
ఒకప్పటితో పోలిస్తే వారంతో సంబంధం లేకుండా ఓటీటీలోకి కొత్త సినిమాలు, సిరీసులు రిలీజ్ అవుతున్నాయి. ఇతర భాషల్లో రిలీజైనవి కూడా కొన్నాళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలా ఓ సిరీస్ తెలుగు వెర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటి సంగతి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.
సోనియా అగర్వాల్, శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ సిరీస్ 'ష్'. ఇది నాలుగు కథల సమాహారం. లస్ట్, రొమాన్స్ తదితర అంశాలని బోల్డ్ గానే చూపించే ప్రయత్నం చేశారు. స్కూల్ ఏజ్ లో సె*క్స్ ఎడ్యుకేషన్.. పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత శృంగార జీవితం తదితర స్టోరీలతో ఈ ఆంథాలజీ తీశారు. పృథ్వీ ఆదిత్య, వాలి మోహన్ దాస్, హరీష్, కార్తీకేయన్ దర్శకత్వం వహించారు.
(ఇదీ చదవండి: అల్లు అర్జున్ కోసం ఫ్లాపుల హీరోయిన్?)
గతేడాది తమిళంలో రిలీజ్ కాగా.. దీని తెలుగు వెర్షన్ ఇప్పుడు(ఏప్రిల్ 30 నుంచి) ఆహా ఓటీటీలోకి వచ్చింది. ఒరిజినల్ వెర్షన్ అయితే ఆహా, అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.
నెట్ ఫ‍్లిక్స్ లో అప్పట్లో సెన్సేషన్ సృష్టించిన 'లస్ట్ స్టోరీస్' స్ఫూర్తితో ఈ ఆంథాలజీని తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తే మీకు ఇది అర్థమైపోతుంది. ఇందులో మరీ అంత బోల్డ్ సీన్స్ లేవని, క్లైమాక్స్ ని ఓపెన్ ఎండింగ్ తో ముగించడం కాస్త అసంతృప్తిని కలిగించిందని తమిళంలో రిలీజైనప్పుడు అన్నారు. మరి తెలుగు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్)