రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘డేంజరస్’(తెలుగులో ‘మా ఇష్టం’) విడుదల వాయిదా పడింది. శుక్రవారం ( ఏప్రిల్ 8) విడుదల కావాల్సిన ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్లు ట్విటర్ ద్వారా ఆర్జీవీ వెల్లడించారు. ‘లెస్బియన్ నేపథ్యం కారణంగా చాలా థియేటర్లు సహకరించకపోవడంతో సినిమా విడుదల పోస్ట్ పోన్ చేస్తున్నాం. అన్ని విధాలుగా ఈ అన్యాయం ని ఎలా ఎదుర్కోవాలో పరిశీలించి తగు చర్యలు తీసుకున్నా తరువాత మరో విడుదల తేదీ తెలియజేస్తాను’అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు.
మరోవైపు ఆర్జీవీ ‘మా ఇష్టం’ సినిమా విడుదలను వాయిదా వేయాలని నిర్మాత నట్టి కుమార్ సివిల్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తనకు 5 కోట్ల 29 లక్షలు ఇవ్వాలని, ఇవ్వాల్సిన ఇవ్వకుండా తప్పించుకుంటున్నాడ నిర్మాత నట్టి కుమార్ కోర్ట్ లో పిటిషన్ వేశారు. దీంతో ‘మా ఇష్టం’ సినిమా రిలీజ్ ను ఆపాలని సిటీ సివిల్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఇలా వరుస వివాదాలు చుట్టుముట్టడంతో సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించాడు.
రామ్ గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘డేంజరస్’. అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం తెలుగులో ‘మా ఇష్టం’పేరుతో విడుదల కాబోతోంది. ఇద్దరమ్మాయిల మధ్య కలిగిన ప్రేమ ఎలాంటి పరిస్థితులకి దారి తీసింది? అనే థ్రిల్లింగ్ అంశాలతో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
I regret to inform that we are postponing the film KHATRA DANGEROUS due to non cooperation of many theatres due to its lesbian theme ..We will proceed in all ways to fight this injustice and come at a later date
— Ram Gopal Varma (@RGVzoomin) April 7, 2022
Comments
Please login to add a commentAdd a comment