అల్లరి నరేశ్ 'బచ్చలమల్లి' ట్విటర్ రివ్యూ | Allari Naresh Bachhalamalli Movie Twitter Review In Telugu, Check These Tweets Inside Before Watching The Film | Sakshi
Sakshi News home page

Bachhalamalli Twitter Movie: 'బచ్చలమల్లి' ట్విటర్ రివ్యూ

Dec 20 2024 7:18 AM | Updated on Dec 20 2024 9:52 AM

Allari Naresh Bachhalamalli Movie Twitter Review

గత కొన్నాళ్లుగా రూట్ మార్చిన అల్లరి నరేశ్.. సీరియస్ కాన్సెప్ట్ సినిమాలు చేస్తూ ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. ఇతడి లేటెస్ట్ మూవీ 'బచ్చల మల్లి'. ఈ వారం థియేటర్లలో రిలీజైన స్ట్రెయిట్ తెలుగు మూవీ ఇదొక్కటే. సుబ్బ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ఓ మాదిరి అంచనాలు ఉన్నాయి. గురువారం రాత్రి ప్రీమియర్స్ వేశారు. దీంతో మూవీ టాక్ బయటకొచ్చింది. ట్విటర్‌లో సినిమా రివ్యూ పెడుతున్నారు.

(ఇదీ చదవండి: ప్రమోషన్స్‌కు దూరంగా వెన్నెల కిశోర్‌.. 'ఇక మీరెందుకు పాకులాడటం?')

బచ్చల మల్లి అనే ట్రాక్టర్ డ్రైవర్ జీవితాన్ని స్పూర్తిగా తీసుకుని చేసిన సినిమా ఇది. అల్లరి నరేశ్ పక్కన 'హనుమాన్' ఫేమ్ అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేసింది. టాక్ విషయానికొస్తే.. మూర్ఖత్వంతో తీసుకునే నిర్ణయాల వల్ల జీవితం ఎలా నాశనం అవుతుందని చెప్పడానికి చక్కటి ఉదాహరణ 'బచ్చలమల్లి' సినిమా  అని అంటున్నారు. అలాన ఈ మల్లిగాడు గుర్తుండిపోతాడని కూడా చెబుతున్నారు.

డైలాగ్స్, జాతర ఫైట్ సీన్, చివరి 20 నిమిషాలతో పాటు హీరో క్యారెక్టరైజేషన్ బాగుందని అంటున్నారు. కాకపోతే స్క్రీన్ ప్లే విషయంలో మరికాస్త కేర్ తీసుకోవాల్సిందని చెబుతున్నారు. ఓవరాల్‌గా చూసేటప్పుడు డెప్త్ తగ్గినట్లు అనిపించిందని తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. అల్లరి నరేశ్ బాగానే కష్టపడ్డాడని మెచ్చుకుంటున్నారు.

(ఇదీ చదవండి: ‘విడుదల–2’ పదిరెట్లు అద్భుతంగా ఉంటుంది)

Advertisement
 
Advertisement
Advertisement