ఆర్కే నాయుడు హీరోగా 'ద 100' సినిమా.. త్వరలో థియేటర్లలో రిలీజ్ | RK Naidu Alias Sagar 'The 100' Movie Release Details | Sakshi
Sakshi News home page

ఆర్కే నాయుడు హీరోగా 'ద 100' సినిమా.. త్వరలో థియేటర్లలో రిలీజ్

Published Fri, Feb 2 2024 5:00 PM | Last Updated on Fri, Feb 2 2024 5:09 PM

RK Naidu Alias Sagar The 100 Movie Release Details - Sakshi

'మొగలిరేకులు' సీరియల్‌లో ఆర్కే నాయుడు పాత్రలో నటించి చాలా ఫేమస్ అయిన నటుడు సాగర్.. హీరోగా మరో సినిమా రెడీ చేశాడు. గతంలో 'సిద్ధార్థ' చిత్రంతో టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 'షాదీ ముబారక్‌' సినిమా చేశాడు. ఇప్పుడు క్రేజీ యాక్షన్ మూవీతో రాబోతున్నాడు. 'ద 100' అనే డిఫరెంట్ టైటిల్ నిర్ణయించారు. అలానే పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?)

రాఘవ్ ఓంకార్ శశిధర్.. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ మూవీలో విక్రాంత్ అనే ఐపీఎస్ అధికారిగా ఆర్కే సాగర్ కనిపించబోతున్నాడు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఇది ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో ఆకట్టుకున్న హర్షవర్ధన్ రామేశ్వర్.. ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అవార్డు విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement