Karthavyam
-
34 ఏళ్ల తర్వాత మళ్లీ అదే పాత్రలో విజయశాంతి
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పేరు చెప్పగానే ఒకప్పుడు ఆమె చేసిన పోలీస్ పాత్రలే గుర్తొస్తాయి. 1990లో 'కర్తవ్యం' సినిమాలో వైజయంతీ ఐపీఎస్ పాత్రలో అదరగొట్టేసింది. దీని తర్వాత పలు సినిమాల్లో ఇదే తరహా రోల్స్ చేసినప్పటికీ అవేవి అంత పేరు తీసుకురాలేకపోయాయి. కానీ ఇన్నేళ్ల తర్వాత మళ్లీ వైజయంతీ ఐపీఎస్ రోల్లో విజయశాంతి కనిపించబోతున్నారు.(ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన అమితాబ్.. ఎందుకంటే?)'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి.. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. చాలా గ్యాప్ తీసుకుని కల్యాణ్ రామ్ కొత్త మూవీలో చేస్తున్నారు. ఇందులోనూ వైజయంతీ ఐపీఎస్ అనే పాత్ర చేస్తున్నారు. పోలీస్ బ్యాక్ డ్రాప్‌తో తీస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా విజయశాంతి పుట్టినరోజు కానుకగా గ్లింప్స్ రిలీజ్ చేశారు.విజయశాంతి వయసు పెరిగినట్లు కాస్త కనిపిస్తున్నప్పటికీ.. డైనమిక్ లుక్ మాత్రం బాగుంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలావరకు పూర్తయింది. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు. మరి విజయశాంతికి రీఎంట్రీలో ఈ పోలీస్ పాత్ర సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?) -
విజయశాంతి 45 ఏళ్ల ప్రస్థానం.. ఆమె జీవితంలో మలుపు తిప్పిన సినిమా
తెలుగు సినిమా రంగంలో లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తో మెప్పించి అనేక విజయాలు సాధించిన ఏకైక సూపర్ స్టార్ విజయశాంతి అనే చెప్పాలి. హీరోలకు దీటుగా యాక్షన్ ఎపిసోడ్స్‌లో నటించి వారికి ఏ మాత్రం తాను తక్కువ కాదని నిరూపించుకుని లేడీ అమితాబ్‌గా గుర్తింపు పొందారు. తన సినిమాలకు స్టార్స్ అక్కర్లేదని నిరూపించిన ఏకైక ఇండియన్ హీరోయిన్ విజయశాంతి. సినిమా రంగంలో ఎన్నో విజయాలను అందుకున్న విజయశాంతో ఈ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి సరిగ్గా 45 సంవత్సరాలు పూర్తి అయింది. అంతేకాకుండా 1983 అక్టోబర్ 15న తన కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన నేటి భారతం చిత్రం విడుదలయి నేటికి 40 ఏళ్లు పూర్తి అయింది. ఇలా ఈరోజు ఆమెకు మరెంతో ప్రత్యేకం. ఇదే విషయాన్ని విజయశాంతి తన సోషల్ మీడియాలో తెలిపారు. ఏడేళ్లకే బాలనటిగా ఎంట్రీ జూన్ 24, 1966న వరంగల్‌లో జన్మించి, మద్రాసులో పెరిగింది విజయశాంతి. తన పిన్నిగారు అయిన విజయలలిత కూడా అలనాటి తెలుగు సినిమా నటే. విజయశాంతి అసలు పేరు శాంతి. ఆమె తెరపేరు లోని విజయ తన పిన్ని విజయలలిత పేరు నుంచి గ్రహించబడింది. విజయశాంతి తన 7వ సంవత్సరములోనే బాలనటిగా సినీరంగములో ప్రవేశించినట్లు సమాచారం ఉంది. కానీ ఆమె బాలనటిగా నటించిన చిత్రాల వివరాలు అందుబాటులో లేవు. ఆమెను కథానాయకిగా తెరకు పరిచయం చేసింది ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా. ఆయన దర్శకత్వంలో 1979లో వచ్చిన తమిళ సినిమా కల్లుక్కుళ్ ఈరమ్ (రాళ్లకూ కన్నీరొస్తాయి) కథానాయికగా విజయశాంతి మొదటి సినిమా. తెలుగులో విజయశాంతి తొలి చిత్రం అదే ఏడాది (1979) అక్టోబరులో ప్రారంభమై ఆ తరువాతి ఏడు విడుదలైన కిలాడి కృష్ణుడు. ఈ చిత్రంలో హీరో సూపర్ స్టార్ కృష్ణతో ఆమె నటించింది. ఈ చిత్రానికి దర్శకురాలు విజయనిర్మల. మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితం విజయశాంతి కథానాయికగా పరిచయమైన మొదటి నాలుగు సంవత్సరాల పాటు గ్లామర్ పాత్రలు పోషించింది. వాటిలో చెప్పుకోతగినవి ఏవీ లేనప్పటికీ ఉన్నంతలో ఎన్టీయార్, ఏయెన్నార్‌ల కలయికలో వచ్చిన 'సత్యం - శివం'లో ఆమె పోషించిన పాత్ర కొద్దిగా చెప్పుకోతగ్గది. ఈ నాలుగేళ్లలో ఆమె ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించింది. విజయశాంతికి తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చిన సినిమా టి.కృష్ణ దర్శకత్వంలో ఈ తరం సంస్థ 1983లో నిర్మించిన 'నేటి భారతం'. ఇలా క్రమంగా కథానాయికగా ఒక్కో సినిమాలో నటిస్తూ దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలోనే మరే నటీ అందుకోలేని స్థాయికి చేరిందని చెప్పవచ్చు. ఈ సినిమాతో మరో తార ఉద్భవించింది 1983లో టి. కృష్ణ రూపంలో అదృష్టం విజయశాంతి తలుపు తట్టింది. ప్రజా నాట్య మండలి నాటకాల ద్వారా ప్రగతిశీల భావాలుగల ప్రయోక్తగా అప్పటికే పేరొందిన టి. కృష్ణ తొలిసారిగా ఒక తెలుగు చలనచిత్రాన్ని రూపొందిస్తూ అందులో ఒక ప్రధాన పాత్రకు అనేకమందిని పరిశీలించిన పిమ్మట విజయశాంతిని ఎంచుకున్నాడు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ ఆ చిత్ర కథానాయిక పాత్రలో విజయశాంతి జీవించిందని చెప్పవచ్చు. దీంతో నేటి భారతం సినిమా ఘన విజయానికి విజయశాంతి ప్రధాన కారణమైంది . అలా అప్పటికే తెలుగు తెరపై జయసుధ, జయప్రద,శ్రీదేవి, మాధవి వంటి వారు అప్పటికే తెలుగు పరిశ్రమలో పాతుకుపోయారు. వారందరినీ సవాలు చేస్తూ విజయశాంతి రూపంలో మరో తార వెండితెరపై ఉద్భవించింది. అక్కడి నుంచి ఆమెకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని ఒక నటిగా ఎదిగింది. నేటి భారతం చిత్రంలో తన నటనకు మొదటిసారిగా ఉత్తమ నటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డును కూడా గెలుచుకుంది. రెండుపడవల ప్రయాణం ఆ తరువాత రెండేళ్లపాటు రెండుపడవల ప్రయాణంలా సాగింది విజయశాంతి సినీ పయనం. ఒక వైపు నేటి భారతంతో వచ్చిన ఉత్తమ నటి పేరును నిలిపే పాత్రలు, మరో వైపు సగటు సినీ వీక్షకులనలరించే గ్లామర్ అద్దిన మసాలా పాత్రలు అలవోకగా పోషిస్తూ 1986నాటికి తెలుగు వెండితెరపై వెలిగే తారామణుల్లో ఒకటి నుంచి పది వరకూ అన్ని స్థానాలు తనవే అనే స్థాయికి చేరిపోయింది. అప్పట్లో ఆమె తరువాతి స్థానాల్లో రాధ, సుహాసిని, రజని, రాధిక వంటి వారుండేవారు. జయశాంతి విశ్వరూపం 1985 నటిగా విజయశాంతి విశ్వరూపం ప్రదర్శంచిన సంవత్సరం. ఆ ఏడాది వందేమాతరం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, ప్రతిఘటన వంటి ప్రగతిశీల చిత్రాల్లో రెబల్ ఛాయలున్న కథానాయిక పాత్రల్లోనూ, అగ్ని పర్వతం, పట్టాభిషేకం, చిరంజీవి, దర్జా దొంగ, ఊరికి సోగ్గాడు, శ్రీవారు వంటి చిత్రాల్లో చలాకీగా హీరోతో ఆడి పాడే కథానాయికగా నటించి తను రెండువిధాలుగానూ ప్రేక్షకులను మెప్పించగలనని ఋజువుచేసింది. పైన పేర్కొన్న పది చిత్రాల్లో ఒక్క చిరంజీవి తప్ప మిగిలినవన్నీ విజయవంతం కావటం విశేషం. ప్రతిఘటన చిత్రంలో తన అద్భుత నటనకు గాను రెండవసారి ఉత్తమ నటిగా నంది అవార్డును గెలుచుకోవటమే కాకుండా ప్రేక్షకులలో ఆమెకంటూ ప్రత్యేకమయిన అభిమాన వర్గాన్ని సంపాదించుకుంది. జీవితాన్ని మరో మలుపు తిప్పిన సంవత్సరం 1990 జూన్ నెలలో వచ్చిన కర్తవ్యం విజయశాంతి నట జీవితాన్ని మరో మలుపు తిప్పింది. ఐ.పీ.ఎస్. అధికారిణి కిరణ్ బేడీ స్ఫూర్తితో, మోహన గాంధీ దర్శకత్వంలో తను కథానాయిక పాత్ర పోషిస్తూ తన సొంత ప్రొడక్షన్ సూర్యా మూవీస్ పతాకంపై విజయశాంతి నిర్మించిన ఈ చిత్రం అపూర్వ విజయం సాధించడమే కాకుండా ఆమెకు 1990వ సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డుతో పాటు, కేంద్ర ప్రభుత్వ ఉత్తమ జాతీయ నటి అవార్డులను సంపాదించిపెట్టింది. ఈ చిత్రంలో సంఘంలోని చీడపురుగులను ఏరి పార వేసే ఐ.పీ.ఎస్. అధికారిణి వైజయంతి పాత్రలో ఆమె చూపిన అద్భుత అభినయం, రిస్క్ కు వెరవకుండా వీరోచితంగా చేసిన పోరాటాలు ఆమెకు లేడీ అమితాబ్, యాంగ్రీ యంగ్ ఉమన్, ఫైర్ బ్రాండ్ లాంటి బిరుదులు కూడా వచ్చాయి. ఒక్క సారిగా తెలుగు సినిమా పరిశ్రమలో టాప్‌లోకి ఆమె ఇమేజ్ చేరింది. మొదటి సారిగా తెలుగు సినిమా పత్రికలు ఒక కథానాయికను సూపర్ స్టార్ అనే బిరుదుతో సంబోధించసాగాయి. ఏడాది పాటు ఒక్క సినిమా కూడా లేదు 1993 లో వచ్చిన పోలీస్ లాకప్ తరువాత వరుసగా రెండేళ్లపాటు ఆమెకు సిల్వర్ జూబ్లీ సినిమాలు కరువయ్యాయి. దానితో ఆమె 1996 లో ఒక్క తెలుగు చిత్రంలోనూ నటించలేదు. ఏడాది పాటు విజయశాంతి సినిమా అనేది థియేటర్లలో కనిపించలేదు. అలా అభిమానుల బాధను మరపిస్తూ 1997 మార్చి 7 న విడుదలయింది 'ఒసేయ్ రాములమ్మా'. దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలయిన మొదటి రోజు నుంచి అన్ని అంచనాలనూ మించిపోతూ తెలుగు చిత్ర సీమలో నాటి వరకూ ఉన్న ఎన్నో రికార్డులను అలవోకగా బద్దలు కొట్టిందీ చిత్రం. అదే ఏడాది విడుదలై విజయవంతమయిన హిట్లర్, అన్నమయ్య, తొలిప్రేమ, ప్రేమించుకుందాం.. రా వంటి చిత్రాలకంటే మిన్నగా వసూళ్లు సాధించి పెట్టింది. అప్పటికి ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్నా బాక్సాఫీసు వద్ద విజయశాంతి హవా ఏమాత్రం తగ్గలేదని నిరూపించిందా చిత్రం. నాలుగోసారి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ నటిగా నంది అవార్డును ఆమెకి అందించింది. అప్పటి నుంచి ప్రేక్షక జనం ఆమెను అభిమానంతో రాములమ్మగా పిలవడం ప్రారంభించారు. ఆ చిత్రం రాష్ట్ర వ్యాప్తంగా సినిమా ధియేటర్ల వద్ద రేపుతున్న సంచలనం సద్దుమణగక ముందే, 1997 జూన్ నెలలో ఆమె ఎవరూ ఊహించని విధంగా అప్పటి కేంద్ర హోం మంత్రి ఎల్. కె. అద్వానీ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరి మరో సంచలనం సృష్టించింది. ఒసేయ్ రాములమ్మా తరువాత విజయశాంతిని ఘన విజయాలు పలకరించటం మానేశాయి. తర్వాత కొన్ని సినిమాలు తీసిన అవి అంతగా మెప్పించలేదు. అలా సుమారు 13 ఏళ్లు బ్రేక్ తీసుకుని మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇలా ఆమె సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 45 ఏళ్లు పూర్తి అయినా నేటికి ఆమెకున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. విజయశాంతి జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయాలు ► ఆమె 1987లో మోటూరి శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అతను ఎన్టీఆర్ పెద్దల్లుడు.. గణేష్ రావుకు స్వయాన మేనల్లుడు. దగ్గుబాటి పురందరేశ్వరి భర్త తరుపు నుంచి కూడా ఆయనకు బంధుత్వం ఉంది. ► చిరంజీవితో అత్యధికంగా 19, బాలకృష్ణతో 17, కృష్ణతో 12, శోభన్ బాబుతో 11, సుమన్‌తో 7 చిత్రాలలో నటించించారు. ► తెలుగులో మాత్రమే కాకుండా భారతదేశంలోని ఏ భాషలోనూ విజయశాంతి కన్నా ఎక్కువ కథానాయిక ప్రాధాన్యత ఉన్నన్ని చిత్రాల్లో నటించిన మరో నటి లేరు. ► కర్తవ్యం సినిమాలో నటించిన నటనకు గానూ జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు. ► విజయశాంతి నాలుగు నంది పురస్కారాలను దక్కించుకున్నారు. ►1987లో ఆమె చిరంజీవితో కలసి నటించిన స్వయంకృషి చిత్రం మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లోనూ, హాలీవుడ్ నటుడు థామస్ జనెతో నటించిన పడమటి సంధ్యారాగం సినిమా లూస్వెల్లీస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడినాయి. ► హీరోలతో సమానంగా పారితోషకం డిమాండ్ చేసిన ఏకైక నటిగా గుర్తింపు పొందారు. ఆమె నటించిన కర్తవ్యం సినిమాలో రెమ్యూనిరేషన్ ఒక కోటి రూపాయలు. ఆ కాలంలో అదే టాప్. ► ఆమె ఏడుసార్లు దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారాలను, ఆరు సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు. ► 2003లో దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ లైఫ్ టైం అఛీవ్‌మెంటు పురస్కారాన్ని పొందారు. ► విజయశాంతి 1998లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె మొదట భారతీయ జనతా పార్టీలో చేరారు. ► తెలంగాణ రాష్ట్ర సాధన లక్షంగా 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసి.. అనంతరం ఆ పార్టీని 2009లో తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేసి టీఆర్ఎస్లో చేరారు. ► ఆమె 2009లో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు ► విజయశాంతిని 2013లో పార్టీవ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటుందని ఆమెను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ► 07 డిసెంబర్ 2020న భారతీయ జనతా పార్టీలో చేరి.. ప్రస్తుతం అదే పార్టీలో కొనసాగుతున్నారు. సాక్షి, వెబ్ డెస్క్ ప్రత్యేకం -
మరో హర్రర్ చిత్రంలో..
తమిళసినిమా: మరో హర్రర్ కథా చిత్రంలో నటించడానికి నటి నయనతార రెడీ అవుతున్నారా? అవుననే టాక్ వినిపిస్తోంది. ఈ తారను లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల నాయకిగా మార్చిన చిత్రం మాయ. ఇది హర్రర్‌తో కూడిన మిస్టరీ కథా చిత్రం. సంచలన విజయం సాధించిన ఈ చిత్రం తరువాత నయనతార రేంజే మారిపోయిందని చెప్పాలి. అయితే ఆ తరువాత నటించిన డోర చిత్రం నిరాశపరచినా, నయనతార కెరీర్‌కు పెద్దగా ఎఫెక్ట్ కాలేదు. ఇక ఈ మధ్య నటించిన అరమ్ చిత్రం నయనతారకు లేడీ సూపర్‌స్టార్ స్థాయినే తెచ్చిపెట్టింది. దీంతో కోలీవుడ్‌లో నయనతారకు ఆ తరహా లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాలు వరుస కడుతున్నాయి. ఇప్పటికే కొలమావు కోకిల, కొలైయుధీర్ కాలం, అరివళగన్ దర్శకత్వంలో చిత్రం అంటూ నటిస్తున్న నయనతార తాజాగా మరో హర్రర్ మిస్టరీ కథా చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. బాలీవుడ్లో సంచలన నటి అనుష్కశర్మ కథానాయకిగా నటించి సొంతంగా నిర్మించిన పరి అనే హర్రర్ కథా చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడుతోంది. దీనికి ప్రాజిట్‌రాయ్ దర్శకుడు. ఆయనిప్పుడు పరి చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని, ఇందులో నయనతారను అనుష్కశర్మ పాత్రలో నటింపజేసే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇదే విధంగా ఇప్పటికే హిందీలో మంచి విజయాన్ని సాధించిన తుమ్హారి సులు చిత్రం తమిళంలో రీమేక్ కానున్న విషయం తెలిసిందే. హిందీలో నటి విద్యాబాలన్ పోషించిన పాత్రలో జ్యోతిక నటించడానికి రెడీ అవుతున్నారు. దీనికి రాధామోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా మన కథానాయికలు హిందీ చిత్రాల రీమేక్‌లపై ఆసక్తి చూపుతున్నారని చెప్పవచ్చు. -
‘కర్తవ్యం’ మూవీ రివ్యూ
టైటిల్ : కర్తవ్యం జానర్ : ఎమోషనల్ డ్రామా తారాగణం : నయనతార, సును లక్ష్మీ, విఘ్నేష్, ఆనంద్ కృష్ణన్ సంగీతం : గిబ్రాన్ దర్శకత్వం : గోపీ నైనర్ నిర్మాత : శరత్ మరార్, ఆర్.రవీంద్రన్ లేడీ ఓరియంటెడ్ సినిమాలతో వరుస విజయాలు సాధిస్తున్న నయనతార లీడ్ రోల్లో తెరకెక్కిన తమిళ సినిమా ఆరమ్. తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో కర్తవ్యం పేరుతో (సాక్షి రివ్యూస్) డబ్ చేసి రిలీజ్ చేశారు. నయనతార కలెక్టర్ పాత్రలో నటించిన ఈ సినిమాకు ప్రివ్యూ షోస్‌తోనే పాజిటివ్ టాక్ రావటంతో మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కిన కర్తవ్యం తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది..? నయనతార లేడీ సూపర్ స్టార్‌గా తన హవాను కొనసాగించిందా..? కథ : కర్తవ్య నిర్వహణలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గని కలెక్టర్ మధువర్షిణి(నయనతార). నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న మధువర్షిణి అక్కడి నీటి సమస్యను ఎలాగైన పరిష్కరించాలని నిర్ణయించుకుంటుంది. అదే సమయంలో ధన్సిక అనే నాలుగేళ్ల చిన్నారి బోరుబావిలో పడుతుంది. (సాక్షి రివ్యూస్) ఆ పాపను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రంగా ప్రయత్నించినా అక్కడి పరిస్థితుల కారణంగా ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. మధువర్షిణి ప్రభుత్వ పరంగా చేసిన ప్రయత్నాలన్ని విఫలం కావటంతో చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? ఆ చిన్నారి ప్రాణాలు ఎలా కాపాడింది? అన్నదే మిగతా కథ. నటీనటులు : పూర్తిగా తమిళ నేటివిటితో తెరకెక్కిన ఈ సినిమాలో ఒక్క నయనతార (సాక్షి రివ్యూస్) మాత్రమే తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న నటి. సినిమా పూర్తిగా నయనతార పాత్ర చుట్టూ నడవటంతో ఎక్కడా మనకు డబ్బింగ్ సినిమా చూస్తున్నామన్న భావన కలుగదు. నయనతార తనదైన నటనతో సిన్సియర్ కలెక్టర్ పాత్రకు ప్రాణం పోసింది. సెటిల్డ్ పర్ఫామెన్స్తో మధువర్షిణి పాత్రలో జీవించింది. ఇతర పాత్రల్లో కనిపించిన నటీనటులు సహజంగా నటించారు. కొత్తవారే అయినా ఎమోషనల్ సీన్స్‌లో అద్భుతంగా నటించి మెప్పించారు.(సాక్షి రివ్యూస్) విశ్లేషణ : గ్రామీణ ప్రాంతాల్లో నీటికోసం ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారన్న అంశాన్ని ఎంచుకున్న దర్శకుడు గోపి నైనర్ ఆ కథకు కంటతడి పెట్టించే ఎమోషన్స్ జోడించి సినిమాను నడిపించాడు. అనవసరమైన కామెడీ, కమర్షియల్ సన్నివేశాలను ఇరికించకుండా (సాక్షి రివ్యూస్) సినిమాను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. ఎక్కడా సినిమా చూస్తున్న భావన కలగకుండా నిజంగా జరిగిన సంఘటనను చూస్తున్నామనిపించేలా సాగింది కథనం. (సాక్షి రివ్యూస్) ఒక పక్క అంతరిక్షంలోకి రాకెట్ లను పంపుతున్నా వంద అడుగుల బావిలో పడ్డ పాపను కాపాడేందుకు సరైన పరిజ్ఞానం లేని పరిస్థితులను ఆలోచింప చేసే విధంగా ఎత్తి చూపించారు. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యం, రాజకీయనాయకులు తప్పులను కూడా ఎత్తి చూపించారు. జిబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు, ప్రేక్షకులతో కంటతడి పెట్టిస్తాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువుల బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : నయనతార నటన ఎమోషనల్ సీన్స్ కథా కథనం మైనస్ పాయింట్స్ : రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవటం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
ఆపరేషన్@బోరు బావి
లేడీ ఓరియంటెడ్ చిత్రాలు కూడా చేస్తూ దూసుకెళోతున్న నయనతార నటించిన తమిళ చిత్రం ‘ఆరమ్’ తెలుగులో ‘కర్తవ్యం’ పేరుతో విడుదల కానుంది. గోపి నైనర్ దర్శకత్వంలో ‘శివ లింగ, విక్రమ్ వేదా’ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించి, 450 పైగా చిత్రాలను డిస్టిబ్యూట్ చేసిన ఆర్. రవీంద్రన్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత శరత్ మరార్ సంయుక్తంగా ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు. ‘‘ప్రజలకు ఏది అవసరమో అదే చట్టమవ్వాలి కానీ చట్టాన్ని ముందే తయారు చేసి దాన్ని ప్రజల మీద రుద్దకూడదు’’ అని ఈ టీజర్‌లోని డైలాగ్ ఆకట్టుకుంటోంది. ‘‘తమిళంలో నయనతారకు లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చి పెట్టిన చిత్రమిది. బోరు బావిలో ఆడుకుంటున్న పిల్లలు పడిపోతే, అక్కడ జరుగుతున్న ఆపరేషన్ కథా వస్తువుగా తీసుకుని సహజత్వానికి దగ్గరగా గోపి నైనర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ ఆపరేషన్ స్పెషల్ ఆఫీసర్‌గా కలెక్టర్ పాత్రలో నయనతార నటన అద్భుతం. ఆసక్తికి గురి చేసే మలుపులతో సాగే మంచి పొలిటికల్ డ్రామా. ఈ నెల 16న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. -
కలెక్టర్ కర్తవ్యం
ఆమె ఒక జిల్లా కలెక్టర్. ప్రజల సంక్షేమం కోసం బాధ్యతతో పనిచేయాల్సిన కర్తవ్వం ఆమెపై ఉంది. కానీ ఆమె కర్తవ్యానికి కొందరు రాజకీయ స్వార్థపరులు సంకెళ్లు వేయాలనుకున్నారు. అప్పుడు ఆ కలెక్టర్ ఎలా స్పందించింది? ఎలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది? అన్న అంశాల ఆధారంగా తమిళంలో రూపొందిన చిత్రం ‘ఆరమ్’. నయనతార లీడ్ రోల్లో గోపీ నైనర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రాన్ని ఆర్. రవీంద్రన్, నార్త్ స్టార్ ఎంటరై్టన్మెంట్ అధినేత శరత్‌మరార్ ‘కర్తవ్యం’ టైటిల్‌తో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాయి. ‘‘నయనతార కెరీర్లో పెద్ద విజయం సాధించిన ఈ సినిమా తెలుగులో హిట్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది. నిర్మాత శరత్ మరార్తో కలిసి ఈ సినిమాను విడుదల చేయనుండటం ఆనందంగా ఉంది. రిలీజ్ డేట్‌ను తర్వలో ఎనౌన్స్ చేస్తాం’’ అన్నారు ఆర్. రవీంద్రన్. విఘ్నేష్, రమేష్, సునులక్ష్మీ, వినోదినీ వైద్యనాథన్ కీలకపాత్రలు చేసిన ఈ సినిమాకు కెమెరా: ఓం ప్రకాశ్. -
కలెక్టర్‌గారి కర్తవ్యం..!
హీరోయిన్ నయనతార ఇప్పుడు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారట. విద్యార్థుల బాగోగుల గురించి ఆరా తీస్తున్నారట. అభివృద్ధికి అడ్డొచ్చిన రాజకీయ నాయకుల ఆట కట్టిస్తున్నారట. అదేంటీ.. సడన్‌గా నయనతార ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? రాజకీయాల్లోకి వస్తున్నారా? అనే డౌట్ మీకు అక్కర్లేదు. ఎందుకంటే ఆమె ఇవన్నీ చేస్తున్నది సినిమాలో. ‘ఆరమ్’ అనే తమిళ చిత్రంలో నయనతార కలెక్టర్‌గా నటిస్తున్నారు. గోపీ నైనర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్లో ఆర్. రవీంద్రన్ ‘కర్తవ్యం’ పేరుతో తెలుగులో విడుదల చేయనున్నారు. ‘‘మా బ్యానర్లో 450 సినిమాలకు పైగా డిస్ట్రిబ్యూట్ చేశాం.‘శివలింగ’, ‘విక్రమ్ వేదా’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించాం. ఇది పొలిటికల్ డ్రామా. దర్శకుడు ఈ సినిమాను బాగా తెరకెక్కిస్తున్నారు. నయనతార నటన అందరినీ ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జీబ్రాన్, కెమెరా: ఓం ప్రకాశ్. -
నయనతార 'కర్తవ్యం' మూవీ స్టిల్స్