ప్రియుడిని పెళ్లాడిన రామ్ చరణ్ హీరోయిన్.. ఫోటోలు వైరల్! | Hollywood Actress Amy Jackson and Ed Westwick are now married | Sakshi
Sakshi News home page

Amy Jackson: వివాహబంధంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ అమీ జాక్సన్‌..!

Published Mon, Aug 26 2024 7:55 AM | Last Updated on Mon, Aug 26 2024 9:19 AM

Hollywood Actress Amy Jackson and Ed Westwick are now married

హీరోయిన్ అమీ జాక్సన్ వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు ఎడ్‌ వెస్ట్‌విక్‌ను ఆమె పెళ్లాడింది. ఇటలీలోని అమాల్ఫీ తీరంలో వీరి వెడ్డింగ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఇరువర్గాల కుటుంబసభ్యులు, స్నేహితులు, అత్యంత సన్నిహితుసు పాల్గొన్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను అమీ జాక్సన్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

కాగా.. 2022లో డేటింగ్ ప్రారంభించిన ఈ జంట ఆగస్టు 25న వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఈ ఏడాది జనవరిలో స్విట్జర్లాండ్‌లోని జిస్టాడ్‌లో అమీ జాక్సన్‌, ఎడ్‌ వెస్టివిక్‌ తమ ప్రేమబంధాన్ని బయటపెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  ఇటీవలే ఫ్రెండ్స్‌తో కలిసి ప్రీ-వెడ్డింగ్ పార్టీ చేసుకున్నారు. కొత్త జర్నీ ప్రారంభమైందంటూ పెళ్లి ఫోటోలను షేర్ చేశారు.

కాగా.. అమీ జాక్సన్ ‍బాలీవుడ్‌తో పాటు తెలుగు,తమిళ చిత్రాల్లో నటించింది. రజినీకాంత్ రోబో 2.0, రామ్ చరణ్ ఎవడు, విక్రమ్ సరసన ఐ చిత్రాల్లో మెరిసింది. వీటితో పాటు క్రాక్, సింగ్ ఇజ్ బ్లింగ్ చిత్రంలో కనిపించింది. చివరిసారిగా ఈ ఏడాది విడుదలైన మిషన్ చాప్టర్-1 మూవీలో మెరిసింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement