హీరోయిన్ నయనతార ఇప్పుడు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారట. విద్యార్థుల బాగోగుల గురించి ఆరా తీస్తున్నారట. అభివృద్ధికి అడ్డొచ్చిన రాజకీయ నాయకుల ఆట కట్టిస్తున్నారట. అదేంటీ.. సడన్‌గా నయనతార ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? రాజకీయాల్లోకి వస్తున్నారా? అనే డౌట్ మీకు అక్కర్లేదు. ఎందుకంటే ఆమె ఇవన్నీ చేస్తున్నది సినిమాలో.
‘ఆరమ్’ అనే తమిళ చిత్రంలో నయనతార కలెక్టర్‌గా నటిస్తున్నారు. గోపీ నైనర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్‌లో ఆర్. రవీంద్రన్ ‘కర్తవ్యం’ పేరుతో తెలుగులో విడుదల చేయనున్నారు. ‘‘మా బ్యానర్‌లో 450 సినిమాలకు పైగా డిస్ట్రిబ్యూట్ చేశాం.‘శివలింగ’, ‘విక్రమ్ వేదా’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించాం. ఇది పొలిటికల్ డ్రామా. దర్శకుడు ఈ సినిమాను బాగా తెరకెక్కిస్తున్నారు. నయనతార నటన అందరినీ ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జీబ్రాన్, కెమెరా: ఓం ప్రకాశ్.
Comments
Please login to add a commentAdd a comment