Apsara Rani
-
లుక్ మార్చేసిన ఆర్జీవీ బ్యూటీ.. యాంకర్ శ్రీముఖి సోయగాలు
పోలీస్ గెటప్‌లో ఆర్జీవీ బ్యూటీ అప్సర రాణిచీరలో మైమరిపించేంత అందంగా బిగ్‌బాస్ స్రవంతిమాల్దీవులు ట్రిప్ వీడియో పోస్ట్ చేసిన సోనాక్షి సిన్హాపొట్టి డ్రస్‌లో కేక పుట్టిస్తున్న హాట్ బ్యూటీ అషూరెడ్డికలర్ కలర్ లంగా జాకెట్‌తో యాంకర్ శ్రీముఖిప్రెగ్నెన్సీ లైఫ్ గురించి సీరియల్ బ్యూటీ ఫన్నీ వీడియోడ్రీమ్ గురించి ఒకప్పటి ఐటమ్ బ్యూటీ మమైత్ ఖాన్ పోస్ట్ View this post on Instagram A post shared by Apsara Rani (@apsararaniofficial_) View this post on Instagram A post shared by Aishwarya Sharma (@aisharma812) View this post on Instagram A post shared by Sri Satya (@sri_satya_) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Mumtaz Khan (@mumait) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Devoleena Bhattacharjee (@devoleena) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Manasa Radhakrishnan (@me.radhakrishnan) View this post on Instagram A post shared by Aashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by karthikeyan (@auraproductions.in) View this post on Instagram A post shared by Nimrrit Kaur Ahluwalia (@nimritahluwalia) View this post on Instagram A post shared by M.Bala bhargavi (@bhanuu_1006) -
'ఖైమర్ అప్సర'గా భారత దౌత్యవేత్త!
భారత రాయబారి దేవయాని ఖోబ్రోగాడే 'ఖైమర్ అప్సర'గా దుస్తులు ధరించి సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలను కంబోడియాలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా ఎక్స్‌లో పంచుకుంది. ఖైమర్ న్యూ ఇయర్ సందర్భంగా కంబోడియన్లకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు భారత దౌత్యవేత్త దేవయాని ఇలా కంబోడియన్ సంప్రదాయ దుస్తులను ధరించి ఖైమర్ అప్సరగా కనిపించారు. ఆమెకు ఖైమర్ సంస్కృతి, సంప్రదాయం పట్ల ప్రగాఢమైన అభిమానం ఉంది. అందువల్ల ఆమె ఇలా ఆ దుస్తుల్లో ధరించి ఆ నాగరికత పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ.. కాంబోడియన్ వాసులకు ఖైమర్ నూతర సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అంతేగాదు మా కాంబోడియా స్నేహితులందరూ ఈ ఖైమర్ నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని కాంబోడియా భారత రాయబార కార్యాలయం అధికారిక సోషల్ మీడియా ఎక్స్‌లో పేర్కొంది. ఈ దౌత్యవేత్త ధరించి సంప్రదాయ కంబోడియన్ వస్త్రధారణ పురాణాల్లో ఉన్న పురాత ఖైమర్ కళకు నిలువెత్తు నిదర్శనంలా ఉంటుంది. ఈ వస్త్రధారణకు తగ్గట్టు ధరించిన ఖైమర్ సాంపాట్ అనే బంగారు ఆభరణం ఒక రకమైన ర్యాప్-ఎరౌండ్ స్కర్ట్‌తో కూడిన కిరీటం మాదిరిగా ఉంది. కాగా, దేవయాని 1999-బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. తన 24 ఏళ్ల కెరీర్లో బెర్లిన్, ఇస్లామాబాద్, రోమ్, న్యూయార్క్‌లోని భారతీయ దౌత్యకార్యాలయాల్లో పనిచేశారు. అలాగే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ వంటి దేశాల్లో విదేశాంగ మంత్రిత్వ ప్రధాన కార్యాలయంలో పనిచేశారు. అంతేగాక సెంట్రల్ యూరప్‌లో ఫైనాన్స్ అండ్ సీపీవీ (కాన్సులర్ పాస్‌పోర్ట్, వీసా) విభాగాలతో సహా అనేక విభాగాలలో పనిచేశారు దేవయాని. Ambassador Devyani Khobragade has a deep admiration for Khmer culture and tradition. Embracing the spirit of Khmer New Year, she elegantly dressed as a Khmer Apsara, embodying the rich bond of our civilizations. Wishing all our 🇰🇭 friends a joyous Khmer New Year celebration pic.twitter.com/5SfQ42g5ln — India in Cambodia (@indembcam) April 13, 2024 (చదవండి: ఒడిస్సీ బాలినీస్ నృత్యాల వందేమాతర సంగమం!) -
టాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?
అప్సర రాణి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ "తలకోన". ఈ చిత్రానికి నగేష్ నారదాసి దర్శకత్వం వహిస్తున్నారు. అక్షర క్రియేషన్స్ పతాకంపైదేవర శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఫిల్మ్ ఛాంబర్లో ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నిర్మాతలు రామసత్యనారాయణ, సాయి వెంకట్, డీఎస్ రావు, హీరో రమాకాంత్ పాల్గొన్నారు. నిర్మాత శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. 'మా హీరోయిన్ అప్సర రాణీ ఇప్పటివరకు చేయని వెరైటీ సబ్జెక్ట్ ఇది.అవుట్ అండ్ అవుట్ యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ కథ మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో ఉండబోతోంది. పాలిటిక్స్, మీడియాను సైతం మిక్స్ చేసి చూపించాం. థ్రిల్లింగ్ సస్పెన్స్‌తో మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా" అని అన్నారు . ర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ.. 'అప్సర రాణీని చూస్తే కశ్మీర్ యాపిల్‌లా కనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో తను కాశ్మీర్ మిర్చిలా నటించింది . చాలా వెరైటీ స్టోరీ ఇది. షూటింగ్ తలకొనలో అద్భుతంగా జరిగింది. మా సినిమా తప్పక విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా" అని అన్నారు హీరోయిన్ అప్సర రాణీ మాట్లాడుతూ.. 'నా కెరీర్ లో ఈ చిత్రం ఓ మైలు రాయిగా నిలుస్తుంది. నేనింతవరకు చేయని ఫైట్స్ ఈ చిత్రంలో చేయడం జరిగింది. మాస్, క్లాస్ ఆడియన్స్‌కు కావలసిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని ఆశిస్తున్నా" అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో అశోక్ కుమార్, అజయ్ ఘోష్, విజయ కరణ్, రంగ రాజన్, రాజా రాయ్ యోగి కత్రి ప్రముఖ పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సుభాష్ ఆనంద్ సంగీతమందిస్తున్నారు. This is just a teaser of the power of Rowdy Lady Police Officer💪🏻🔥 Production- AKSHARA CREATIONS Producer- @sridharreddy3355 Powered by- One Media Director- @nageshnaradasi Fight Master- @anji_fight_master Fight assistant &training- @_its_me_raksha pic.twitter.com/Da1uUANcdN — Apsara Rani (@_apsara_rani) March 21, 2024 -
రెడ్ చీరలో RGV గర్ల్ అప్సర రాణి హాట్ ట్రీట్ (ఫొటోలు)
-
అప్సర రాణి కొత్త సినిమా షురూ
అరుణ్ ఆదిత్య - అప్సర రాణి జంటగా ఓ చిత్రం తెరకెక్కబోతోంది. వినూత్న సెల్యూలాయిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై కృష్ణబాబు దర్శకత్వంలో కొత్త సినిమా ప్రొడక్షన్ నం.1 ప్రారంభోత్సవ కార్యక్రమం ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది. జస్ట్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణ.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ వి. సముద్ర తొలిషాట్‌కు గౌరవ దర్శకత్వం వహించగా, ప్రముఖ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ హీరోయిన్‌పై క్లాప్ కొట్టారు. తొలిషాట్‌కు సంగీత దర్శకురాలు యం యం శ్రీలేఖ కెమెరా స్విచ్చాన్ చేశారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కృష్ణబాబు మాట్లాడుతూ.. ''సినిమా ప్రారంభోత్సవం ఒక పండగగా జరగడం సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు ధన్యవాదాలు. ఏప్రిల్ 20 నుంచి 10 రోజుల పాటు షెడ్యూల్ చేస్తాం. సబ్జెక్టు బాగా వచ్చింది. అరుణ్ ఆదిత్య - అప్సర రాణి జంటగా చేస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తాం..'' అని తెలిపారు. అప్సరరాణి మాట్లాడుతూ... ''మంచి రోజు మంచి సినిమా ప్రారంభమైంది. సంతోషంగా ఉంది. నా కెరీర్‌కు ఈ సినిమా మంచి హెల్ప్ అవుతుందన్న నమ్మకంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్‌కు, డైరెక్టర్‌కు ధన్యవాదాలు..'' అని తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ యం యం శ్రీలేఖ మాట్లాడుతూ.. తొలిషాట్‌కు కెమెరా స్విచ్చాన్ చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా పాటలు చాలా బాగా వచ్చాయి. అందరిని ఆకట్టుకుంటాయి, స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది. అందరికి నచ్చుతుంది..'' అని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ వెంకటేష్ మాట్లాడుతూ... ఒక అద్భుతం జరుగుతుందంటే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తాయని ఈ సందర్బం రుజువు చేసింది. ఒక టాలెంట్ ఉన్న డైరెక్టర్ ఈ సినిమాను ఒక తపస్సులా చేస్తున్నాడు. కృష్ణబాబు స్క్రిప్టును అద్భుతంగా రెడీ చేశారు. ఈ ప్రాజెక్టును ఎంతో నిజాయితీగా, పర్ఫెక్ట్ సిద్ధం చేశారు. హీరో అరుణ్ ఆదిత్య ఈ ప్రాజెక్టుకు దొరికిన ఆణిముత్యం, హీరోయిన్ అప్సర రాణి కూడా నిబద్దతతో, అంకితభావంతో పని చేసే వ్యక్తి. ఆమె డెడికేషన్ ఈ సినిమాకు ఎంతో హెల్ప్ అవుతుంది..'' అని తెలిపారు. -
లుక్ మార్చేసిన టాలీవుడ్ హాట్ బ్యూటీ.. ఏకంగా ముఖానికి రక్తంతో
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు బోలెడంత మంది హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అలా కొన్నేళ్ల ముందు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ బ్యూటీని పరిచయం చేశాడు. ఆమె పేరే అప్సర రాణి. ఆర్జీవీ తీసిన పలు సినిమాల్లో నటించిన ఈమె.. బోల్డ్, హాట్‌నెస్‌కి కేరాఫ్ అడ్రస్‌లా నిలిచింది. వరసపెట్టి అలాంటి సినిమాల్లో నటిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఏకంగా లుక్ మార్చి అందరికీ షాకిచ్చింది. (ఇదీ చదవండి: ఆ గుడిలో స్పెషల్ పూజలు చేసిన హీరో ప్రభాస్.. ఎందుకో తెలుసా?) అప్సరా రాణి హీరోయిన్గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రాచరికం'. విజయ్ శంకర్ హీరోగా చేస్తున్నాడు. చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈశ్వర్ నిర్మిస్తున్నారు. సురేష్ లంకలపల్లి దర్శకుడు. రీసెంట్‌గానే ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఇకపోతే శుక్రవారం, అప్సరా రాణి పుట్టినరోజు సందర్భంగా క్రేజీ పోస్టర్ రిలీజ్ చేశారు. ముఖమంతా రక్తంతో, నోట్లో కత్తితో భయపెట్టేలా కనిపించింది. ఇప్పుడీ లుక్ చూసి అందరూ అవాక్కవుతున్నారు. హాట్ బ్యూటీ ఇలా మారిపోయిందేంటా అనుకుంటున్నారు. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు మూవీ) -
‘రాచరికం’ అరాచకంగా ఉండబోతోంది
విజయ్ శంకర్ హీరోగా, అప్సరా రాణి హీరోయిన్ గా ‘రాచరికం’ సినిమా ఆరంభం అయింది. సురేష్ లంకలపల్లి దర్శకుడు. చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్పై ఈశ్వర్ నిర్మిస్తున్న ‘రాచరికం’ మూవీ సోమవారంప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాతలు డీఎస్ రావు కెమెరా స్విచ్చాన్ చేయగా, రాజ్ కందుకూరి క్లాప్ కొట్టగా, ఈశ్వర్ స్క్రిప్ట్‌ను అందించారు. ఈశ్వర్ మాట్లాడుతూ ‘‘సురేష్‌తో ఆరు నెలలుగా ప్రయాణించాం. సినిమా బాగా వస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘రాచరికం’ చిత్రంలో ప్రతి పాత్రకుప్రాధాన్యత ఉంటుంది’’ అన్నారు సురేష్ లంకలపల్లి. ‘‘రాచరికం’ లాంటి మంచి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు విజయ్ శంకర్. ‘‘రాచరికంతో అరాచకం సృష్టించబోతున్నాం’’ అన్నారు అప్సరా రాణి. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్: చాణక్య, కెమెరా: ఆర్య సాయికృష్ణ, సంగీతం: వెంగి. -
అడవి అందంగా ఉంటుంది
అప్సరా రాణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తలకోన’. నగేశ్ నారదాసి దర్శకత్వంలో స్వప్న శ్రీధర్ రెడ్డి సమర్పణలో దేవర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నవంబరు రెండో వారంలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు దర్శక–నిర్మాత రామ్‌గోపాల్ వర్మ, నటుడు శివాజీరాజా, నిర్మాత రామారావు అతిథులుగా హాజరై పాటలు, ట్రైలర్‌ను విడుదల చేశారు. రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘నాకు అందమంటే చాలా ఇష్టం. అడవి కూడా చాలా అందంగా ఉంటుంది. అందమైన అడవిలో అప్సరా రాణి డ్యాన్స్, ఫైట్లు చేస్తుంటే చూడటానికి అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘నటనకు స్కోప్ ఉన్న ‘తలకోన’లాంటి సినిమా చేయడం నా అదృష్టం’’ అన్నారు అప్సరా రాణి. ‘‘ప్రకృతిలో ఏం జరుగుతుందో ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాం’’ అన్నారు నగేశ్. ‘‘చాలా రిస్క్ చేసి, ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేశాం’’ అన్నారు దేవర శ్రీధర్ రెడ్డి. -
తలకోనలో ఏం జరిగింది?
అప్సరా రాణి ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘తలకోన’. నగేష్ నారదాసి దర్శకత్వం వహించారు. స్వప్న శ్రీధర్ రెడ్డి సమర్పణలో దేవర శ్రీధర్ రెడ్డి (చేవెళ్ల) నిర్మించిన ఈ చిత్రం నవంబరులో విడుదల కానుంది. ‘‘కొంతమంది స్నేహితులతో కలిసి అడవికి వెళతారు హీరోయిన్ . ఎంతమంది వెళ్లారు? ఎందరు తిరిగొచ్చారు? అక్కడ ఏం జరిగింది? అనే అంశాలతో ఈ చిత్ర కథ సాగుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సుభాష్ ఆనంద్ సంగీత దర్శకుడు. -
తలకోన: ప్రకృతికి విరుద్ధంగా వెళితే...
అప్సరా రాణి ప్రధాన పాత్రలో, అశోక్ కుమార్, అజయ్ ఘోష్, ‘ఉగ్రం’ మంజు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘తలకోన’. నగేష్ నారదాసి దర్శకత్వంలో స్వప్న శ్రీధర్ రెడ్డి సమర్పణలో దేవర శ్రీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం ఇది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘హీరోయిన్, ఆమె స్నేహితులు కలిసి తలకోన ఫారెస్ట్‌కి వెళ్లినప్పుడు ఏం జరిగింది? అనేది కథాంశం. ప్రకృతికి విరుద్ధంగా వెళితే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాం’’ అన్నారు నగేష్ నారదాసి. -
అనసూయ హాట్ అందాలు..ప్రగ్యా బోల్డ్ పోజులు
► యాంకర్ అనసూయ ఈ సండే ఫ్యామిలీతో ఎంజాయ్ చేసింది. భర్త, పిల్లలతో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టింది. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ► ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ డోస్ పెంచేసింది. తాజాగా ఆమె మరింత బోల్డ్‌గా ఫోటో షూట్ చేసింది ► రెడ్ డ్రెస్‌లో అప్సర రాణి హాట్ ట్రీట్ ►ఎక్కడైనా ధ్యానం చేసుకోవచ్చు అంటూ కూర్చిలో కూర్చొని ధ్యానం చేస్తున్న ఫోటోని షేర్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Apsara Rani (@apsararaniofficial_) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
అందమైన భామలు.. అదిరిపోయే స్టెప్పులు
సినిమా సీరియస్‌గా సాగుతున్నప్పుడు జరగాలి ఓ మ్యాజిక్. స్పెషల్ సాంగ్ ఆ మ్యాజిక్ చేస్తుంది. ఒక్కసారిగా ప్రేక్షకులకు మంచి రిలీఫ్ ఇస్తుంది. అందుకే విడుదలవుతున్న ప్రతి సినిమాలోనూ దాదాపు ఓ స్పెషల్ సాంగ్ ఉండటం కామన్ అయింది. అలా రానున్న రోజుల్లో సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేయనున్న ‘స్పెషల్ సాంగ్స్’ గురించి, ఆ పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేసిన అందమైన భామల గురించి తెలుసుకుందాం. తెలుగు మాస్ ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు హిందీ భామ ఊర్వశీ రౌతేలా. ‘భాగ్ జానీ’, ‘కాబిల్’ వంటి హిందీ చిత్రాల్లో ఇప్పటికే స్పెషల్ సాంగ్స్ చేసిన ఈ బ్యూటీ తెలుగులో ఒకేసారి రెండు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడం విశేషం. చిరంజీవి టైటిల్ రోల్లో, రవితేజ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’లో ఊర్వశి స్టెప్స్ చూడనున్నాం. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకుడు. ఈ చిత్ర సంగీతదర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన స్పెషల్ సాంగ్‌లో చిరంజీవితో కలిసి సూపర్ స్పెషల్ స్టెప్పులేశారు ఊర్వశి. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది. కాగా ఊర్వశి చేసిన మరో స్పెషల్ సాంగ్ చిత్రీకరణ కూడా పూర్తయింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్‌లో రామ్‌తో కలిసి స్టెప్పులేశారు ఊర్వశి. ఊర్వశీ రౌతేలా ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ కానుంది. ఇక ఊర్వశీ రౌతేలా హీరోయిన్గా నటించిన ‘బ్లాక్ రోజ్’ సినిమా రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దర్శకుడు సంపత్ నంది కథ అందించారు. మరోవైపు బుల్లితెర ప్రేక్షకుల్లో సూపర్ క్రేజ్‌ను సంపాదించుకున్న రష్మీ గౌతమ్ స్పెషల్ డ్యాన్స్ మూమెంట్స్‌ను ‘బోళా శంకర్’ చిత్రంలో చూడొచ్చు. చిరంజీవి హీరోగా మోహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్. అప్సరా రాణి ఈ చిత్రంలో చిరంజీవితో కలిసి ఓ స్పెషల్ సాంగ్‌కి డ్యాన్స్ చేశారు రష్మీ. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. ఇంకోవైపు భారత మాలాలు ఉన్న ఆస్ట్రేలియన్ నటి చంద్రికా రవి ‘వీరసింహారెడ్డి’లో బాలకృష్ణతో కలిసి స్పెషల్ డ్యాన్స్ వేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న సినిమా ‘వీరసింహా రెడ్డి’. చిత్ర సంగీతదర్శకుడు తమన్ స్వరపరచిన స్పెషల్ సాంగ్‌లో బాలకృష్ణతో కలసి చంద్రికా రవి మాస్ స్టెప్పులేశారు. చంద్రికా రవి ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే రామ్ ‘రెడ్’ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో మెరిసిన హెబ్బా పటేల్ ‘శాసన సభ’లో కూడా తళుక్కుమననున్నారు. ఇంద్రసేన హీరోగా నటించిన ఈ సినిమాకు వేణు మడికంటి దర్శకుడు. ఈ సినిమాలో ‘నన్ను పట్టుకుంటే...’ అనే పాటలో నర్తించారు హెబ్బా పటేల్. ఈ సినిమాకు ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీత దర్శకుడు. ఇక గత ఏడాది సంక్రాంతికి ‘క్రాక్’లో ‘బూమ్ బద్దల్’ అంటూ సిల్వర్ స్క్రీన్‌ని షేక్ చేసిన అప్సరా రాణి గుర్తుండే ఉంటారు. ఈ బ్యూటీ ఇప్పుడు ‘హంట్’ చిత్రంలో సుధీర్‌బాబుతో కలిసి ‘పాపతో పైలం’ అనే స్పెషల్ సాంగ్ చేశారు. సుధీర్ బాబు హీరోగా శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హంట్’. మహేశ్ సూరపనేని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతదర్శకుడు. వీళ్లే కాదు.. ఇంకా స్పెషల్ సాంగ్స్‌లో మెరవనున్న తారలు కొందరున్నారు. సినిమాకి స్పెషల్‌గా నిలిచే ఈ సాంగ్స్ అందాల తారల కెరీర్లోనూ స్పెషల్‌గా నిలిచిపోతాయి. అందుకే శ్రుతీహాసన్, తమన్నా వంటి అగ్ర తారలు కూడా అప్పుడప్పుడూ స్పెషల్ సాంగ్స్ చేస్తుంటారు. -
డేంజరస్ ట్రైలర్.. ఆ అమ్మాయిలిద్దరూ ఎందుకు ప్రేమించుకున్నారు?
అప్సరా రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో కంపెనీ పతాకంపై రామ్‌గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డేంజరస్’. ‘మా ఇష్టం’ అనేది క్యాప్షన్. ఈ సినిమా డిసెంబరు 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. రామ్‌గోపాల్ వర్మ, నట్టి కుమార్, ఏబీ శ్రీనివాస్ రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘నా సినిమాల్లో మరో కొత్త కోణం ఈ సినిమా. మగవాళ్లతో ఇద్దరు అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? ఆ అమ్మాయిలిద్దరూ ఎందుకు ప్రేమించుకున్నారు? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అని అన్నారు. ఈ కార్య క్రమంలో నిర్మాత– డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్, నిర్మాత ఏబీ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
Apsara Rani : శారీలో మెరిసిపోతున్న ఆర్జీవీ భామ.. (ఫొటోలు)
-
హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ చేస్తున్న అప్సర రాణి
నగేష్ నారదాసి దర్శకత్వంలో అప్సర రాణి ప్రధాన పాత్రలో నటిస్తున్న తలకోన సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ నూతన చిత్ర ప్రారంభోత్సవ వేడుక గురువారం ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ చిత్రానికి గుర్తుందా శీతాకాలం నిర్మాత రామారావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు. ఈ సంద్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 'తలకోన' చిత్ర దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ... 'చాలా సినిమాలతో నేను మీకు సుపరిచితమే.. ఇప్పుడు ఈ 'తలకోన' చిత్రంతో మరోసారి మీ ముందుకు వస్తున్నా. క్రైమ్ థ్రిల్లర్‌తో సాగే ఈ కథాంశం మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో ఉండబోతోంది. ఫారెస్ట్ అనగానే కేవలం ప్రకృతి అందాలే కాదు మరో కోణం కూడా ఉంటుందని ఈ సినిమాలో తెలియజేస్తాం. అలాగే పాలిటిక్స్, మీడియాను సైతం మిక్స్ చేసి చూపిస్తాం. అంతే కాకుండా ప్రకృతిలో ఏమేం జరుగుతాయో తెలిపే ప్రయత్నం కూడా చేశాం. మెయిన్ కథాంశం అయితే తలకోన ఫారెస్ట్‌లోకి కొంతమంది స్నేహితులు వెళ్తారు. ఎంత మంది వెళ్లారు? ఎంతమంది తిరిగొచ్చారు? అనేదే ప్రధానాంశంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా రూపొందిస్తున్నాము. తలకోన చిత్రాన్ని 20రోజులు హైదరాబాద్‌లో, మరో 20 రోజులు తలకోనలో రెగ్యులర్ షూట్ చేయనున్నాము' అని తెలిపారు. హీరోయిన్ అప్సర రాణి మాట్లాడుతూ... 'మంచి స్క్రిప్ట్స్‌కు నేను ఫ్యాన్‌ను. తలకోన చిత్రం చేయడానికి అదే కారణం అయ్యింది. మొదటి నుంచి కూడా మంచి స్క్రిప్ట్ ఉన్న కథలనే ఎంచుకుంటున్నాను. అవి నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలాగే ఈ చిత్రం కూడా విజయంతో పాటు మంచి పేరు ఇస్తుందని ఆశిస్తున్నా' అన్నారు. చదవండి: ఇప్పుడసలైన మజా, ఆదిరెడ్డి వర్సెస్ గీతూ గేమ్ స్టార్ట్ -
అదే నా ఫిలాసఫీ – రామ్‌గోపాల్ వర్మ
‘‘కాలేజ్‌లో చదువుతున్నప్పుడు అమ్మాయిలను చూడాలంటే నాకు భయం.. ఎప్పుడైనా ఓరకంటితో చూసేవాణ్ణి. కానీ ఇవాళ నేనలా కాదు. నైనా, అప్సర వంటి అందమైన అమ్మాయిలను జీవితానికి సరిపడేంత సమయం చూశాను.. ఇది సక్సెస్ కాకపోతే ఇంకేంటి సక్సెస్? అని డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ అన్నారు. నైనా గంగూలీ, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఇష్టం’. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 6న రిలీజ్ కానుంది. (చదవండి: నాన్న తాగొచ్చాడని బాత్రూమ్లో లాక్ చేసింది: పూజా భట్) ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన ‘ఆస్క్ మి ఎనీథింగ్’ కార్యక్రమంలో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ – ‘‘సమాజానికి ఏదో సందేశం ఇద్దామనే ఉద్దేశంతో ‘మా ఇష్టం’ని తీయలేదు. నిన్న ఏదో అయిపోయింది.. రేపు ఏం జరుగుతుందో తెలియదు.. అందుకే ఇవ్వాళ బతికేయాలన్నది నా ఫిలాసఫీ. నాకంటే డబ్బులు, పేరు ఉన్నవారు, కమర్షియల్ సక్సెస్ ఉన్నవారు ఉండొచ్చు. కానీ వాళ్లందరికంటే నేనే ఎక్కువగా నాకు నచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నాను’’ అన్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_511240763.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });