బంపర్‌ ఆఫర్‌‌: వోడ్కా విత్‌ వర్మ! | Ram Gopal Varma Beautiful Movie Team Pre New Year Private Party | Sakshi
Sakshi News home page

వోడ్కా విత్‌ వర్మ.. కానీ కండీషన్స్‌ అప్లై

Published Sun, Dec 29 2019 12:22 PM | Last Updated on Sun, Dec 29 2019 12:29 PM

Ram Gopal Varma Beautiful Movie Team Pre New Year Private Party - Sakshi

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ రూటే సపరేటు. కొత్తగా, వైవిధ్యంగా చిత్రాలను తెరకెక్కించాలన్నా.. పొలిటికల్‌ సెటైర్‌ సినిమాలతో అగ్గిరాజేసి వివాదాలు సృష్టించాలన్నా వర్మకే సాధ్యం. అంతేకాకుండా వీటితో పాటు రొమాంటిక్‌, అడల్ట్‌ చిత్రాలను కూడా తెరకెక్కించడంలో ఈ వివాదస్పద దర్శకుడు సిద్దహస్తుడు. తన శిష్యులను దర్శకులుగా పెట్టి తక్కువ బడ్జెట్‌తో తానే స్వయంగా సమర్పిస్తూ ఈ మధ్య వరుసగా సినిమాలు తీస్తున్నాడు. ఇక చిత్ర ప్రమోషన్‌లను కూడా వర్మ వినూత్నంగా నిర్వహిస్తుంటాడు. భారీ హంగులతో కూడిన ప్రమోషన్‌లు కాకుండా సింపుల్‌గా సోషల్‌ మీడియాను ఉపయోగించుకుటూ తన సినిమాకు కావాల్సిన హైప్‌ను క్రియేట్‌ చేసుకుంటాడు. ప్రస్తుతం ఆర్జీవీ సమర్పణలో ‘బ్యూటిఫుల్‌’ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలను జోరుగా ప్రారంభించారు ఆర్జీవీ. దీనిలో భాగంగా వర్మ తాజాగా చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. 

‘వోడ్కా విత్‌ ఆర్జీవీ లైవ్‌. ఈ రోజు ‘బ్యూటిఫుల్‌’టీం ప్రి న్యూఇయర్‌ ప్రయివేట్‌ పార్టీ ఉంది. నాతో మరియు మా టీమ్‌తో కలిసి తాగడానికి అదేవిధంగా మాట్లడటానికి వీలుగా ఈ పార్టీకి మీ అందరినీ ఈ రోజు రాత్రి 8.45 గంటలకు ఫెస్‌బుక్‌, ఇన్‌స్టా లైవ్‌లో కలవడానికి ఆహ్వానిస్తున్నా’అంటూ వర్మ ట్వీట్‌ చేశాడు. వర్మ తన దైన స్టైల్లో చేసిన ట్వీట్‌ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ‘ బంపర్‌ ఆఫర్ వర్మతో వోడ్కా పార్టీ‌’అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. ‘వోడ్కా, స్టఫ్‌ మీరు పంపిస్తారా లేక మేమే తెచ్చుకోవాలా’అంటూ మరొకరు సరదాగా కామెంట్‌ చేశారు.
 
ఇప్పటికే చిత్ర హీరోయిన్‌ నైనా గంగూలీతో వర్మ స్టెప్పులేసి జనాలను ఈ సినిమాపై ఫోకస్‌ చేసేలా చేశాడు. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, సాంగ్స్‌కు ప్రేక్షకులనుంచి విశేష ఆదరణ వస్తోంది. ఆర్జీవీ టైగర్‌ కంపెనీ ప్రొడక్షన్స్‌ పతాకంపై  టి. అంజయ్య సమర్పణలో నైనా గంగూలీ, సూరి జంటగా అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్యూటిఫుల్‌’. చిత్రం న్యూఇయర్‌ కానుకగా జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఇంటెన్స్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టి.నరేశ్‌ కుమార్, టి.శ్రీధర్‌ నిర్మాతలు. నట్టి క్రాంతి, నట్టి కరుణ సహనిర్మాతలు. రవి శంకర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. 

చదవండి: 
కిందటి జన్మలో రంగీలా తీశా!
రామ్‌ గోపాల్‌ వర్మకు నోటీసులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement