telugu moives
-
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. థియేటర్లలో ఇంకా 'పుష్ప 2' హవా నడుస్తూనే ఉంది. మరోవైపు అల్లరి నరేశ్ 'బచ్చలమల్లి', విజయ్ సేతుపతి 'విడుదల 2', ఉపేంద్ర 'యూఐ', హాలీవుడ్ మూవీ 'ముఫాసా' థియేటర్లలోకి వచ్చేశాయి. వీటన్నింటిపైన ఓ మాదిరి బజ్ అయితే ఉంది. మరోవైపు ఓటీటీల్లోనూ ఈ ఒక్కరోజే 20కి మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి అనేది చూద్దాం.(ఇదీ చదవండి: అల్లరి నరేశ్ 'బచ్చలమల్లి' ట్విటర్ రివ్యూ)ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన మూవీస్ జాబితా (డిసెంబర్ 20)అమెజాన్ ప్రైమ్ముర - మలయాళ మూవీమదనోల్సవం - మలయాళ సినిమాస్వైప్ క్రైమ్ - హిందీ సిరీస్బీస్ట్ గేమ్స్ - ఇంగ్లీష్ సిరీస్ఆహాజీబ్రా - తెలుగు సినిమానిరంగళ్ మూండ్రు - తమిళ మూవీహాట్స్టార్వాట్ ఇఫ్? సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ (డిసెంబర్ 22)నెట్ఫ్లిక్స్ఫెర్రీ 2 - డచ్ సినిమాసిక్స్ ట్రిపుల్ ఎయిట్ - ఇంగ్లీష్ మూవీయూనివర్ క్సో డబీజ్ - ఇంగ్లీష్ సిరీస్ఉజుమాకీ - జపనీస్ సిరీస్యోయో హనీసింగ్: ఫేమస్ - హిందీ మూవీఉంజులో - ఇంగ్లీష్ సినిమాదిలాన్ 1983 - ఇండోనేసియన్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)ద డ్రాగన్ ప్రిన్స్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)వర్జిన్ రివర్ సీజన్ 6 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)స్పై x ఫ్యామిలీ కోడ్: వైట్ - హిందీ సినిమా (డిసెంబర్ 21)ద ఫోర్జ్ - ఇంగ్లీష్ మూవీ (డిసెంబర్ 22)సోనీ లివ్క్యూబికల్స్ సీజన్ 4 - తెలుగు డబ్బింగ్ సిరీస్స్టాగ్స్ - ఇంగ్లీష్ సిరీస్సన్ నెక్స్ట్కడకన్ - మలయాళ మూవీజియో సినిమాఆజ్ పిర్ జీనే కీ తమన్నా హై - భోజ్‌పురి సినిమామూన్ వాక్ - హిందీ సిరీస్పియా పరదేశియా - మరాఠీ మూవీలెయిడ్ - ఇంగ్లీష్ సిరీస్థెల్మా - ఇంగ్లీష్ సినిమా (డిసెంబర్ 21)లయన్స్ గేట్ ప్లేబాయ్ కిల్స్ వరల్డ్ - ఇంగ్లీష్ సినిమాబుక్ మై షోసెంటిమెంటాల్ - బెంగాలీ మూవీ(ఇదీ చదవండి: పుష్ప రాజ్ వసూళ్ల సునామీ.. రెండు వారాల్లోనే ఆ మార్క్ దాటేశాడు!) -
అల్లరి నరేశ్ 'బచ్చలమల్లి' ట్విటర్ రివ్యూ
గత కొన్నాళ్లుగా రూట్ మార్చిన అల్లరి నరేశ్.. సీరియస్ కాన్సెప్ట్ సినిమాలు చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇతడి లేటెస్ట్ మూవీ 'బచ్చల మల్లి'. ఈ వారం థియేటర్లలో రిలీజైన స్ట్రెయిట్ తెలుగు మూవీ ఇదొక్కటే. సుబ్బ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ఓ మాదిరి అంచనాలు ఉన్నాయి. గురువారం రాత్రి ప్రీమియర్స్ వేశారు. దీంతో మూవీ టాక్ బయటకొచ్చింది. ట్విటర్లో సినిమా రివ్యూ పెడుతున్నారు.(ఇదీ చదవండి: ప్రమోషన్స్‌కు దూరంగా వెన్నెల కిశోర్.. 'ఇక మీరెందుకు పాకులాడటం?')బచ్చల మల్లి అనే ట్రాక్టర్ డ్రైవర్ జీవితాన్ని స్పూర్తిగా తీసుకుని చేసిన సినిమా ఇది. అల్లరి నరేశ్ పక్కన 'హనుమాన్' ఫేమ్ అమృత అయ్యర్ హీరోయిన్గా చేసింది. టాక్ విషయానికొస్తే.. మూర్ఖత్వంతో తీసుకునే నిర్ణయాల వల్ల జీవితం ఎలా నాశనం అవుతుందని చెప్పడానికి చక్కటి ఉదాహరణ 'బచ్చలమల్లి' సినిమా అని అంటున్నారు. అలాన ఈ మల్లిగాడు గుర్తుండిపోతాడని కూడా చెబుతున్నారు.డైలాగ్స్, జాతర ఫైట్ సీన్, చివరి 20 నిమిషాలతో పాటు హీరో క్యారెక్టరైజేషన్ బాగుందని అంటున్నారు. కాకపోతే స్క్రీన్ ప్లే విషయంలో మరికాస్త కేర్ తీసుకోవాల్సిందని చెబుతున్నారు. ఓవరాల్‌గా చూసేటప్పుడు డెప్త్ తగ్గినట్లు అనిపించిందని తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. అల్లరి నరేశ్ బాగానే కష్టపడ్డాడని మెచ్చుకుంటున్నారు.(ఇదీ చదవండి: ‘విడుదల–2’ పదిరెట్లు అద్భుతంగా ఉంటుంది)Super #BachhalaMalliAsl start to interval varaku asl bore ledu songs @allarinaresh Anna Main ga @Actor_Amritha chala beautiful ga undi Love track chala Baga ochindi Interval block adirindi Fights too good 1st half highlight camera work and music champesaru@subbucinema 🔥👌 pic.twitter.com/1yZNKrHCwz— Viraj ❤️ RCB ❤️ (@_Virajvijay) December 19, 2024#BachhalaMalli is a rustic drama that has a very honest point at its core, but the routine/bland screenplay dilutes the soul of the film and makes it less effective. The film follows many tropes and scenes that are seen in typical rural dramas. While there are a few promising…— Venky Reviews (@venkyreviews) December 19, 2024#BachhalaMalli Although the movie has a very truthful premise, the absence of excitement in the screenplay lessens its depth and affects its overall impact. #AllariNaresh tried his best, but his efforts went in vain. #AmritaAiyer was fine. Plus:👉Allari Naresh's Performance… pic.twitter.com/ZDVBM5JUtL— Review Rowdies (@review_rowdies) December 19, 2024మూర్ఖత్వంతో తీసుకునే నిర్ణయాల వల్ల జీవితం నాశనం అవుతుంది.Watchable Film @allarinaresh Characterization Was Good Dialogue 's & Jathara Fight, Last 20 MinsHero Realisation Scene 👌👌Congratulations @subbucinema & Team.#Bachhalamalli pic.twitter.com/o9u9qXBryp— Praveen (@AlwaysPraveen7) December 19, 2024#AllariNaresh #BachhalaMalli#MaheshBabu #PrabhasBachhalaMalli Review=-Mass Parts💥OverAll=2.75/5Story=2.65/5🎶/BGM=3/5♥️Emotion=3.25/5🥹Love=2.75/5Action=2.9/5🥵1stHalf=2.8/5Interval=3/5🔥2ndHlf=2.75/5Acting=4/5-Naresh🔥Climax=2.9/5-Last 15M pic.twitter.com/iZPKEFZ0ga— Reviewer_Boss^ (@ReviewerBossu) December 19, 2024ST : #BachhalaMalli pic.twitter.com/tUPtHZvdOB— sunny 𝕏🗿 (@itssunny4545) December 19, 2024#Review మూర్ఖత్వంతో తీసుకునే నిర్ణయాల వల్ల జీవితం నాశనం అవుతుంది అని చెప్పడానికి చక్కటి ఉదాహరణ #Bachhalamalli సినిమా @allarinaresh Acting Peaks 💥💥Director @subbucinema 👏👏👏Heroine @Actor_Amritha Settled Performance 👌👌@Composer_Vishal Good Music Good Movie... pic.twitter.com/T4JdTR72UR— Nine Tv Entertainment (@ChitramReviews) December 19, 2024Just finished movie #BachhalaMalli 🔥@allarinaresh ee malli gadu gurtundi pothad anna ❤️@Actor_Amritha I need a girl like #Kaveri you are so good I like you so much 💞 Spcl @_amAryan so good ❤️@subbucinema you made me emotional 🥺 What a writing so depth 🔥👌Songs 👌3.5/5 pic.twitter.com/1qZvfKv4aq— Viraj ❤️ RCB ❤️ (@_Virajvijay) December 19, 2024 -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు
దేశవ్యాప్తంగా ప్రస్తుతం థియేటర్లలో 'పుష్ప 2' హంగామా నడుస్తోంది. దీంతో ఈ వారం కూడా బిగ్ స్క్రీన్‌పై తెలుగు సినిమాలేం రిలీజ్ కావట్లేదు. కానీ సిద్ధార్థ్ నటించిన 'మిస్ యూ' అనే డబ్బింగ్ చిత్రం ఒక్కడే రాబోతుంది. మరోవైపు ఓటీటీలో మాత్రం 30కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: ‘మంచు’ కుటుంబంలో హైడ్రామా)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే 'సింగం ఎగైన్', 'బొగెన్ విల్లా', 'డిస్పాచ్' సినిమాలతో పాటు 'హరికథ' అనే వెబ్ సిరీస్ ఉన్నంతలో ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. వీకెండ్ టైమ్‌కి కొత్త చిత్రాలు ఏమైనా సడన్ రిలీజ్ అని చెప్పి సర్ప్రైజ్ చేయొచ్చు. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీల్లోకి రాబోతుందంటే?ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే సినిమాలు (డిసెంబరు 9 నుంచి 15 వరకు)అమెజాన్ ప్రైమ్సీక్రెట్ లెవల్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 10సింగం ఎగైన్ (హిందీ సినిమా) - డిసెంబర్ 12బండిష్ బండిట్స్ సీజన్ 2 (హిందీ సిరీస్) - డిసెంబర్ 13నెట్ఫ్లిక్స్ద షేప్స్ ఆఫ్ లవ్ (జపనీస్ సిరీస్) - డిసెంబరు 09ద గ్రేట్ బ్రిటీష్ బేకింగ్ షో హాలీడేస్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 09జెమియా ఫాక్స్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 10పోలో (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 10రగ్డ్ రగ్బీ (కొరియన్ సిరీస్) - డిసెంబరు 10మకల్యాస్ వాయిస్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 11మారియా (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 11వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సోలిట్యూడ్ (స్పానిష్ సిరీస్) - డిసెంబర్ 11క్వీర్ ఐ: సీజన్ 9 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 11ద ఆడిటర్స్ (కొరియన్ సిరీస్) - డిసెంబర్ 11ద కింగ్స్ ఆఫ్ టుపేలో (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 11హౌ టూ మేక్ మిలియన్స్ బిఫోర్ గ్రాండ్ మా డైస్ (థాయ్ సినిమా) - డిసెంబర్ 12లా పల్మా (నార్వేజియన్ సిరీస్) - డిసెంబర్ 12నో గుడ్ డీడ్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 121992 (స్పానిష్ సిరీస్) - డిసెంబర్ 12క్యారీ ఆన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 13డిజాస్టర్ హాలీడే (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 13మిస్ మ్యాచ్డ్ సీజన్ 3 (హిందీ సిరీస్) - డిసెంబర్ 13ట్యాలెంట్ లెస్ టకానో (జపనీస్ సిరీస్) - డిసెంబర్ 14హాట్స్టార్డ్రీమ్ ప్రొడక్షన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 11ఎల్టన్ జాన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 13హరికథ (తెలుగు సిరీస్) - డిసెంబర్ 13ఇన్విజబుల్ (స్పానిష్ సిరీస్) - డిసెంబర్ 13జియో సినిమాబూకీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 13పారిస్ & నికోల్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 13బుక్ మై షోడ్యాన్సింగ్ విలేజ్: ద కర్స్ బిగిన్స్ (ఇండోనేసియన్ మూవీ) - డిసెంబరు 10ద క్రో (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 10సోనీ లివ్బొగెన్ విల్లా (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబర్ 13జీ5డిస్పాచ్ (హిందీ సినిమా) - డిసెంబర్ 13లయన్స్ గేట్ ప్లేషో ట్రైల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 13ఆపిల్ ప్లస్ టీవండర్ పెట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 13(ఇదీ చదవండి: Bigg Boss 8: విన్నర్ ప్రైజ్‌మనీ కంటే ఎక్కువే సంపాదించిన విష్ణు!) -
హనుమాన్ టు కల్కి.. టాలీవుడ్ ఫస్టాప్ ఎలా ఉందంటే..
టాలీవుడ్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్‌గా మారింది. ఇక్కడి సినిమాలను ప్రపంచం మొత్తం ఆదరిస్తోంది. వందల కోట్ల కలెక్షన్స్ రాబడుతూ రికార్డులను సృష్టిస్తోంది. అయితే ఇక్కడ సక్సెస్ ఎంత శాతం ఉందో ఫెయిల్యూర్ అంతే ఉంది. కొన్ని సినిమాలు ఊహించని రీతిలో కలెక్షన్స్ రాబడితే.. మరికొన్ని దారుణమైన అపజయాన్ని మూటగట్టుకున్నాయి. ఈ ఆరు నెలల్లో టాలీవుడ్ రిపోర్ట్ ఎలా ఉందో చూసేద్దాం.ఓపెనింగ్ అదిరింది!టాలీవుడ్‌కి సంక్రాంతి పండగ చాలా పెద్దది. ప్రతి సంక్రాంతికి ఒకటి రెండు పెద్ద సినిమాలు వస్తుంటాయి. కానీ ఈ ఏడాది మాత్రం ఏకంగా నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘గుంటూరు కారం’, వెంకటేశ్ ‘సైంధవ్’, నాగార్జున ‘నా సామిరంగ’తో పాటు కుర్రహీరో తేజ సజ్జ ‘హనుమాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే వీటిల్లో హనుమాన్ భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. స్టార్ హీరోల సినిమాలు బరిలో ఉన్నప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులు ‘హనుమాన్’కే ఓటేశారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 300 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టింది. గుంటూరుకారం, నా సామిరంగ చిత్రాలకి మిశ్రమ టాక్ వచ్చినా.. మంచి వసూళ్లనే రాబట్టాయి. సైంధవ్ మాత్రం దారుణంగా బోల్తాపడింది. అంతకు ముందు జనవరి 1న వచ్చిన సర్కారు నౌకరి, రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజైన ‘ర్యాపిడ్ యాక్షన్ మిషన్’, ‘బిఫోర్ మ్యారేజ్’ సినిమాలు ప్లాప్ టాక్‌నే మూటగట్టుకున్నాయి.బ్యాండ్ మోగింది..ఇక ఫిబ్రవరి తొలివారంలో సుహాస్ హీరోగా నటించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్’ విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మంచి విజయమే సాధించింది. అదేవారంలో వచ్చిన ‘కిస్మత్’, ‘హ్యాపీ ఎండింగ్’, ‘బూట్‌కట్ బాలరాజు’, ‘గేమ్ ఆన్’ చిత్రాలు మాత్రం సందడి చేయలేకపోయాయి. ఇక రెండో వారంలో వచ్చిన రవితేజ ఈగల్, మమ్ముట్టి, జీవా ల‘యాత్ర 2’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపంచాయి. మూడోవారంలో వచ్చిన ‘ఊరు పేరు భైరవకోన’ప్రేక్షకలను కొంతమేర భయపెట్టేసింది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక చివరివారంలో వచ్చిన ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’, ‘రాజధాని ఫైల్స్’, ‘సిద్ధార్థ్ రాయ్’, ‘సుందరం మాస్టర్’ చిత్రాలేవి ప్రేక్షకులను అలరించలేకపోయాయి. అయితే ఫిబ్రవరిలో ఈగల్, యాత్ర 2 తప్పితే మిగతావన్నీ అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిన్న చిత్రాలే రిలీజ్ కావడం గమనార్హం.అలరించని సమ్మర్సంక్రాంతి తర్వాత సమ్మర్ సీజన్ టాలీవుడ్‌కి చాలా ముఖ్యమైనది. దాదాపు మూడు నాలుగు పెద్ద సినిమాలైనా వేసవిలో విడుదలయ్యేవి. కానీ ఈ ఏడాది సమ్మర్లో ఒక్క స్టార్ హీరో సినిమా కూడా రిలీజ్ కాలేదు. మార్చి తొలివారం వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అదేవారం భూతద్దం భాస్కర్ నారాయణ’, ‘చారి 111’, ‘ఇంటి నెంబర్ 13’లాంటి చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ.. ఏ ఒక్కటి అలరించలేదు. (చదవండి: బాక్సాఫీస్ వద్ద కల్కి నయా రికార్డ్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లో తెలుసా?)రెండోవారం గోపిచంద్ ‘భీమా’తో విశ్వక్ సేన్ ‘గామి’తో వచ్చాడు. వీటిల్లో భీమాకి ప్లాప్ టాక్ రాగా.. ‘గామి’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాలో బోల్తా పడ్డాయి. ఇక మూడో వారంలో రజాకార్, లంబసింగి, షరతులు వర్తిసాయి’తో పాటు అరడజనుకు పైగా చిన్న సినిమాలు రిలీజ్ అయినా..ఒక్కటి కూడా హిట్ కాలేదు. మూడో వారంలో రిలీజైన శ్రీవిష్ణు ‘ఓం భీమ్ బుష్’ థియేటర్లలో నవ్వులు పూయించింది. ఇక చివరి వారంలో వచ్చిన ‘టిల్లు స్వ్కేర్’ సూపర్ హిట్ కొట్టేసింది. బాక్సాపీస్ వద్ద దాదాపు రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ‘టిల్లుగాడు’ సత్తా చాటాడు.ఏప్రిల్‌లో భారీ అంచనాలతో వచ్చిన విజయదేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అదేవారంలో రిలీజైన భరతనాట్యం’, ‘బహుముఖం’ చిత్రాలు ప్లాప్ టాక్ని సంపాదించుకున్నాయి. రెండోవారంలో రిజీలైన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రం యావరేజ్ టాక్ని సంపాదించుకుంది. ఇక చివరి రెండు వారాల్లో ‘శ్రీరంగనీతులు’ ‘పారిజాతపర్వం’, ‘మార్కెట్ మహాలక్ష్మీ, తెప్ప సముద్రం చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాగా..ఏ ఒక్కటి ఆకట్టుకోలేదు.(చదవండి: పాన్ ఇండియాపై ‘మెగా’ ఆశలు)మేలో తొలివారం ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ అల్లరి నరేశ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాలా కాలం తర్వాత నరేశ్ నటించిన కామెడీ చిత్రమిది. మంచి అంచనాలతో రిలీజైన ఈ చిత్రం ఫ్లాప్ టాక్‌నే సంపాదించుకుంది. ఈ మూవీతో పాటు రిలీజైన సుహాస్ ‘ప్రసన్నవదనం’ చిత్రానికి మంచి టాక్ వచ్చినా.. వసూళ్లను మాత్రం రాబట్టలేకపోయింది. ఒక సెకండ్ వీక్‌లో సత్యదేవ్ ‘కృష్ణమ్మ’తో పాటు ‘ఆరంభం’ అనే చిన్న చిత్రం విడుదలైన..తొలిరోజే నెగెటివ్ టాక్ని సంపాదించుకున్నాయి. ఇక నారా రోహిత్ హీరోగా నటించిన ‘ప్రతినిధి 2’ థియేటర్స్‌కి వచ్చిన విషయమే తెలియదు. ఆ తర్వాత వారంలో ‘నట రత్నాలు’, ‘బిగ్ బ్రదర్’, ‘సీడీ’ ‘సిల్క్ శారీ’, ‘డర్టీ ఫెలో’, ‘బ్రహ్మచారి’తో పాటు మొత్తం అరడజను చిత్రాలు విడుదలైన ప్లాప్ టాక్ని మూటగట్టుకున్నాయి. గెటప్ శ్రీను తొలిసారి హీరోగా నటించిన ‘రాజు యాదవ్’ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక చివరివారం భజేవాయు వేగం, గం..గం..గణేశా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలు రిలీజ్ కాగా.. వీటిల్లో ‘భజే వాయు వేగం’ హిట్ టాక్‌కి సంపాదించుకుంది. ఇక జూన్ తొలివారం ‘సత్యభామ’ అంటూ కాజల్.. ‘మనమే’ అంటూ శర్వానంద్ ప్రేక్షకుల ముందుకు రాగా.. రెండు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేపోయాయి. అదేవారంలో లవ్ మౌళితో పాటు మరో రెండు చిత్రాలు రిలీజ్ అయ్యాయి కానీ.. ఏది హిట్ కాలేదు. రెండో వారంలో సుధీర్ బాబు ‘హరోం హర’తో పాటు ‘మ్యూజిక్ షాప్ మూర్తి, నీ దారే నీ కథ, యేవమ్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. వీటిల్లో మ్యూజిక్ షాప్ మూర్తి విమర్శకులు ప్రశంసలు అందుకుంది. మూడోవారంలో నింద, ‘ఓ మంచి ఘోస్ట్’, ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’, ‘అంతిమ తీర్పు’ లాంటి పలు చిన్న సినిమాలు విడుదలైనా..ఏ ఒక్కటి అలరించలేదు. ఇక చివరి వారం మాత్రం టాలీవుడ్‌కి గుర్తిండిపోయే విజయాన్ని అందించింది. ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ జూన్ 27న విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. కేవలం మూడు రోజుల్లోనే 415 కోట్లను వసూళ్లు చేసి రికార్డ్ సృష్టిస్తోంది. మొత్తంగా ఈ ఆరు నెలల్లో హిట్ల కంటే ఎక్కువగా ఫ్లాపులే ఉన్నాయి. అయితే హనుమాన్, కల్కి 2898 చిత్రాలు మాత్రం చారిత్రాత్మక విజయాలను అందుకున్నాయి. -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 11 మూవీస్.. మొత్తంగా 17 రిలీజ్
వీకెండ్ వచ్చేసింది. వచ్చే వారం 'కల్కి' రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ వీకెండ్ చిన్న చిత్రాలు క్యూ కట్టాయి. హనీమూన్ ఎక్స్‌ప్రెస్, నింద, ఓ మంచి ఘోస్ట్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, అంతిమ తీర్పు, సందేశం, మరణం, పద్మవ్యూహంలో చక్రధారి, ఇట్లు మీ సినిమా, సీతా కళ్యాణ వైభోగమే, మరణం సై అంటే సై సినిమాలతో పాటు ఉపేంద్ర ఏ, ప్రేమ కథా చిత్రమ్, కేజీఎఫ్ 1 చిత్రాలు రీ రిలీజ్ కానున్నాయి.(ఇదీ చదవండి: ఒకేసారి ఆరు ఫ్లాట్స్ కొనేసిన స్టార్ హీరో.. రేటు ఎంతో తెలుసా?)మరోవైపు ఓటీటీలో మాత్రం ఈ శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 11 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఓవరాల్ వీకెండ్లో 17 చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో బాక్, నడిగర్ తిలగం, రసవతి మూవీస్.. ఉన్నంతలో కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. మరి ఈ వీకెండ్ ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు లిస్ట్ ఏంటి? ఏవి ఎందులోకి రానున్నాయనేది చూద్దాం.ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ జాబితా (జూన్ 21)నెట్ఫ్లిక్స్నడికర్ తిలగం - తెలుగు డబ్బింగ్ సినిమాద విక్టిమ్స్ గేమ్ సీజన్ 2 - మాండరిన్ సిరీస్గ్యాంగ్స్ ఆఫ్ గలీషియా - స్పానిష్ సిరీస్ట్రిగ్గర్ వార్నింగ్ - ఇంగ్లీష్ మూవీకోటా ఫ్యాక్టరీ సీజన్ 3 - హిందీ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)అమెరికన్ స్వీట్ హార్ట్స్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)ద యాక్సిడెంటల్ ట్విన్స్ - స్పానిష్ మూవీ (స్ట్రీమింగ్)రైజింగ్ ఇంపాక్ట్ - జపనీస్ సిరీస్ (జూన్ 22)హాట్‌స్టార్బాక్ - తెలుగు డబ్బింగ్ మూవీమై నేమ్ ఈజ్ గాబ్రియోల్ - కొరియన్ సిరీస్బ్యాడ్ కాప్ - హిందీ సిరీస్ద బేర్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ఆహారసవతి - తమిళ మూవీజియో సినిమాబిగ్ బాస్ ఓటీటీ - హిందీ రియాలిటీ షోఅమెజాన్ ప్రైమ్లెస్ ఇన్ఫైలబుల్స్ - ఫ్రెంచ్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)ఫెదరర్: ట్వెల్వ్ ఫైనల్ డేస్ - ఇంగ్లీష్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)బుక్ మై షోలాస్ట్ నైట్ ఆఫ్ అమోర్ - ఇటాలియన్ మూవీ(ఇదీ చదవండి: ప్రభాస్ వల్లే ఇలా మారిపోయాను: దీపికా పదుకొణె) -
అనుపమ-నేహా శెట్టి ఎవరు బెస్ట్?
-
'బాబు నెం.1 బుల్ షిట్ గయ్' సినిమా రివ్యూ
బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్, బజ్జీల పాపగా ఫేమస్ అయిన కుషిత కల్లపు జంటగా నటించిన సినిమా 'బాబు నెం.1 బుల్ షిట్ గయ్'. లక్ష్మణ్ వర్మ దర్శకుడు. డీడీ క్రియేషన్స్ బ్యానర్‌పై దండు దిలీప్ కుమార్ రెడ్డి నిర్మించారు. శివరాత్రి కానుకగా ఈ చిత్రం థియేటర్లలో రిలీజైంది. మరి ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం. (ఇదీ చదవండి: 'ప్రేమలు' సినిమా రివ్యూ) కథేంటి? కార్తీక్ బాబు(అర్జున్ కల్యాణ్) అమెరికాలో చదువుకుని ఇండియాకు తిరిగొచ్చిన ఓ డబ్బున్న కుర్రాడు. కరోనా టైంలో స్వదేశానికి వస్తాడు. దీంతో హైదరాబాద్ శివారులో ఉన్న తమ విల్లాలో కొడుకుని ఉండమని తండ్రి (రవి వర్మ) చెబుతాడు. దీంతో కార్తీక్... తన ప్రేయసి కుషిత(కుషిత కల్లపు)తో కలిసి విల్లాలో ఉండాలని ఫిక్స్ అవుతారు. ఆర్నెళ్లకు సరిపడా వస్తువులన్నీ తెచ్చుకుంటారు. ఇంతలో ప్లంబర్ సోంబాబు(డైరెక్టర్ లక్ష్మణ్ వర్మ) వీరిద్దరిని కిడ్నాప్ చేసి, విల్లాలో బంధించి అక్కడే సెటిల్ అయిపోతారు. ఇంతకీ సోంబాబు ఎందుకలా చేశాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ. ఎలా ఉందంటే? 'బాబు నం.1 బుల్ షిట్ గాయ్' మూవీ యాక్షన్ కామెడీ డ్రామా స్టోరీతో తీశారు. ఓ అందమైన జంటను గదిలో బంధించి... అదే బంగ్లాలో తన కుటుంబంతో కలిసి దర్జాగా జీవించే ఓ తాపీ మేస్త్రీ సోంబాబు కథే ఈ సినిమా. కిడ్నాపర్‌కి కూడా నైతిక విలువలు వుంటాయని చివర్లో చూపించారు. (ఇదీ చదవండి: 'గామి' సినిమా రివ్యూ) కోట్ల విలువ చేసేవి ఎదురుగానే ఉన్నా తనకు వచ్చిన కష్టకాలంలో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికే ఆ బంగ్లాలో ఉండాల్సి వచ్చిందని సింపుల్‌గా వెళ్లిపోయే సోంబాబు జీవిత పాఠం బాగుంది. ఫస్టాప్‌లో కామెడీ ట్రాక్‌తో మొదలై, సోంబాబు లవ్, తన ప్రేయసి సోనాలి పాణిగ్రాహితో వివాహం తదితర అంశాలతో ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేశారు. సెకెండాఫ్‌లో కొంత ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ సీన్స్ తదితర అంశాలతో ఆకట్టుకున్నారు. ఎవరెలా చేశారు? అర్జున్ కల్యాణ్, కుషిత జంట బాగుంది. అర్జున్ ఉన్నంతలో బాగానే చేశాడు. హీరోయిన్ కుషిత క్యూట్ ఫెర్ఫార్మెన్తో అలరించింది. డైరెక్టర్ లక్ష్మణ్ వర్మ కూడా హీరోకి సమంగా ఉండే పాత్రలో కనిపించారు. ఇతనికి జంటగా సోనాలి పాణిగ్రాహి చేసింది. కమెడియన్ భద్రం కాసేపు అక్కడక్కడ నవ్వించాడు. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. దర్శకుడు లక్ష్మణ్ వర్మ రాసుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే బాగున్నాయి. అన్నివర్గాల ప్రేక్షకులు చూసేయొచ్చు. మణికర్ణన్ సినిమాటోగ్రఫీ బాగుంది. పవన్ సంగీతం ఓకే. నిర్మాణ విలువులు స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
ఆర్కే నాయుడు హీరోగా 'ద 100' సినిమా.. త్వరలో థియేటర్లలో రిలీజ్
'మొగలిరేకులు' సీరియల్లో ఆర్కే నాయుడు పాత్రలో నటించి చాలా ఫేమస్ అయిన నటుడు సాగర్.. హీరోగా మరో సినిమా రెడీ చేశాడు. గతంలో 'సిద్ధార్థ' చిత్రంతో టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 'షాదీ ముబారక్' సినిమా చేశాడు. ఇప్పుడు క్రేజీ యాక్షన్ మూవీతో రాబోతున్నాడు. 'ద 100' అనే డిఫరెంట్ టైటిల్ నిర్ణయించారు. అలానే పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?) రాఘవ్ ఓంకార్ శశిధర్.. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ మూవీలో విక్రాంత్ అనే ఐపీఎస్ అధికారిగా ఆర్కే సాగర్ కనిపించబోతున్నాడు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో యాక్షన్ ఎంటర్టైనర్గా ఇది ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో ఆకట్టుకున్న హర్షవర్ధన్ రామేశ్వర్.. ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అవార్డు విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
సంక్రాంతి అంటే సినిమా ఉండాల్సిందేనా? అసలు ఈ కల్చర్ ఎప్పుడు మొదలైంది?
అసలు సంక్రాంతి అంటే ఏంటి? బతుకు తెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిపోయిన కొడుకులు, అల్లుళ్లు, కూతుళ్లు, మనవళ్లు.. అందరూ సొంతూరికి చేరుకుని ఉన్న మూడు రోజులు సరదాగా గడపడమే అసలైన పండగ. అయితే ఈ పండగ హడావుడిలో కోళ్ల పందెలు, పిండి వంటలు చాలా కామన్. వీటితో పాటు సినిమాలు చూడటం అనేది మనకు బాగా అలవాటైపోయిన పని. అసలు సంక్రాంతి అంటే సినిమా కచ్చితంగా చూడాలా? ఇంతకీ ఈ కల్చర్ ఎప్పుడు మొదలైంది? సంక్రాంతి సీజన్ సాధారణంగా సినిమాల్ని ప్రతి శుక్రవారం రిలీజ్ చేస్తుంటారు. ఎందుకంటే శని, ఆదివారాలు కలిసొస్తాయి. సెలవు రోజులు కాబట్టి కుర్రాళ్ల దగ్గర నుంచి ఫ్యామిలీస్ వరకు థియేటర్లకు వస్తారు. ఇక సంక్రాంతి లాంటి సీజన్ వచ్చిందంటే దాదాపు వారం పదిరోజులు అందరికీ సెలవులే. కుటుంబ సభ్యులందరూ ఒక్కచోటే ఉంటారు. కాబట్టి వీళ్లందరికీ వినోదం కావాలి. అప్పుడు అందరికీ గుర్తొచ్చేది సినిమా. అలా తెలుగు చిత్రాలకు సంక్రాంతి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సీజన్ అయిపోయింది. (ఇదీ చదవండి: మెగా సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఈ విషయం గమనించారా? ) ఎప్పుడు మొదలైంది? 1932లో తొలి తెలుగు సినిమా 'భక్త ప్రహ్లాద' రాకముందు వీధి నాటకాలు, బుర్రకథలు లాంటి వాటితో ప్రజలు ఎంటర్టైన్ అయ్యేవారు. ఎప్పుడైతే సినిమా కల్చర్ మొదలైందో.. బుర్రకథలు, నాటకాలు లాంటివి జనాలకు మెల్లమెల్లగా బోర్ కొట్టేశాయి. తొలుత బ్లాక్ అండ్ వైట్‌లో వచ్చిన సినిమాలు.. కాలానుగుణంగా కలర్లోకి మారాయి. అలా 70-80 దశకంలో నిర్మాతల ఆలోచన కూడా మారింది. సంక్రాంతి సీజన్‌ని క్యాష్ చేసుకోవడంతో పాటు సినీ ప్రేమికుల్ని అలరించొచ్చని తెలుసుకుని.. పండక్కి సినిమాలు రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. గ్యారంటీగా వచ్చే స్టార్ హీరోలు అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ దగ్గర నుంచి మొదలుపెడితే ప్రస్తుతం మహేశ్, ప్రభాస్ లాంటి హీరోల వరకు సంక్రాంతి సీజన్ అనేది వీళ్లకు సెంటిమెంట్ అయిపోయింది. ఇప్పుడంటే హీరోలు రెండేళ్లకొక సినిమా చేస్తున్నారు గానీ కొన్నాళ్ల ముందు వరకు సంక్రాంతికి ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోలైనా కచ్చితంగా ఒక్క మూవీ అయినా రిలీజ్ చేసేవాళ్లు. అలా ప్రతిసారి పండక్కి స్టార్ హీరోల మధ్య మంచి పోటీ ఉండేది. కాకపోతే అప్పట్లో ఆరోగ్యకర వాతావరణం ఉండేది. ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది! (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 45 సినిమాలు) ఇప్పుడంతా దందా ఒకప్పుడు సంక్రాంతి సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే. నిర్మాతలు కూడా మంచి సినిమాని రిలీజ్ చేయాలనే తాపత్రయం మాత్రమే ఉండేది. ప్రేక్షకులకు నచ్చిందా లేదా అని మాత్రమే చూసేవాళ్లు. కానీ ఇప్పుడు అంతా మారిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే సంక్రాంతికి సినిమా అనగానే.. పండగ పేరు చెప్పి టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. సగటు ప్రేక్షకుడిని దోచుకుందామని ఫిక్స్ అయిపోతున్నారు. అభిమానులకు అంటే మరో దారి ఉండదు కాబట్టి ఆయా స్టార్ హీరోల సినిమాలకు వెళ్తారు. మరి సామాన్యుడి సంగతేంటి? నిర్మాతలని వీళ్లని పట్టించుకోరు. ఎందుకంటే సంక్రాంతికి ఊరెళ్లినా వాళ్లు.. పండక్కి సరదా కోసం ఒక్క సినిమా అయినా చూడకపోతే ఏం బాగుంటుందిలే అని థియేటర్లకు వెళ్తారు. ఇష్టం లేకపోయినా సరే ఒక్కసారే కదా అని టికెట్ రేట్లు ఎక్కువున్నా సరే డబ్బులు ఖర్చు పెట్టి తప్పక సినిమా చూస్తున్నారు. కొన్నిసార్లు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తే.. కొన్నిసార్లు మాత్రం డిసప్పాయింట్మెంట్ తప్పట్లేదు! అలాంటి సరుకు కూడా అన్నిసార్లు అని చెప్పలేం గానీ కొన్నిసార్లు సంక్రాంతికి వచ్చే సినిమాలని గమనిస్తే.. నార్మల్ టైంలో వస్తే ఇవి ఆడుతాయా? కోట్లకు కోట్లు వసూలు చేస్తాయా అనే డౌట్ చాలామందికి వచ్చే ఉంటుంది. ఎందుకంటే గతంలో అంతంత మాత్రంగానే ఉన్న కొన్ని సినిమాలు.. సంక్రాంతి టైంలో వచ్చి హిట్టో లేదా యావరేజ్ అయిపోయిన సందర్భాలు బోలెడు. ఎందుకంటే పండగ హడావుడిలో సినిమా చూస్తున్నామనే ఆనందం తప్పితే అది ఎలాంటి మూవీ అనేది సగటు ప్రేక్షకుడు పెద్దగా పట్టించుకోరు. అలా పండగ బరిలో పాసైపోయిన సినిమాలెన్నో? (ఇదీ చదవండి: విజయ్-రష్మిక రిలేషన్‌పై మళ్లీ రూమర్స్.. అంతా ఆ ఫొటోల వల్లే?) -
'మాధవే మధుసూదన' అలాంటి సినిమా: దర్శకుడు రామచంద్రరావు
తేజ్ బొమ్మదేవర, రిషికి లొక్రే జంటగా నటించిన సినిమా 'మాధవే మధుసూదన'. ఈ చిత్రానికి బొమ్మదేవర రామచంద్రరావు.. దర్శకత్వం వహిస్తూ నిర్మించారు. ఈ నెల 24న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా సినిమా గురించి పలు ఆసక్తికర సంగతులు చెప్పారు. (ఇదీ చదవండి: యాంకర్ రష్మీతో పెళ్లెప్పుడు? సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్!) మేకప్‌మ్యాన్ టూ డైరెక్టర్ 'మన్మథుడు' టైంలో నాగార్జునతో నేను దర్శకుడిని కావాలని అనుకుంటున్నట్టు చెప్పాను. నీ మెంటాల్టీకి దర్శకుడు అంటే కష్టం కానీ నిర్మాతగా ట్రై చేయ్ అని సలహా ఇచ్చారు. 'సూపర్' సినిమా టైంలో అనుష్కకు మేకప్ వేస్తూ.. మీరు పెద్ద హీరోయిన్ అవుతారు.. అప్పుడు నాకు డేట్స్ ఇవ్వాలని అన్నాను. అలా చాలామందిని అడిగాను. కానీ అనుష్క మాట నిలబెట్టుకున్నారు. 'ఆజాద్' సినిమా టైంలో నాగార్జున కోసం కాచిగూడ రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాను. ఆయన వచ్చారని ఎవరో అంటే పరిగెత్తుకుంటూ వెళ్లి చూశాను. కానీ ఆయన రాలేదు. అలా ఓ మనిషి కోసం వెయిట్ చేస్తుంటే, వాళ్లు రాకపోతే ఆ బాధ ఎలా ఉంటుందనే ఆలోచనలోంచే ఈ కథ పుట్టింది. వెయిట్ చేసి వెయిట్ చేసి రాకపోవడం, 25 ఏళ్ల తరువాత ఆ మనిషి వస్తే పరిస్థితి ఏంటి? అన్నది ఈ సినిమాలో చూపించాం. అలానే నాగార్జున ముందు నుంచీ నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నాగ చైతన్య, అఖిల్, మంచు విష్ణు, బ్రహ్మానందం ఇలా ఎంతోమంది సహాయం చేయడం వల్లే సినిమా ఇక్కడి వరకు వచ్చింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు) -
కిడ్నాప్ చేయడం ఓ కళ
చైతన్యా రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవికా సతీశన్ ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ‘పారిజాత పర్వం’. కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్ అనేది ట్యాగ్ లైన్ (కిడ్నాప్ చేయడం అనేది ఓ కళ). సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహిధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న ఈ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలయ్యాయి. ఒక పోస్టర్లో చైతన్యా రావు, సునీల్, శ్రద్ధా దాస్, శ్రీకాంత్ అయ్యంగార్లు చేతిలో గన్‌తో, ఇతర పాత్రలు ఆశ్చర్యంగా చూస్తున్నట్లు కనిపించారు. ఇంకో పోస్టర్లో శ్రద్ధా దాస్ చేతిలో గన్‌తో స్టయిలిష్‌గా కనిపించారు. -
ఆత్మలతో మార్పిడి కాన్సెప్ట్.. ఆకట్టుకుంటున్న తెలుగు ట్రైలర్
కెప్టెన్ కుక్ ఫిలిమ్స్ పతాకంపై '7:11 PM' ఫేమ్ సాహస్ పగడాల హీరోగా నటించిన సినిమా 'ధీమహి'. విరాట్ కపూర్, సాహస్ పగడాల సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సాహస్ పగడాల, నవీన్ కంటె దర్శకులు. నిఖిత చోప్రా హీరోయిన్. షారోన్ రవి సంగీతమందించారు. అక్టోబర్ 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి' సినిమా రిలీజ్‌కి ముందే రూ 3.5 కోట్లు నష్టం?) 7:11 PM సినిమాతో టైం ట్రావెల్ కాన్సెప్ట్ చూపించిన హీరో కమ్ డైరెక్టర్ సాహస్.. ఇప్పుడు ఆత్మల మార్పిడి కాన్సెప్ట్‌తో తీసిన 'ధీమహి'తో అలరించేందుకు సిద్ధమయ్యాడు. నెక్రోమాన్సీ అంటే చనిపోయిన వాళ్ళతో మాట్లాడటం అనే కాన్సెప్ట్ బాగుంది. ట్రైలర్ బాగుంది మరి సినిమా ఎలా ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగితే సరి. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో డబుల్ మీనింగ్ డైలాగ్స్.. 'జబర్దస్త్'ని మించిపోయిందిగా!) -
అసలు ఆ పాట ఉంది అని కూడా తెలియదు..!
-
'బేబి' దర్శకుడు రిలీజ్ చేసిన 'అష్టదిగ్బంధనం' ట్రైలర్
బాబా పి.ఆర్. దర్శకత్వంలో మనోజ్‌కుమార్ అగర్వాల్ నిర్మించిన చిత్రం 'అష్టదిగ్బంధనం'. సూర్య, విషిక జంటగా నటించిన ఈ మూవీ ట్రైలర్ ని బేబి దర్శకుడు సాయి రాజేశ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమం.. ప్రసాద్‌ల్యాబ్‌లో మంగళవారం జరిగింది. సెప్టెంబర్ 22న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: బెండు తీసిన 'బిగ్‌బాస్'.. హౌసులో దొంగతనానికి స్కెచ్!) 'అష్టదిగ్బంధనం అనేది చాలా పవర్ఫుల్ టైటిల్. ట్రైలర్ చూసిన తర్వాత ఇందులో ప్రేక్షకులను అష్టదిగ్బంధనం చేసే అంశాలు చాలానే ఉన్నాయనిపిస్తోంది. మంచి సస్పెన్స్ కనపడుతోంది. ఈ చిత్రం ఘన విజయం సాధించి యూనిట్ అందరికీ మంచి పేరు, అవకాశాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. సెప్టెంబర్ 22న విడుదల అవుతున్న ఈ సినిమాని థియేటర్లలో అందరూ చూడాలని కోరుకుంటున్నా' అని సాయి రాజేశ్ చెప్పకొచ్చారు. (ఇదీ చదవండి: విదేశాలకు ప్రభాస్.. సర్జరీ కోసమేనా!) -
'రీ-రిలీజ్' ట్రెండ్.. ప్లస్‌ల కంటే మైనస్‌లే ఎక్కువ!
రీ-రిలీజ్ సినిమాలు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ట్రెండ్ ఇదే. ఈ హీరో- ఆ హీరో అని తేడా లేదు. పుట్టినరోజు వస్తుందంటే చాలు.. ఆయా హీరోల పాత మూవీస్‌ని థియేటర్లలో మళ్లీ విడుదల చేస్తున్నారు. అభిమానులతోపాటు సాధారణ ప్రేక్షకులూ వాటిని స్క్రీన్‌పై చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఈ ట్రెండ్ వల్ల ఇండస్ట్రీకి ప్లస్ కంటే మైనస్‌లే అనిపిస్తుంది. వాళ్ల పైత్యం! స్టార్ హీరోల ఫ్యాన్స్ అందరూ చెడ్డోళ్లు కాదు. కానీ వాళ్లలోని కొందరు మాత్రం అభిమానం అనే ముసుగు వేసుకుని ఎక్కడలేని పైత్యం బయటపెడుతున్నారు. ఉదాహరణకు చెప్పుకుంటే.. ఈ మధ్యే ప్రభాస్ 'యోగి' సినిమాని రిలీజ్ చేశారు. చాలామంది చూసి ఎంజాయ్ చేశారు. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్ లో సినిమా చూడటానికి వచ్చిన కొందరు మాత్రం.. ఖాళీ కూల్‌డ్రింక్ కేసులు విరగ్గొట్టారు. మరోచోట స్క్రీన్ చింపేశారు. ఇది నిజంగా పైత్యానికి పరాకాష్ట అని చెప్పొచ్చు. (ఇదీ చదవండి: అప్పు ఎగ్గొట్టిన స్టార్ హీరో.. వేలానికి ఖరీదైన విల్లా!) అందరూ అంతే! అయితే అభిమాని అని చెప్పుకునే ఎక్కడలేని పైత్యం అంతా చూపించేది ఏదో ఓ హీరో ఫ్యాన్స్ మాత్రమే అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే అందరు హీరోల ఫ్యాన్స్ అలానే తగలడ్డారు. ఎంజాయ్ చేయడానికి, పైత్యం చూపించడానికి మధ్య ఉన్న గీతని దాటేస్తున్నారు. వీళ్లు ఇలా చేయడం వల్ల పలు థియేటర్ యాజమానులు.. రీ రిలీజ్ సినిమాలంటేనే భయపడుతున్నారు. లక్షల్లో నష్టం రీ రిలీజ్‌ల వల్ల స్టార్ హీరోల సినిమాలకు కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కుతున్నాయి.. ఈ వార్తల వల్ల థియేటర్ యజమానుల నష్టాలు పెద్దగా బయటకు రావట్లేదు. ఈ ట్రెండ్ దెబ్బకు థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఫ్యాన్స్ డ్యాన్స్ చేస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మైకంలో కుర్చీలు విరగ్గొట్టడం, స్క్రీన్ చించేయడం లాంటివి చేస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే.. వచ్చిన డబ్బుల కంటే పెట్టుబడే ఎక్కువవుతోంది. (ఇదీ చదవండి: ఆ ఇల్లు వల్లే ధనుష్-ఐశ్వర్య విడిపోయారా..?) చిన్న సినిమాలకు దెబ్బ తెలుగులో చిన్న సినిమాలకు ఉండే ఆదరణే అంతంత మాత్రం. టాక్ చాలా బాగుంటే తప్ప.. ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి వాటిని చూడరు. అలాంటిది ఇప్పుడు ఈ రీ రిలీజ్ చిత్రాల వల్ల.. ప్రతివారం పలు చిన్న మూవీస్ విడుదలవుతున్నా ఆడియెన్స్ వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇలా రీ రిలీజ్ ట్రెండ్ వల్ల చిన్న సినిమాలు బలవుతున్నాయి. మరీ ఎక్కువైపోతున్నాయి! రీ రిలీజ్ అనేది ఎప్పుడో ఓసారి చేస్తే.. ప్రేక్షకులకు కూడా ఓ సరదాలా ఉంటుంది. అదేదో ఉద్యమం.. పనిగట్టుకుని మరీ స్టార్ హీరోల సినిమాల్ని రిలీజ్ చేస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే మాత్రం రెగ్యులర్ చిత్రాలు- పాత సినిమాలు.. ఇలా దేనిపై కూడా ఆసక్తి లేకుండా తయారైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరి రీ రిలీజ్ ట్రెండ్‌కి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో ఏంటో? (ఇదీ చదవండి: జబర్దస్త్ ఆర్టిస్ట్‌పై కేసు నమోదు) -
భారతదేశంలో తెలుగు సినిమా అని నాకు తెలియదు : తాప్సీ పన్ను
-
మరో కాంతారా ?
-
సినిమాల్లోకి రాకముందు పేపర్ కవర్లు తయారు చేసేవాణ్ణి!
కొంచెం అతిగానూ... మరికొంచెం అతిశయంగానూ... ఒక్క ముక్కలో చెప్పాలంటే తిక్కతిక్కగా ఉంటాయ్ ఉపేంద్ర సినిమాలు. ఆ విభిన్నతే కన్నడ హీరో అయిన ఉపేంద్రను తెలుగులో కూడా క్రేజీ స్టార్‌ను చేశాయి. ఎ, ఉపేంద్ర, రా... ఇలాంటివిచిత్రమైన టైటిల్స్‌తో అప్పట్లో ఉపేంద్ర చేసిన సినిమాలన్నీ మాస్‌కి మంచి కిక్ ఇచ్చాయి. కన్నడంలో బిజీగా ఉన్న ఉపేంద్ర...త్వరలోనే మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తానంటున్నారు. నేడు ఉపేంద్ర బర్త్‌డే. ఈ సందర్భంగా ‘సాక్షి’ స్పెషల్ టాక్. అప్పట్లో తెలుగులో వరుసగా సినిమాలు చేశారు కదా.. ఇప్పుడెందుకు చేయడంలేదు? కన్నడ చిత్రాలతో బిజీ కావడంవల్ల తెలుగులో చేయడం కుదరలేదు. వాస్తవానికి అప్పట్లో నాకు కర్ణాటకలో ఎంత ఫాలోయింగ్ ఉందో, తెలుగులో కూడా అంతే ఫాలోయింగ్ ఉండేది. అందుకే తెలుగు సినిమాలకు దూరమైనందుకు కొంచెం బాధగానే ఉంది. మళ్లీ తెలుగులో ఎప్పుడు? ప్రస్తుతం నేను హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘ఉప్పి 2’ని తెలుగులో విడుదల చేయబోతున్నాను. అప్పట్లో నేను చేసిన ‘ఉపేంద్ర’కి సీక్వెల్ ఇది. ఇకనుంచి నేను కన్నడంలో చేసే సినిమాలు తెలుగు నేటివిటీకి కూడా అనుగుణంగా ఉందనిపిస్తే, ఇక్కడ కూడా విడుదల చేస్తా. గతంలో మీరు చేసిన ఉపేంద్ర, రా, ఎ తదితర చిత్రాల్లో మీ పాత్రలు శాడిస్టిక్ తరహాలా ఉంటాయి. బయట కూడా అలా ఉంటారేమోనని చాలామంది అనుకుంటుంటారు కూడా? అయ్య బాబోయ్.. రియల్ లైఫ్‌లో నేను చాలా సాఫ్ట్ అండి. ఆ కథలు అలా కుదిరాయి. అందుకని చేశాను. ఆ సినిమాల్లో నా లుక్స్‌కీ నా రియల్ లుక్స్‌కి అస్సలు పోలికే ఉండదు. నిజంగా నేను కొంచెం హుందాగా ఉంటాను. అలాగే, ఆ సినిమాల్లో వేసుకున్నట్లుగా విచిత్రమైన బట్టలు వేసుకోను. ముఖ్యంగా ‘ఉపేంద్ర’ సినిమాలో మీది ఆడవాళ్లను ఆడిపోసుకునే పాత్ర కదా..? ఆడవాళ్లంటే నాకు చాలా గౌరవం. ఆ చిత్రంలో ఆడవాళ్లనే కాదు... మగవాళ్ల గురించి కూడా కొన్ని నిజాలు చెప్పాం. ఆ నిజాలను చాలామంది జీర్ణించుకోలేకపోయారు. అప్పట్లో అంతలా ముక్కుసూటిగా చెప్పిన సినిమాలు లేవు. దాంతో కొంచెం ఇబ్బందిపడ్డారు. అది ఇప్పుడు తియ్యదగ్గ సినిమా. అప్పట్లో నేను చేసిన రెండు, మూడు చిత్రాలు ఇప్పటి ట్రెండ్‌కు కరెక్ట్. ఓకే.. ఓసారి మీ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని ఉంది. మీరు దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారట? నిజమే. మా నాన్నగారు ‘వంటవాడు’. రోజుకి 50, 60 రూపాయలు మించి సంపాదన ఉండేది కాదు. అమ్మ, నాన్న, అన్నయ్య, నేను.. ఉన్నదాంట్లోనే సర్దుకుని హ్యాపీగా ఉండేవాళ్లం. మన కుటుంబ పరిస్థితి ఇలా ఉందేంటి? అని ఎప్పుడూ బాధపడలేదు. అందుకే ఒకవైపు చదువుకుంటూ మరోవైపు పని చేసేవాణ్ణి. రోజుకి 15, 20 రూపాయలు సంపాదించేవాణ్ణి. ఏం పని చేసేవారు? కూరగాయలు, పండ్లు, సరుకులు క్యారీ చేసుకునేందుకు వీలుగా ‘పేపర్ కవర్స్’ తయారు చేసేవాణ్ణి. అలాగే, బూందీ, మిక్సర్ ప్యాక్ చేయడానికి ప్లాస్టిక్ కవర్లు తయారు చేసేవాణ్ణి. మరి సినిమాల్లోకి ఎలా వచ్చారు? కాలేజ్ డేస్‌లో నేను నాటకాల్లో నటించేవాణ్ణి. కథలు, మాటలు రాసేవాణ్ణి. ప్రముఖ కన్నడ దర్శకుడు కాశీనాథ్ మాకు దూరపు బంధువు అవుతారు. ఆయన్ను కలిసి నేను రాసుకున్న నాటకాలకు సంబంధించిన కథలు, సంభాషణలు చూపించాను. దాంతో ఆయన నన్ను ‘అజగజంతారా’ అనే చిత్రానికి సహాయదర్శకునిగా చేర్చుకున్నారు. ఆ తర్వాత కాశీనాథ్గారి దగ్గరే కొన్ని సినిమాలకు పని చేశాను. అప్పట్లో మీ లక్ష్యం దర్శకత్వమా? నటనా? ఏ లక్ష్యమూ లేదు. ఏ పని దొరికితే అది చేద్దామనుకున్నాను. అనుకోకుండా కాశీనాథ్గారు ‘అజగజంతారా’లో ఓ అతిథి పాత్ర చేయమన్నారు. ఎలాగూ నాటకాల్లో నటించాను కాబట్టి, చేశాను. కొంత అనుభవం సంపాదించుకున్న తర్వాత ‘తర్లే నాన్ మగ’ అనే చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అయ్యాను. దర్శకునిగా ‘ఓం’ చిత్రం మిమ్మల్ని రాత్రికి రాత్రి స్టార్ డెరైక్టర్ని చేసేసింది. అప్పుడు ఎలా అనిపించింది? కష్టపడినవాళ్లకి ప్రతిఫలం దక్కుతుందనే ఆనందం లభించింది. ఆ తర్వాత నేను హీరోగా నటిస్తూ ‘ష్’, ‘ఉపేంద్ర’ చిత్రాలు చేశాను. అవి కూడా మంచి గుర్తింపు తెచ్చాయి. నా జీవితం ‘ఇంత బాగుండాలి.. నా ఆర్థిక స్థితి ఇంత భారీగా ఉండాలి’ అని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, ఆ దేవుడు చాలానే ఇచ్చాడు. ఒకవైపు దర్శకునిగా, నటుడిగా, మంచి రచయితగా బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్నారు. మధ్యలో కొన్ని పరాజయాలు కూడా చూశారు కదా? ‘మనం ఇలానే ఉండాలి... ఇదే చేయాలి’ అని నేనెప్పుడూ ప్రణాళికలు వేసుకోలేదు. ఏది వస్తే అది తీసుకున్నాను. ఏం చేసినా సిన్సియర్‌గా చేశాను. జయాపజయాలకు అతీతంగానే స్పందిస్తుంటాను. పాటలు కూడా పాడుతుంటారు.. అదెప్పుడు మొదలైంది? ఓసారి ఏదో సినిమా కోసం జస్ట్ ట్రాక్ పాడమంటే పాడాను. చాలా బాగుందని దాన్నే ఉపయోగించారు. ఆ తర్వాత కొంతమంది అడిగితే పాడాను. అప్పట్నుంచీ వరుసగా పాటలు పాడుతున్నాను. ఇతర హీరోలకు కూడా చాలా పాటలు పాడాను. ‘ఉపేంద్ర’ తర్వాత దాదాపు పదేళ్లు దర్శకత్వం జోలికి వెళ్లకపోవడానికి కారణం? హీరోగా బిజీ కావడంవల్లే. దాంతో కథలు తయారు చేసుకునే వీలు చిక్కలేదు. ఇప్పుడున్న బిజీలో యాక్టింగ్, డెరైక్షన్ అంటూ రెండు పడవల మీద కాళ్లు అవసరమా అనిపించింది. అందుకే చేయలేదు. మీ కెరీర్ తొలినాళ్లను గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది? మొదట్లో నాకో లక్ష రూపాయలు చెక్ ఇస్తే తడబడిపోయేవాణ్ణి. అంత డబ్బు అంతకు ముందు చూడలేదు. కొన్ని విషయాలు చెప్పడానికి మొహమాటపడాల్సిన అవసరంలేదు. నాకు బ్యాంక్ అకౌంట్ కూడా ఉండేది కాదు. అందుకని డబ్బులు ఎక్కడ దాచుకోవాలో తెలిసేది కాదు. కొంచెం స్థాయి పెరిగిన తర్వాత మేనేజర్ని పెట్టుకున్నాను. ఓకే.. హీరోయిన్ ప్రియాంక త్రివేదీతో మీ ప్రేమకథ గురించి? ‘రా’ సినిమాలో చేస్తున్నప్పుడు మా ఇద్దరి మధ్య స్నేహం మొదలై, ‘హెచ్2ఓ’ సినిమా టైమ్‌కి ప్రేమగా మారింది. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకున్నాం. మీ పిల్లల గురించి? మా బాబు అయుష్ ఐదో తరగతి, పాప ఐశ్వర్య నాలుగో తరగతి చదువుతున్నారు. సరే.. ఈ బర్త్‌డే ఎలా చేసుకోబోతున్నారు? సినిమాల్లోకి రాకముందు నేను సెలబ్రేట్ చేసుకున్నది లేదు. ఇక్కడికొచ్చాక అభిమానులు నా పుట్టినరోజుని ఓ పండగలా చేయడం మొదలుపెట్టారు. ఆ రోజంతా అభిమానులకు కేటాయించేస్తాను. ఎక్కడెక్కణ్ణుంచో వచ్చే అభిమానుల్ని పలకరిండంలో నాకు లభించే ఆనందం గురించి మాటల్లో చెప్పలేను. - డి.జి. భవాని