'Dangerous' Trailer Launch by Director Ram Gopal Varma - Sakshi
Sakshi News home page

Dangerous Trailer: ‘డేంజరస్‌’ .. ఆ అమ్మాయిలిద్దరూ ఎందుకు ప్రేమించుకున్నారు?

Published Mon, Nov 21 2022 4:36 AM | Last Updated on Mon, Nov 21 2022 8:33 AM

Dangerous Trailer Launch Director by RamGopal Varma - Sakshi

అప్సరా రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో కంపెనీ పతాకంపై రామ్‌గోపాల్‌ వర్మ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డేంజరస్‌’. ‘మా ఇష్టం’ అనేది క్యాప్షన్‌. ఈ సినిమా డిసెంబరు 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు.


రామ్‌గోపాల్‌ వర్మ, నట్టి కుమార్, ఏబీ శ్రీనివాస్‌

రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ– ‘‘నా సినిమాల్లో మరో కొత్త కోణం ఈ సినిమా. మగవాళ్లతో ఇద్దరు అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? ఆ అమ్మాయిలిద్దరూ ఎందుకు ప్రేమించుకున్నారు? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అని అన్నారు. ఈ కార్య క్రమంలో నిర్మాత– డిస్ట్రిబ్యూటర్‌ నట్టి కుమార్, నిర్మాత ఏబీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement