Maa Istam Movie
-
నా సంతకం ఫోర్జరీ చేశారు.. పోలీసులకు రామ్‌గోపాల్ వర్మ ఫిర్యాదు
తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ నట్టి క్రాంతి, నట్టి కరుణలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘మా ఇష్టం’సినిమాకు సంబంధించిన లెటర్ రేట్‌పై నట్టి ఎంటర్టైన్మెంట్కు చెందిన క్రాంతి, కరుణలు తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. \ ‘ఏప్రిల్ 8 ,2022 న మూడు బాషల్లో రిలీజ్ కి సిద్దంగా ఉన్న నా డేంజరస్(తెలుగులో ‘మా ఇష్టం’) చిత్రాన్ని ఆపడానికి నట్టి క్రాంతి,నట్టి కరుణ లు కుట్ర పన్ని , ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ ఆధారంగా సిటీ సివిల్ కోర్టు లో పిటీషన్ ఫైల్ చేసి చిత్రాన్ని అడ్డుకున్నారు. ఈ పోర్జరీ కేసుకు సంబంధించిన వివరాలను చెప్పి..పంజాగుట్ట పోలీసు స్టేషన్లో వారిపై రిటన్ కంప్లైంట్ ఇచ్చాను’ అని ఆర్జీవీ చెప్పారు. -
అదే నా ఫిలాసఫీ – రామ్‌గోపాల్ వర్మ
‘‘కాలేజ్‌లో చదువుతున్నప్పుడు అమ్మాయిలను చూడాలంటే నాకు భయం.. ఎప్పుడైనా ఓరకంటితో చూసేవాణ్ణి. కానీ ఇవాళ నేనలా కాదు. నైనా, అప్సర వంటి అందమైన అమ్మాయిలను జీవితానికి సరిపడేంత సమయం చూశాను.. ఇది సక్సెస్ కాకపోతే ఇంకేంటి సక్సెస్? అని డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ అన్నారు. నైనా గంగూలీ, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఇష్టం’. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 6న రిలీజ్ కానుంది. (చదవండి: నాన్న తాగొచ్చాడని బాత్రూమ్లో లాక్ చేసింది: పూజా భట్) ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన ‘ఆస్క్ మి ఎనీథింగ్’ కార్యక్రమంలో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ – ‘‘సమాజానికి ఏదో సందేశం ఇద్దామనే ఉద్దేశంతో ‘మా ఇష్టం’ని తీయలేదు. నిన్న ఏదో అయిపోయింది.. రేపు ఏం జరుగుతుందో తెలియదు.. అందుకే ఇవ్వాళ బతికేయాలన్నది నా ఫిలాసఫీ. నాకంటే డబ్బులు, పేరు ఉన్నవారు, కమర్షియల్ సక్సెస్ ఉన్నవారు ఉండొచ్చు. కానీ వాళ్లందరికంటే నేనే ఎక్కువగా నాకు నచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నాను’’ అన్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_511240763.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘మా ఇష్టం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
అలాంటి సినిమాలు తీయడం నాకు చేతకాదు : రామ్ గోపాల్ వర్మ
‘నా నుంచి పెద్ద బడ్జెట్ మూవీలు వస్తాయని అస్సలు ఎక్స్ పెక్ట్ చేయద్దు. దానికి సంబంధించిన ఫ్యామిలీ ఆడియన్స్ చాలా మంది ఉంటారు. అలాంటి సినిమాలు తీయడం నాకు చేతకాదు. తీయలేను’ అన్నారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా ఆయన తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘డేంజరస్’(తెలుగులో ‘మా ఇష్టం’పేరుతో విడుదలవుతోంది). అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఏప్రిల్7న వర్మ బర్త్‌డే. ఈ సందర్భంగా బుధవారం ఆయన పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ‘మా’ ఇష్టం కథేంటి? ‘మా ఇష్టం’అనేది ఓ క్రైమ్ డ్రామా మూవీ. ఇద్దరు అమ్మాయిలు ఒక క్రైమ్ లో ఇరుక్కుంటారు. ఆ క్రైమ్ నుంచి బయటపడే క్రమంలో వీరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది అనేదే ఈ మూవీ కథ. ఇందులో లెస్బియన్స్ గా లీడ్ పెయిర్ లలో నైనా గంగూలీ, అప్సర రాణి ఇద్దరు అద్భుతంగా నటించారు. కాంట్రవర్సీ అయితే? నేను ఎలాంటి కాంట్రవర్సీస్ ను పట్టించుకోను. నేను తీసే సినిమా నాకు నచ్చినట్టుగా నా కోసమే తీసుకుంటాను. మంచి ఫాలోయింగ్ ఉన్న మీరు ఇలాంటి సినిమాలు తీస్తే ఎలా? నేను ఒక కాన్సెప్ట్ అనుకోని సినిమా తీస్తాను. నాకు నచ్చినట్టుగా సినిమా తీస్తాను . నచ్చితే చూడండి నచ్చకపోతే లేదు .అంతే తప్ప ఎవ్వరినీ ఇబ్బంది పెట్టను. పెద్ద సినిమాలు ఎక్స్పెక్ట్ చేయ్యొచ్చా? నా నుంచి పెద్ద బడ్జెట్ సినిమాలు వస్తాయని ఆశించొద్దు. పెద్ద సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ముఖ్యం. అందరూ చూస్తేనే ఆ సినిమా లాభాల్లోకి వెళ్తుంది. నాకు అలాంటి సినిమాలు చేయడం చేతకాదు. నేను ఇప్పడు తీయలేను. ‘మా ఇష్టం’లో బోల్డ్ కంటెంట్ ఎంతవరకు ఉంటుంది ? ఇందులో బోల్డ్ కంటెంట్ కంటే యాక్షన్ ఓరియెంటెడ్ పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఇందులో నావల్టీ తక్కువగా ఉంటుంది. అయితే ప్రేక్షకులు ఈ మధ్య నావల్టీ ఎక్కువ చూస్తున్నందున పోస్టర్స్ ను చూసి దానికే ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. ఇద్దరి హీరోయిన్స్ మధ్య రొమాన్స్, యాక్షన్ తీయడానికి గల కారణం? ప్రపంచంలో ఇప్పటివరకు ఇద్దరి హీరోయిన్స్ లతో రొమాంటిక్ పాట షూట్ చేయడం జరగలేదు. ఇలాంటి కథ ఈ మధ్య ఎవ్వరూ తీయలేదు. హీరో,హీరోయిన్స్ మధ్య ప్రేమ అనేది కామన్ అది రెగ్యులర్ గా అందరూ తీసేదే..కానీ ఇలా తీయడం నేనే మొదటిసారి . మీ తదితర ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పటి వరకు నేను అనౌన్స్ చేసిన సినిమాలన్నీ వచ్చాయి. ఇండో,చైనా మీద మార్షల్ ఆర్ట్స్ మీద ఒక సినిమా తీశాం. జూన్ లో రిలీజ్ అవుతుంది , కొండ సినిమా రెడీ గా ఉంది, దహనం వెబ్ సిరీస్ ఇవి కాక ఇంకా 20 స్క్రిప్ట్స్ రెడీ గా ఉన్నాయి.