
రామ్‌గోపాల్ వర్మ, అప్సరా రాణి, శ్రీధర్ రెడ్డి, నగేశ్ నారదాసి
అప్సరా రాణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తలకోన’. నగేశ్ నారదాసి దర్శకత్వంలో స్వప్న శ్రీధర్ రెడ్డి సమర్పణలో దేవర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నవంబరు రెండో వారంలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు దర్శక–నిర్మాత రామ్‌గోపాల్ వర్మ, నటుడు శివాజీరాజా, నిర్మాత రామారావు అతిథులుగా హాజరై పాటలు, ట్రైలర్‌ను విడుదల చేశారు.
రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘నాకు అందమంటే చాలా ఇష్టం. అడవి కూడా చాలా అందంగా ఉంటుంది. అందమైన అడవిలో అప్సరా రాణి డ్యాన్స్, ఫైట్లు చేస్తుంటే చూడటానికి అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘నటనకు స్కోప్ ఉన్న ‘తలకోన’లాంటి సినిమా చేయడం నా అదృష్టం’’ అన్నారు అప్సరా రాణి. ‘‘ప్రకృతిలో ఏం జరుగుతుందో ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాం’’ అన్నారు నగేశ్. ‘‘చాలా రిస్క్ చేసి, ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేశాం’’ అన్నారు దేవర శ్రీధర్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment