Ram Gopal Varma Interesting Comments On Maa Ishtam Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: ప్రపంచంలో ఇప్పటివరకు ఇద్దరు హీరోయిన్స్‌తో అలా చేయించలేదు

Published Wed, Apr 6 2022 5:49 PM | Last Updated on Wed, Apr 6 2022 6:25 PM

Ram Gopal Varma Talk About Maa Istam Movie - Sakshi

ఇప్పటి వరకు నేను అనౌన్స్ చేసిన సినిమాలన్నీ వచ్చాయి.

‘నా నుంచి  పెద్ద బడ్జెట్ మూవీలు వస్తాయని అస్సలు ఎక్స్ పెక్ట్ చేయద్దు. దానికి సంబంధించిన ఫ్యామిలీ ఆడియన్స్ చాలా మంది ఉంటారు. అలాంటి సినిమాలు తీయడం నాకు చేతకాదు. తీయలేను’ అన్నారు ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. తాజాగా ఆయన తెరకెక్కించిన పాన్‌ ఇండియా మూవీ ‘డేంజరస్‌’(తెలుగులో ‘మా ఇష్టం’పేరుతో విడుదలవుతోంది). అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. ఏప్రిల్‌ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఏప్రిల్‌7న వర్మ బర్త్‌డే. ఈ సందర్భంగా బుధవారం ఆయన పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

‘మా’ ఇష్టం కథేంటి?
‘మా ఇష్టం’అనేది ఓ క్రైమ్‌ డ్రామా మూవీ. ఇద్దరు అమ్మాయిలు ఒక క్రైమ్ లో ఇరుక్కుంటారు. ఆ క్రైమ్  నుంచి బయటపడే క్రమంలో వీరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది అనేదే ఈ మూవీ కథ. ఇందులో  లెస్బియన్స్ గా  లీడ్ పెయిర్ లలో నైనా గంగూలీ, అప్సర రాణి ఇద్దరు అద్భుతంగా నటించారు.  

కాంట్రవర్సీ అయితే?
నేను ఎలాంటి కాంట్రవర్సీస్ ను పట్టించుకోను. నేను తీసే సినిమా నాకు నచ్చినట్టుగా నా కోసమే తీసుకుంటాను.

మంచి ఫాలోయింగ్‌ ఉన్న మీరు ఇలాంటి సినిమాలు తీస్తే ఎలా?
నేను ఒక కాన్సెప్ట్ అనుకోని సినిమా తీస్తాను. నాకు నచ్చినట్టుగా సినిమా తీస్తాను . నచ్చితే చూడండి నచ్చకపోతే లేదు .అంతే తప్ప ఎవ్వరినీ ఇబ్బంది పెట్టను. 
 
పెద్ద సినిమాలు ఎక్స్‌పెక్ట్‌ చేయ్యొచ్చా?
నా నుంచి పెద్ద బడ్జెట్‌ సినిమాలు వస్తాయని ఆశించొద్దు. పెద్ద సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్‌ చాలా ముఖ్యం. అందరూ చూస్తేనే ఆ సినిమా లాభాల్లోకి వెళ్తుంది. నాకు అలాంటి సినిమాలు చేయడం చేతకాదు. నేను ఇప్పడు తీయలేను. 

‘మా ఇష్టం’లో బోల్డ్ కంటెంట్ ఎంతవరకు ఉంటుంది ? 
ఇందులో బోల్డ్ కంటెంట్ కంటే యాక్షన్ ఓరియెంటెడ్ పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఇందులో నావల్టీ తక్కువగా ఉంటుంది. అయితే ప్రేక్షకులు ఈ మధ్య నావల్టీ ఎక్కువ చూస్తున్నందున పోస్టర్స్ ను చూసి దానికే ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు.

 ఇద్దరి హీరోయిన్స్ మధ్య రొమాన్స్, యాక్షన్ తీయడానికి గల కారణం?
ప్రపంచంలో ఇప్పటివరకు ఇద్దరి హీరోయిన్స్ లతో రొమాంటిక్ పాట షూట్ చేయడం జరగలేదు. ఇలాంటి కథ ఈ మధ్య ఎవ్వరూ తీయలేదు. హీరో,హీరోయిన్స్ మధ్య ప్రేమ అనేది కామన్ అది రెగ్యులర్ గా అందరూ తీసేదే..కానీ ఇలా  తీయడం నేనే మొదటిసారి .

 మీ తదితర ప్రాజెక్ట్స్ ఏంటి? 
ఇప్పటి వరకు నేను అనౌన్స్ చేసిన సినిమాలన్నీ వచ్చాయి. ఇండో,చైనా మీద  మార్షల్ ఆర్ట్స్ మీద ఒక సినిమా తీశాం. జూన్ లో రిలీజ్ అవుతుంది , కొండ సినిమా రెడీ గా ఉంది, దహనం వెబ్ సిరీస్ ఇవి కాక ఇంకా 20 స్క్రిప్ట్స్ రెడీ గా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement