తేజ్ బొమ్మదేవర, రిషికి లొక్రే జంటగా నటించిన సినిమా 'మాధవే మధుసూదన'. ఈ చిత్రానికి బొమ్మదేవర రామచంద్రరావు.. దర్శకత్వం వహిస్తూ నిర్మించారు. ఈ నెల 24న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా సినిమా గురించి పలు ఆసక్తికర సంగతులు చెప్పారు.
(ఇదీ చదవండి: యాంకర్ రష్మీతో పెళ్లెప్పుడు? సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్!)
మేకప్‌మ్యాన్ టూ డైరెక్టర్
'మన్మథుడు' టైంలో నాగార్జునతో నేను దర్శకుడిని కావాలని అనుకుంటున్నట్టు చెప్పాను. నీ మెంటాల్టీకి దర్శకుడు అంటే కష్టం కానీ నిర్మాతగా ట్రై చేయ్ అని సలహా ఇచ్చారు. 'సూపర్' సినిమా టైంలో అనుష్కకు మేకప్ వేస్తూ.. మీరు పెద్ద హీరోయిన్ అవుతారు.. అప్పుడు నాకు డేట్స్ ఇవ్వాలని అన్నాను. అలా చాలామందిని అడిగాను. కానీ అనుష్క మాట నిలబెట్టుకున్నారు.
'ఆజాద్' సినిమా టైంలో నాగార్జున కోసం కాచిగూడ రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాను. ఆయన వచ్చారని ఎవరో అంటే పరిగెత్తుకుంటూ వెళ్లి చూశాను. కానీ ఆయన రాలేదు. అలా ఓ మనిషి కోసం వెయిట్ చేస్తుంటే, వాళ్లు రాకపోతే ఆ బాధ ఎలా ఉంటుందనే ఆలోచనలోంచే ఈ కథ పుట్టింది. వెయిట్ చేసి వెయిట్ చేసి రాకపోవడం, 25 ఏళ్ల తరువాత ఆ మనిషి వస్తే పరిస్థితి ఏంటి? అన్నది ఈ సినిమాలో చూపించాం. అలానే నాగార్జున ముందు నుంచీ నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నాగ చైతన్య, అఖిల్, మంచు విష్ణు, బ్రహ్మానందం ఇలా ఎంతోమంది సహాయం చేయడం వల్లే సినిమా ఇక్కడి వరకు వచ్చింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment