సెలబ్రిటీలు చేసే కామెంట్లు, వేసే ట్వీట్లు ఏమాత్రం నచ్చకపోయినా నెటిజన్లు సోషల్ మీడియాలో రుసరుసలాడుతారు. అలా సింగర్ నిక్ జోనస్ వేసిన ట్వీట్ చూసి నెట్టింట విరుచుకుపడుతున్నారు. నీ భర్తను అదుపులో పెట్టుకో అంటూ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు వార్నింగ్ ఇస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే?
ఎలన్ మస్క్ రాజకీయాల్లో అడుగుపెట్టి తన కంపెనీ టెస్లా పేరును తనే చేతులారా నాశనం చేస్తున్నాడని అందరూ అనుకున్నారు. కానీ జరిగిందేంటో తెలుసా? అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత టెస్లా లాభాలు పుంజుకున్నాయి అని టెస్లా ఓనర్స్ సిలికాన్ వాలీ అకౌంట్ నుంచి డిసెంబర్ 17న ఓ ట్వీట్ వేశారు. దీనికి మస్క్.. అవును, నిజమేనంటూ స్పందించాడు.
నీ భర్తను అదుపులో పెట్టుకో
ఇది చూసిన నిక్ జోనస్.. 3000వ సంవత్సరం వరకు మమ్మల్ని మీరే నడిపించాలి అని రాసుకొచ్చాడు. ఇది కొందరికి మింగుడుపడలేదు. ట్రంప్‌కు సపోర్ట్ చేస్తున్నారా? ప్రియాంక.. దయచేసి నీ భర్తను కాస్త అదుపులో పెట్టుకో, ఏంటి? ప్రపంచ కుబేరుడు మస్క్‌కు మద్దతిస్తున్నావా? ప్రియాంక.. మరింత ఆలస్యం కాకముందే నీ భర్త చేతిలోని ఫోన్ తీసేసుకో అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Take us to the Year 3000. https://t.co/vk0sdBhrXS pic.twitter.com/CSG7ItCmES
— Nick Jonas (@nickjonas) December 17, 2024
Comments
Please login to add a commentAdd a comment