
తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ నట్టి క్రాంతి, నట్టి కరుణలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘మా ఇష్టం’సినిమాకు సంబంధించిన లెటర్ రేట్‌పై నట్టి ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన క్రాంతి, కరుణలు తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. \
‘ఏప్రిల్ 8 ,2022 న మూడు బాషల్లో రిలీజ్ కి సిద్దంగా ఉన్న నా డేంజరస్(తెలుగులో ‘మా ఇష్టం’) చిత్రాన్ని ఆపడానికి నట్టి క్రాంతి,నట్టి కరుణ లు కుట్ర పన్ని , ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ ఆధారంగా సిటీ సివిల్ కోర్టు లో పిటీషన్ ఫైల్ చేసి చిత్రాన్ని అడ్డుకున్నారు. ఈ పోర్జరీ కేసుకు సంబంధించిన వివరాలను చెప్పి..పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో వారిపై రిటన్ కంప్లైంట్ ఇచ్చాను’ అని ఆర్జీవీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment