సినిమా తీయడమే కాదు దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం కూడా అంతే ముఖ్యం. పుష్ప 2 రిలీజ్‌కు ముందు అల్లు అర్జున్ క్షణం ఖాళీ లేకుండా నార్త్ టు సౌత్ మొత్తం చుట్టేశాడు. ప్రమోషన్స్ ఆ రేంజ్‌లో ఉన్నాయి కాబట్టే ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా నెక్స్ట్ లెవల్‌లో వచ్చాయి. సినిమా ప్రమోషన్స్‌కు కూడా ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తున్నారు. జనాల్లో తమ సినిమా గురించి మాట్లాడుకునేందుకు ఇదే బెస్ట్ ఆప్షన్ అని భావిస్తున్నారు.
వరుసగా డుమ్మా
అయితే వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమా ఈవెంట్స్‌కు వరుసగా డుమ్మా కొడుతున్నాడు. గురువారం నాడు ట్రైలర్ సక్సెస్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్ అనన్య నాగళ్లతో పాటు దర్శకనిర్మాతలు వచ్చారు. దీంతో ఓ జర్నలిస్ట్.. వెన్నెల కిశోర్ ఈ సినిమాకు పబ్లిసిటీ అక్కర్లేదనుకుంటున్నాడు. ఆయన సినిమాకు ఆయనే రావట్లేదు. ఆయన రానప్పుడు మీరెందుకు పాకులాడటం? అని ప్రశ్నించాడు.
కథే హీరో
అందుకు డిస్ట్రిబ్యూటర్ వంశీ ఈ సినిమాలో కథే హీరో. మేము కథనే నమ్మాం. కథలో ఆయన ప్రధాన పాత్ర పోషించాడు అని చెప్పాడు. అప్పటికీ సదరు జర్నలిస్ట్.. హీరో మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటున్నారు అని వ్యాఖ్యానించాడు. అందుకు నిర్మాత.. మరి ముందుకువెళ్లాలి కదా.. డబ్బులు పెడుతోంది మేము.. ఆయన కాదు కదా! అని బదులిచ్చాడు.
ప్రమోషన్స్‌కు ఎందుకు రావట్లేదంటే?
ఇంతలో మరొకరు వెన్నెల కిశోర్ ఎందుకు ప్రమోషన్స్‌కు రారు? అని ప్రశ్నించాడు. ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. తనకున్న బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోతున్నారు. పలుమార్లు ప్రమోషన్స్‌కు రమ్మని బతిమాలాం.. కానీ రాలేకపోయారు. ఆయన ఇంట్రోవర్ట్.. ఇలాంటివాటికి నేను రాలేనని సున్నితంగా తిరస్కరించాడు అని నిర్మాత వివరించాడు. కాగా ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది.
చదవండి: 'ప్రియాంక.. నీ భర్తను అదుపులో పెట్టుకో!' నిక్‌పై ట్రోలింగ్
Comments
Please login to add a commentAdd a comment