OTT: వందకు పైగా అవార్డ్స్‌ కొట్టిన సినిమా ఓటీటీలో.. తెలుగులో స్ట్రీమింగ్‌ | Anatomy Of A Fall Movie Telugu Version Released In OTT, Check Streaming Platform Details Inside - Sakshi
Sakshi News home page

Anatomy Of A Fall Movie: ఆస్కార్‌తో పాటు వందకు పైగా అవార్డ్స్‌ కొట్టిన సినిమా ఓటీటీలో.. తెలుగులో స్ట్రీమింగ్‌

Published Sat, Mar 30 2024 8:25 AM | Last Updated on Sat, Mar 30 2024 10:23 AM

Anatomy Of A Fall Movie Telugu Version Streaming Now OTT - Sakshi

ఆస్కార్‌ అవార్డు దక్కించుకున్న 'అనాటమీ ఆఫ్ ఎ ఫాల్' అనే సినిమా 2023లో విడుదలైంది. ఫ్రెంచ్ లీగల్ డ్రామా చిత్రంగా ఇది తెరకెక్కింది. ఇటీవ‌ల ప్ర‌క‌టించిన 96వ ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజిన‌ల్ స్క్రీన్‌ప్లే విభాగంలో అనాట‌మీ ఆఫ్ ఏ ఫాల్ అవార్డును గెలుచుకున్న‌ది. ఆస్కార్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వంద‌కుపైగా అవార్డుల‌ను గెలుచుకున్న‌ సినిమాగా ఇది రికార్డుకెక్కింది. 

ఇప్పటికే అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా ఇంగ్లీష్‌ వర్షన్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. తాజాగా రిజనల్‌ భాషలు అయిన తెలుగు,తమిళ్‌,కన్నడ,మలయాళంలో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన సాండ్ర హ‌ల్ల‌ర్ ప్రేక్షకులను మెప్పించింది. ఈ ఏడాది బెస్ట్‌ నటిగా ఆమెకే ఆస్కార్‌ అవార్డు దక్కుతుందని అందరు భావించారు కానీ తృటిలో అవార్డును మిస్స‌యింది.

ఈ చిత్రంలో సాండ్రా హుల్లర్ తన భర్త మరణంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్న రచయితగా నటించారు. మంచుకొండ‌ల్లోని త‌న ఫ్యామిలీతో ఒంట‌రిగా సాండ్రా జీవిస్తుంటుంది. తన భ‌ర్త అనుమాన‌స్ప‌ద రీతిలో అక్కడ మరణించడం. ఆ ప్రాంతంలో సాండ్రా తప్ప మ‌రెవ‌రూ లేక‌పోవ‌డంతో ఆమె ఈ హ‌త్య చేసింద‌ని పోలీసులు అనుమానిస్తుంటారు. ఊహలకు అందని ట్విస్ట్‌లతో నడిచే ఈ కథలో అస‌లు ఈ హ‌త్య ఎవ‌రు చేశారు? ఈ నేరం నుంచి సాండ్రా ఎలా బ‌య‌ట‌ప‌డుతుంది అనేది అసలు కథ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement