ఆర్‌ఆర్‌ఆర్ మూవీపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి షాకింగ్ కామెంట్ చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లిప్‌లాక్ పెట్టుకోలేదని, అందుకే అది ఫ్రెండ్‌షిప్ అయిందని, ఒకవేళ లిప్‌లాక్ పెట్టుకొని ఉంటే.. అది గే ఫిలిం అవుతుందని వర్మ చెప్పుకొచ్చాడు. లిప్‌లాక్ ఉన్నా లేకున్నా స్టోరీ మాత్రం మారదన్నారు. తాజాగా ఆయన తెరకెక్కించిన మూవీ ‘డేంజరస్’(తెలుగులో ‘మా ఇష్టం’పేరుతో విడుదలవుతోంది). అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్జీవీ మాట్లాడుతూ.. ‘డేంజరస్ ’ రెగ్యులర్ కథే.. ఇందులో ఇద్దరు అమ్మాయిలు ఉండడమే కొత్తదనం’ అన్నారు. అప్సర, నైనా వారి పెరెంట్స్ తో మాట్లాడిన తర్వాతే ఈ సినిమా చేశమని తెలిపారు.
కాగా, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాన్ని తన సినిమా ప్రమోషన్స్‌కు వాడుకోవడం ఇది మొదటిసారేం కాదు. ఆ మధ్య ఎన్టీఆర్, చరణ్‌లతో.. ‘డేంజరస్’ హీరోయిన్లు నైనా గంగూలి, అప్సర రాణిలతో పోల్చారు. ‘రాజమౌళి.. మీకు రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి డేంజరస్ బాయ్స్ ఉంటే.. నాకు అప్సర రాణి, నైనా గంగూలీ వంటి డేంజరస్ అమ్మాయిలు ఉన్నారు’అంటూ ట్వీట్ చేస్తూ.. ఎన్టీఆర్, చరణ్‌లతో ఉన్న జక్కన్న ఫోటోకు ఇద్దరు హీరోయిన్లతో కలిసి ఉన్న తన ఫోటోని జతచేశాడు. ఇప్పుడు మళ్లీ అదే సినిమా ప్రమోషన్స్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ని వాడేశాడు. ట్రెండింగ్‌లో ఉంది కాబట్టే ఆర్‌ఆర్‌ఆర్‌ని వాడేస్తున్నానని స్వయంగా ఆర్జీవే చెప్పడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment