Hollywod Actress
-
ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే సినిమా.. మీరు చూశారా?
టైటిల్: ఇమ్మాక్యూలేట్దర్శకత్వం: మైఖేల్ మోహన్లీడ్ రోల్: సిడ్నీ స్వీనినిడివి: 90 నిమిషాలుఓటీటీ: అమెజాన్ ప్రైమ్విడుదల తేదీ: మార్చి 22, 2024ఓటీటీల్లో హారర్ చిత్రాలకు ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. అందుకే టాలీవుడ్‌లోనూ ఇటీవల ఆ జోనర్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే హాలీవుడ్లో అయితే ఈ చిత్రాలకు కొదువే లేదు. హాలీవుడ్ చిత్రాలు అత్యంత భయంకరంగా, ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. అలాంటి వాటిలో ఈ సినిమా కచ్చితంగా ఉంటుంది.గతంలో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. ఈ కథ మొత్తం నన్ల చుట్టు తిరుగుతుంది. నన్‌గా మారేందుకు అమెరికా నుంచి ఇటలీకి వచ్చిన ఓ యువతి కథ. ఇందులో నన్ పాత్రలో సిడ్నీ స్వీనీ నటించారు. సిసిలియో అనే యువతిగా కనిపించారు. వృద్ధ నన్స్‌కు సేవలందించేందుకు వచ్చిన యువతి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే అసలు కథ.నన్ నేపథ్యంలో వచ్చిన కథలు చాలా భయంకరంగా ఉంటాయి. ఈ సినిమా కూడా అలాంటిదే. హారర్ సినిమా అంటే ఇంత భయంకరంగా ఉంటుందా అనేలా స్క్రీన్ ప్లే నడిపించారు. అత్యంత భయానక దృశ్యాలు ప్రేక్షకులకు కాస్తా ఇబ్బంది కలిగించేలా కూడా ఉన్నాయి. నన్లను ట్రీట్ చేసే విధానం.. వారిని వేధింపులకు గురిచేయడం లాంటి అత్యంత దారుణమైన సీన్స్ ఆడియన్స్‌ను భయపెట్టేస్తాయి. ఒక నన్ జీవితం ఇంత దారుణంగా ఉంటుందో ఈ సినిమాలో ఆడియన్స్‌కు పరిచయం చేశారు. హారర్ చిత్రమే అయినా.. ఎక్కడా కూడా దెయ్యం అనే కాన్సెప్ట్ లేకుండానే తెరకెక్కించాడు. ఈ కథలో సిసిలియో యువతిదే కీ రోల్. ఈ హారర్ మూవీకి ఆమె నటనే బలం. ఎక్కువగా హారర్ సినిమాలు ఇష్టపడేవారు ఇలాంటివి ట్రై చేయొచ్చు. అయితే కొన్ని సీన్స్ అత్యంత భయంకరంగా ఉన్నాయి. కాకపోతే చిన్నపిల్లలు లేనప్పుడు ఈ సినిమా చూడటం ఉత్తమం. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. -
ప్రియుడిని పెళ్లాడిన రామ్ చరణ్ హీరోయిన్.. ఫోటోలు వైరల్!
హీరోయిన్ అమీ జాక్సన్ వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు ఎడ్ వెస్ట్విక్ను ఆమె పెళ్లాడింది. ఇటలీలోని అమాల్ఫీ తీరంలో వీరి వెడ్డింగ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఇరువర్గాల కుటుంబసభ్యులు, స్నేహితులు, అత్యంత సన్నిహితుసు పాల్గొన్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను అమీ జాక్సన్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.కాగా.. 2022లో డేటింగ్ ప్రారంభించిన ఈ జంట ఆగస్టు 25న వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఈ ఏడాది జనవరిలో స్విట్జర్లాండ్‌లోని జిస్టాడ్‌లో అమీ జాక్సన్, ఎడ్ వెస్టివిక్ తమ ప్రేమబంధాన్ని బయటపెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవలే ఫ్రెండ్స్‌తో కలిసి ప్రీ-వెడ్డింగ్ పార్టీ చేసుకున్నారు. కొత్త జర్నీ ప్రారంభమైందంటూ పెళ్లి ఫోటోలను షేర్ చేశారు.కాగా.. అమీ జాక్సన్ బాలీవుడ్‌తో పాటు తెలుగు,తమిళ చిత్రాల్లో నటించింది. రజినీకాంత్ రోబో 2.0, రామ్ చరణ్ ఎవడు, విక్రమ్ సరసన ఐ చిత్రాల్లో మెరిసింది. వీటితో పాటు క్రాక్, సింగ్ ఇజ్ బ్లింగ్ చిత్రంలో కనిపించింది. చివరిసారిగా ఈ ఏడాది విడుదలైన మిషన్ చాప్టర్-1 మూవీలో మెరిసింది. View this post on Instagram A post shared by Ed Westwick (@edwestwick) -
హాలీవుడ్ నటుడి మృతికి సమంత, కరీనా సంతాపం
హాలీవుడ్లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న డొనాల్డ్ సదర్లాండ్ (88) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మియామీలో చికిత్స పొందుతూ మరణించారు. కెనడాకు చెందిన డొనాల్డ్ సదర్లాండ్ సుమారు 60 ఏళ్ల పాటు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించారు. ఆయన మరణించడంతో హాలీవుడ్‌లోని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అయితే, ఇండియన్ సినిమా నుంచి సమంత, కరీనా కపూర్ ఖాన్లు కూడా నివాళులర్పించారు.డొనాల్డ్ సదర్లాండ్ మరణంతో ఇన్స్టాగ్రామ్ ద్వారా సమంత సంతాపం తెలిపింది. ఇదే క్రమంలో కరీనా కపూర్ కూడా సోషల్ మీడియాలో డొనాల్డ్ సదర్లాండ్ ఫోటోను పంచుకుంది. ది డర్టీ డజన్ (1967) చిత్రం ద్వారా మొదలైన ఆయన ప్రయాణంలో అనేక అవార్డులను అందుకున్నారు. ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డ్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్, అకాడమీ అవార్డ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డ్స్‌ను ఆయన సొంతం చేసుకున్నాురు. ఆర్డినరీ పీపుల్, M*A*S*H,యానిమల్ హౌస్, ది హంగర్ గేమ్స్ ఫ్రాంచైజీ, మూన్ ఫాల్ వంటి సినిమాలతో బాలీవుడ్లో ఆయన ప్రసిద్ధి చెందారు. చివరిగా 2023లో ది హంగర్ గేమ్స్ చిత్రంలో ఆయన నటించారు. -
OTT: వందకు పైగా అవార్డ్స్ కొట్టిన సినిమా ఓటీటీలో.. తెలుగులో స్ట్రీమింగ్
ఆస్కార్ అవార్డు దక్కించుకున్న 'అనాటమీ ఆఫ్ ఎ ఫాల్' అనే సినిమా 2023లో విడుదలైంది. ఫ్రెంచ్ లీగల్ డ్రామా చిత్రంగా ఇది తెరకెక్కింది. ఇటీవల ప్రకటించిన 96వ ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ అవార్డును గెలుచుకున్నది. ఆస్కార్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వందకుపైగా అవార్డులను గెలుచుకున్న సినిమాగా ఇది రికార్డుకెక్కింది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా ఇంగ్లీష్ వర్షన్లో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా రిజనల్ భాషలు అయిన తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళంలో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన సాండ్ర హల్లర్ ప్రేక్షకులను మెప్పించింది. ఈ ఏడాది బెస్ట్ నటిగా ఆమెకే ఆస్కార్ అవార్డు దక్కుతుందని అందరు భావించారు కానీ తృటిలో అవార్డును మిస్సయింది. ఈ చిత్రంలో సాండ్రా హుల్లర్ తన భర్త మరణంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్న రచయితగా నటించారు. మంచుకొండల్లోని తన ఫ్యామిలీతో ఒంటరిగా సాండ్రా జీవిస్తుంటుంది. తన భర్త అనుమానస్పద రీతిలో అక్కడ మరణించడం. ఆ ప్రాంతంలో సాండ్రా తప్ప మరెవరూ లేకపోవడంతో ఆమె ఈ హత్య చేసిందని పోలీసులు అనుమానిస్తుంటారు. ఊహలకు అందని ట్విస్ట్‌లతో నడిచే ఈ కథలో అసలు ఈ హత్య ఎవరు చేశారు? ఈ నేరం నుంచి సాండ్రా ఎలా బయటపడుతుంది అనేది అసలు కథ. -
సూపర్ హిట్ డైరెక్టర్ చేతిలో ప్రపంచ కుబేరుడి ఎలన్ మస్క్ బయోపిక్
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ జీవిత చరిత్ర గురించి అమెరికన్ ప్రముఖ రచయిత వాల్టర్ ఐజాక్సన్ రచించారు. తన బయోగ్రఫీలో మస్క్ పంచుకున్న కొన్ని ఆసక్తికర విషయాలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఎలాన్ మస్క్‌ను భారతీయ యువకులు కూడా ఐకాన్‌గా గుర్తిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ జీవితం త్వరలో సినిమాగా కూడా రాబోతుంది. దక్షిణాఫ్రికాలో సాధారణ కుటుంబంలో జన్మించిన మస్క్ ప్రపంచ కుబేరుడిగా ఎలా ఎదిగారు? జీవితంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఎలాంటివి..? వంటి అంశాలపై ప్రధానంగా చూపుతూ సినిమాను నిర్మించనున్నారు. ఈ మేరకు ఏ24 అనే చిత్ర నిర్మాణ సంస్థ మస్క్ బయోపిక్ తీసేందుకు రెడీగా ఉన్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పుస్తక రచయిత వాల్టర్ ఐజాక్సన్ నుంచి ఆ నిర్మాణ సంస్థ హక్కులను సొంతం చేసుకుంది. ఎంతో క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కను ఈ చిత్రానికి ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ డారెన్ ఆర్‌న్ఫోస్కీ తెరకెక్కించనున్నారు. హాలీవుడ్లో బ్లాక్ స్వాన్, పై, ది వేల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. కానీ మస్క్ పాత్రలో ఎవరు నటిస్తారనే వివరాలను ఇప్పటికైతే వెల్లడించలేదు. ఎలన్ మస్క్ కుటుంబ విషయాలు ఎలన్ మస్క్ కు తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. అతని తమ్ముడు కింబాల్ మస్క్ అమెరికాలో కిచెన్ రెస్టారెంట్ గ్రూప్ యజమాని, చెల్లెలు తోస్కా చిత్రనిర్మాత. కాగా మస్క్‌కు ఏడుగురు పిల్లలు ఉన్నారు, వీరంతా అబ్బాయిలే. వారిపేర్లు ఎక్స్ ఏఈ ఏ-12 మస్క్, నెవాడా అలెగ్జాండర్ మస్క్, గ్రిఫిన్ మస్క్, జేవియర్ మస్క్, డామియన్ మస్క్, సాక్సన్ మస్క్, కై మస్క్ వీళ్లంతా కృత్తిమంగా జన్మించారు. -
Blackpink Lisa: మోస్ట్ టాలెంటెడ్ రాపర్, సింగర్, డాన్సర్, బ్లాక్‌పింక్ లిసా (ఫోటోలు)
-
రాజమౌళి- మహేశ్‌బాబు సినిమాపై అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది
భారత దిగ్గజ దర్శకుడు రాజమౌళి- ప్రిన్స్ మహేశ్ బాబు కాంబినేషన్లో సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటన వచ్చిన రోజు నుంచి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్‌లో ఉత్కంఠ నెలకొంది. RRR తర్వాత రాజమౌళి చేస్తున్న ప్రాజెక్ట్ కూడా ఇదే. అంతేకాకుండా ఈ సినిమాకు కథను కూడా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందిస్తున్నారనే విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. (ఇదీ చదవండి: చంద్రయాన్ విజయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ హీరోయిన్) తాజాగ SSMB29 ప్రాజెక్ట్‌పై విజయేంద్ర ప్రసాద్ స్పందించారు. యాక్షన్ అడ్వంచర్ సినిమాగా మహేశ్‌బాబుతో కథ సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. యాక్షన్ సీన్స్ ఇండియానా జోన్స్ సినిమా టైపులో ఉంటాయని ఉదాహరణగా తెలిపారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ నటులు, టెక్నీషియన్స్ సైతం భాగం కానున్నారని ప్రకటించారు. దీంతో ఈ సినిమా హాలీవుడ్ రేంజ్లో విడుదల కానున్నట్లు ఆయన చెప్పకనే చెప్పారని తెలుస్తోంది. ఆఫ్రికా అడువుల నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రాంచైజీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆయన గతంలోనే ఆయన తెలిపారు. (ఇదీ చదవండి: రేణు దేశాయ్ వీడియో.. ఇంత పెద్ద స్టోరీ నడిచిందా?) సీక్వెల్స్‌లో కథలు మారుతుండొచ్చు. కానీ, ప్రధాన పాత్రలు మాత్రం అవే ఉంటాయని అప్పట్లో చెప్పుకొచ్చారు. 2024లో షూటింగ్ ప్రారంభిస్తారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' సినిమాతో మహేష్‌బాబు బిజీగా ఉన్నారు. నటిస్తున్నారు. అతడు, ఖలేజా తర్వాత మహేశ్‌బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రమిది. పవర్ఫుల్ కథాంశంతో ఈ సినిమా రానుందని సమాచారం. వచ్చే ఏడాది జనవరి 13న వరల్డ్ వైడ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. "There is a possibility to rope in Hollywood actor for superstar #MaheshBabu's #SSMB29 with SS Rajamouli." This will be an African adventure film." - Vijayendra Prasad pic.twitter.com/uZKr2kmfiC — Manobala Vijayabalan (@ManobalaV) August 23, 2023 -
హాలీవుడ్‌ని ఏలుతున్న ఇండియన్ అమ్మాయి అర్చీ పంజాబీ
ఆమె వయసు పాతికేళ్లు. ధరించిన పాత్ర పద్నాలుగేళ్ల అమ్మాయిది. అదే తన మొదటి సినిమా, పైగా హాలీవుడ్ సినిమా.. ధైర్యంగా కెమెరా ముందుకెళ్లింది. తన నటనా ప్రావీణ్యంతో అవార్డునూ సాధించింది. ఆమె మన ఇండియన్ అమ్మాయి – అర్చీ పంజాబీ. ►తల్లిదండ్రులు గోవింద్ పంజాబీ, పద్మా పంజాబీ. ఇద్దరూ బ్రిటన్‌లో స్థిరపడిన స్కూల్ టీచర్స్. చిన్నతనంలో కొంతకాలం ముంబైలో పెరిగింది. అందుకే తనను తాను ‘పార్ట్ బాంబేౖయెట్, పార్ట్ బ్రిటిష్’గా పరిగణించుకుంటుంది. ►ఇంగ్లండ్‌లోని బ్రూనెల్ యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేసి, నటిగా మారాలని నిర్ణయించుకుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఆడిషన్కూ వెళ్లేది. అలా మొదటగా ‘సైరన్ స్పిరిట్స్’ టీవీ సీరియల్లో కనిపించింది. ►సినిమాల్లోకి ‘ఈస్ట్ ఈజ్ ఈస్ట్’తో ఎంట్రీ ఇచ్చింది. అందులో ఓ పద్నాలుగేళ్ల అమ్మాయిలా నటించింది. కానీ, ఆమె వయసు అప్పటికే 25 సంవత్సరాలు. ఆ తర్వాత చేసిన ‘ది గుడ్ వైఫ్’ సిరీస్‌తో ఆమె బుల్లితెర స్టార్‌గా మారింది. ►అర్చీ నటించిన ‘ది కాన్స్టంట్ గార్డెన ర్’ సినిమా ఆస్కార్‌కు నామినేట్ అయింది. అంతేకాదు, వివిధ అవార్డు ఫంక్షన్స్‌లో ‘ఉత్తమ నటి’ అవార్డు, ‘ది చాపర్డ్ ట్రోఫీ’, ‘ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డు’, ‘ఇమేజ్ అవార్డు’ ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలా అవార్డులే ఆమెను వరించాయి. ►టెలివిజన్ టాప్ టెన్ యాక్టర్స్‌లో ఒకరిగా నిలవడమే కాదు.. ‘యాస్మిన్’, ‘ఎ మైటీ హార్ట్’, ‘కోడ్ 46’, ‘ఎ గుడ్ ఇయర్’ వంటి పెద్ద సినిమాలూ చేసింది. ప్రస్తుతం వివిధ వెబ్‌సీరిస్ చేస్తూ బిజీగా ఉంది. ►మా అమ్మ వాళ్ల నాన్నతో గొడవపడి టీచర్ ఉద్యోగం సాధించింది. అందుకే, నేను సినిమాల్లో నటిస్తానంటే మా తల్లిదండ్రులు అడ్డు చెప్పలేదు. పైగా మా అమ్మ ‘ఈ ప్రపంచంలో సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు’ అని చెప్పి నాలో స్పూర్తిని నింపింది. – అర్చీ పంజాబీ -
క్యాన్సర్‌తో మరో నటి కన్నుమూత
క్యాన్సర్ మహమ్మారి కారణంగా మరో నటి, హాలీవుడ్‌కు చెందిన కెల్లీ ప్రెస్టన్ (57) మరణించారు. గత రెండేళ్లుగా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె ఆదివారం కన్నుమూశారు. కెల్లీ భర్త జాన్ ట్రావోల్టా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషాదాన్ని వెల్లడించారు. దీనిపై హాలీవుడ్ నటీనటులు, ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఎండీ అండర్సన్ క్యాన్సర్ సెంటర్ వైద్యులు, నర్సులు, సన్నిహితులు, స్నేహితుల మద్దతుతో సాహసోపేతమైన పోరాటం చేసి తన భార్య చివరికి ఓడిపోయిందంటూ ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు జాన్. కెల్లీ ప్రేమ, ఆమె జ్ఞాపకాలు ఎప్పటికీ తమతోనే ఉంటాయన్నారు. ఈ సందర్భంగా తమకు సాయపడిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వీరికి కుమార్తెఎల్లా (20), కుమారుడు బెంజమిన్ (9) ఉన్నారు. 2009 లో జెట్(16) అనే కుమారుడిని కోల్పోయారు కెల్లీ, జాన్ దంపతులు. కాగా స్పేస్క్యాంప్ (1986), జెర్రీ మాగైర్ (1996) ఫర్ లవ్ ఆఫ్ ది గేమ్ (1999) వంటి ప్రముఖ చిత్రాలలో కెల్లీ ప్రెస్టన్ నటించారు. ఆమె నటించిన చివరి చిత్రం గొట్టి (2018). View this post on Instagram It is with a very heavy heart that I inform you that my beautiful wife Kelly has lost her two-year battle with breast cancer. She fought a courageous fight with the love and support of so many. My family and I will forever be grateful to her doctors and nurses at MD Anderson Cancer Center, all the medical centers that have helped, as well as her many friends and loved ones who have been by her side. Kelly’s love and life will always be remembered. I will be taking some time to be there for my children who have lost their mother, so forgive me in advance if you don’t hear from us for a while. But please know that I will feel your outpouring of love in the weeks and months ahead as we heal. All my love, JT A post shared by John Travolta (@johntravolta) on Jul 12, 2020 at 10:20pm PDT -
విమానంలో హడావుడి చేసిన నటి
లాస్ ఏంజెలెస్: హాలీవుడ్ నటి సెమ్లా బ్లెయిర్(43) విమానంలో హడావుడి చేసింది. విమానంలో విచిత్రంగా ప్రవర్తించి అందరినీ కంగారు పెట్టేసింది. తన నాలుగేళ్ల కొడుకు ఆర్థర్ తో కలిసి డెల్టా విమానంలో మెక్సికో నుంచి లాస్ ఏంజెలెస్ కు బయలు దేరింది. వైన్ లో ఏవో మందులు కలుపుకుని తాగింది. తర్వాత ఒక్కసారి అరవడం మొదలు పెట్టింది. 'అతడు కొడుతున్నాడు. తిననీయకుండా, తాగకుండా అడ్డుకుంటున్నాడు. నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడ'ని గట్టిగా కేకలు పెట్టింది. ఆమె ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో తెలియక విమానంలోని సిబ్బంది, ప్రయాణికులు బుర్రలు గోక్కున్నారు. లాస్ ఏంజెలెస్ విమానాశ్రయంలో దిగిన తర్వాత ఇద్దరు నర్పుల సాయంతో స్ట్రెచర్ పై ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సెమ్లా బ్లెయిర్ ఏ మందులు కలుపుకుని తాగిందో తెలుసుకునేందుకు ఆమె బ్యాగులు వెతికారు. ఆమె ఏదైనా రుగ్మతతో బాధ పడుతూవుండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పందించేందుకు ఆమె తరపు ప్రతినిధి నిరాకరించారు. 'క్రుయల్ ఇంటెన్షన్, ది యాంగర్ మేనేజ్ మెంట్' సినిమాల్లో నటించిన సెమ్లా బ్లెయిర్ 'ది పీపుల్ వీ.' టీవీ సిరీస్ లోనూ కనిపించింది.