
సాక్షి, మహబూబ్‌నగర్: ప్రజలు అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి అన్నారు. రాష్ట్రంలో దొరను దింపుతామని చాలెంట్ చేయాలన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో అభివృద్ధి జరగలేదన్నారు. నాలుగు కోట్ల మంది ప్రజలు నలుగురుగా ఉన్న కేసీఆర్‌పై దండయాత్ర చేయాలన్నారు. బీజేపీ 420 పార్టీతో కుమ్మక్కైందన్నారు. ఈసారి సామ ధాన బేధ దండోపయాలు ప్రయోగించి బీజేపీ కేసీఆర్‌ను మరోసారి గద్దెమీద ఎక్కించడానికి కుట్ర పన్నుతుందని, ప్రజలు వీటిని తిప్పికొట్టాలన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇస్తే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని గ్యారెంటీ ఇవ్వాలని కోరారు.
ఇవి చదవండి: కోడ్ ఉల్లంఘనులపై కఠిన చర్యలు.. : రాహుల్‌రాజ్
Comments
Please login to add a commentAdd a comment