బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్, బజ్జీల పాపగా ఫేమస్ అయిన కుషిత కల్లపు జంటగా నటించిన సినిమా 'బాబు నెం.1 బుల్ షిట్ గయ్'. లక్ష్మణ్ వర్మ దర్శకుడు. డీడీ క్రియేషన్స్ బ్యానర్‌పై దండు దిలీప్ కుమార్ రెడ్డి నిర్మించారు. శివరాత్రి కానుకగా ఈ చిత్రం థియేటర్లలో రిలీజైంది. మరి ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: 'ప్రేమలు' సినిమా రివ్యూ)
కథేంటి?
కార్తీక్ బాబు(అర్జున్ కల్యాణ్) అమెరికాలో చదువుకుని ఇండియాకు తిరిగొచ్చిన ఓ డబ్బున్న కుర్రాడు. కరోనా టైంలో స్వదేశానికి వస్తాడు. దీంతో హైదరాబాద్ శివారులో ఉన్న తమ విల్లాలో కొడుకుని ఉండమని తండ్రి (రవి వర్మ) చెబుతాడు. దీంతో కార్తీక్... తన ప్రేయసి కుషిత(కుషిత కల్లపు)తో కలిసి విల్లాలో ఉండాలని ఫిక్స్ అవుతారు. ఆర్నెళ్లకు సరిపడా వస్తువులన్నీ తెచ్చుకుంటారు. ఇంతలో ప్లంబర్ సోంబాబు(డైరెక్టర్ లక్ష్మణ్ వర్మ) వీరిద్దరిని కిడ్నాప్ చేసి, విల్లాలో బంధించి అక్కడే సెటిల్ అయిపోతారు. ఇంతకీ సోంబాబు ఎందుకలా చేశాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.
ఎలా ఉందంటే?
'బాబు నం.1 బుల్ షిట్ గాయ్' మూవీ యాక్షన్ కామెడీ డ్రామా స్టోరీతో తీశారు. ఓ అందమైన జంటను గదిలో బంధించి... అదే బంగ్లాలో తన కుటుంబంతో కలిసి దర్జాగా జీవించే ఓ తాపీ మేస్త్రీ సోంబాబు కథే ఈ సినిమా. కిడ్నాపర్‌కి కూడా నైతిక విలువలు వుంటాయని చివర్లో చూపించారు.
(ఇదీ చదవండి: 'గామి' సినిమా రివ్యూ)
కోట్ల విలువ చేసేవి ఎదురుగానే ఉన్నా తనకు వచ్చిన కష్టకాలంలో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికే ఆ బంగ్లాలో ఉండాల్సి వచ్చిందని సింపుల్‌గా వెళ్లిపోయే సోంబాబు జీవిత పాఠం బాగుంది. ఫస్టాప్‌లో కామెడీ ట్రాక్‌తో మొదలై, సోంబాబు లవ్, తన ప్రేయసి సోనాలి పాణిగ్రాహితో వివాహం తదితర అంశాలతో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేశారు. సెకెండాఫ్‌లో కొంత ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ సీన్స్ తదితర అంశాలతో ఆకట్టుకున్నారు.
ఎవరెలా చేశారు?
అర్జున్ కల్యాణ్, కుషిత జంట బాగుంది. అర్జున్ ఉన్నంతలో బాగానే చేశాడు. హీరోయిన్ కుషిత క్యూట్ ఫెర్ఫార్మెన్‌తో అలరించింది. డైరెక్టర్ లక్ష్మణ్ వర్మ కూడా హీరోకి సమంగా ఉండే పాత్రలో కనిపించారు. ఇతనికి జంటగా సోనాలి పాణిగ్రాహి చేసింది. కమెడియన్ భద్రం కాసేపు అక్కడక్కడ నవ్వించాడు. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. దర్శకుడు లక్ష్మణ్ వర్మ రాసుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే బాగున్నాయి. అన్నివర్గాల ప్రేక్షకులు చూసేయొచ్చు. మణికర్ణన్ సినిమాటోగ్రఫీ బాగుంది. పవన్ సంగీతం ఓకే. నిర్మాణ విలువులు స్థాయికి తగ్గట్లు ఉన్నాయి.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)
Comments
Please login to add a commentAdd a comment