![Apsara Rani Thalakona Movie Now OTT Streaming](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/Apsara-Rani.jpg.webp?itok=JOhO7AH1)
అప్సర రాణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ "తలకోన" ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాది మార్చి 29న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. నటి అప్సర రాణికి సోషల్‌మీడియాలో భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో ఆమె నటించిన మూవీ సడెన్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇవడంతో నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటివరకు అప్సర రాణీ చేయని వెరైటీ సబ్జెక్ట్ కావడంతో సినిమాపై భారీగా బజ్ క్రియేట్ అయింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ కథ మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుంది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/1_439.jpg)
తలకోన సినిమా ఎలాంటి ప్రకటన లేకుండానే సడెన్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఈ సినిమా చూడాలంటే రూ. 99 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మూవీ కోసం ఆమె మరింత గ్లామర్‌గా కనిపించడమే కాకుండా భారీ యాక్షన్ సీన్స్‌లలో కూడా దుమ్మురేపింది. ఈ సినిమాకు ఐఎమ్‌డీబీలో 8.7 రేటింగ్ ఉండటం విశేషం. హీరోయిన్, ఆమె స్నేహితులు కలిసి తలకోన ఫారెస్ట్‌కి వెళ్లినప్పుడు ఏం జరిగింది..? అనేది కథాంశం. ప్రకృతికి విరుద్ధంగా వెళితే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు.
ఈ చిత్రానికి నగేష్ నారదాసి దర్శకత్వం వహించారు. అక్షర క్రియేషన్స్ పతాకంపైదేవర శ్రీధర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో అశోక్ కుమార్, అజయ్ ఘోష్, విజయ కరణ్, రంగ రాజన్, రాజా రాయ్ యోగి కత్రి ప్రముఖ పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సుభాష్ ఆనంద్ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment