హాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న డొనాల్డ్ సదర్లాండ్ (88) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మియామీలో చికిత్స పొందుతూ మరణించారు. కెనడాకు చెందిన డొనాల్డ్ సదర్లాండ్ సుమారు 60 ఏళ్ల పాటు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించారు. ఆయన మరణించడంతో హాలీవుడ్‌లోని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అయితే, ఇండియన్ సినిమా నుంచి సమంత, కరీనా కపూర్ ఖాన్‌లు కూడా నివాళులర్పించారు.
డొనాల్డ్ సదర్లాండ్ మరణంతో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సమంత సంతాపం తెలిపింది. ఇదే క్రమంలో కరీనా కపూర్ కూడా సోషల్ మీడియాలో డొనాల్డ్ సదర్లాండ్ ఫోటోను పంచుకుంది. ది డర్టీ డజన్ (1967) చిత్రం ద్వారా మొదలైన ఆయన ప్రయాణంలో అనేక అవార్డులను అందుకున్నారు. ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డ్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్, అకాడమీ అవార్డ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డ్స్‌ను ఆయన సొంతం చేసుకున్నాురు.
ఆర్డినరీ పీపుల్, M*A*S*H,యానిమల్ హౌస్, ది హంగర్ గేమ్స్ ఫ్రాంచైజీ, మూన్ ఫాల్ వంటి సినిమాలతో బాలీవుడ్‌లో ఆయన ప్రసిద్ధి చెందారు. చివరిగా 2023లో ది హంగర్ గేమ్స్ చిత్రంలో ఆయన నటించారు.
Comments
Please login to add a commentAdd a comment