ఓటీటీకి నయనతార హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Nayanathara Horror Movie Streaming On This Ott From This Date | Sakshi
Sakshi News home page

Nayanathara: మూడేళ్ల తర్వాత ఓటీటీకి హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published Thu, Aug 29 2024 1:19 PM | Last Updated on Thu, Aug 29 2024 1:48 PM

Nayanathara Horror Movie Streaming On This Ott From This Date

లేడీ సూపర్‌స్టార్‌ న‌య‌న‌తార ప్రధాన పాత్రలో న‌టించిన మ‌ల‌యాళ హార‌ర్ థ్రిల్ల‌ర్ మాయనిజాల్. ఈ చిత్రంలో  కుంచ‌కోబోబ‌న్ హీరోగా న‌టించాడు. 2021లో థియేట‌ర్ల‌లో  రిలీజైన ఈ మ‌ల‌యాళం మూవీ దాదాపు మూడేళ్ల తర్వాత ఓటీటీకి వస్తోంది. ఈ నెల 30 నుంచి ఆహా తమిళంలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాకు అప్పు భట్టాత్రి దర్శకత్వం వహించారు.

మ‌ర్డ‌ర్ నేపథ్యంలో..!

అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. దాదాపు 30 ఏళ్ల క్రితం జ‌రిగిన ఈ మ‌ర్డ‌ర్ ఇన్వెస్టిగేషన్‌ కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఓ చిన్నపిల్లాడు ఈ మర్డర్‌ కేసును ఎలా కనిపెట్టాడనేదే అసలు కథ. ఇందులో నయనతార ఆ పిల్లాడికి తల్లిపాత్రలో నటించింది. కుంచ‌కోబోబ‌న్ న్యాయ‌మూర్తి పాత్ర‌లో మెప్పించారు. ఇలాంటి ఇన్వెస్టిగేషన్ జానర్ చిత్రాలు ఇష్టపడేవారుంటే ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ఈ మూవీని ట్రై చేయొచ్చు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement