
శివరాత్రి వచ్చేసింది. దీంతో ఇప్పటికే శివాలయాలన్నీ కళకళలాడిపోతున్నాయి. శివుడి భక్తిలో మునిగిపోయేందుకు, రాత్రంతా జాగారం చేసేందుకు కోట్లాది మంది భక్తులు సిద్ధమైపోతున్నారు. రాత్రంతా గుడిలో ఉండలేం కానీ జాగారం చేస్తాం అనుకునే వాళ్లు.. తమ మనసు మరోచోటకు వెళ్లకూడదనుకుంటే శివుడి సినిమాలు చూస్తూ ఈ శివరాత్రిని పూర్తిచేయొచ్చు.
(ఇదీ చదవండి: ఆ ఊరి పేరు 'ప్రభాస్'.. ఎక్కడో తెలుసా?)
మరి తెలుగులో ఇప్పటివరకు శివుడు, ఆయనకు సంబంధించి చాలానే సినిమాలు వచ్చాయి. చిరంజీవి, ఎన్టీఆర్, కృష్ణంరాజు తదితరలు నటించిన పాత చిత్రాలతో పాటు రీసెంట్ టైంలో వచ్చిన మూవీస్ లోనూ శివుడి రిఫరెన్స్ ఉన్నవి కొన్ని ఉన్నాయి. ఇంతకీ వాటిని ఎక్కడెక్కడ చూడొచ్చంటే?
శివరాత్రి స్పెషల్ మూవీస్
శ్రీ మంజునాథ (యూట్యూబ్)
అంజి (యూట్యూబ్)
ఎన్టీఆర్ 'భూ కైలాస్' (యూట్యూబ్)
ఖలేజా (అమెజాన్ ప్రైమ్ - సన్ నెక్స్ట్)
ఢమరుకం (అమెజాన్ ప్రైమ్ - సన్ నెక్స్ట్)
అఖండ (యూట్యూబ్ - హాట్ స్టార్)
మహాభక్త సిరియాళ (హాట్ స్టార్)
భక్త శంకర (హాట్ స్టార్)
భక్త కన్నప్ప (యూట్యూబ్-అమెజాన్ ప్రైమ్)
శివకన్య (యూట్యూబ్- అమెజాన్ ప్రైమ్)
మహాశివరాత్రి (జీ5 - యూట్యూబ్)
శివరాత్రి మహత్యం (జియో సినిమా- యూట్యూబ్)
వీటితోపాటు భక్త మార్కండేయ, దక్షయజ్ఞం, ఉమాచండీ గౌరీశంకరుల కథ, కాళహస్తి మహత్యం, జగద్గురు ఆదిశంకర, మావూళ్లో మహాశివుడు, కార్తికేయ సినిమాల్ని కూడా చూస్తూ శివరాత్రి జాగారం చేసేయొచ్చు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'తండేల్'.. ప్లాన్ మారిందా?)
Comments
Please login to add a commentAdd a comment