
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పేరు చెప్పగానే ఒకప్పుడు ఆమె చేసిన పోలీస్ పాత్రలే గుర్తొస్తాయి. 1990లో 'కర్తవ్యం' సినిమాలో వైజయంతీ ఐపీఎస్ పాత్రలో అదరగొట్టేసింది. దీని తర్వాత పలు సినిమాల్లో ఇదే తరహా రోల్స్ చేసినప్పటికీ అవేవి అంత పేరు తీసుకురాలేకపోయాయి. కానీ ఇన్నేళ్ల తర్వాత మళ్లీ వైజయంతీ ఐపీఎస్ రోల్‌లో విజయశాంతి కనిపించబోతున్నారు.
(ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన అమితాబ్.. ఎందుకంటే?)
'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి.. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. చాలా గ్యాప్ తీసుకుని కల్యాణ్ రామ్ కొత్త మూవీలో చేస్తున్నారు. ఇందులోనూ వైజయంతీ ఐపీఎస్ అనే పాత్ర చేస్తున్నారు. పోలీస్ బ్యాక్ డ్రాప్‌తో తీస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా విజయశాంతి పుట్టినరోజు కానుకగా గ్లింప్స్ రిలీజ్ చేశారు.
విజయశాంతి వయసు పెరిగినట్లు కాస్త కనిపిస్తున్నప్పటికీ.. డైనమిక్ లుక్ మాత్రం బాగుంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలావరకు పూర్తయింది. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు. మరి విజయశాంతికి రీఎంట్రీలో ఈ పోలీస్ పాత్ర సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)
Comments
Please login to add a commentAdd a comment