. ఈ పిచ్చి బట్టలు.. గ్లామర్ అని విసుక్కున్నప్పటికీ చేసేదాన్ని. హీరోకన్నా ఎక్కువ పారితోషికం అంటే.. అవకాశాలు తగ్గేలా చేయడానికి ట్రై చేయలేదా? అప్పటికే చేయి దాటిపోయింది. నాకు స్టారడమ్ వచ్చేసింది. అలా వస్తుందని వాళ్లూ అనుకోలేదు.. నేనూ అనుకోలేదు (నవ్వుతూ). కళ్లు మూసి తెరిచేలోపు పెద్ద స్థాయికి వెళ్లిపోయాను. పైగా నేను ‘గివ్ అప్’ చేయను. ఇక వరుసగా సినిమాలు చేస్తారా? అన్నీ కుదిరాయి కాబట్టి ఈ సినిమా చేస్తున్నాను. మంచి పాత్రలొస్తే చూద్దాం. అమ్మ, వదిన.. పాత్రలు చేస్తారా? నో. చాన్సే లేదు. డిఫరెంట్ పాత్రలుంటే చేస్తా. అమ్మ అయినా ‘మదర్ ఇండియా’ లాంటి పాత్ర అయితే చేస్తా. విజయశాంతి అంటే ఆడియన్స్‌కి అంచనాలుంటాయి. మామూలు సినిమాలు చేస్తే ఎలా? కెపాసిటీ ఉండి చేయకపోవడం ఎందుకు? స్త్రీ ఆత్మవిశ్వాసం కోల్పోవాలంటే ఆమె వ్యక్తిత్వం గురించి చెడుగా మాట్లాడతారు. ఇప్పుడు ఆ ధోరణి ఎక్కువ కావడం గమనించారా? అవును. అలా మాట్లాడే కొంతమంది వల్ల సమాజం చాలా నాశనం అవుతోంది. 60 శాతం మంది బావుంటే 40 శాతం దారుణంగా ఉన్నారు. వాళ్లు చేసే కామెంట్స్ చాలా దరిద్రంగా ఉంటున్నాయి. ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే తెలియడం లేదు. వేరే స్త్రీని అంటున్నాం అంటే వాళ్ల తల్లిని అంటున్నట్లే. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. ఉమెన్ను రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి. నిన్ను కన్నది కూడా ఓ ఆడదే కదా. ఇవాళ జరుగుతున్నవి చూస్తుంటే నా ‘ప్రతిఘటన’ సినిమా గుర్తొస్తోంది. అందులోని ‘ఈ దుర్యోధన దుశ్సాసన దుర్వినీత లోకంలో...’ పాట గుర్తొస్తోంది. ఏం చేస్తున్నారు? ఏం చేయదలచుకున్నారు? మంచి చేయండి. అది రాదా? నోరు మూసుకొని కూర్చోండి. నోటికొచ్చిన మాటలు అంటుంటే ఎవరు ఊరుకుంటారు? ప్రభుత్వాలు సోషల్ మీడియాకూ కొత్త చట్టం తీసుకురావాలి. సమాజం ఎటు పోతోందో తెలియడంలేదు. మొన్నటికి మొన్న తొమ్మిది నెలల పసి పాపపై అత్యాచారం చేసి, ప్రాణాలు బలిగొన్నాడు...అభం శుభం తెలియని పసి పాపపై పైశాచికత్వమా? ఆ సంఘటన వినగానే మనసు అదోలా అయిపోయింది. వీళ్లను ఏం చేస్తే ఆ పాప ఆత్మకు శాంతి లభిస్తుందా అనిపించింది. ఏం చేయక్కర్లేదు. నడిరోడ్డులో నిలబెట్టి కాల్చి పడేయాలి. ఉరి తీయాలి. ఎన్కౌంటర్ చేసి పడేయాలి. లేకపోతే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కేసులు పెట్టి, నెలలు, సంవత్సరాలు గడిచిపోతే విషయం ‘డైల్యూట్’ అయిపోతుంది. శిక్ష అనేది అప్పటికప్పుడు ఇచ్చేయాలి. ప్రస్తుతం సోషల్ మీడియా రూపంలో విచ్చలవిడితనం పెరిగింది. హీరోయిన్ అంటే టేకిట్ ఫర్ గ్రాంటెడ్ అయిపోయి ఎలా పడితే అలా కామెంట్ చేస్తున్నారు.. అవును. బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నారు. అసహ్యం వేస్తోంది. సోషల్ మీడియా వల్ల కొంత వరకూ మంచి జరుగుతోంది, కానీ ఎక్కువ చెడే జరుగుతోంది. సినిమాలకు సెన్సార్ ఎలా అయితే ఉందో సోషల్ మీడియా కామెంట్స్‌కు ఏదైనా సెన్సార్ ఉండాలి. ఏదైనా కొత్త చట్టం ప్రభుత్వం తీసుకురావాలి. ఏదైనా అనేస్తారా? తప్పు కదా? అనేవాళ్లు వాళ్ల ఇంట్లో అమ్మాయిలను అంటారా? అనరు. అంటే.. మీ ఇంటి ఆడవాళ్లు గొప్ప, మిగతావాళ్లు చులకనా? సంబంధం లేని స్టోరీలు అల్లేస్తారు. శాడిజం అది. గవర్నమెంట్ ఆలోచించాలి. క్యారెక్టర్ తప్పుబట్టి మెంటల్‌గా వీక్ చేద్దామనుకుంటారు. కానీ ఎవరూ వీక్ అవ్వరు. రెండు రోజులు పట్టించుకుంటాం. మూడో రోజు నుంచి ‘పోరా’ అనుకుంటాం. అవసరమైతే పోరాడతాం. మీ టైమ్‌లో సోషల్ మీడియా లేకపోవడం లక్కీ అనుకుంటున్నారా? చాలా లక్కీ. మా అప్పుడు ఇంత నెగటివిటీ లేదు. ఇప్పుడు ఎవరికీ సేఫ్టీ లేదు. మహిళలకు గౌరవం తగ్గింది. ఇది మంచి పరిణామం కాదు. ఫైనల్లీ పేరులో ‘విజయ’ ఉన్నట్లే జీవితం విజయవంతంగా కొనసాగిస్తున్నందుకు రెండు మాటలు.. చిన్నప్పటి నుంచి శివభక్తురాలిని. నా లైఫ్‌ని డిజైన్ చేసింది ఆయనే. మనం బొమ్మలం మాత్రమే. ఆయన కీ ఇచ్చి ఆడిస్తుంటాడు. డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్ అన్నీ ఆయనే. బాధపెడతాడు, నవ్విస్తాడు. మంచివాళ్లతో, గొప్పవాళ్లతో సినిమాలు చేసే అవకాశం ఇచ్చాడు. ఆ దేవుడే మంచి కెరీర్ ఇచ్చాడు. నా కెరీర్లో ఫ్లాప్స్ తక్కువ. హైట్సే ఎక్కువ. అందుకే ఆ దేవుడికి థ్యాంక్స్ చెబుతున్నా. – డి.జి. భవాని -
మహేశ్ సినిమాలో నటిస్తున్నా: విజయశాంతి
హైదరాబాద్: సీనియర్ నటి విజయశాంతి మరోసారి వెండితెరపై కనిపించనున్నారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీలోకి పునఃప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నారు. ‘ప్రిన్స్’ మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలో ఆమె కనిపించనున్నారని సమాచారం. సూపర్‌స్టార్ కృష్ణకు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా షూటింగ్‌ను పూజా కార్యక్రమంతో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయశాంతి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘సూపర్‌స్టార్ కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు. తెలుగులో నా మొదటి సినిమా కృష్ణతో నటించిన ‘ఖిలాడీ’.. ఆ తర్వాత 150 సినిమాలు చేశాను. రాజకీయాల్లోకి వెళ్లడంతో 13 సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నాను. తొలి సినిమా కృష్ణతో నటిస్తే.. నా రీఎంట్రీలో మొదటి సినిమా ఆయన కుమారుడు మహేశ్‌బాబుతో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంద’ని విజయశాంతి పేర్కొన్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు, మహేశ్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. రష్మిక మందాన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
రాహుల్‌తోనే దేశాభివృద్ధి సాధ్యం
సాక్షి, కొండాపూర్(సంగారెడ్డి): రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరచిన మెదక్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని, రాహుల్ ప్రధాని అయితేనే దేశం అభివృద్ధి సాధ్యమవుతుందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి అన్నారు. మండల పరిధిలోని మల్కాపూర్ చౌరస్తాలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో మంగళవారం సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన విజయశాంతి మాట్లాడుతూ దేశంలో నేడు జరుగుతున్న ఎన్నికలు, న్యాయానికి, అన్యాయానికి మధ్య అని, ప్రజలు ఎప్పుడూ న్యాయం వైపే వుంటారని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని యువత మొత్తం రాహుల్ గాంధీ ప్రధాని కావాలని చూస్తోందన్నారు. దేశంలోని ప్రతీ నిరుపేదను ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంగా ప్రతి ఇంటికి సంవత్సరానికి 72 వేల రూపాయలను తమ ఖాతాల్లో జమ చేయనున్నట్లు రాహుల్ గాంధీ వెల్లడించడం శుభపరిణామమన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రూ.2 వేలు కావాలో, రాహుల్ గాంధీ ఇవ్వనున్న రూ.6 వేలు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని తెలిపారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేడీ ఇద్దరూ ఒకటేనని, ఇద్దరూ ప్రజలను మోసం చేసి ఆచరణకు సాధ్యం కాని హామీలను ప్రకటిస్తున్నారని దుయ్యబట్టారు. మోదీతో కలిసి కేసీఆర్ రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలని చూస్తున్నారని, 125 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని ఖతం చేయడం ఎవరి వల్లా కాదన్నారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి గత ఐదేళ్లలో ఎన్నడూ ప్రజలను కలువలేదని, మళ్లీ ఏం ముఖం పెట్టుకుని వస్తున్నాడని ప్రశ్నించారు. అతనికి తగిన గుణపాఠం చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. ఈవీఎంలలో మోసాల వల్లే టీఆర్ఎస్ గెలిచింది ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ఈవీఎంలను ట్యాంపరింగ్, రిగ్గింగ్ చేయడం వల్లే గెలిచిందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ జెట్టి కుసుమకుమార్ ఆరోపించారు. ప్రతి గ్రామంలో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా టీఆర్ఎస్ పార్టీ ఎలా గెలిచిందో అర్థం కావడం లేదన్నారు. త్వరలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తరువాత అన్ని లెక్కలు తేలుస్తామని తెలిపారు. ఇటీవలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి గెలుపే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందనడానికి నిదర్శనమని తెలిపారు. రాష్ట్రంలో మీరు, మీ కుటుంబ సభ్యులు అంతా మంత్రి పదవులు అనుభవిస్తున్నారంటే అది సోనియాగాంధీ దయ వల్లనే అని, గతాన్ని మరిచి ఇప్పుడు సోనియా గాంధీపై విమర్శలు చేయడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. పరిపాలనలో టీఆర్ఎస్ విఫలం ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున జులై తరువాత కేసీఆర్ పరిపాలన ఏంటో తెలుస్తుందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. జులై తరువాత నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కేటాయింపులు ఏవిధంగా వుంటాయో అనే విషయంపై స్పష్టత వచ్చిన తరువాత మాట్లాడుతానని తెలిపారు. సింగూర్, మంజీరా నది నుండి నీటి తరలింపులు ఆపాలని కోరిన అప్పటి మంత్రి హరీష్‌రావు అన్యాయంగా నీటిని తరలించుకుపోయాడని, దీంతో సంగారెడ్డి జిల్లాలో గ్రౌండ్ వాటర్ తగ్గిపోయిందన్నారు. తాగు నీరు లేక ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలలో ప్రజల దాహార్తిని తీర్చేందకు బోర్లు వేద్దామన్నా చుక్క నీరు రాని పరిస్థితి వుందన్నారు. మిషన్ భగీరథ పనులు కొనసాగడం లేదు, రాష్ట్రంలో నిధులు కూడా లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. నవంబర్ తరువాత సంగారెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు పర్యటించి నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకుంటానని, గ్రామాభివృద్దికి కావాల్సిన నిధులు, అభివృద్ది పనులపై చర్చిస్తానని తెలిపారు. సీఎం కేసీఆర్ అల్లుడిగా మాత్రమే హరీష్‌రావు ప్రజలందరికీ తెలుసునని, త్వరలో నా సత్తా ఎంటో హరీష్‌రావుకు చూపిస్తానన్నారు. తనపై విమర్శలు చేస్తే సహించేది లేదని, కార్యకర్తలు అధైర్య పడవద్దని, మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి చేస్తానని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో నా కోసం కష్టపడినట్లుగానే ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌కు సైతం నియోజకవర్గంలో 80 వేల ఓట్లు వచ్చేలా కష్టపడాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తోపాజి అనంత్కిషన్, షేక్ సాబేర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగేష్, రాంరెడ్డి, ప్రభు, పాండురంగం, రామకృష్ణారెడ్డి, డేవిడ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు వెంకటేశం గౌడ్, సర్పంచ్ వనపర్తి నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
‘కేసీఆర్ మాటలు.. బ్రహ్మానందం కామెడీ’
సాక్షి, మెదక్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కంకణం కట్టుకున్నారని మాజీ ఎంపీ విజయశాంతి ఆరోపించారు. మెదక్‌లో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ సింహగర్జన ఎన్నికల ప్రచార సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశ మంతా ప్రధానిగా మోదీ వద్దనుకుంటుంటే, కేసీఆర్ మాత్రం కావాలంటున్నారని విమర్శించారు. కేసీఆర్ మోదీ మనిషి అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ మాటలు చూస్తుంటే బ్రహ్మానందం, ఆలీ కామెడీలా అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. 16 మంది ఎంపీలున్నా విభజన హామీలు సాధించలేకపోయారని ధ్వజమెత్తారు. 2014లో మెదక్‌కు మంచి జరుగుతుందని ఎమ్మెల్యేగా పోటీకి దిగితే కుట్రలు కుతంత్రాలతో తనను ఓడించినా తాను బాధ పడలేదన్నారు. గెలుపు, ఓటములు తనకు మామూలేనని చెప్పారు. గెలిచినా ఓడినా మెదక్ తన ఇల్లు లాంటిదన్నారు. మెదక్‌కు రైలు నేనే సాధించానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది నాయకులు బయటకు పోయినా ఏమీ కాదన్నారు. మెదక్ ఎంపీ, ఎమ్మెల్లే వసూల్ రాజా, వసూల్ రాణిగా మారారని విజయశాంతి దుయ్యబట్టారు. సిరిసిల్లలో తాను ప్రచారం చేసి గెలిపించకపోతే కేటీఆర్ గెలిచేవాడా.. అప్పుడు దేవత, ఇప్పుడు దెయ్యం లా కనిపిస్తున్నానా అని ప్రశ్నించారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ సీఎం అయ్యే వారా అని నిలదీశారు. కేసీఆర్ మాయమాటలతో కాలం గడుపుతారని విమర్శించారు. ప్రజలు ఆలోచించకపోతే తమ గొయ్యి తాము తీసుకున్నట్టేనని హెచ్చరించారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి బీజేపీ తెలంగాణ ఇవ్వలేదని ధ్వజమెత్తారు. -
సార్వత్రిక ఎన్నికలకు ఐదు కమిటీలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌గా మాజీ ఎంపీ విజయశాంతి నియమితులయ్యారు. పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మీడియా సమన్వయ కమిటీ చైర్మన్‌గా మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్లను నియమించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షణకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మొత్తం 5 కమిటీలను ఏర్పాటు చేశారు. ఎన్నికల కమిటీ, ప్రచార కమిటీ, పబ్లిసిటీ కమిటీ, మీడియా సమన్వయ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం రాత్రి ఆయా కమిటీల వివరాలను మీడియాకు వెల్లడించారు. ఎన్నికల కమిటీ.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమ్‌కుమార్, మహ్మద్ అజారుద్దీన్, జానారెడ్డి, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, ఎస్.జైపాల్‌రెడ్డి, నంది ఎల్లయ్య, ఎంఏ ఖాన్, డాక్టర్ జె.గీతారెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, డీకే అరుణ, రవీందర్‌నాయక్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, డి.సుధీర్‌రెడ్డి. ఎన్నికల కమిటీకి ప్రత్యేక ఆహ్వానితులు.. గూడూరు నారాయణరెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి కార్యదర్శులు, తెలంగాణ నుంచి ఉన్న ఏఐసీసీ కార్యదర్శులు. ప్రచార కమిటీ.. విజయశాంతి (చైర్పర్సన్), డీకే అరుణ (కో చైర్పర్సన్), టి.జగ్గారెడ్డి, అనిల్ యాదవ్, ఎన్.శారద, ఎస్.కె.అబ్దుల్లా సొహైల్, బెల్లయ్య నాయక్, వెంకటేశ్, కిరణ్ రెడ్డి, మానవతారాయ్, విజయ్‌కుమార్, కార్తీక్‌రెడ్డి, ప్రేమ్‌లాల్, హెచ్.వేణుగోపాల్, దీపక్ జాన్, అమర్, రామ్మోహన్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, ఆత్రం సక్కు ఆసిఫా, టి.నాగయ్య. పబ్లిసిటీ కమిటీ: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (చైర్మన్), ఎస్.గంగారాం(కో చైర్మన్), మల్లు రవి (కన్వీనర్), సురేంద్రరెడ్డి (కన్వీనర్), సుధీర్‌రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, సబితాఇంద్రారెడ్డి, హరిప్రియా నాయక్, సీతక్క, వనమా వెంకటేశ్వరరావు, పోడెం వీరయ్య, చిరుమర్తి లింగయ్య, కె.హర్షవర్ధన్‌రెడ్డి, భిక్షపతి యాదవ్, గూడూరు నారాయణరెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్. మీడియా సమన్వయ కమిటీ.. మధుయాష్కీ గౌడ్(చైర్మన్), దాసోజు శ్రవణ్‌కుమార్(కన్వీనర్), మల్లు రవి, సురేశ్ కుమార్, ఇందిరా శోభన్. కో ఆర్డినేషన్ కమిటీ.. ఆర్సీ కుంతియా (చైర్మన్), ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కన్వీనర్), భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, రేవంత్‌రెడ్డి, ఎండీ అజారుద్దీన్, జెట్టి కుసుమ్‌కుమార్, గీతారెడ్డి, నంది ఎల్లయ్య, ఎంఏ ఖాన్, డీకే అరుణ, టి.జీవన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, బలరాంనాయక్, జైపాల్‌రెడ్డి, రేణుకా చౌదరి, మర్రి శశిధర్‌రెడ్డి, సబి తా ఇంద్రారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సుదర్శనరెడ్డి, డి.శ్రీధర్‌బాబు, అంజన్‌కుమార్‌యాదవ్, రాపోలు ఆనంద్ భాస్కర్, మల్లు రవి, గండ్ర వెంకట రమణారెడ్డి, జగ్గారెడ్డి, రేగా కాంతారావు, ఎం.రంగారెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, కె.గౌరీశంకర్, సీతక్క, డాక్ట ర్ వినయ్‌కుమార్, ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి కార్యదర్శులు, ఏఐసీసీ తెలంగాణ కార్యదర్శులు ఎక్స్ అఫీషియో సభ్యులు. -
‘దుండగుల దౌర్జన్యాలకు కేసీఆరే ఆదర్శం’
సాక్షి, హైదరాబాద్: యథా రాజా తథా ప్రజా అన్న చందంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిస్థితి మారిందని మాజీ ఎంపీ విజయశాంతి మంగళవారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తరఫున ఎన్నికయిన ఎమ్మెల్సీలను దౌర్జన్యంగా తమ పార్టీలో కలుపుకుంటున్న సీఎం కేసీఆర్ తీరును ఆదర్శంగా తీసుకుని కొం దరు దుండగులు ప్రైవేట్ ఆస్పత్రిపై దౌర్జన్యానికి పాల్పడ్డారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు మేల్కొని ఈ తరహా ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని విజయశాంతి డిమాండ్ చేశారు. -
సొంత పార్టీపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సి ఇప్పుడు వివాదాన్ని రాజేసింది. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయ శాంతి మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 23 సోనియా గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో సోనియాకు స్వాగతం చెబుతూ కాంగ్రెస్ పార్టీ ఓ ఫ్లెక్సి ఏర్పాటు చేసింది. కానీ దీనిలో ఒక్క మహిళా నాయకురాలి ఫోటో కూడా లేదు. దాంతో ఇతరులను విమర్శించే ముందు మనం ఏం చేస్తున్నామో ఆలోచించుకోవాలంటూ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క మహిళా మంత్రి కూడా లేదంటూ టీఆర్ఎస్ని విమర్శించే మనం ఇప్పుడు చేసింది ఏంటంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సిలో ఒక్క మహిళా నాయకురాలి ఫోటో కూడా లేకపోవడం ఏంటని ప్రజలు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. చెప్పడానికే నీతులు పాటించడానికి కావా అంటూ జనాలు విమర్శిస్తున్నారని అన్నారు. ఈ సభలో మగవాళ్లు మాత్రమే ఉంటారా.. మహిళలు కూడా సభకు హాజరవుతారు కదా అంటూ విజయశాంతి ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. సొంత పార్టీ నేతలనే విమర్శిస్తూ రాములమ్మ ఇలా మాట్లాడటం పట్ల కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
వచ్చే ఎన్నికల్లో అన్నాచెల్లెలి యుద్దం జరుగుతుంది
-
యుద్దానికి మేం సిద్దం: విజయశాంతి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల యుద్దానికి తమ పార్టీ సిద్దంగా ఉందని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్, మాజీ ఎంపీ విజయశాంతి తెలిపారు. శనివారం హైదరాబాద్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ ప్రచార కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం విజయశాంతి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో శుత్రవులతో యుద్దానికి సిద్దమవుతున్నామని, శత్రువును ఓడగొట్టి ప్రజలకు మేలు చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ తనను దేవుడిచ్చిన చెల్లి అన్నారని, ఈ అన్నా, చెల్లెల మధ్య పోరాటానికి ప్రజలే తీర్పు చెబుతారన్నారు. స్టార్ క్యాంపెయినర్‌గా బాధ్యతలు అప్పజెప్పిన తమ అధినేత రాహుల్ గాంధీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చానని, తన గురించి తర్వాత మాట్లాడుతానని చెప్పారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, డీకే అరుణ, దాసోజు శ్రవణ్ కుమార్‌లు పాల్గొన్నారు. దొరలు, ప్రజలకు జరిగే ఎన్నికలు : భట్టి వచ్చే ఎన్నికలు దొరలకు, ప్రజలకు మధ్య జరిగే ఎన్నికలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రచార కమిటీ ఛైర్మన్ భట్టి విక్రమార్క తెలిపారు. ఆత్మగౌరవం కోసం పోరాడి తెచ్చుకున్న రాష్ట్ర ఫలాలు.. సామాన్యులకు అందడం లేదన్నారు. టీఆర్ఎస్ నాలుగున్నరేళ్ల పాలనలో తెలంగాణ దోపిడీకి గురయ్యిందని తెలిపారు. ప్రజా గాయకులు గద్దర్, గోరెటి వెంకన్న, విమలక్కలను తమతో కలిసి రావాలని ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రజల ప్రభుత్వం ఏర్పాటుకు అందరిని కలుపుకొని పోతామని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రస్తుతం స్వేచ్ఛ , భావవ్యక్తీకరణ, స్వాతంత్ర్యం లేదన్నారు. బస్సు యాత్రలు, సభలు, రోడ్ షోలకు సబంధించిన వివరాలను త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు. ప్రజలను మోసం చేసింది: డీకే అరుణ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను దారుణంగా మోసం చేసిందని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. ప్రచార సభలపై రెండు మూడు రోజుల్లో స్పష్టత ఇస్తామని తెలిపారు. టీఆర్ఎస్ బానిసత్వం నుంచి విముక్తి కల్పించడానికి పోరాడుతామన్నారు. అందరం ఏకమై టీఆర్ఎస్ గద్దె దించుదామని పిలుపునిచ్చారు. -
పవన్‌కు విజయశాంతి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ తెలంగాణలో చేపట్టిన రాజకీయ యాత్రపై నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. పవన్ రెండు కళ్ల సిద్ధాంతం ఇక్కడ పనిచేయదంటూ కౌంటర్ ఇచ్చారు. గురువారం ఇక్కడ మీడియాతో చిట్ చాట్ సందర్భంగా పలు విషయాలను ఆమె ప్రస్తావించారు. రాష్ట్ర ప్రజల్లో టీఆర్ఎస్ పాలనపై తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. సీఎం కేసీఆర్ పాలన ఎక్కడ స్మార్ట్‌గా ఉందో చెప్పాలని పవన్ కల్యాణ్‌ను విజయశాంతి ప్రశ్నించారు. పవన్ రెండు కళ్ల సిద్ధాంతం తెలంగాణలో పని చేయదంటూ ఆయన తీరును విమర్శించారు. తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గతేడాది అన్నాడీఎంకే నాయకురాలు వీకే శశికళను విజయశాంతి కలుసుకున్న నేపథ్యంలో ఆమె ఏఐఏడీఎంకే పార్టీలో చేరనున్నారని, తమిళ రాజకీయాల్లోకి ఈ ‘లేడీ సూపర్ స్టార్’ ఎంట్రీ ఖాయమంటూ వదంతులు ప్రచారమైన సంగతి తెలిసిందే. త్వరలో పార్టీలో క్రియా శీలకంగా పనిచేస్తానని చెప్పిన విజయశాంతి.. కాంగ్రెస్ అధిష్టానం ఏం చెప్పినా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. -
విజయశాంతికి ఊరట
సాక్షి, చెన్నై: సినీ నటి విజయశాంతికి మోసం కేసు నుంచి మద్రాసు హైకోర్టు ఊరట ఇచ్చింది. విజయశాంతి తనను మోసం చేశారంటూ గతంలో ఇందర్‌చంద్ జైన్ అనే వ్యక్తి చెన్నై జార్జ్ టౌన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓ స్థలం యజమాని, దాని విక్రయం నిమిత్తం విజయశాంతికి పవరాఫ్ పట్టాను ఇచ్చారని, ఆ స్థలాన్ని తనకు విక్రయించేందుకు తొలుత ఒప్పందాలు జరిగాయని జైన్ పేర్కొన్నారు. అయితే తనకు కాకుండా మరో వ్యక్తికి విక్రయించి తనను మోసం చేశారని ఆరోపించారు. దీనిపై బుధవారం న్యాయమూర్తి జస్టిస్ మురళీధరన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఇది పవరాఫ్ పట్టా వ్యవహారం అని, హక్కుల విషయంగా సంబంధిత కోర్టులో ఎప్పుడో తేల్చుకుని ఉండాల్సిందని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే మోసం కేసు విచారణ నిమిత్తం విజయశాంతికి వ్యతిరేకంగా గతంలో ఎగ్మూర్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. జార్జ్‌టౌన్ కోర్టుకు వ్యతిరేకంగా జైన్ దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చింది. -
అన్నాడీఏంకేలోకి విజయశాంతి?
- జైలులో శశికళతో ములాఖత్ రహస్యమిదే! - దినకరన్ సూచనతో వడివడిగా అడుగులు - రజనీకాంత్ కంటే ముందే లేడీ సూపర్‌స్టార్ ఎంట్రీ సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ఇదిగో వస్తా.. అదిగో వస్తా..’ అంటూ పొలికల్ ఎంట్రీపై సూపర్ స్టార్ రజనీకాంత్ నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తుండగా.. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మాత్రం వేగంగా పావులు కదుపుతున్నారు. ఒకప్పుడు తెలంగాణలో తనకంటూ ప్రత్యేక ఉనికిని చాటుకున్న ఆమె.. తాజాగా తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. జైలులో ఉన్న శశికళతో ఇటీవలే ములాఖాత్ అయిన విజయశాంతి.. మరికొద్దిరోజుల్లో అన్నాడీఎంకేలో చేరబోతున్నట్లు తెలిసింది. జయలలిత మరణానంతరం చెన్నైలో ప్రత్యక్షమైన విజయశాంతి.. ఆర్కేనగర్ ఉపఎన్నికలో టీటీవీ దినకరన్ తరఫున ప్రచారం చేశారు. సినీనటిగా విజయశాంతికి ఉన్న ఫాలోయింగ్, ఆమె రాజకీయ అనుభవం అన్నాడీఎంకేకు కలిసివస్తాయని భావించిన దినకరన్.. ఆ మేరకు శశికళను ఒప్పించినట్లు తెలిసింది. రజనీకాంత్ పొలికట్ ఎంట్రీ కంటే ముందే విజయశాంతిని అన్నాడీఎంకేలోకి చేర్చుకోవడం ద్వారా లబ్దిపొందొచ్చన్నది దినకరన్ వ్యూహంగా కనిపిస్తోంది. శశికళతో ములాఖత్ ఈనెల 5న దినకరన్ బెంగళూరుకు వెళ్లి శశికళను కలుసుకున్నారు. ఆయన వెళ్లిన కొద్దిసేపట్లోనే విజయశాంతి సైతం చిన్నమ్మతో ములాఖత్ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఇద్దరూ పలు విషయాలపై మాట్లాడుకున్నట్లు సమాచారం. దినకరన్ సూచన మేరకు శశికళ.. విజయశాంతిని పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిసింది. నటిగా జనాకర్షణ, మహిళా నేత ఉంటే పార్టీని కట్టడి చేయడం సులభం అవుతుందని చిన్నమ్మ, దినకరన్ అంచనా వేసినట్లు పార్టీ వర్గాల కథనం. బీజేపీతో మొదలై.. నటిగా అత్యున్నత శిఖరాలు అధిరోహించి ‘లేడీ అమితాబ్ బచ్చన్’ అనే బిరుదును పొందిన విజయశాంతి.. 1998లో బీజేపీలో చేరడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తరువాత ‘తల్లి తెలంగాణ’ పార్టీని స్థాపించారు. అటుపై ఆ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేశారు. నేటి సీఎం కేసీఆర్ అప్పట్లో విజయశాంతికి టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ పోస్టు ఇచ్చి గౌరవించారు. అయితే తెలంగాణ ఏర్పాటు అనంతరం (2014 ఎన్నికల సమయంలో) విజయశాంతి అనూహ్యంగా టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలోచేరి ఓటమిపాలై రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ జయలలిత మరణానంతరం చెన్నైలో సందడిచేశారు. -
ఆర్కేనగర్లో విజయశాంతి
► దినకరన్ కు మద్దతు ► కొనసాగుతున్న ఘర్షణలు ► వాహనాల తనిఖీలో 12 మంది అరెస్ట్ సాక్షి ప్రతినిధి, చెన్నై : ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న దినకరన్ తాజాగా ప్రముఖ సినీ నటి విజయశాంతిని ప్రచారంలోకి దించారు. అన్ని పార్టీల అభ్యర్థులు తమ నేతలతో శుక్రవారం ప్రచారం నిర్వహించగా, దినకరన్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్న విజయశాంతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమిళనాడు ఎన్నికల్లో సహజంగా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్యనే ప్రధాన పోటీ. అయితే జయలలిత మరణం, అన్నాడీఎంకే రెండుగా చీలిపోవడంతో సహజస్థితి మాయమై కొత్త పోటీలు పొద్దుపొడిచాయి. ఆర్కేనగర్లో డీఎంకే అభ్యర్థి పోటీచేస్తున్నా అన్నాడీఎంకే నుంచి రెండు వైరి వర్గాలే ఒకరిపై ఒకరు పట్టుదలతో ఉన్నారు. ఆర్కేనగర్లో గెలుపు జీవన్మరణ సమస్యగా భావిస్తున్న దినకరన్ తమిళ సినీ రంగానికి చెందిన ఎందరో తారలను ప్రచారంలోకి దించారు. తాజాగా దినకరన్ తరఫున విజయశాంతి రంగ ప్రవేశం చేశారు. ఆర్కేనగర్ నియోజకవర్గ పరిధిలో తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే కొరుక్కుపేట, శాస్త్రినగర్, కామరాజనగర్, తదితర ప్రాంతాల్లో విజయశాంతి ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట తిరువళ్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి బీవీ.రమణ, అన్నాడీఎంకే కార్యదర్శి బలరామన్, గుమ్మిడిపూండి జిల్లా కార్యదర్శి విజయకుమార్, పూందమల్లి ఎమ్మెల్యే ఏలుమలై ఉన్నారు. ప్రచార సమయంలో తెలుగు ప్రజలు తమ అభిమాన నటి విజయశాంతికి ఘన స్వాగతం పలకడంతో పాటూ ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. ఘర్షణల నగర్:ఆర్కేనగర్లో ఎన్నికల ప్రచారం రానురాను ఘర్షణలకు దారితీస్తోంది. ధన వర్షం కురిపించైనా గెలుపొందాలని ఒక అభ్యర్థి, ధన ప్రవాహాన్ని అడ్డుకోవాలని ప్రత్యర్థుల ప్రయత్నాలతో పలువురు గాయపడుతున్నారు. ఓ వర్గం వ్యక్తులు రెండు రోజుల కిందట నగదు పంచుతుండగా అడ్డుకున్న ఇద్దరు డీఎంకే కార్యకర్తలపై దాడి చేసి గాయపరిచారు. కొరుక్కుపేట 41వ వార్డులో డీఎంకే కార్యకర్తలు తమ అభ్యర్థి మరుదు గణేష్‌కు మద్దతుగా ప్రచారం చేస్తుండగా అన్నాడీఎంకే ఆర్కేనగర్ కార్యదర్శి సంతానం, వార్డు కార్యదర్శి రవి నేతృత్వంలో 50 మంది యువకులు దాడులు చేశారు. ఈ దాడుల్లో తంగరాజ్(29), బాబు(31) గాయపడ్డారు. అలాగే, నేతాజీ నగర్లో గురువారం రాత్రి పన్నీర్‌సెల్వం, దినకరన్ వర్గీయులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడుల్లో మాజీ ఎమ్మెల్యే కరుప్పయ్యా తదితర 8మందితో పాటు పోలీసులు గాయపడ్డారు. ఇందుకు సంబంధించి పన్నీర్ వర్గానికి చెందిన వారిపై కేసులు నమోదయ్యాయి. తమది ధర్మయుద్ధం, గెలిచే తీరుతామని ఈ సందర్భంగా పన్నీర్‌సెల్వం ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును దినకరన్ పంచుతున్నారని దీప ఎద్దేవా చేశారు. డీఎంకే అభ్యర్థి తరఫున స్టాలిన్ వీధి వీధిన తిరుగుతూ ప్రచారం చేశారు. పన్నీర్ వర్గీయులు జయలలిత భౌతిక కాయాన్ని పోలిన నమూనా శవపేటికతో ప్రచారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల కమిషన్ సైతం ఈ తరహా ప్రచారాన్ని ఆక్షేపించింది. దినకరన్ ఓపెన్ టాప్ జీపులో తిరుగుతూ ఓటర్లను ఆకర్శించే ప్రయత్నం చేస్తున్నారు. మధుసూధనన్ తరఫున పన్నీర్‌సెల్వం ప్రచారం చేయగా, ఆర్కేనగర్లో పోటీచేస్తున్న నలుగురు స్వతంత్ర అభ్యర్థులు పన్నీర్‌సెల్వంకు మద్దతు తెలిపారు. మధుసూధనన్ గెలుపునకు పాటుపడతామని వారు చెప్పారు. వాహనాల తనిఖీలో 12 మంది అరెస్ట్: ఆర్కేనగర్ ప్రజలను మభ్యపెట్టేందకు అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారనే సమాచారంతో ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు వాహనాల తనిఖీ ముమ్మురం చేశారు. శుక్రవారం ఉదయం పుదువన్నార్పేట్టై, దేశీయనగర్, ఇందిరానగర్, శివన్ నగర్ తదితర ప్రాంతాల్లో ఓటర్లకు నగదు పంచుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఓటర్లకు నోట్లు పంచుతున్న తిరుపూరుకు చెందిన తంగరాజ్, బాబు, ముసిరి సెంథిల్, జయశీలన్, పుదూర్ రామచంద్రన్ తదితర 9మందిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.1.15 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే తండయార్‌పేట తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి డీఎంకేకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసి రూ.27వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా, తనిఖీ అధికారులను ఇంట్లోకి రాకుండా నిలువరించేందుకు ఒక మహిళ బహిరంగంగా వివస్త్రగా మారగా అందరూ కంగారుపడ్డారు. ఆ మహిళ నోటిమాటల ధాటికి అధికారులు వెళ్లిపోయారు. ఆర్కేనగర్లో అక్రమమార్గంలో గెలవాలని ప్రయత్నిస్తున్న దినకరన్ ను ఎన్నికల్లో పోటీచేయకండా అనర్హత వేటు వేయాల్సిందిగా అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప ఢిల్లీలో ఎన్నికల కమిషన్ కు వినతిపత్రం సమర్పించారు. -
మెగా 150లో విజయశాంతి
-
మెగా 150లో విజయశాంతి..?
మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా ఎప్పటికప్పుడు ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది. చాలా ఏళ్లుగా ఊరిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ ఇటీవలే పట్టాలెక్కింది. వినాయక్ దర్శకత్వంలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఇప్పటి వరకు హీరోయిన్ మాత్రం ఫైనల్ కాలేదు. అయితే తాజాగా మరో ఆసక్తి కరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. తమిళ సినిమా కత్తికి రీమేక్ గా తెరకెక్కుతున్న మెగాస్టార్ 150వ సినిమాలో అలనాటి స్టార్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్రలో నటించనుందట. 90లలో హిట్ పెయిర్ అనిపించుకున్న ఈ జోడి మరోసారి తెరమీద కనిపించనుందన్న వార్త ఇప్పుడు మెగాఫ్యాన్స్తో పాటు సినీ వర్గాలను కూడా షాక్‌కు గురిచేస్తోంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న విజయశాంతి మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమానే తన రీ ఎంట్రీకి కూడా కరెక్ట్ అని ఫీలవుతుందట. మెగాస్టార్ సినిమాలో విజయశాంతి నటిస్తుందన్న వార్తకు సంబందించి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేక పోయినా.. మీడియా సర్కిల్స్‌లో మాత్రం ఈ గాసిప్ తెగ హడావిడి చేస్తోంది. మరి ఇప్పటికైన చిరు టీం ఈ వార్తలపై క్లారిటీ ఇస్తుందో లేక ఫ్రీ ప్రమోషన్ అన్న ఆలోచనతో వదిలేస్తుందో. -
పవన్ కళ్యాణ్ సామాజిక నేరస్థుడా!
గత కొద్దికాలంగా కేసీఆర్ తో పవన్ కళ్యాణ్, విజయశాంతిల మధ్య ప్రచ్ఛన్న యుద్దం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సమయంలో కేసీఆర్, పవన్ కళ్యాణ్ లిద్దరూ పరస్పర ఆరోపణలు మీడియాలో పతాక శీర్షికల్లో చేరిన సంగతి తెలిసిందే. తెలంగాణలో నిర్వహించిన సమగ్ర సర్వే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై కేసీఆర్ పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేసినా.. ధాటిగానే స్పందించినట్టు అర్ధమవుతోంది. ఇక తెలంగాణ రాములమ్మ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ తో విభేదించి కాంగ్రెస్ తరపున అసెంబ్లీకి పోటీ చేసి ఓటమిపాలైనారు. గతంలో కేసీఆర్, విజయశాంతి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయనే నేపథ్యంలో టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఇలాంటి నేపథ్యంలో వీరిద్దరూ సమగ్ర సర్వేకు దూరంగా ఉండటం మీడియాను ఆకర్షించాయి. తెలంగాణలో నిర్వహించిన సమగ్ర సర్వేకు పది జిల్లాల్లోనే కాక దేశ, విదేశాల్లో ఉన్న ప్రజల నుంచి కూడా మంచి స్పందన కనిపించింది. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర సర్వేలో సీమాంధ్ర ప్రాంతవాసులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు భాగమయ్యారు. అయితే సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ నేత విజయశాంతి సర్వేకు దూరంగా ఉండటం కొంత వివాదంగా మారింది. సమగ్ర సర్వేలో పవన్ కళ్యాణ్, విజయశాంతిలు పాల్గొనలేదనే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకురాగా.. తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఉండాలనుకోవడం లేదో అని వ్యాఖ్యలు చేశారు. టూరిస్టులు, అతిధుల మాదిరిగా ఉండి, వెళ్లాలనే ఉద్దేశంతోనే సర్వేలో పాల్గొని ఉండకపోవచ్చని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో నివసిస్తూ తాగునీరు, లైట్లు, తదితర ప్రభుత్వ సౌకర్యాలను వినియోగించుకుంటూ ప్రభుత్వ సర్వేలో పాల్గొనకపోవడం సామాజిక నేరం అంటూ తీవ్రంగా స్పందిచారు. వ్యక్తిగత కారణాల వల్లనో.. లేదా ఇతరత్రా అంశాల ప్రభావం వల్లనో పవన్ కళ్యాణ్, విజయశాంతిలు సమగ్ర సర్వేకు దూరంగా ఉన్నారు. ఒకవేళ సమగ్ర సర్వేను వ్యతిరేకిస్తే అందుకు కారణాలను మీడియా ముఖంగా వెల్లడించి ఉండే బాగుండేదనే కోణంలో పలువురు అభిప్రాయపడుతున్నారు. లేదా వ్యక్తిగత కారణాల వల్ల అయితే మరో దఫాలో సర్వేలో భాగస్వామ్యులవుతారా అనే విషయం సామాజిక వెబ్ సైట్ల ద్వారా స్పందించినా.. ప్రజలకు వారి మనోభావాలు తెలిసి ఉండేవి. ఓ సినీనటుడిగానే సమగ్ర సర్వేకు దూరంగా ఉంటే పెద్గగా వివాదమయ్యేది కాదు. కాని జనసేన అనే పార్టీ ద్వారా ప్రజల పక్షాన నిలిచి ప్రశ్నిస్తా అనే ట్యాగ్ లైన్ తో గత ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్ మౌనం వహించడం సామాజిక నేరాన్ని అంగీకరించారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. -
మెదక్‌పైనే అందరి గురి
ఉప పోరుకు నేతల సై - ఎంపీ స్థానానికి పోటాపోటీ - ముమ్మర ప్రయత్నాల్లో ఆశావహలు - రోజురోజుకు పెరుగుతున్న సంఖ్య - టీఆర్ఎస్లో తీవ్ర పోటీ - బీజేపీలో సైతం అదే తీరు.. - పావులు కదుపుతున్న కిషన్‌రెడ్డి, విజయశాంతి - కాంగ్రెస్, టీడీపీల్లో కానరాని ఆసక్తి సాక్షి, సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యం కావడంతో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ, మెదక్ లోక్‌సభ స్థానాల నుంచి బరిలో దిగి విజయదుందుభి మోగించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మెదక్ లోక్‌సభ స్థానానికి కేసీఆర్ త్వరలో రాజీనామా చేయనున్నారు. దీంతో ఆరు నెలల్లో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. టీఆర్ఎస్, బీజేపీల నుంచి ‘ఉప’ పోరు బరిలో దిగి అదృష్టాన్ని పరీక్షించుకోడానికి భారీ సంఖ్యలో ఆశావహులు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో ఆయా పార్టీల టికెట్‌కు తీవ్ర పోటీ నెలకొని ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభావాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్, టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ఇప్పటివరకు ఎవ రూ తమ ఆసక్తిని బహిర్గతం చేయకపోవడం గమనార్హం. సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టేందుకు సమాయత్తమవుతోంది. టీఆర్ఎస్ తరఫున మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఇదే ఊపుతో సునాయాసంగా గెలుపొందవచ్చని ఆ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహులు భావిస్తున్నారు. టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న వారిలో కేవీ రమణాచారి, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆర్. సత్యనారాయణ, మైనంపల్లి హన్మంతరావు, దేవీప్రసాద్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. కేసీఆర్ వీరిలో ఎవరిని ఆశీర్వదిస్తారేచి చూడాల్సిందే. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ సమీప బంధువుకు జెడ్పీ చైర్మన్ పదవిని కట్టబెట్టాలని ఇప్పటికే పార్టీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇదే జరిగితే మెదక్ లోక్‌సభ నుంచి పోటీలో దింపేందుకు ఆయన పేరును పరిశీలించే అవకాశాలు సన్నగిల్లుతాయి. మూడు పర్యాయాలుగా దుబ్బాక అసెంబ్లీ టికెట్ ఆశించిన కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రతిసారీ భంగపడక తప్పలేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న కేసీఆర్.. కొత్త ప్రభాకర్ రెడ్డికి అన్ని విధాలుగా ప్రాధాన్యత ఇస్తామని.. ఎమ్మెల్యే హోదాకు మించిన పదవిని ఆయనకు కట్టబెడతానని సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా హామీ ఇచ్చారు. దీంతో టికెట్ తనకే దక్కవచ్చని ప్రభాకర్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌ను లోక్‌సభ నుంచి బరిలో దింపాలని ఉద్యోగ నేతల నుంచి డిమాండు వినిపిస్తోంది. మాజీ ఐఏఎస్ అధికారి కేవీ రమణాచారి, మల్కాజ్గిరి లోక్‌సభ నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన మైనంపల్లి హన్మంతరావు పేర్లు సైతం ఆశావహుల్లో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్న వారి సంఖ్య సైతం రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా పార్టీ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో పాటు తాజా మాజీ ఎంపీ విజయశాంతి పేర్లు వినిపిస్తున్నాయి. మెదక్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన విజయశాంతి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. బీజేపీ అగ్రనేతలు అద్వానీ, వెంకయ్యనాయుడులతో ఉన్న పరిచయాలతో ఆమె బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఒక వేళ కిషన్‌రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపకపోతే విజయశాంతికి బీజేపీ టికెట్ దక్కే అవకాశాలున్నాయి. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం బీజేపీ టికెట్‌పై మెదక్ లోక్‌సభ నుంచి పోటీ చేసే ఆలోచనతో జనసేన అధినేత పవన్ కల్యాన్‌ను కలిసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, బీజేపీ తెలంగాణ శాఖ అభ్యంతరం తెలపడంతో ఆయన ప్రయత్నానికి ఆదిలోనే చుక్కెదురైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి కాంగ్రెస్‌లోనే ఉంటానని ఉద్ఘాటించారు. సార్వత్రిక పోరులో బీజేపీ నుంచి పోటీ చేసి మూడో స్థానంతో సరిపెట్టుకున్న చాగన్ల నరేంద్రనాథ్ సైతం మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. విజయశాంతి బీజేపీ నుంచి బరిలో దిగితే ఆయన టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించవచ్చని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్, టీడీపీల నుంచి పోటీ చేసేందుకు ఇంతవరకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. -
గులాబీలో గుబులు!
సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి: గులాబీ దళంలో సీబీఐ గుబులు నెలకొన్నట్టు సమాచారం. ఎన్నికల వేళ ఇవేం చిక్కులు అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి సైతం ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ సీనియర్ నాయకుడు హరీష్‌రావు, అలాగే విజయశాంతిపై అక్రమాస్తుల ఆరోపణలపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని నాంపల్లి సీబీసీ ప్రత్యేక కోర్టు సీబీఐ ఎస్పీని ఆదేశించడంతో మెతుకుసీమలో రాజకీయ కలకలం రేగుతోంది. ఇదే జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు(మాజీ టీఆర్ఎస్ నేత) రఘునందన్‌రావు చేసిన ఆరోపణల ఆధారంగా హైదరాబాద్‌కు చెందిన బాలాజీ వడేరా అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. పిటిషనర్ ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో రాజకీయ విశ్లేషకుల దృష్టి జిల్లా రాజకీయాల మీద పడింది. 2001 తర్వాత కేసీఆర్ ఉద్యమం పేరుతో అక్రమంగా డబ్బు కూడబెట్టారని కోర్టుకు విన్నవించారు. అప్పట్లో టీఆర్ఎస్లో ఉన్న విజయశాంతి ఇంట్లోనే రూ. 100 కోట్ల లావాదేవీలు నడిచాయని, ఇదంతా అక్రమంగా వసూలు చేసిన మొత్తం అని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిజానికి పైముగ్గురు నాయకులు కూడా ఇటీవలే ఎన్నికల కమిషన్‌కు తమ ఆస్తుల అఫిడవిట్లను సమర్పించారు. ఈ ముగ్గురు ఆస్తులు అన్నీ కలిపి కనీసం రూ. 40 కోట్లు కూడా దాటలేదు. కానీ కోర్టు ఏకంగా రూ. 100 కోట్ల అక్రమ ఆస్తులపై విచారణ జరపాలని ఆదేశించడంతో మిగిలిన ఆస్తులు ఎక్కడ నుంచి బయట పడతాయోనని జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్లో కేసీఆర్ తనకు కారు లేదని చూపించారు. జగదేవ్‌పూర్ మండలం ఎర్రవ ల్లి గ్రామంలో 37 ఎకరాల 70 గుంటల వ్యవసాయ భూమి ఉన్నట్టు కేసీఆర్ చూపించారు. ప్రస్తుతం మార్కెట్ విలువ రూ 4.5 కోట్లు అని పేర్కొన్నారు. దీనితో పాటు సిద్దిపేట మండలం మిట్టపల్లిలో 2 ఎకరాల భూమి ఉందని దీని మార్కెట్ విలువ రూ. 50 లక్షలు ఉంటుందని చెప్పారు. బంజారాహిల్స్‌లో 584 గజాల స్థలం, కరీంనగర్లో 1,449 గజాల స్థలం ఉందని వీటి మార్కెట్ విలువ రూ. 8.65 కోట్లు అని చెప్పారు. వీటితో పాటు రూ. 7.88 కోట్లు అప్పులు ఉన్నట్లు కేసీఆర్ చూపించారు. ఆయన భార్య పేరిట 650 గ్రాముల బంగారం ఉన్నట్లు చూపించారు. విజయశాంతి ఆస్తులు: ఇక విజయశాంతి , ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ పేరిట రూ. 29.87 కోట్లు స్థిరాస్తి ఉన్నట్లు చూపించారు. రూ 70.61 లక్షల చరాస్తి ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అప్పులు ఏమి లేవన్నారు. టయోటా(రూ.5.89 లక్షలు) వాహనం ఉన్నట్లు చూపించారు. హరీష్ ఆస్తుల వివరాలు: హరీష్‌రావు తన పేరిట రూ. 1.35 కోట్ల విలువ చేసే స్థిర, చరాస్తి ఉందని, తన భార్య శ్రీనిత పేరిట రూ. 1.60 కోట్ల చరాస్తులు ఉన్నాయని చూపించారు. వాటితో పాటు తన భార్యకు రూ 1.21 కోట్ల అప్పుందని పేర్కొన్నారు. 16 లక్షల విలువ చేసే ఇన్నోవా కారు ఉందని చూపించారు. -
టీఆర్ఎస్ దొంగల పార్టీ: విజయశాంతి
మెదక్: తెలంగాణ రాష్ట్ర సమితి, ఆపార్టీ అధినేత కేసీఆర్ పై ఎంపీ, కాంగ్రెస్ నేత విజయశాంతి నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ ఓ దొంగల పార్టీ అంటూ విజయశాంతి మండిపడ్డారు. తన స్వార్ధమే తప్ప తెలంగాణ ప్రజల సమస్యలు కేసీఆర్ కు పట్టవని విజయశాంతి అన్నారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని ఆమె విమర్శించారు. అంతేకాకుండా మాట మీద నిలబడే వ్యక్తి కేసీఆర్ కారని ఆమె అన్నారు. కేవలం కుటుంబం కోసమే కేసీఆర్ పాకులాడుతున్నారని విజయశాంతి తెలిపారు. దళితుడిని ముఖ్యమంత్రి, ముస్లింని ఉప ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్ ...ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. కేసీఆర్ అధికారం కోసం పాకులాడుతున్నారని విజయశాంతి ఆరోపించారు. తెలంగాణ అభివృద్ది చెందాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని విజయశాంతి స్పష్టం చేశారు. -
పిచ్చోడు.. బుడ్డర్ఖాన్.. అలీబాబా చాలీస్ చోర్!
సార్వత్రిక ఎన్నికల పుణ్యమాని చాలా రోజుల తర్వాత మళ్లీ నాయకుల తిట్ల పురాణం వినే భాగ్యం తెలుగు ప్రజలకు కలిగింది. సాధారణంగా నోటి దురుసు ప్రదర్శించే విషయంలో కాస్త వెనకబాటులో ఉండే నాయకులు కూడా ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా స్వరం పెంచేశారు. ప్రధానంగా టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు కేంద్రంగానే ఈ తిట్లన్నీ సాగుతున్నాయి. కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరూ కేసీఆర్‌ను నోటికొచ్చినట్లు తిడుతున్నారు. కిలాడీ, అలీబాబా చాలీస్ చోర్, కాపలా కుక్క, బుడ్డర్ఖాన్, పిచ్చోడు.. ఇలా ఎవరికి తోచిన స్థాయిలో వాళ్లు కేసీఆర్‌ను తిట్టిపోస్తున్నారు. కే అంటే కిలాడీ అని.. కేసీఆర్ అంటే మాట తప్పే పెద్ద కిలాడీ అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పడ్డాక కాపలా కుక్క(వాచ్డాగ్) లా పని చేస్తానని చెప్పిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు మొరగడమేంటని విమర్శించారు. కేసీఆర్ బుడ్డర్‌ఖాన్‌లా మాట్లాడుతున్నారని మరో సందర్భంలో పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. నిత్యం ఫాం హౌస్‌లో పడుకునే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసిందెప్పుడని ప్రశ్నించారు. కేసీఆర్ ఒక అలీబాబా చాలీస్‌చోర్.. టీఆర్ఎస్కు ఓటువేస్తే దొంగోడి చేతికి తాళం చెవి ఇచ్చినట్లే’ అని మెదక్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతి అన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌వి మాయ మాటలు.. నమ్మి మోసపోవద్దని కేంద్రమంత్రి జైరాం రమేష్ అన్నారు. కేసీఆర్ బిడ్డకోసీటు, కొడుక్కో సీటు, అల్లుని కో సీటు ఇచ్చి.. తానూ రెండుసీట్లు తీసుకున్నాడు.. ఇది కుటుంబ పాలనకు నిదర్శనమన్నారు. ఇక విమర్శల విషయంలో ఎప్పుడూ పెద్దగా ధైర్యం చేయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కేసీఆర్ విషయంలోకి వచ్చేసరికి రెచ్చిపోయి మాట్లాడారు. తనను జైలుకు పంపుతానని కేసీఆర్ అంటున్నాడని, 'మరోసారి పిచ్చిమాటలు మాట్లాడితే పిచ్చాస్పత్రికి పంపిస్తా జాగ్రత్త’ అని ఆయన అన్నారు. ఇలా దాదాపు ప్రతి ఒక్కళ్లూ కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని తమ తిట్లపురాణాలకు మరింత పదును పెడుతున్నారు. -
తారలు దిగివచ్చే వేళ..
విజయశాంతి, జయసుధ, జయప్రద రాక పొన్నాల ఇలాకాలో ప్రచారం 22, 23, 28వ తేదీల్లో పర్యటన జనగామ, న్యూస్‌లైన్ :జనగామ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కనువిందుగా మారనుంది. కాంగ్రెస్‌లో జనాకర్షణ నేత లేకపోవడంతో సినీ తారలను రంగంలోకి దింపుతున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సైతం ప్రచారంలో పాల్గొననున్నారు. ఇదీ షెడ్యూల్ ఈనెల 22న మద్దూరు మండలంలో పర్యటన కు పొన్నాల వెంట కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ ఎం.కోదండరెడ్డితోపాటు, మాజీ ఎంపీ, సినీతా ర విజయశాంతి రానున్నారు. ఉదయం 10 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి 10.45 గంటల వరకు మద్దూ రు చేరుకుంటారు. బహిరంగసభ, రోడ్ షోల్లో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ తిరుగుపయనమవుతారు. ఈనెల 23న పొన్నాలతో పార్టీ స్టార్ క్యాంపైనర్ ఎం.కోదండరెడ్డి, సినీతార, మాజీ ఎమ్మెల్యే జయసుధ రానున్నారు. ఉదయం 10 గంటలకు బేగంపేట లో బయలుదేరి 10.40 గంటల వరకు బచ్చన్నపేట పట్టణానికి చేరుకుంటారు. అక్కడ ప్రచా రం ముగిసిన అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరి ఒంటిగంట వరకు నర్మెట చేరుకుంటారు. ఇక్కడ ప్రచారం ముగియగానే సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ బయలుదేరుతారు. తదుపరి ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన ఈనెల 28న పొన్నాల వెంట మాజీ ఎంపీ జయప్రద కూడా రానున్నా రు. ఉదయం 10.40 వరకు జనగామకు హెలికాప్టర్లో చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల వరకు పట్టణంలో రోడ్ షో, బహిరంగ సభ ప్రచార కార్యక్రమాలు చేపడుతారు. అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్లిపోతారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారులకు సమాచారం అందించింది. -
రాములమ్మే దిక్కు!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ ఎంపీ అభ్యర్థిగా రాములమ్మ పేరు మళ్లీ తెరమీదకు వచ్చింది. దాదాపు ఆమె పేరే ఖరారు కానున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు విజయశాంతిని ఒప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగినట్టు సమాచారం. ఇప్పటికే రెండు పర్యాయాలు ఆమెతో సంప్రదింపులు జరిపినట్టు వినికిడి. కేసీఆర్ కూడా మెదక్ నుంచే పోటీ చేయడం దాదాపు ఖాయమనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో.. సిట్టింగ్ ఎంపీ విజయశాంతి అయితేనే గట్టి పోటీ ఇవ్వగలరని అధిష్టానం భావిస్తోంది. దీంతో ఆమెను ఒప్పించే పనిలో ఉన్నారు. ఒకవేళ మెదక్ నుంచి ఓడిపోయినా రాజ్యసభకు పంపుతామనే హామీ కూడా ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన రాములమ్మ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొదట డీసీసీ అధ్యక్షుడు వి. భూపాల్రెడ్ది పేరును అధిష్టానం పరిశీలించింది. కానీ కేసీఆర్‌లాంటి బలమైన ప్రత్యర్థిపై పోటీ చేయడానికి ఆయన విముఖత చూపినట్టు తెలిసింది. తెలంగాణ ప్రజలు.. ఎన్నికల మేనిఫెస్టోలో ప్ర కటించే తాయిలాల కంటే సెంటిమెంటుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని కాంగ్రెస్ అధిష్టానం బలంగా నమ్ముతోంది. సోనియాగాంధీ ప్రత్యేక రాష్ర్టం ఏర్పాటుచేసి ఇక్కడి ప్రజలకు చేరువయ్యారని, తెలంగాణ కోసం పోరాటం చేసిన నేతలే బరిలో నిలబడితే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఆ దిశగా రాములమ్మే సరైన అభ్యర్థి అని ఏఐసీసీ భావిస్తోంది. తెలంగాణవాదంతోనే తెర మీదకు వచ్చిన ఆమె కేసీఆర్‌ను దీటుగా ఎదుర్కోగలదని, పైగా పట్టుబట్టి మెదక్‌కు రైల్వే లైన్ మంజూరు చేయించి అక్కడి ప్రజలకు దగ్గరయ్యారని, కేసీఆర్‌ను దెబ్బ కొట్టాలంటే విజయశాంతిని బరిలోకి దింపడం ఉత్తమమని అధిష్టానం నిర్ణయించింది హస్తిన వర్గాలు చెబుతున్నాయి. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, పార్టీ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ ఇప్పటికే విజయశాంతితో ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం. మెదక్ ను ంచి ఎంపీ అభ్యర్థిగా పోటీచేయాలని కోరినట్లు, ఒకవేళ ఓడిపోతే రాజ్యసభకు పంపిస్తామని సోనియాగాంధీ మాటగా చె ప్పినట్టు తెలిసింది. -
'కాంగ్రెస్ కు రాజీనామా చేస్తా-విలీనం చేస్తారా'
-
కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి
ఢిల్లీ: మెదక్ లోక్‌సభ సభ్యురాలు విజయశాంతి ముందు నుంచి ఊహించినట్లే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్‌సింగ్‌తో కలిసి ఆమె విలేకరుతో మాట్లాడారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు విజయశాంతి చెప్పారు. తెలంగాణ ఇస్తామని చెప్పిన మాటను సోనియా గాంధీ నిలబెట్టుకున్నారని, అలాగే తెలంగాణ ఇస్తే మీతో కలిసి పనిచేస్తానని తాను చెప్పిన మాటను నిలబెట్టుకున్నానన్నారు. రాజకీయ నాయకులు ఎవరైనా మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండాలని విజయశాంతి చెప్పారు. చాలా మంది అన్న మాటలను నిలబెట్టుకోలేకపోతున్నారన్నారు. ఏదేదో మాట్లాడుతున్నారని, అది మంచి పద్దతి కాదని చెప్పారు. గతంలో చెప్పిన దానికి కట్టుబడాలన్నారు. తాను 16 ఏళ్ల నుంచి తెలంగాణ కోసం కష్టపడ్డానని చెప్పారు. 98 నుంచి తన పోరాటం ప్రారంభమైందని, అప్పటి నుంచి సరైనదారిలోనే నడుస్తున్నట్లు తెలిపారు. మాట తప్పితే ప్రజలు నమ్మరన్నారు. గెలుపు ఓటములు, పదవులు ఇవన్నీ రాజకీయాలలో మామూలే అన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందడం ముఖ్యం అని చెప్పారు. తాను భక్తురాలినని, శివరాత్రి చాలా మంచి రోజుని, అందువల్ల ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. మెదక్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు అభినందనలు తెలిపారు. మెదక్ నుంచి పోటీ చేస్తారన్న అన్న విలేకరుల ప్రశ్నకు పోటీ చేయడం ముఖ్యం కాదని, పార్టీని బలోపేతం చేయాలని అన్నారు. అధిష్టానం నిర్ణయం ప్రకారం తాను పోటీ చేస్తానని విజయశాంతి చెప్పారు. -
కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి
-
ఈరోజు శుభదినం: విజయశాంతి
-
విజయశాంతివి అసత్య ఆరోపణలు: కేటీఆర్
హైదరాబాద్ : టీఆర్ఎస్ నేతలు తన చావును కోరుకున్నారని ఆ పార్టీ మాజీ నేత, మెదక్ ఎంపీ విజయశాంతి చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే కేటీఆర్ ఖండించారు. విజయశాంతి ఆరోపణలు అన్ని అవాస్తవాలేనని ఆయన కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీలో ఆమెకు సరైన గుర్తింపు లేకపోవటంతో తమపై ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తాము వసూళ్లకు పాల్పడితే... అందుకు ఆధారాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తనను రాజకీయంగా అణగదొక్కేందుకు టీఆర్ఎస్ నేతలు కుట్రపన్నారని, అడుగడుగునా ఆంక్షలు విధించారని, ఆ పార్టీ నేతలు తన చావును కోరుకున్నారంటూ విజయశాంతి నిన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. -
'సీమాంధ్ర ఎమ్మెల్యేలు రౌడీల్లా ప్రవర్తించారు'
నంగునూరు: అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ బిల్లు ప్రతులను చింపి రాద్ధాంతం చేసిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులు వీధి రౌడీల్లా ప్రవర్తించారని ఎంపీ విజయశాంతి ధ్వజమెత్తారు. గురువారం మెదక్ జిల్లా నంగునూరులో ఆమె విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తలకిందులుగా తపస్సు చేసినా తెలంగాణ ఆగబోదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని కేంద్రం ఎప్పుడో నిర్ణయించిందని, కొత్త సంవత్సరంలో ఏర్పాటు కావటం ఖాయమని చెప్పారు. -
ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు త్వరలో శంకుస్థాపన
రామచంద్రాపురం, న్యూస్‌లైన్: లింగంపల్లి నుంచి రామచంద్రాపురం వరకు రానున్న ఎంఎంటీఎస్ కోసం చేపట్టే పనులకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్టు మెదక్ ఎంపీ విజయశాంతి తెలిపారు. శుక్రవారం ఆమె రామచంద్రాపురంలో విలేకరులతో మాట్లాడారు. తెల్లాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు 4.75 కిలోమీటర్ల లైన్ కోసం రూ.28 కోట్లను వెచ్చిస్తున్నట్టు తెలిపారు. మొదట పటాన్‌చెరుకు ఎంఎంటీఎస్‌ను తేవాలని అనుకున్నా కొన్ని సాంకేతిక కారణాల వల్ల రామచంద్రాపురం వరకే పరిమితమైనట్టు చెప్పారు. ఈ పనులను లండన్‌కు చెందిన సంస్థ దక్కించుకుందని, ఏడాదిలోపు పనులు పూర్తి కావచ్చన్నారు. ఎంఎంటీఎస్ విషయంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు మారినా ప్రజల ఆశీస్సులతో అనుకున్న లక్ష్యాన్ని సాధించినట్టు చెప్పారు. పనుల శంకుస్థాపన కోసం కేంద్ర రైల్వేశాఖ మంత్రితోపాటు ముఖ్యమంత్రి సమయం తీసుకున్నట్టు తెలిపారు. అక్కన్నపేట నుంచి మెదక్ వరకు రైల్వేలైన్ పనులను త్వరలో ప్రారంభించేలా కృషి చేస్తానన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తున్నట్టు చెప్పారు. ఓ వైపు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూనే మరోవైపు అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు విజయశాంతి తెలిపారు. సమావేశంలో పీసీసీ కార్యదర్శి షేక్ అబ్దుల్ ఘని, టెలికం బోర్డు సభ్యుడు రఘువీర్ తదితరులు పాల్గొన్నారు. -
మెదక్‌లో విజయశాంతి సుడిగాలి పర్యటన
మెదక్ టౌన్, న్యూస్‌లైన్: మెదక్ ఎంపీ విజయశాంతి ఆదివారం మెదక్ పట్టణంలో సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా ఆమెకు పట్టణ శివారులోని ద్వారకా గార్డెన్స వద్ద యువజన కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలుకుతూ పట్టణంలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె రాందాస్ చౌరస్తాలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అక్కడ ఏర్పాటు చేసిన తెలంగాణ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పట్టణ శివారులోని పిట్లంబేస్ చెరువు కట్టపై గల దర్గాతోపాటు పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా అభిమానులతో కరచాలనం చేస్తూ ఫొటోలు దిగారు. అంతకు ముందు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టణంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి శశధర్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు శంకర్, డీసీసీ కార్యదర్శులు అస్గర్, దుర్గాప్రసాద్, అశోక్, రెడ్డిగారి నర్సింహారెడ్డి, సీడీసీ డెరైక్టర్ ఆంజనేయులు, ఏఎంసీ మాజీ చైర్మన్లు గంటరాజు, మధుసూదన్‌రావు, అమరసేనారెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జి.ఆంజనేయులుగౌడ్, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు కొండశ్రీను, నాయకులు శివరామకృష్ణ, పురం వెంకటనారాయణ, కాలేక్, ఎల్లయ్య, విజయ్, సలీం, అమీర్, నయీం, జీవన్, పవన్, ఏఎంసీ రామాయంపేట వైస్ చైర్మన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీకీ వినతుల వెల్లువ సోమవారం మెదక్ వచ్చిన ఎంపీ విజయశాంతికి పట్టణ ప్రజలు పలు సమస్యలపై పెద్ద ఎత్తున వినతి పత్రాలను సమర్పించారు. జిల్లాలో ఉర్దూ మీడియం పాఠశాలలో 369 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి భర్తీకి కృషి చేయాలని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఖాజామొహినొద్దీన్, రహీమొద్దీన్ తదితరులు వినతి పత్రం సమర్పించారు. హౌసింగ్‌బోర్డు కాలనీలో గత 25 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ అనిల్‌కుమార్, కాలనీ అధ్యక్షుడు డెన్నిస్ ప్రశాంత్ విజ్ఞప్తి చేశారు. మెదక్‌లోని అంబేద్కర్ భవనానికి స్థలం కేటాయించి భవన నిర్మాణం చేపట్టాలని కోరుతూ దళిత సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు కొల్చారం యాదగిరితోపాటు పలువురు దళిత సంఘాల నేతలు ఎంపీకి విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన తనను ఆదుకోవాలని పూలశేఖర్ ఎంపీకి విజ్ఞప్తి చేశారు. పార్లమెంటులో బిల్లు మాత్రమే మిగిలింది పాపన్నపేట: తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని, పార్లమెంటులో బిల్లు మాత్రమే పెట్టాల్సి ఉందని, 2014 జనవరిలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తథ్యమని ఎంపీ విజయశాంతి పేర్కొన్నారు. దేవీ శరన్నవరా త్రోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం ఏడుపాయల దుర్గామాతను డీసీసీ అధికార ప్రతినిధి శశిధర్‌రెడ్డి, గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలిసి ఆమె దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాకుండా ఎంతోమంది సమైక్యవాదులు, రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులు అడ్డుపడినా ఇచ్చిన మాటకోసం సోనియాగాంధీ కట్టుబడ్డారన్నారు. తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది తమ ప్రాణాలను బలిపెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి త్యాగం వృధా కాలేదన్నారు. కొంతమంది తెలంగాణ విషయంలో పిచ్చి పిచ్చి సవాళ్లు విసురుతున్నారని వాటిని వెంటనే మానుకోవాలని హెచ్చరించారు. ఏడుపాయల్లో భక్తుల సౌకర్యార్థం హైమాస్ట్ లైట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. డీసీసీ అధికార ప్రతినిధి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో సమ్మక్క-సారలమ్మ జాతర తరువాత ఏడుపాయల ప్రసిద్ధి చెందిందన్నారు. ఏడుపాయల చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఏడుపాయల అభివృద్ధి కోసం ఎంపీ తన నిధులను వినియోగించాలని కోరారు. అంతర్గత రోడ్లతోపాటు ఏడుపాయల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఏడుపాయల మాజీ చైర్మన్లు వెంకటేశ్వర్‌రెడ్డి, నర్సింలుగౌడ్, గోపాల్‌రెడ్డి, ఈఓ వెంకటకిషన్‌రావులు పాల్గొన్నారు. దుర్గమ్మ తల్లికి ప్రత్యేక పూజలు ఆదివారం రాత్రి ఏడుపాయలకు చేరుకున్న ఎంపీ విజయశాంతి దుర్గమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక పూజారులు ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏడుపాయల దుర్గామాత విశిష్టతను మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి వివరించారు. ఎల్లాపూర్‌లో ప్రొటోకాల్ రగడ తమ గ్రామ సర్పంచ్ మల్లీశ్వరికి తెలియకుండా ఎంపీ పర్యటన చేపట్టి ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఎంపీ పర్యటనను కొంతమంది ఎల్లాపూర్‌లో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.