మెగా 150లో విజయశాంతి..? | vijayashanti likely to make comeback with chiranjeevi 150th film | Sakshi
Sakshi News home page

మెగా 150లో విజయశాంతి..?

Published Wed, Jul 13 2016 3:44 PM | Last Updated on Mon, Sep 4 2017 4:47 AM

మెగా 150లో విజయశాంతి..?

మెగా 150లో విజయశాంతి..?

మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా ఎప్పటికప్పుడు ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది. చాలా ఏళ్లుగా ఊరిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ ఇటీవలే పట్టాలెక్కింది. వినాయక్ దర్శకత్వంలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఇప్పటి వరకు హీరోయిన్ మాత్రం ఫైనల్ కాలేదు. అయితే తాజాగా మరో ఆసక్తి కరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది.

తమిళ సినిమా కత్తికి రీమేక్ గా తెరకెక్కుతున్న మెగాస్టార్ 150వ సినిమాలో అలనాటి స్టార్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్రలో నటించనుందట. 90లలో హిట్ పెయిర్ అనిపించుకున్న ఈ జోడి మరోసారి తెరమీద కనిపించనుందన్న వార్త ఇప్పుడు మెగాఫ్యాన్స్తో పాటు సినీ వర్గాలను కూడా షాక్కు గురిచేస్తోంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న విజయశాంతి మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమానే తన రీ ఎంట్రీకి కూడా కరెక్ట్ అని ఫీలవుతుందట.

మెగాస్టార్ సినిమాలో విజయశాంతి నటిస్తుందన్న వార్తకు సంబందించి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేక పోయినా.. మీడియా సర్కిల్స్లో మాత్రం ఈ గాసిప్ తెగ హడావిడి చేస్తోంది. మరి ఇప్పటికైన చిరు టీం ఈ వార్తలపై క్లారిటీ ఇస్తుందో లేక ఫ్రీ ప్రమోషన్ అన్న ఆలోచనతో వదిలేస్తుందో.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement