అప్సర, రామ్‌గోపాల్ వర్మ, నైనా
‘‘కాలేజ్‌లో చదువుతున్నప్పుడు అమ్మాయిలను చూడాలంటే నాకు భయం.. ఎప్పుడైనా ఓరకంటితో చూసేవాణ్ణి. కానీ ఇవాళ నేనలా కాదు. నైనా, అప్సర వంటి అందమైన అమ్మాయిలను జీవితానికి సరిపడేంత సమయం చూశాను.. ఇది సక్సెస్ కాకపోతే ఇంకేంటి సక్సెస్? అని డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ అన్నారు. నైనా గంగూలీ, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఇష్టం’. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 6న రిలీజ్ కానుంది.
(చదవండి: నాన్న తాగొచ్చాడని బాత్రూమ్‌లో లాక్ చేసింది: పూజా భట్)
ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన ‘ఆస్క్ మి ఎనీథింగ్’ కార్యక్రమంలో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ – ‘‘సమాజానికి ఏదో సందేశం ఇద్దామనే ఉద్దేశంతో ‘మా ఇష్టం’ని తీయలేదు. నిన్న ఏదో అయిపోయింది.. రేపు ఏం జరుగుతుందో తెలియదు.. అందుకే ఇవ్వాళ బతికేయాలన్నది నా ఫిలాసఫీ. నాకంటే డబ్బులు, పేరు ఉన్నవారు, కమర్షియల్ సక్సెస్ ఉన్నవారు ఉండొచ్చు. కానీ వాళ్లందరికంటే నేనే ఎక్కువగా నాకు నచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment