నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. బలవంతపు మత మార్పిడిని తట్టుకోలేక ఇటీవల ఓ విద్యార్థిని ఆత్మహత్య పాల్పడిన సంఘటన దేశవవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనిని వ్యతిరేకిస్తూ బీజేపీ తమిళనాడులో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువత్తాయి. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ ఘటనపై ఓ కమిషన్ వేయగా.. దీనికి విజయశాంతి సారథ్యం వహిస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న విజయశాంతి తంజావూరులోని బాలిక తల్లిదండ్రులను కలిశారు.
అనంతరం చెన్నై వెళ్లి దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళను కలిశారు. శశికళ ఇంటికి వెళ్లి కాసేపు ఆమెతో భేటీ అయ్యారు. విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ.. శశికళతో మర్యాదపూర్వకంగా సమావేశం అయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జయలలిత తనపై చూపిన ప్రేమ గురించి విజయశాంతి గుర్తు చేసుకున్నారు. విజయశాంతి కలవడంపై శశికళ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా విజయశాంతి, శశికళను కలవడం ప్రస్తుతం హట్‌టాపిక్ మారింది. ఓ నటిగా జయలలితని గుర్తు చేసుకుంటూ శశికళని కలిశారా? లేదా పార్టీ పరంగా కలిశారా? అనేది తమిళనాడు రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment